raparthi anuradha

Drama Fantasy Thriller

4.5  

raparthi anuradha

Drama Fantasy Thriller

శక్తి ఆగమనం..8

శక్తి ఆగమనం..8

10 mins
406


*"" సిద్దు హాస్పటిల్ లో తెలివి లేకుండా ఉండటం

అతడి నెక్ పై ఎవరో బలం గా నొక్కినట్టుగా గుర్తులు ఉండటం తో శివరాం అదుపు తప్పాడు

ఎవరో నా కొడుకుని చంపాలి

అని చూసాడు

నన్ను నా కుటుంబాన్ని

నాశనం చేయాలి అనే ఆలోచన ఒక్క భూషణ్ కి మాత్రమే

ఉంది వాడే ఇదంతా చేశాడు

అని అవేశం గా పోలీస్

కంప్లైంట్ వరకు వెళ్ళాడు

విషయం తెలుసుకున్న

హరిబాబు అడ్డుకుంటూ

ముందు అబ్బాయి కి నయం అవ్వని ఏం జరిగింది

తెలుసుకుని యాక్షన్

తీసుకుందాం అంత వరకు

నువ్వు కోపం కంట్రోల్

చేసుకో నాకు ఇప్పుడే ఒక

విషయం తెలిసింది

రాబోయే ఎలక్షన్స్ కి భూషణ్ సిద్ధం అవుతున్నాడు

నాకు పోటీ గా అంటే నన్ను

ఓడించి

నిన్ను సాధించాలి అన్నది

వాడి ప్లాన్.... వాడు గెలిస్తే నా మినిస్ట్రీ వాడికి ఇస్తారు

ఆ విషయం తెలుసుకుని

తట్టుకోలేక ఈ అబద్ధపు

కంప్లైంట్ ఇచ్చావు అని వాడు ప్రచారం చేస్తాడు

అదే జరిగితే రాబోయే

ఎలక్షన్ లో వాడిదే పై చేయి అవుతుంది

చేతులారా వాడికి అవకాశం

ఇచ్చిన వాళ్ళం అవుతాం

అని ఎన్నో విధాల నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు

హరి బాబూ మాటలకు ఎటూ తేల్చుకోలేక

శివరాం కొడుకు కోలుకోలేదు

అని భాధ భయంతో కుప్పకూలిపోయాడు

అతడి భార్య దాక్షాయణి మరింత భాధ పడుతూ కూర్చుంది.

హాస్పటిల్ పరిసర ప్రాంతం

అంతా శివరాం మనుషులు

ఉన్నారు అంతే కాదు

హరిబాబు సెక్యూరిటీ

సిబ్బంది చాలానే ఉన్నారు...!!

*"డాక్టర్స్ చెక్ చేసి ఇంజక్షన్ ఇస్తు సిలైన్ ఎక్కిస్తూ ఆక్సిజన్

వెంటిలేటర్ పరికరాలతో అతడ్ని ఫుల్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు....!!

ఇంకో వైపు ఇందు చాలా భాధ పడుతుంది

సిద్దు అల్లరి పిల్లాడు

అనుకున్నది వెంటనే జరగాలి అనుకునే మొండి తనం గలవాడు అందుకే తాను నో చెప్పే సరికి ప్రాణాలు తీసుకోవాలి అని చూసాడు అది తప్పు

ఇంత తక్కువ సమయంలో ప్రాణాలు సైతం తన కోసం వదిలేయాలి అని

అనుకున్నాడు ఎందుకు

ప్రేమలో అంత మహత్యం

ఉందా అని ఆలోచిస్తూ

కూర్చుంటే

ఆమె పక్కనే

శ్రావణి కూర్చుని శ్రీరామ్

చెప్పిన మాటలు చెబుతూ

ఉంది.

ఇందు కి వెంటనే అతడ్ని చూడాలి అని ఉంది

కానీ ఎలా ఇంకాసేపట్లో

యాది తనని తీసుకు వెళ్లేందుకు వస్తాడు

తనతో నేను ఇంటికి వెళ్ళక

పోతే ప్రాబ్లం అవుతుంది

ఇక్కడి విషయాలు అన్ని

ఇంట్లో వారికి తెలుస్తాయి

ముఖ్యం గా నాన్నగారికి తెలిస్తే

పెద్ద సమస్య వస్తుంది

ఎలా అని ఆలోచిస్తూ ఉంది.

