raparthi anuradha

Horror Romance Thriller

4.5  

raparthi anuradha

Horror Romance Thriller

శక్తి ఆగమనం..11

శక్తి ఆగమనం..11

8 mins
303


ఇంటికి చేరుకున్న ఇద్దరు తండ్రులు తమ బిడ్డలను చేరుకుని

కోయ దొర ఇచ్చిన రక్ష

కుడిచేతికి కట్టి

నుదిట కుంకుమ దిద్దారు

ఆ పిల్లలు తండ్రుల ఒడిలో

తల పెట్టుకుని నీరసంగా

కళ్ళు మూసుకుని

నిదురించారు

కొంత సమయం వరకు

వాళ్ళని కదిల్చే ప్రయత్నం

ఆ తండ్రులు చేయలేదు

నెమ్మదిగా బెడ్ పై వారిని

పడుకో బెట్టి బైటకు వచ్చారు....!

వారి కోసం వాళ్ళు చెప్పే

మాటల కోసం ఆ బిడ్డల్ని

కన్న తల్లులు

ఆశగా ఎదురు చూస్తున్నారు..

వాళ్ళు బైటకు వచ్చి అసలు విషయం చెప్పారు

ఇంకే సమస్య ఉండదు ఒక్క అమావాస్య పౌర్ణమి కి జాగర్తగా చూసుకుంటే చాలు

అని ధైర్యం చెప్పారు

అంతా హమ్మయ్య అనుకున్నారు...!!

*" భువనగిరి కోట

ఆనుకుని ఉన్న కాళీ

ఆలయంలో ఎన్నో ఏళ్లుగా మూగబోయిన

గంటలు మ్రోగుతున్నాయి...

చీకటి కాటుక నడుమ

కాంతి రేఖ ప్రసరిస్తూ

చిరు జ్యోతి వెలిగింది...

హిరణ్య వర్ణపు కవచం

కాసింత కన్నులకగుపడే

వేడగ వచ్చిన జీవి మొరపెట్టుకుంటుంది....!!

అమ్మా శక్తి రామ్మా

వెలుగులోకి రా

నీ బిడ్డలకు రక్ష చేరింది

మరీ నీ ముంగిట జ్యోతి

లేకుంటే ఎలా తల్లి

ఈ అమరావతి ఆవేదన

ఈ భువనగిరి ఘోష వినుకొమ్మ...???

ఇంకెన్నాళ్ళు

జాగుచేయక జాడ చూపవే....

శక్తి ఆగమనం జరిగి

పుడమితల్లి తాపం తీర్చవే...

అంటూ ఆవేదన గా

ఆరాధిస్తూ అర్ధిస్తుంది

ఓ ఆత్మ

ఆమె అమరావతి ఆమె

పుట్టుక ఒక శాపం ఒక వరం గా పరిగణిస్తూ చేసిన

శపథం ఇచ్చిన మాట

ఆమెకు మరణం జననం

లేకుండా చేసింది

కొన్ని సంవత్సరాల క్రితం

జరిగిన ఘోర సంఘటనలు

ఆ భువనగిరి ఘోషించెలా చేస్తున్నాయి ఇన్నేళ్ళు

కాళి మాత ఆలయం

చీకటిలో ఉంది ఈ క్షణం

వెలుగు నీడలు చేరుకున్నాయి.

రాబోవు కాలంలో శాపం తొలగి

శక్తి ఆగమనం జరగాలి

అన్నదే అక్కడి వారి కోరిక

కటిక చీకటి కడు పున్నమి కావాలి ఆ పుణ్య పాదాలు ఈ పుడమి పై అడుగు మోపాలి

చేయవలసిన దైవ కార్యం పూర్తి

చేసి చెడుని అంతం చేయాలి

అందుకు ఇంకా ఎంతో

సమయం లేదు అని

ఆశగా అమ్మని ఆరాధిస్తూ వేడుకుంటుంది అమరావతి.

ఆమె ప్రార్థన అమ్మ విన్నట్టు

గుడి గంటలు మ్రోగుతు

విచారం వలదు అంటూ

సంకేతం ఇస్తుంది అమ్మ

ఆ గంటల ధ్వని ఊరంతా

వినిపించ సాగింది.

