raparthi anuradha

Horror Romance Fantasy

4  

raparthi anuradha

Horror Romance Fantasy

శక్తి ఆగమనం..10

శక్తి ఆగమనం..10

9 mins
384


ఇరు హృదయాలు ఆ రాత్రి నిద్రపోలేదు

ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే గడిపారు

అందుకే అందరి కంటే ముందుగా కాలేజ్ కి చేరుకున్నారు,,

ఇందు తనని వెతుక్కుంటూ

వచ్చి హగ్ చేసుకుని

ఐ లవ్ యూ చెప్తుంది అని

ఆశగా ఎదురు చూస్తున్నాడు

సిద్దు కానీ అతడి ఆత్రం తెలిసిన శ్రీరామ్ అంత లేదు గానీ

ముందుగా ఓవర్ ఎక్స్పట్ చేయకు నాకు తెలిసి సిస్టర్ నీకు పిచ్చా క్లాస్ పీకుతుంది చూడు ఆ వచ్చే

స్పీడ్ చూస్తుంటే అలానే ఉంది అమ్మా

శ్రావణి ఎందుకు వచ్చిన గొడవ మనం తప్పుకోవడం బెటర్ ఏమంటావ్ అని అడిగాడు

ఆమె హా అవును నిజమే కాస్త ఎస్కేప్ అవ్వడమే బెటర్

అంటూ ఎదురుగా వస్తున్న

ఇందు నీ చూసి

ఇద్దరు ఎస్కేప్ అయ్యారు

సిద్దు మాత్రం తన లవర్ తనని వెతుక్కుంటూ వస్తుంది

సూపర్ అన్నట్టు మురిసిపోయి చూస్తున్నాడు

ఇందు సిద్దు వద్దకు నేరుగా

వెళ్ళడం యాది చూసాడు

కానీ ఏమి చేయలేక వెళ్ళిపోయాడు,

ఆమె రాకతో మొహం

వెలిగిపోతున్న సిద్దు నీ చూసి

ఆమె మనసులో ఆనందం కలుగుతున్న

తమ ఇరువురి నడుమ కొన్ని వేల అడుగుల దూరం ఉంది

అని అర్థం చేసుకుని

అతడి వద్దకు కోపంగా వెళ్లి

నీతో మాట్లాడాలి చాలా

నాతో రా అని అతడు

ఐస్క్రీమ్ తినిపించిన చెట్టు

దగ్గరకు తీసుకు పోయింది

అదంతా చాటుగా

శ్రావణి ఇంకా శ్రీరామ్ చూస్తూనే ఉన్నారు

ఆమె మనసు కరిగి పోయి

సిద్దు కి ఓకే చెప్తుంది ఏమో

అనే ఆశగా చూస్తున్నారు వాల్ల ఫ్రెండ్స్.

అక్కడ సిద్దు కూడా ఆనందం గా చూస్తూ ఎంటి

ఓకే చెప్పాలి అని వచ్చావా

అంటూ అడిగాడు

అంతే ఆమె సీరియస్ అవుతూ ఎంటి ఓకే చెప్పేది

అసలు నీకు అర్థం అవుతుందా నువ్వేం చేస్తున్నావో

నిన్న రాత్రి విండో నుంచి నా బెడ్ రూమ్ కి వస్తావా

నన్ను కిస్ చేస్తావా....???

అమే ప్రశ్న దూరంగా ఉండి విన్న ఇద్దరు షాక్ అయ్యారు.

సిద్దు చిన్నగా నవ్వి సారి బేబీ తప్పలేదు నిన్ను అంత దగ్గరగా చూసానా మనసు కంట్రోల్

లేకుండా పోయింది

అంతే కాకుండా అరుస్తున్నావు ఆంటీ వాళ్ళు వస్తె ప్రాబ్లం అని అంటూ ఉన్నాడు

ఆమె సీరియస్ గా చూస్తూ

అరవక హారతి పట్టమంటావా...???

అయినా నీకేంటి పని

నా గదికి రావడానికి...??? 

అని అడిగితే

అతడు ఆమె మీదికి వెళుతూ

నీకేం పని ఎదో శక్తి మాన్ లా వాల్ నుండి లోపలికి వచ్చావ్

అంటూ ప్రశ్న వేశాడు

ఆ ప్రశ్న శ్రావణి వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి వింతగా గొడలోనుంచి రావడం

సిద్దు కల ఏమైనా కన్నాడేమో అనుకుంటూ ఉన్నారు.