*"శ్రావణి ఆలోచించి ఒక ఐడియా చెప్పింది

స్పెషల్ క్లాస్ ఉంది నేను

ఆలస్యం గా వస్తాను అని ఇంట్లో చెప్పు డ్రైవర్ నీ పంపొద్దు

నేను నా ఫ్రెండ్ వెహికల్ లో

వస్తాను అని చెప్పి

మేనేజ్ చెయ్యి అని సలహా ఇచ్చింది. 

ఇందు కి వెంటనే సిద్దు నీ

చూడాలి అనిపించడం తో కాస్త ధైర్యం తెచ్చుకుని

తండ్రి కి ఫోన్ చేసి విషయం

చెప్పింది శ్రావణి అని నా ఫ్రెండ్ ఉంది ఆమెతో కలిసి ఇంటికి

వస్తాను నాన్న గారు

ఎలాంటి ఇబ్బంది ఉండదు

అంటూ ఉంటే

శ్రావణి ఫోన్ అందుకుని

అంకుల్ నేను శ్రావణి ఇందు

ఫ్రెండ్ నీ స్పెషల్ క్లాస్ ఉంది

తను కంగారు పడుతుంది

నేను చెప్పాను టెన్షన్ లేదు

నేను డ్రాప్ చేస్తాను అని

మరీ చదువుకునే అమ్మాయిలు ఇంత అమాయకం గా ఉంటే ఎలా ఆడపిల్లలు అయినా ధైర్యం గా ఉండాలి అని చెబుతున్న

అంటూ నోటికి వచ్చిన మాటలు చెప్పింది

భూషణ్ ఆలోచిస్తూ ఈ అమ్మాయి ఎవరో కాస్త గడుసు పిల్ల లా

ఉంది మా ఇందు కి స్నేహితురాలు అయితే పాప లో మార్పు వస్తుంది అని సంతోష పడి అలా చెప్పు అమ్మ అమ్మాయికి పిరికిగా

ఉండకూడదు అని సరే

నువ్వు జాగర్తగా అమ్మాయిని

ఇంటి వద్ద వదిలి పెట్టు అని నవ్వుతూ చెప్పి ఇందు జాగర్త అంటూ ఫోన్ పెట్టేసాడు

భూషణ్

ఆ వెంటనే యాది కి ఫోన్ చేసి అమ్మాయి కి కాలేజ్ లో ఎదో స్పెషల్ క్లాస్ అంట ఆ సంగతి చూడు అంటూ ఆర్డర్ ఇచ్చి

తన పనిలో తాను ఉన్నాడు.

*"" ఇందు శ్రావణి బైక్ మీద సిద్దు ఉన్న హాస్పటిల్ వైపు వెళ్ళడం మొదలు పెట్టింది.

అప్పుడే అక్కడికి వచ్చిన

యాది వాళ్ళు బైక్ మీద వెళ్ళడం చూసి ఫాలో చేయడం

మొదలు పెట్టాడు.

*"" హాస్పటిల్ వద్ద చాలా

జనం ఉన్నారు

శివరాం ఎవర్ని లోపలికి

రానివ్వడం లేదు శ్రీరామ్

సిద్దు ఫ్రెండ్ అని చెబుతున్న

బైటకు పంపించేసాడు

తన కొడుకు మేలుకుని

జరిగింది చెప్పే వరకు ఎవర్ని నమ్మను అంటూ ఆవేశ

పడుతుంటే ఆయన భాధ అర్థం చేసుకుని శ్రీరామ్ వెలుపలికి వెళ్ళిపోతూ

ఉండగా అటుగా వస్తున్న

శ్రావణి ఇందు కనిపించారు

వాళ్ళని చూసి గబగబా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు

అంకుల్ ఎవర్ని లోపలికి

రానివ్వడం లేదు అక్కడ ఉన్న నన్ను ఇంకా కొందరు ఫ్రెండ్స్ నీ బైటకు పంపించేశారు

ఈ టైం లో సిద్దు నీ చూడటం జరగదు వెళదాం రండి అంటూ పిలిచాడు

వాళ్ళు మాట్లాడుకుంటూ

ఉండగా యాది అక్కడికి

వచ్చాడు.