అర్ధరాత్రి మూత పడ్డ గుడి

ఆలయ గంటలు మ్రోగడం తో ఉలిక్కి పడి అక్కడి ప్రజలు పరుగులు తీస్తూ ఆలయాన్ని చేరుకుంటూ ఉన్నారు

వారు వచ్చే సరికి అమరావతి మాయం అయ్యింది.

కాని ఆలయ గంటలు

మ్రోగుతూనే ఉన్నాయి

కాళీమాత పాదాల చెంత జ్యోతి వెలుగుతూ ప్రకాశిస్తూ

కనిపించింది

అంతే ఊరి ప్రజలకు సంతోషం ధైర్యం మదిలో ఆశ మొదలైంది

మా కష్టాలు తీరే రోజు రాబోతోందా తల్లి మమ్ము ఆశీర్వదిస్తూ

ఆలయం లో జ్యోతిని వెలిగించమని

ఆదేశం ఇస్థున్నావా అంటూ ఆనందం గా వేడుకుంటూ ఉన్నారు....

అక్కడి పెద్దలు తెల తెల వారుతూ ఉండగా ఆలయానికి చేరుకుని

తొలి జ్యోతి వెలిగింది

ఇకనుండి ఎలాంటి అడ్డంకులు లేకుండా భువనగిరి వాసులు అలయాన జ్యోతులు వెలిగించి వేడుకోవచ్చు భీమశంకర చరణ సేవ కరణ చూపును

అమ్మ ఆజ్ఞ ఇచ్చింది

బీటలు బారిన నేల తొలకరి జల్లులు కురిసి తడారి ఆనవాలు లేని దేవనాగ నది పునరుర్ధారం అవుతుంది. అందరి కష్టం తొలగుతుంది చింతించకండి

అంటూ ఆనతి ఇచ్చారు

అక్కడి వాళ్ళు తమ కష్టాలు తొలగేరోజు త్వరలో వస్తుంది

అని ఆశగా అమ్మకి పూజలు నిర్వహించారు

వారికి చేతనైన దానిలో

నివేదన చేస్తూ ఉన్నారు...

అంత వరకు ఎలాంటి

ఆటంకం జరగలేదు

ఎప్పుడైనా ధైర్యం చేసి

ఆలయం లో శుభ్రం చేసి

పూజలు చేయ

జ్యోతి వెలిగించే ప్రయత్నం

చేస్తే దుష్ట శక్తి కోరలు విసిరి

ప్రకృతి బీబాత్సం సృష్టించి

అక్కడ భయానక పరిస్థితులు నెలకొని వందల మంది శక్తి హీనులుగా మారి మంచాన

పడి తెరుకోవటానికి నెలులు

పట్టేది

ఆ క్రమంలో కొందరు

ప్రాణాలు కూడా కోల్పోయే

పరిస్తితి ఏర్పడేది

అందుకే గుడి ప్రాంగణం దరి దాపుల్లోకి కూడా ఎవరు వెళ్లే సాహసం చేయలేక

పోయారు....!

కానీ ఇప్పుడు ఆ దుష్ట శక్తి

ఎలాంటి ప్రమాదం తెలేదు

అందుకే అక్కడి వారికి

ధైర్యం వచ్చింది.

కాళీమాత అలయాన్నే

మూతపడే లా చేసిందో

దుష్ట శక్తి అమ్మ ఆలయంలో

జ్యోతి లేకుండా నూరు సంవత్సరాలు దాటింది

ఇన్నాళ్ళకి గుడిలో జ్యోతి దానంతట అదే వెలిగింది అని

ఊరి ప్రజలు పుణ్య ఘడియలు

కొరకు ఆశగా ఎదురు

చూస్తున్నారు.

అసలు

ఎందుకు ఇంతటి దారుణం

జరిగింది అసలు ఏమైంది

త్వరలో తెలుస్తుంది.