ఇందు అబద్ధం చెబుతూ

నేనా నిన్ను కలిసాన లేదే

నేను ఎలా వస్తాను బైట అంత సెక్యూరిటీ ఉంది

అయినా మనిషి గోడ లో నుంచి ఎలా వస్తాడు

నువ్వే ఎదో కల కని ఉంటావు

అని అబద్ధం చెప్పింది

సిద్దు ఒప్పుకోలేదు నేను

చూసాను నువ్వు ఏడుస్తూ

ఉన్నావ్ నాకు కుంకుమ పెట్టావ్ నీతో ఆ లేడి అదే ఆమె పేరు ఎదో ఉంది గా అమరావతి

ఆమె కూడా ఉంది

అంటూ వాదించాడు

అంతే ఇందు షాక్ అయ్యి

నీకు ఆమె ఎలా తెలుసు పేరు అమరావతి అని ఎవరు చెప్పారు ఆవిడ నిన్ను ఇంతకు ముందే కలిసిందా...???

అని అడిగింది

సిద్దు ఆమె మాటలకి సీరియస్ అవుతూ అవును నన్ను

ఒకసారి సేవ్ చేసింది అంటే

ఆమెతో కలిసి నువ్వు గదిలోకి వచ్చావు అని ఒప్పుకుంటున్నావు అంతేనా అని అడిగాడు

ఆమె చిరాగ్గా అదేం లేదు

నువ్వు చెప్పేది ఎదీ నిజం కాదు ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టు ముందు అయితే నన్ను లవ్ చేసే ఆలోచన మానుకో నీకు నాకు మంచిది మన ఇరు కుటుంబాలు ఒక్కటి కావడం జన్మలో

జరగదు నేను మీ డాడ్ శత్రువు

ఫణి భూషణ్ గారి కూతురుని

మీ నాన్నగారికి మా నాన్నగారికి ఏళ్లనాటి శతృత్వం ఉంది

వాళ్ళకి ఈ విషయం తెలిస్తే

పెద్ద ప్రాబ్లం అవుతుంది

సో ప్లీజ్ ఈ లవ్ అంటూ

ఆలోచన ఇక్కడితో విడిచిపెట్టు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి ముందుకు

కదిలింది

సిద్దు అంతా విని వెళ్ళిపోతున్న ఆమె చేయి టక్కున

పట్టుకుని అతడివైపు

లాక్కున్నాడు

అంతే ఇందు అతడి పై పడింది

సిద్దు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ

ఇందులో ఎలాంటి మార్పు

ఉండదు మీ డాడ్ భూషణ్ అంకుల్ అని నాకు ఎప్పుడో తెలుసు అందుకని నీపై పుట్టిన ప్రేమ మరచిపోలేను నాకు నువ్వంటే చచ్చేంత లవ్ ఉంది

మా డాడ్ కి పడంది మీ డాడ్

సమస్య వాళ్ళది

మనది కాదు అయినా నీకు

నేను నచ్చలేదు అంటే

ఆలోచించే వాడ్ని మీ డాడ్ కారణం తో వద్దు అంటే ఎలా ఆలోచిస్తాను

నువ్వు ఒప్పుకోని విషయం

ఏమిటి అంటే నీకు నేను అంటే ఇష్టం అందుకే నిన్ను కిస్ చేసిన మీ మదర్ ముందు బైట పెట్టలేదు

నేను హాస్పటిల్ బెడ్ మీద

ఉంటే కన్నీళ్లు పెట్టుకున్నావు

మీ నాన్నగారి నీ చూసి భయపడుతూ నీలో ఇష్టం బైట పెట్టడం లేదు ఒప్పుకో

నీకు నేను అంటే ఇష్టం అని

ఆమెను పట్టుకుని ఎంతో ఎమోషన్ గా అడుగుతుంటే

ఇందూ అతడి కళ్ళలో ఆకర్షణ కి మరింత చేరువ అవుతూ

తెలియని అయోమయంలో

కొన్ని క్షణాలు అతడ్ని చూస్తూ

ఉంది సిద్దు చిరునవ్వు నవ్వుతూ నువ్వు నాకోసం పుట్టావు నేను నీకోసం పుట్టాను అనిపిస్తుంది

మరి ఎందుకు దూరం మనసులో మాట బైట పెట్టు బేబీ అంటూ ప్రేమగా అడుగుతూ

ఉంటే

స్పృహలోకి వచ్చిన ఇందు

అతడ్ని విదిలిస్తూ ఎంటి నువ్వు

చెప్తే అర్థం చేసుకోవా

మన మధ్య ఎలాంటి లవ్ లేదు నాకు నీపై ఎలాంటి ఇష్టం లేదు నువ్వు నన్ను కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేయకు నాన్నగారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది

ప్లీజ్ నన్ను నా మానాన చదువుకోని ఇంక నన్ను మీట్ అయ్యే

ప్రయత్నం కూడా చేయకు

గుడ్ బై అంటూ వెళ్ళిపోతూ

ఉంటే

సిద్దు సీరియస్ గా

మాట్లాడతాను మీట్ అవుతాను మళ్లీ మళ్లీ నిన్ను ఇబ్బంది

పెడతాను నువ్వు నీ మనసులో నాపై ఉన్న ఇష్టాన్ని బైట పెట్టే

వరకు నిన్ను విసిగిస్తూనే

ఉంటా హేయ్ నువ్వు నో అంటే

నా లవ్ మారిపోదు

ఐ లవ్ యూ అంతే

నువ్వు ఫిక్స్ అయిపో అంటూ

అరిచి చెప్తుంటే

ఇందు కన్నీళ్లు పెట్టుకుంటు

కోపంగా వెళ్లిపోయింది.

అమే వెళ్ళాక శ్రావణి శ్రీరామ్ అక్కడికి వచ్చి ఏంట్రా ఇది

ఆమె చెప్పింది నిజమే

మీ రెండు ఫ్యామిలీల మధ్య శతృత్వం ఉంది

ఈ లవ్ గొడవలు అవసరమా

చెప్పు అంటూ సలహా చెప్తుంటే

సిద్దు ఫీల్ అవుతూ

మనసులో ఒకరిపై ఇష్టం మన ప్రమేయం లేకుండా

కలుగుతుంది

ఆ ఇష్టం కలిగాక ఎవరు ఎన్ని చెప్పినా ఎలాంటి సమస్యలు

వచ్చిన ఇష్టం ఇష్టంగానే ఉంటుంది అది ఎవరి కోసమే మారిపోధు

నాకు ఇందు అంటే మొదటి చూపులోనే ఇష్టం ఏర్పడింది

ఆమెకు నేను అంటే ఇష్టం ఉంది మధ్యలో మా ఫాధర్లు గొడవ పడటం మా ప్రేమకు దూరం

పెట్టడం ఎంత వరకు కరెక్ట్

నేను మారను

ఇందు నీ మరచిపోను అంతే

అని చెప్పి సీరియస్ గా వెళ్ళిపోయాడు,,

ఇందు క్లాస్ రూం లో వెయిట్ చేస్తూ ఉంది శ్రావణి రాగానే కంగారుగా వాడు గొడవ చేస్తున్నాడా అరుస్తున్నాడ

నన్ను మరచిపోను అంటున్నాడ అసలు వాడు బాగానే ఉన్నాడు గా మళ్లీ హెల్త్ పాడు చేసుకోలేదు గా అని కంగారుగా అడిగింది

శ్రావణి కి ఇందు కళ్ళలో సిద్దు పై ఇష్టం కనిపిస్తుంది

అమే అయోమయం గా

చూస్తూ నీకు సిద్దు అంటే ఇష్టం ఉందా మీ పేరెంట్స్ కారణంగా వాడికి దూరం గా ఉంటున్నావా

అని అడిగింది

ఇందు తడబడుతూ అదేం లేదు కేవలం కొద్దీ రోజుల పరిచయానికి ప్రేమ అని పేరు పెట్టుకుని

పేరెంట్స్ నీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు ఆ సిద్దు అర్థం చేసుకుని

నాకు దూరంగా ఉండాలి

అంతే చాలు అని ఆన్సర్ చేసింది

శ్రావణి నవ్వుతూ అయామ్

సారి ఇందు నేను ఇలా చెప్పడం కరెక్టా కాదా తెలియదు కానీ

నిజం అయితే చెప్పాలి

ప్రేమ పుట్టడానికి కొన్ని క్షణాలు చాలు కొద్ది రోజులు అవసరం

లేదు ఒక మనిషి పై ఇష్టం ప్రేమ కలిగాయి అంటే నువ్వు కాదు

అని ఎంత చెప్తే అంత ఎక్కువ

ఇష్టం పుడుతుంది

ఆ ఇష్టం ఎదో ఒక సమయం లో

బైట పడుతుంది

అందుకే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే బెటర్ అని

ఇందు నీ ఇబ్బంది పెట్టింది

అంతే ఇందు ఆలోచిస్తూ

క్లాస్ కూడా సరిగా వినకుండా యాది కి కాల్ చేసి త్వరగా ఇంటికి వెళ్లిపోయింది.