ఇందు కన్నీళ్లు పెట్టుకుంటు అన్నయ్య నేను సిద్దు నీ చూడాలి తను ఎలా ఉన్నడో అని

కంగారుగా ఉంది అని ఏడుస్తూ అడుగుతుంటే

శ్రావణి శ్రీరామ్ ఆమెను

కంట్రోల్ చేస్తూ ఏమీ కాదు

నువ్వు టెన్షన్ అవ్వకు ఇలా రా కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుందాం కాసేపట్లో సిద్దు కి మెళుకువ వస్తుంది లే అని ధైర్యం చెప్పి ఒక పెద్ద చెట్టు వద్ద కూర్చో పెట్టారు

ఇందు మృత్యుంజయ 

మంత్రం చదువుతూ సిద్దు కి ఏమీ కాకూడదు అని వేడుకుంటూ

ఉంది

శ్రావణి శ్రీరామ్ ఆమెను కదిల్చె ప్రయత్నం చేయకుండా

దిగులుగా కూర్చుని

ఉన్నారు....!

*""యాది ఏమ్ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం

చేస్తున్నాడు అక్కడ ఉన్న

కొందరు అనుచరులను

చూసి షాక్ అయ్యాడు

వాళ్లంతా శివరాం మనుషులు.... అంతే కాదు మినిష్టర్ హరిబాబు అతడి సెక్యూరిటీ అంతా కనిపించారు

యాది కంగారుగా వెనక్కి

తగ్గాడు అక్కడి వాళ్ళు

తనని చూస్తే లేనిపోని సందేహాలు వస్తాయి అని పక్కకి తప్పుకుని

ఆ హాస్పటిల్ బాయ్ కనిపిస్తే అతడ్ని అడిగాడు

ఇంత జనం ఈ గందరగోళం

ఎంటి సంగతి అని.

ఆ వ్యక్తి విషయం చెప్పాడు

ఎవరో బిజినెస్ మేన్ శివరాం

అంట అతడి కొడుకుని ఎవరో కాలేజ్ లో హత్యచేయ బోయారు అని అంటున్నారు ప్రస్తుతం ఆ బాబు హాస్పటిల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు

డాక్టర్స్ బ్రతకడం కష్టం

అంటున్నారు అందుకే ఈ జనం గందరగోళం అని విషయం చెప్పి వెళ్ళాడు

అంతా విన్న యాది గుండె ఆగిపొయింది

ఎంటి ఆ అబ్బాయిని చంపాబోయారా

బ్రతకడం కష్టం అంటున్నారా అలాంటి పరిస్థితిలో ఉన్న శివరాం కొడుకుని చూడటానికి మా

ఇందు అమ్మ వచ్చి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంద

ఈ విషయం అన్న కి తెలిస్తే

పెద్ద ఎత్తున తుఫాన్ రేగుతుంది

ఆ శివరాం అమ్మాయిని

చూసినా గొడవ అవుతుంది

అని కంగారుగా ఇందు నీ

తీసుకు పోవాలి అనుకుని

ముందుకి అడుగు

వేయబోతే భూషణ్ నుంచి

ఫోన్ వచ్చింది

యాది కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నా అన్నాడు

అవతలి వ్యక్తి అడిగాడు

ఎంటి విషయం అని

యాది తడబడుతూ కాలేజ్ లో క్లాసు అవుతుంది అన్న

నేను బైట ఉన్న ఇందు అమ్మ లోపల ఉంది అని అబద్ధం

చెప్పాడు

భూషణ్ చిన్న నవ్వు నవ్వి సరే నువ్వు అమ్మాయికి కనిపించక

అలా అని వెనక్కి వచ్చేయమాకు ఇందు ఇంటికి వచ్చే వరకు

కాపలా గా ఫాలో చెయ్యి

ఏమో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు

జాగర్తగా ఉండాలి అంటూ

ఫోన్ పెట్టాడు

యాది నిట్టూరుస్తూ ఆల్ రెడీ ప్రమాదం వచ్చింది ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని ఇందు వైపు కదిలాడు....!