***""""""""""

*"'' సిద్దు మేలుకుని ఇందు కోసం ఆలోచిస్తూ ఆమె మనసులో

నేను ఉన్నా ఎందుకు నన్ను

దూరం పెడుతుంది నాకు ఆమె కావాలి

క్షణం కూడా ఆమెను చూడకుండా నేను ఉండలేక పోతున్న

ఇప్పుడే వెళ్లి ఇందు నీ హగ్ చేసుకుని తనివి తీరా

ముద్దు పెట్టుకోవాలి అని ఉంది

కానీ రాక్షసి అరుస్తుంది

నిన్న ఊరుకున్నా

ఇవ్వాళ ఊరుకోదు

పెద్ద గొడవ చేస్తుంది అని

ఆమెను చేరుకోవాలి అని ఆశ

ఉన్న వెనకడుగు వేస్తూ ఇంక తన వల్ల కాదు అని

ఆమెకు వాట్సప్ లో మెసేజ్ చేసాడు.

ఇందు నాకు నిన్ను చూడాలి

అని ఉంది అంటూ....

ఆ మెసేజ్ సౌండ్ కి ఇందు

ఉలిక్కి పడి నిద్ర లేచింది

ఈటైం లో పడుకున్నా ఎంటి అనుకుంటూ పోయి ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీ లో కూర్చుని

చేతిలో మొబైల్ ఆన్ చేసి చూస్తే

సిద్దు విసిగిస్తూ మెసేజ్ చేస్తూ ఉన్నాడు ఆమె ఆన్సర్ ఇవ్వక

పోతే మళ్ళీ మళ్ళీ చేస్తాడు

లేదా ల్యాండ్ లైన్ కి కాల్ చేసి విసిగిస్తాడు అమ్మో నాన్నగారు ఇంట్లో ఉన్నారు

అంతే కాదు అందరూ

నాకోసం ఎందుకో దిగులుగా ఉన్నారు అని ఆలోచించి

అతడి మెసేజ్ కి రిప్లై ఇచ్చింది

నీకు బ్రెయిన్ పని చేయడం లేదా ఎంత చెప్పినా వినిపించు కోవా అంటూ మెసేజ్ చేసింది

సిద్దు హార్ట్ ఇమోజస్ పెడుతూ

నాకు ఏమీ వినిపించడం లేదు

కానీ కనిపిస్తుంది నీ అందమైన మోము అంటూ స్మైల్ ఇమోజి పెట్టాడు

ఇందు ఉలిక్కి పడి

కనిపిస్తున్నానా ఎలా ఎక్కడ ఉన్నావ్ అంటూ ఉండగా

అతడు ఆమె బాల్కనీ లో కూర్చుని ఉండటం ఫోటో తీసి ఆమెకే పంపించాడు

అంతే ఇందు కి అర్ధం అయింది అతడు తన ఆపోజిట్ గా ఉన్నాడు అని అటుగా చూసింది

సిద్దు కార్ పైకి ఎక్కి కూర్చుని ఆమెకు చేతిని ఊపుతూ సైగ చేసాడు

అంతే ఇందు భయం గా వాడికి

ఫోన్ చేసి రేయ్ నీకేమైనా పిచ్చా మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది రా పో అంటూ అరుస్తూ చెప్పింది

*""సిద్దు నవ్వుతూ ఆమెకు వినిపించేలా మొబైల్ పై కిస్

చేసి ఆమె వాయిస్

కంట్రోల్ చేశాడు

ఇందు తడబడుతూ

నీకు పిచ్చి పట్టింది.

అందుకే ఇలా పిచ్చి పిచ్చి గా బిహేవ్ చేస్తున్నావ్

శివరాం అంకుల్ కొడుకు ఇలా

రోడ్ సైడ్ రోమియో లా ప్రవర్తిస్తూ ఆడపిల్ల ఇంటిముందు

వేషాలు వేసి తన్నులు తింటే చండాలం గా ఉంటాది

పోరా ఇంటికి

అని అతడ్ని మందలిస్తూ ఉంటే

*"" సిద్దు నవ్వుతూ థాంక్యూ బేబీ నాకోసం మా డాడ్ మర్యాద కోసం పెళ్లికి ముందే ఆలోచిస్తున్నావు గ్రేట్.... అంటూ ఉన్నాడు

*"" ఆమె చిరాగ్గా పెళ్లెంట్రా ఎవరు చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని

పిచ్చి వాగుడు వాడకుండా పో ఇక్కడి నుంచి లేదా తన్నులు

తింటా వ్ అని హెచ్చరించింది.