ఆమె అలా వెళ్లిపోవడం తెలుసుకుని సిద్దు ఫీల్ అయ్యాడు ఆమె

మొబైల్ కి ఫోన్ మీద ఫోన్ కొడుతూనే ఉన్నాడు....

ఆమె రెస్పాండ్ అవ్వలేదు

అని చివరిగా ఇంటి ల్యాండ్ లైన్ కి కాల్ చేసాడు.

ఆమెకు అర్థం అయ్యింది

ఆ ఫోన్ చేస్తుంది సిద్దు అని

ఇంట్లో ఎవరు లిఫ్ట్ చేసిన సమస్య వస్తుంది అని పరుగులు పెడుతూ వచ్చి ఆమె మదర్ లిఫ్ట్ చేసే లోగా ఫోన్ అందుకుని

హాలో అంది

అంతే సిద్దు ఆమె వాయిస్ విని

కుషి అవుతూ థాంక్స్ బేబీ కాల్ లిఫ్ట్ చేశావ్ అంటూ ఉంటే

ఆమె ఆయాస పడుతు నీకు బుద్ధి లేదు మార్నింగ్ అంత చెప్పానా ఎందుకు కాల్ చేస్తున్నావ్

హా అంటూ ఇంకా ఆయాసంగా మాట్లాడుతూనే ఉంది

సిద్దు రిసీవర్ మీద ముద్దు పెడుతూ ఆ శబ్ధం ఆమెకు వినిపించేలా చేశాడు

అంతే ఆమె ఆయాసం ఆగింది హేయ్ నిన్ను అంటూ అరవబోయి ఎదురుగా అమ్మ ఉండే సరికి

వచ్చి రాని నవ్వు నవ్వుతూ నాకు నీరసం గా ఉంది

రేపు వస్తాగా అప్పుడు మాట్లాడతా ఫోన్ పెట్టే య్ అంటూ ఉంది

సిద్దు చిరునవ్వు నవ్వుతు

పెట్టేస్తాలే గాని మొబైల్ కి చేస్తే ఎందుకు ఆన్సర్ చేయలేదు హా ల్యాండ్ లైన్ ఆన్సర్ లేకుంటె

నేరుగా ఇంటికి వస్తాను

మీ డాడ్ తో తన్నులు తినడానికి అయినా నేను సిద్ధమే నీ మౌనం మాత్రం భరించలేను

అంటూ ఉన్నాడు

ఇందు భయంగా హేయ్ అలాంటి పని ఎప్పుడు చేయకు ప్లీజ్

నన్ను భయపెట్టకు

అని కంగారుగా అడిగింది

సిద్దు ఆమె స్వరం తో ఆనందంగా ఫీల్ అవుతూ ఓకే అమూల్ బేబీ....

నేను చెప్పింది మరచిపోకుండా

ఓకే చెప్పెయ్ రేపైన సరే బై లవ్ యూ బంగారం అంటూ ఫోన్ పెట్టేసాడు

ఆమె హుష్ అంటూ తల తిప్పి చూసింది అమే మదర్ ఎదురుగా నిలుచుని ఎంటే నీ హడావిడి వేసుకున్న బట్టలు సరిగా లేవు

ఇలా పరుగులు ఎంటి ఫోన్ లో ఎవరు ఎందుకు అలా చమటలు పడుతున్నాయి అని అడిగింది

ఇందు తడబడుతూ ఎవరు లేరు అమ్మ ఓ తలనెప్పీ కెండెట్

కాలేజ్ సీనియర్ వెంటనే కాల్ అటెండ్ చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది అందుకే పరుగులు పెడుతూ ఫోన్ తీసా అంటూ వెళ్ళిపోయింది

ఆవిడ మాత్రం అనుమానం గా

దీని తీరే మారిపోయింది

ఎవరో ఆ సీనియర్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది.

*"" కోయ దొర ముందు శివరాం భూషణ్ కూర్చుని ఉన్నారు

అయన నవ్వుతూ మీరు

వస్తారు అని తెలుసు....

మీరు వచ్చినా రాక పోయినా జరిగిపోయింది అలాగే జరగాల్సింది మారదు మారకూడదు

అంటూ అర్థం లేకుండా చెబుతుంటే.....