*" అతడు ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఇందు నీ చేరుకుంటాడు కానీ అడుగు ముందుకి పడలేదు పాదం నేల మీద పడకుండా ఎదో శక్తి ఆపింది

చుట్టు ఉన్న జనం వెహికల్స్ వీచే గాలి అన్ని కూడా ఎక్కడికి అక్కడ స్తంభించి పోయాయి....

మొత్తం నిశ్శబ్ధం ఆవహించింది.

మంత్రం చదువుతూ ఉన్న ఇందు ఆమె చుట్టూ ఉన్న వారు ఫ్రీజ్ అయిపోవడం కాలం స్తంభించి నట్టు కదలిక లేనట్టు ఉండిపోవడం గుర్తించి ఆశ్చర్య పోయింది

ఆమెకు ఏం జరుగుతుంది

అర్థం కాలేదు కంగారుగా తల పైకి ఎత్తి చూసింది

ఎదురుగా ఒక ఆడ వేషం వేసుకున్న మగ వ్యక్తి నవ్వుతూ కనిపించాడు.

నిజానికి అతడు ఒక హిజ్రా.... వంటి నిండా బంగారు పూత పూసినట్టు పసుపు పూసుకుని సూర్యుడి ఆకృతి వలె ఎర్రటి కుంకుమ బొట్టు అద్దుకుని

మెడలో శివుడి మెడలో నాగు పాము మెలికలు తిరిగి నట్టు

ఆమె మెడలో పచ్చల గొలుసు మెలికలు తిరిగి ఉంది

ఎర్రటి చీర చేతి నిండా గాజుకి

కాళ్లకి బలమైన వెండి కడియాలు పెట్టుకుని అమ్మవారు లా దర్శనం ఇచ్చింది

ఆవిడ్ని చూసి

ఇందు భయం గా ఎవరు మీరు ఇక్కడేం జరుగుతుంది

అని భయం గా అడిగింది

ఆవిడ నవ్వుతూ నేను ఎవరు

అని నన్ను నేనే అడుగుతున్నట్టు ఉంది విచిత్రం గా లేదూ

అని నవ్వింది

ఆవిడ మాటలు ఇందూ కి

అర్ధం కాలేదు అందుకే అయోమయం గా చూస్తూ

ఉంటే ఆమె నవ్వుతూ

చెలికాడు నిన్నే కోరి వచ్చి చెంత చేరితే చేయి విదిలించి ఇప్పుడు చింత పడుతున్నావా

అది నీ తప్పు కాదు లే

ఏళ్ల ఎడబాటు తొలగి ఒక్కటి కావాలి అని జన్మెత్తిన మిమ్ము

వేరు చేయాలి అని చూస్తున్న .

వాడి ఆటలు ఈ అమరావతి ఉండగా సాగవు

నీకు నేను ఉన్నాగా నాతో రా

నీవు ఎవరి కోసం కన్నీళ్లు పడుతున్నావో వాడి నుదుట నీ చేత్తో కస్తూరి కుంకుమ బొట్టు

పెట్టు చీకటి మాయ కమ్ని మైకం పాలు అయిన వాడు లేచి కూర్చుంటాడు

రా నాతో ఆలస్యం జేయక సమయం లేదు అంటూ

ఇందు చేయి పట్టుకుంది

ఆవిడ

అంతే ఇందు ఎవరండీ మీరు

నాకు మీ మాటలు అర్థం కావడం లేదు అని అడగాలి అనుకున్న

ఆమె పెదవి కదల్లేదు

నోట మాట రానాట్టు ఎదో మాయలో ఆవిడ వెనకే కదిలింది....