సిద్దు సీరియస్ అవుతూ తన్నులా నన్నా ఎవడికి అంత సీన్ లేదు

నా పై చేయి వేస్తే ఎముకలు విరిచేయను అంటూ కాలర్ ఎత్తి స్టైల్ గా పోజ్ కొడుతూ ఉంటే

ఇందు కంగారుగా బైట అంతా తన చుట్టూ చూసుకుంటూ రేయ్

ప్లీజ్ రా వెళ్ళిపో ఎవరైనా

చూస్తారు నాకు భయం గా ఉంది మొన్నే హాస్పటిల్ బెడ్ ఎక్కావు మరచిపోయావా అంటూ

అతడ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే

సిద్దు నవ్వుతూ అయితే నాకు

ఓకే అని చెప్పు వెళ్ళిపోతా

అన్నాడు

ఇందు తెల పై కొట్టుకుని నీకేమైనా పిచ్చా నిన్ను చూస్తేనే నాన్నగారు గొడవ చేస్తారు ఇంక నీతో లవ్ ఓకే చెప్పడం అంటే మామూలుగా ఉండదు అంటూ ఉంది

సిద్దు సీరియస్ అవుతూ

మళ్లీ అదే మాట ఇప్పుడేంటి

మీ నాన్న కి భయపడమని చెప్తున్నావా నాకు ఎవరన్నా

భయం లేదు నీమీద ప్రేమ మాత్రమే ఉంది కావాలి అంటే ఇప్పుడే నా ప్రేమ రుజువు చేస్తాను చూస్తుండు అంటూ ఆవేశంగా ఆమె ఉన్న

వైపు రావడం కనిపించింది.

ఆమెకు చాలా భయం వేస్తుంది అయ్యో ఈ అబ్బాయికి పిచ్చి పట్టినట్టు ఉంది నాన్నగారు చూస్తే ఎలా చాలా గొడవ అవుతుంది శివరాం అంకుల్ నాన్నగారు

ఇంకా పెద్ద శతృవులు అవుతారు తగాదా పడతారు ఇప్పుడేం చేయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే సిద్దు ఎప్పటిలా ఆ ఇంటి

పైప్ లైన్ పట్టుకుని ఆమె ముందుకు చేరుకున్నాడు

ఇందు క్షణ కాలం అతడి ధైర్యం సాహసం చూసి ఆశ్చర్య పోయింది నీకు నామీద ఇంత ప్రేమ ఉందా అందుకే ఎంత ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవాలి అని వచ్చావా అన్నట్టు చూస్తుంటే

సిద్దు ఆమె వద్దకు చొరవగా

వచ్చి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆమెను గట్టిగా హగ్ చేసుకుని మనసు నిండేలా ముద్దు పెట్టుకున్నాడు.

ఇందు మతి పోయినట్టు అయిపోయి అతడి ప్రేమ

మాయలో తేరుకోలేనీ వింత అనుభవం చూస్తూ ఉంటే

సిద్దు చేయాలి అనుకున్నది

చేసి ఆమెను అతడి కౌగిలిలో దాచుకుంటూ నే చెప్తున్నాడు

ఐ లవ్ యూ....