వాళ్ళు విసుగ్గా అది కాదు దొర

మా బిడ్డా అంటూ మాట పూర్తి చేయలేదు ఆయన ఇద్దరికీ ఓకే సమాధానం ఇచ్చారు

బిడ్డల జననం నుండి దుష్ట పీడితులు గా ఆరోగ్య అవస్తలతో అర్థం కాని వింత ప్రమాదాలతో

భాధ పడుతున్నారు

కానీ వారికి ఏమీ కాదు

వారిని కాపాడే శక్తి అండగా ఎప్పుడు ఉంటుంది

ఉండి తీరాలి....

ఇచ్చిన మాట కోసం మరణాన్ని జయించి కాలాన్ని శాసించి

మిగిలి ఉంది

ఆ తోడు నీడ మీ బిడ్డలకు ఎల్లప్పుడూ రక్ష గా ఉంటుంది

నిజానికి మీరు ఇరువురు

శత్రువులు గా మారడానికి

కూడా దుష్ట శక్తి ప్రభావమే

కారణం మిత్రులు కండిఅన్నా మీరు ఒప్పుకోరు

కానీ మీకు చెప్పినా

అర్థం కాదు అందుకే

ఒక్కటే చెప్తాను మీ పిల్లలు

కారణ జన్ములు వారికై

శక్తి ఆగమనం జరిగి

తీరుతుంది కొన్ని

ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు సరిచేసి భూమి తాపం తీర్చడానికి పుణ్య పదాలు అడుగు మోపే రోజుకై పుడమి ఎదురు

చూస్తుంది అంటూ ఉంటే

వాళ్ళకి ఏమీ అర్ధం కాలేదు

అందుకే ఓపిక గా దొర మీరు చెప్తుంది ఏమి అర్ధం కాలేదు దయచేసి వివరంగా చెప్పి మా సమస్యకు పరిష్కారం చూపండి అంటూ అడిగారు

ఆ దొర నవ్వుతూ మీ పిల్లలు

ఇద్దరు ఓకే రోజు ఓకే గడియలో పుట్టారు కేవలం కొన్ని

విఘడియలు తేడా

ఉంది అంతే.

ఆ ఇరువురు నక్షత్రం ఒక్కటే సమస్య ఒక్కటే

ప్రస్తుతం పీడిస్తున్న దుష్ట శక్తి

ఒక్కటే రక్షించే దైవ శక్తి ఒక్కటే వారిలో దాగి ఉన్న శక్తి ఆగమనం జరిగే వరకు ఎదురయ్యే

సమస్యలు ఎదుర్కోవడం

తప్ప ఏమీ చేయలేరు

ఆ శుభ గడియలకి ఇంకా

సమయం ఉంది అందాకా

వేచి చూడాలి అంటూ ధైర్యం చెప్పాడు .