వాల్లుముందుకు వెళుతుంటే

ఎదో శక్తి సుడిగుండం లా గాలి దుమారం రేపుతూ

వాళ్ళకి అడ్డం రాబోయింది

అమరావతి చేయి అడ్డం గా చూపించి హు.....ఆగు అన్నట్టు

సైగ చేసింది

అంతే వచ్చిన అడ్డంకి

తప్పుకుంది.

ఇందు నీ చేత పుచ్చుకుని ఆవిడ సిద్దు ఉన్న గది కి బైటవైపు గా ఉన్న గోడలోపలి నుంచి ప్రవేశించింది....

విచిత్రం ఆ ఇరువురు ఎంతో బలమైన గోడలోపలికి వెల్లిపోగలిగారు...

చూడబోతే బెడ్ మీద జీవం లేనట్టు ఎంతో నీరసం గా ఉన్నాడు సిద్దు

అతడిలో స్పృహ లేదు ఇందు అతడ్ని చూసి చాలా భాధ పడింది అయ్యో సిద్దు నీకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అతడి చెంపలు పట్టుకుని తడుముతు మెడమీద ఉన్న ఎర్రటి గుర్తులు చూసి షాక్ అయ్యింది

చూడబోతే ఎవరో అతడి గొంతు నులిమి నట్లు తెలుస్తుంది.

ఇందు అర్థం కానట్టు ఆవిడ వైపు చూసింది

ఆవిడ నిట్టూరుస్తూ ముందు

ఈ కస్తూరి అతడి నుదుట పెట్టు అని అందించింది

ఇందు కంగారుగా ఆ కుంకుమ

సిద్దు నుదిట బొట్టు లా పెట్టింది.

అంతే సిద్దు తుల్లిపడ్డాడు ఒక్కసారిగా కదిలాడు

వంటిన ఉన్న మాయా మాయం అయ్యింది అంతే కాదు ఇందు చూస్తుండగా అతడి మెడ చుట్టూ ఉన్న గాయం ఎరైజర్ తో చేరిపినట్లు మాయం అయిపొయింది.

అమరావతి నవ్వుతూ ఇది మీ ప్రేమ కి ఉన్న శక్తి.....

ఈ శక్తి ముందు మరీ ఏ శక్తి భలం సరిపోదు నీవు తన చెంత ఉంటే అతడు నీ చెంత ఉంటే ఎలాంటి ప్రమాదం రాదు రాలేదు అర్ధం అయ్యిందా అని నవ్వింది

ఇందు కి అంతా అయోమయం గా ఉంది ఇది నిజమా లేక కల అర్థం కాని ఆశ్చర్యం లో చూస్తుంటే

ఆవిడ ఇంక వచ్చిన పని పూర్తి అయ్యింది వెళదామా అని

అడిగింది ఇందు సిద్దు వైపు దిగులుగా చూస్తూ సరే అన్నట్టు

తల ఆడించి ఆవిడ వెంట కదిలింది.

ఇందు దూరం అవ్వడం కళ్ళు మూసుకుని ఉన్న సిద్దు కి తేలిసిపోయింది అంతే టక్కున కళ్ళు తెరిచి ఆమె చేయి పట్టుకున్నాడు

అతడి చర్య ఆమె ఊహించ లేదు అందుకే కంగారుగా అతడి వైపు చూసింది.

సిద్దు ఆమెను దగ్గరకు

తీసుకుని ఇందు

వెళ్ళిపోతున్నావా నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అంటూ

దగ్గరకు ఆమె నుదిటి పై ముద్దు పెట్టుకుని గట్టిగా చుట్టుకున్నాడు

ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు సిద్దు మాత్రం ఆమెను హగ్ చేసుకుని ఎంతో పరవశం అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటు ఉన్నాడు

ఇందు అతడి చర్య తో మాట రాని శిలల ఉండిపోయింది

ఆ ఇరువురి కౌగిలి భంగ పరుస్తూ సమయం లేదు అంటూ

అమరావతి ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ఎలా అయితే

తీసుకు వచ్చిందో ఆలాగే ఆ గది బైట వైపు గోడ నుండి వెలుపలికి తీసుకు వచ్చేసింది.