నాకు భయం లేదు అని

చెప్పడానికే ఈ సాహసం

చేయలేదు ఇంకో కారణం ఉంది మనసు ఎంతగానో కోరుకుంది

నిన్ను హత్తుకోమని మనసారా ముద్ధాడమని అంతే కాకుండా

నన్ను అమరావతి ఎంకరేజ్

చేసింది అందుకే వెనకడుగు వేయకుండా వచ్చాను

నిన్ను ముద్దాడాను

ఇప్పుడేం అంటావ్ ఇంకా

నన్ను బయపెట్టాలి అనే చూస్తావా అని కన్ను కొడుతూ ప్లీజ్

బేబీ లవ్ యు అని ఓకే

చెప్పు అంటూ ఎంతో ప్రేమగా అడుగుతుంటే

షాక్ తగిలినట్టు అతడి

కౌగిలిలో ఉన్న ఇందు స్పృహలోకి వచ్చి అతడ్ని విదిలించుకుని

హౌ డేర్ యూ నీకు పిచ్చి

పట్టింది నన్ను అలా ఎలా కిస్ చేస్తావ్ అయినా

అమరావతి పేరు ఎందుకు యూస్ చేసుకుంటున్నావ్

అసలు నువ్వు ఇక్కడ

ఓహ్ నో నాన్నగారు వచ్చేలా ఉన్నారు ప్లీజ్ వెళ్ళిపో నీకు

దండం పెడతాను అంటూ అడుగుతూ ఉంది

సిద్దు నవ్వుతూ ఓకే ఓకే కూల్ బేబీ వెలతాలే టెన్షన్ అవ్వకు కూల్ అంటూ ఆమె వైపు ఇష్టం గా

చూస్తూ నీకు నేను అంటే ఇష్టం

అని నువ్వు ఒప్పుకునే వరకు

నేను నిన్ను ఇలాగే వెంటాడుతూ ఉంటా అందుకోసం నా ప్రాణాలు పణం గా పెట్టడానికి కూడా వెనకడుగు వేయను

చెప్తున్నా నాకు ఏమైనా

అయితే నీదే బాధ్యత ఉమ్మా.....అంటూ

త్వరగా ఓకే చెప్పేస్తే ఇలా

తంటాలు ఉండవు రా బేబీ

అంటూ ఆమెను కవ్విస్తూ ఎలా వచ్చాడో అలాగే బిల్డింగ్ కిందకు

దిగి అతడి కార్ వద్దకు చేరుకున్నాడు.

అంత వరకు ఇందు టెన్షన్ పడుతూనే ఉంది

సిద్దు కార్ డోర్ ఓపెన్ చేస్తూ

ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి బై అంటూ సైగ చేసి వెళ్ళాడు

అతడు వెళ్ళాక ఆమె

హమ్మయ్య అని ఊపిరి

తీసుకుని వెనక్కి తిరిగి చూసింది అంతే ఊహించని షాక్ ఎదురుగా భూషణ్ గారు నిలుచుని ఉన్నారు

అయన్ని చూసి ఇందు పిచ్చ షాక్ అయ్యింది

ఆమె తడబడుతూ నాన్నగారు మీరా అంటూ ఉంటే

ఆయన కూతురు తలపై చేయి వేస్తూ ఎదో అంటున్నారు

ఇందు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది ఈ సిద్దు రావడం నాన్నగారు చూసినట్టు ఉన్నారు

అయిపోయింది వాడ్ని ఎం చేస్తారో ఏమో అనుకుంటూ ఎదో చెప్పి ఆపాలి అనుకుంది

అంతలో ఆయన దిగులుగా

ఎమ్మా ఇందు ఇప్పుడు ఎలా ఉంది నీకు భయం గా లేదుగా

చేతికి రక్ష కట్టాక కూడా ఏవైనా భయం పీడకలలు వచ్చాయా

అని అడిగారు ఆమెకు అర్థం అయింది ఆయన సిద్దు నీ చూడలేదు అని అందుకే

గట్టిగా ఊపిరి తీసుకుని

లేదు నాన్నగారు దుష్ట శక్తి భయం లేదు గానీ ఓ అల్లరి పిల్లాడితో

అవస్థ ఎక్కువ అయింది

అనుకుంది మనసులో

పైకి నవ్వుతూ ఏమి లేదు నాన్నగారు ఇప్పుడు బాగానే ఉన్నాను మీరు దిగులు పడకండి అంటూ ఉంటే ఆయన

నవ్వుతూ అయితే రామ్మ భోజనం చేద్దాం అని అడిగారు

సరిగ్గా అప్పుడే సిద్దు మెసేజ్ చేసాడు నేను ఇచ్చిన ముద్దు తోనే కడుపు నింపుకోకు వెళ్లి పాలన్నం తిని పడుకో లేదా నీరసం వస్తుంది నా అముల్బెబికి అంటూ