భూషణ్ ఎమోషన్ అవుతూ

దొర వీళ్ళ అబ్బాయి విషయం ఏమో గానీ నా కూతురు సున్నితమైన అమాయక మైన

పిల్ల ఎప్పుడు ఎదో దుష్ట శక్తి వెంటాడుతూ బాధిస్తుంది

మీరు ఎదో ఒక రక్ష ఇచ్చి దాన్ని కాపాడండి అంటూ అడిగాడు

శివరాం కలుగు చేసుకుని

నా కొడుకు ప్రాణాలు మీదికి ప్రమాదాలు వస్తున్నాయి దొర

వాడికి ఎదో ఒక రక్ష ఇవ్వండి

మీరు సమస్యకి ఎదో ఒక పూజ పెట్టీ పరిష్కారం చూపండి

అంటూ అడిగారు

ఆయన నవ్వుతూ

మీ బిడ్డలు ఇరువురిలో

ఎవరో ఒకరిలో శక్తి దాగి ఉంది

ఆ శక్తి ఆగమనం జరిగి

వేరొకరితో ఏకం కావాలి

అప్పటి

వరకు సమస్యలు తప్పవు

మీ సంతోషం కోసం ఈ రక్ష లు తీసుకుని బిడ్డలకు కట్టండి

కానీ అమావాస్య పౌర్ణమి నాడు మాత్రం వారికి ప్రత్యేక జాగర్తలు తీసుకోండి ఆ దినాల్లో

దుష్ట శక్తి దైవ శక్తి రెండిటికీ బలం ఎక్కువగానే ఉంటుంది

ఆ రెండు పోటీ పడి తలపడుతుంటాయి

ఆ సమయంలో బిడ్డలకు భారం ఎక్కువ అవుతుంది

అందుకే ఆ రెండు రోజులు

బిడ్డల్ని బైటకు పంపకండి

పంపిన సద్యావెల కంటే ముందే ఇంటికి చేరుకునేలా చూసుకోండి

ఒక్కటి మాత్రం చెబుతాను

మీ ఇద్దరి పిల్లలలో ఒకరిలో శక్తి దాగి ఉంది

ఆ శక్తి ఆగమనం

జరిగి వేరొకరితో ఏకం

అయ్యే వరకు ఎదురయ్యే

ప్రమాదాలు ఆటంకాలు

తప్పవు

ఈ రక్షలు మీ సంతృప్తి కోసం మాత్రమే మీరు శత్రువులు గా

ఉన్నా మీ బిడ్డలు శతృవులు కాలేరు కాకూడదు

పరిస్థితులు

ఎలా ఉన్నా

ఈ ఇరువురు ఒక్కటిగా పయనించాలి

పవిత్ర పాదాలు అడుగు మోపి పుణ్య కార్యం పూర్తి చేయాలి

అంత వరకు కన్న వారీగా

మీకు ఆవేదన తప్పదు

వాస్తవాన్ని గుర్తించి

శక్తి నీ ఆగమనం చేయగలిగితే

గత జ్ఞాపకం ముందుకు

పోయే మార్గం చూపుతుంది.

అందాకా దేవి పై భారం మోపి

ఓర్పు వహించక తప్పదు

వెళ్లి రండి అంటూ పంపించాడు.

*"" ఆయన చెప్పకనే చెప్పిన

మాట ఆ ఇరువురు శతృవులు

కారు కాకూడదు అంటే

మిత్రులు అవుతారా అని ఆలోచిస్తూ ఒకరిని ఒకరు

కోపం గా చూసుకుంటూ

వీడి కొడుకు నా కూతురుకి మిత్రుడు ఎలా అవుతాడు

అది జరగని పని

అనుకున్నాడు భూషణ్.

వీడి కూతురు వీడిలానే

మూర్ఖంగా ఉంటాది ఏమో

అది నా కొడుక్కి స్నేహితురాలు ఎలా అవుతుంది

జరగని పని ఈ దొర అర్థం కాని మాటలు ఏవో చెప్పాడు

పోనీలే రక్ష ఇచ్చాడు కట్టి

పున్నానికి అమావాస్యకు

బైటకి పోనివ్వకుండా

చూసుకుంటా అనుకుంటూ సీరియస్ గా

వెళ్ళిపోయాడు శివరాం

భూషణ్ కూడా అలాగే అనుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.

వాల్ల ఆలోచనలు ఆవేదనలు

అన్ని తెలిసిన కోయ దొర

అక్కడి దేవికి నమస్కరిస్తూ

ఆ ఇరువురు గత జన్మలో

పడ్డ బాధలు చాలవా తల్లి

ఇంకా ఎందుకు ఉపేక్ష

నీ శక్తి ఎవరిలో ఉందో ఎప్పుడు ఆగమనం జరుగుతుందో

వారు చేయవలసిన పుణ్య కార్యక్రమం ఎప్పటికీ నెరవేరోనో

గదా ఈ పిచ్చి తండ్రులు

దూరం దూరం అంటున్నారు

ఆ జంట అంత దగ్గర అవుతూ ఉన్నారు మరీ నీ ఆజ్ఞ కోసం అమరావతి సైతం ఎదురు చూస్తుంది

జాగు చేయక జాడ చూపి

దాగి వున్న శక్తి ఆగమనం జరపించవే అంటూ వేడుకున్నాడు.....!!!!

ఆయన కంటికి అంతా

కనిపించింది జరిగింది

ఇకమీదట జరగబోయేది అంతా తెలిసిన వాడు కావడం తో

ఆ తండ్రులకి పూర్తిగా

విషయం చెప్పకుండా

జాగర్తలు మాత్రమే చెప్పాడు

మరీ ముందు ముందు

ఎం జరుగుతుందో

చూడాలి జరగవలసిన

కార్యక్రమం జరిపించి

మాట నిలుపుకోవాలి అని

చూసే దైవ శక్తి గెలుస్తుందో

లేక శాపం బారిన పడతోసి

పుడమి కన్నీళ్ళతో తడిసిన

దుష్ట శక్తి గెలుస్తుందో

తెలియాలి అంటే

కాస్త సమయం

పడుతుంది....!!

అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుడ్ నైట్ ఫ్రెండ్స్...!!Rate this content
Log in

Similar telugu story from Horror