సిద్దు అమరావతి నీ చూడలేదు

కానీ ఇందు రావడం గోడ లోనుండి మాయం అవ్వడం చూసాడు

అందుకే ఆమె ఏడబాటు సహించ లేనట్టు ఇందూ ఇందూ అంటూ పిలుస్తున్నాడు....!

*"" బైటకు వచ్చిన ఇందూ నీ అక్కడి చెట్టు వద్ద కూర్చో బెట్టి ఆవిడ నవ్వుతూ చింత లేదు లే చెలికాడు చేరవచ్చు లే అంటూ మాయం అయ్యింది....

అంతే ఎప్పటిలా అక్కడ అంతా నార్మల్ అయ్యింది

ఒక్కసారిగా వాతావరణ మునుపటిలా అయిపోయింది

తన చుట్టూ ఉన్న వారు కదిలారు అంతా అయోమయం గా అనిపించింది ఆమె కలకన్నదో లేక నిజం గా జరిగిందో అర్ధం కాలేదు అమరావతి అంటూ వచ్చిన

ఆమె కనిపించ లేదు 

ఇందు అయోమయంగా లేచి నిలుచుని అటు ఇటు చూస్తూ

ఉంటే శ్రావణి శ్రీరామ్ ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఏమైంది ఇందూ

అని అడుగుతున్నారు....

ఆమె తడబడుతూ ఎదో చెప్పాలి అనుకుంది

అంతలో అక్కడికి యాది

వచ్చాడు అతడు రావడం

చూసి ఇందు కంగారు పడింది

యాది దిగులుగా ఇక్కడికి వచ్చావు ఎంటి ఇందమ్మా అన్న కి తెలిస్తే నా ప్రాణం తీస్తాడు తెలుసా రండి వెళ్లి పోదాం అని అడిగాడు ఆమె భాధగా అదికాదు యాది నా క్లాస్ మెట్ ఒకరికి ఒంట్లో బాలేదు చూసి వెళ్ళాలి అని వచ్చాను కానీ ఇప్పుడే అతడ్ని చూసాను కూడా అని మాట్లాడుతుంటే యాది సీరియస్ అవుతూ అతడు క్లాస్ మేట్ మాత్రమే కాదు మీ నాన్న శతృవు కొడుకు కూడా నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే రెండు వైపుల వాళ్ళు కత్తులు నూరు తారు

రక్తం ఏరు లా పారుతాది

అర్థం చేసుకొమ్మ ఆ శివరాం మంచి వాడు కాదు కోరి కయ్యానికి చూస్తాడు ముందు నువ్వు నాతో రా అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకు పోతుంటే

మిగిలిన వాళ్ళు అతడి వెంటే కదిలారు యాది

అందరినీ కార్ ఎక్కించుకుని గబగబా బైటకు తీసుకు

పోయాడు

ఇందు మాత్రం సిద్దు శివరాం అంకుల్ కొడుకా అన్నట్టు

బిగుసుకు పోయి కూర్చుంది.

గదిలోకి వచ్చిన ఇందు ఉన్నట్టుండి మాయం అయ్యింది ఆమె తనని వదిలి వెళ్ళడం భరించ లేని సిద్దు ఇందు ఇందు అంటూ పిలవడం మొదటి పెట్టాడు

అతడిలో స్పృహ రావడం గట్టిగా అరవడం బైట ఉన్న వాళ్ళకి వినిపించింది పరుగులు పెడుతూ శివరాం అతడి భార్య లోపలికి వచ్చారు వాళ్ళ రాక చూసి సిద్దు కంట్రోల్ చేసుకుంటూ

మౌనం వహించాడు సిద్దు

మెడ మీద గాయం మాయం అయ్యింది ఇప్పుడు అతడు

నార్మల్ అయ్యాడు

డాక్టర్స్ వచ్చి పరీక్ష చేసి ఇంకే సమస్య లేదు ఇంటికి తీసుకు వెల్లోచ్చు అని చెప్పారు

శివరాం కొడుకుని పట్టుకుని సంతోష పడ్డారు అలాగే ఏమ్ జరిగింది అని అడిగారు సిద్దు తనకి జరిగిన