కొంటెగా మెసేజ్ చేశాడు

ఇందు కంగారుగా మొబైల్

వంక చూసి సరే నాన్నగారు భోంచేద్దాం అంటూ ముందుకు

కదిలి సిద్దు తో వాదన మంచిది కాదు అని ఓకే థాంక్స్ నీ సంగతి రేపు చెప్తా ప్లీజ్ ఇంక మెసేజ్ చేయకు అంటూ ఆన్సర్ చేసి పంపింది

సిద్దు ఓకే డార్లింగ్ అంటూ

మెసేజ్ పెట్టాడు

ఆమె విసుగ్గా ఆ మేసేజులు

డిలీట్ చేసి మొబైల్ సైలంట్ లో పెట్టీ అందరితో కలిసి భోజనం చేసి వచ్చి పడుకుంది. ఆమెకు ప్రశాంతంగా నిద్ర పట్టింది.

సిద్దు మాత్రం ఆమెనే తలుచుకుని నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు

అతడు ఇందు నీ చూడాలి అని ఆశగా ఉన్న వెనకడుగు వేయడం తో అక్కడికి వచ్చిన అమరావతి అతడ్ని ఎంకరేజ్ చేస్తూ

ప్రేమ ఉంటే సరిపోదు

ఆ ప్రేమని ప్రేమించిన వారికి చూపించ గలగాలి

నీ గుండె నిండా ఆమె ఉంది

నాకు తెలుసు అందుకే నిన్ను ఆమెను కలిపేందుకు వచ్చాను ఇప్పుడు ఆమె నీకు ఎదురైయ్యే అవకాశం ఉంది

ఇలా గదిలో కూర్చుని చింతించకు పోయి ప్రేమని చూపించుకో

అంటూ సలహా ఇచ్చింది.

సిద్దు ఆశ్చర్యంగా మీరు

ఇక్కడికి ఎలా వచ్చారు

అసలు మీరు ఎవరు ఎందుకు

నాకు హెల్ప్ చేస్తున్నారు అని అడిగాడు

ఆమె నవ్వుతూ నేను ఎవరు

అని నువ్వు అడగడం వింతగా ఉంది హు...

సమయం వచ్చినప్పుడు

నేను ఎవరో ఏంటో తెలుస్తుంది

లే ముందు అయితే

ఇందు నీ చూసిరా నీ మనసు

తేలిక అవుతుంది నాకు

నీ సంతోషం కంటే ఏమీ

ఎక్కువ కాదు రాజా అంటూనే తడబడి సిద్దు అని పేరు మార్చింది.

అతడు ఇందు పేరు విని

ఆనంద పడిపోతూ థాంక్స్ అమరావతి నువ్వు ఎవరో ఎంటో గాని నాకు అయితే ఫ్రెండ్ అయ్యవ్ థాంక్స్ అంటూ ఇందు కోసం

కార్ తీసుకు వెళ్ళాడు

అమరావతి అతడ్ని ఎంతో

ఇష్టంగా చూస్తూ నిలుచుంది .

అక్కడికి సిద్దు తల్లి వచ్చి సిద్దు భోజనం చేయరా నీరసం తగ్గుతుంది అని పిలిచింది

అమరావతి సిద్దు రూపంలో

మారి అక్కడి వాళ్ళతో భోజనం చేసి నవ్వుతూ అందరినీ

నవ్విస్తూ వచ్చి గదిలోకి చేరుకుంది

కొంత సమయం గడిచింది

సిద్దు ఇందూని చూసాను హగ్ చేసుకుని కిస్ చేశాను

అని హ్యాపీగా ఇల్లు చేరుకుని

అతడి గదిలో కూర్చుని

ఆమెనే తలుచుకుంటూ ఆకలి

నిద్ర లేకుండా కూర్చున్నాడు

అప్పటివరకు అతడి రూపం లో ఉన్న అమరావతి అతడు రావడంతో మాయం అయ్యింది....

*' ఒకరికి విరహం మరొకరికి పరవశం ఈ జంట కలయిక

కోసం ఓ జీవి ఆరాటం

ముందు ముందు మరిన్ని

వింతలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్థాయి

అనుకుంటున్నా అంతవరకు

వేచి చూడాలి ఫ్రెండ్స్

అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....!!!Rate this content
Log in

Similar telugu story from Horror