వింత పరిస్తితి చెప్పాడు

చిన్నప్పటి నుంచి అతడికి

ఇలాంటి వింత పరిస్తితి ఎదురవ్వడం తెలిసిన వాళ్ళు కావడం తో చాలా భాధ పడి

ఇక మీదిట జాగర్తగా ఉండమని చెప్పి నిముషాల్లో ఇంటికి తీసుకు పోయారు ఆ భూషణ్ ఎదో చేశాడు అని పొరపాటు పడ్డాను కానీ

వాడికి నా కొడుకుని టచ్ చేసే అంత ధైర్యం లేదు కానీ నా కొడుకుని వెంటాడుతున్న దుష్ట శక్తి ఎవరు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని భాధ పడుతున్నాడు

అతడి అవస్థ అంతా

చూస్తున్న ఆ ఇంట్లో పనిచేసే శాంతి భయం భయం గా ఆయన ముందుకు వెల్లి

బాబుగారు నేను ఒక మాట చెబుతాను వింటారా అని

అడిగింది

ఆమె మాటకి శివరాం ఇంకా

అతడి భార్య ఎంటి అన్నట్టు చూసారు

ఆమె చెబుతుంది మా ఊరు నెల్లిపూడి అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరం లో తొర్లం పూడు అనే గూడెం ఉంది

అక్కడ ఒక కొండ దొర ఉన్నాడు ఆయన ఎలాంటి దయ్యాన్ని అయినా దుష్ట శక్తి నీ అయినా

అడ్డు కట్ట వేస్తాడు

ఒక్కసారి అతడ్ని కలిస్తే సిద్దు బాబు సమస్య కి పరిష్కారం దొరకవచ్చు అని చెప్పింది

శాంతి మాటలు విన్న శివరాం ఆలోచన లో పడ్డాడు

అతడి భార్య దాక్షాయణి

వెళదాం అండి నా బిడ్డ కి ఎలాంటి గండం రాకుండా ఉండాలి అందుకు నేను ఏం చేయమన్న చేస్తాను అని అంటుంటే అక్కడే ఉన్న

హరిబాబు కలుగు చేసుకుని అంతా విచిత్రం గా ఉంది

ఎందుకన్నా మంచిది ఈ పిల్ల చెప్పిన ఊరు వెళ్లి చూద్దాం అని అడిగాడు

శివరాం సరే అని శాంతి నీ వెంట పెట్టుకుని నెల్లిపుడి

వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

*"" సిద్దు గదిలో కూర్చుని

ఇందూనే తలుచుకుంటూ తను ఎలా వచ్చింది అలా ఎలా ఒక గోడలోకి వెళ్లగలిగింది ఇది

నిజమా లేక నా బ్రమ అర్థం కావడం లేదు అనుకుంటూ అతడి

ఎదురుగా ఉన్న అద్దం వైపు చూసాడు

అందులో ఇందు అతడికి పెట్టిన కుంకుమ బొట్టు కనిపించింది

ఆమె వచ్చింది అనడానికి

అదే సాక్షం....!!

శ్రావణి శ్రీరామ్ ఇందు కి ధైర్యం చెబుతూ మార్గం మధ్య దిగిపోయారు ఇందు ఒక్క మాట కూడా మాట్లాడలేదూ.

కార్ దిగి ముందుకు కదిలారు

శ్రావణి శ్రీరామ్ అంతలో

వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సిద్దు కి నయం అయ్యింది అతడు

ఇంటికి వెళ్లిపోయాడు అని

అంతే ఆ వార్త విన్న ఇరువురు సంతోషం గా తమ ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఇందు కి

ఫోన్ చేస్తే యాది వింటాడు అని మెసేజ్ లో విషయం చెప్పారు....

ఆమె ఎలాంటి రియాక్షన్ లేకుండా ఎదో తెలియని అలజడి లో వింత అనుభవం మధ్య సతమతం అవుతూ ఉంది.

మరి నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటె కాస్త సమయం వేచి చూడాలి

ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....!Rate this content
Log in

Similar telugu story from Drama