raparthi anuradha

Romance Fantasy Thriller

4  

raparthi anuradha

Romance Fantasy Thriller

శక్తి ఆగమనం..12

శక్తి ఆగమనం..12

10 mins
479


సిద్దు మనసు చాలా విచారం గా ఉంది ఇందు అతడి ప్రేమని అర్థం చేసుకోవడం లేదు

తనకి చేరువ కావడం లేదు

ఎంత చెప్పిన ఎన్ని చేసినా

ఆమె నో అంటుంది

ఎలా నాకేమో ఇప్పుడే తనని

చూసి వచ్చినా మళ్లీ తనని చూడాలి అనిపిస్తుంది

ఎందుకు నా మనసు ఆమెకోసం ఆరాట పడుతుంది

అని తెల్లవార్లూ ఆమెనే

తలచుకుని నిద్ర పోకుండా

గడిపాడు

ఎప్పుడు తెల్లవారు తుందో

ఎప్పుడు ఆమెను చూస్తానో అని ఎదురు చూస్తూ గడిపాడు

సూర్యోదయం కాగానే

హడావిడి గా రెడీ అయి

ఆమె కోసం పరుగులు తీస్తూ

కాలేజ్ చేరుకున్నాడు,,

ఇందు కి కాలేజ్ కి వెళ్ళాలి అనిపించడం లేదు

అక్కడికి వెళితే సిద్దు ఎదురు పడతాడు తనని ఇబ్బంది

పెడతాడు నేను వాడ్ని తిడతాను నాకు నచ్చడం లేదు

వాడ్ని తిడుతుంటే వాడి

మొహం చిన్న బుచ్చుకొని

నావైపు దిగులుగా చూస్తున్నాడు నాకు ఆ చూపు ఎంతో కష్టం గా అనిపిస్తుంది

నేను ఎక్కడ వాడ్ని పట్టుకుని

ప్లీజ్ అలా చూడకు అంటానో

ఎమో వాడికి ఇంకాస్త ధైర్యం వస్తుంది

నన్ను అస్సలు విడిచి పెట్టడు అనుకుని ఆమె నీరసం గా

ఉంది అని వంక పెట్టీ

కాలేజ్ కి వెళ్ళలేదు

సిద్దు ఇందు కోసం ఎంతో వేచి చూసాడు

ఆమె రాలేదు శ్రీరామ్ శ్రావణి

అతడ్ని ఆ ఆలోచన మానుకోమని రిక్వెస్ట్ చేసిన అతడు ఆమె

వస్తుంది అని కాలేజ్ బైటే వెయిట్ చేస్తూ నిలుచున్నాడు

మధ్యాహ్నం లంచ్ టైం

అయ్యింది ఆమె రాలేదు

శ్రావణి సిద్దు ఆమెకోసం

చూడటం గమనించింది

*""ఇందుకి కాల్ చేసి పాపం వాడు నీకోసం కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాడు నువ్వేమో

కాలేజ్ కి రాలేదు ఎందుకు

ఇందు నువ్వు రాలేదు

వాడ్ని తప్పించుకునే ప్రయత్నం లో కాలేజ్ కి రాలేదా అంటూ

అడిగింది

ఇందు విచారం గా అవును

శ్రావణి నాకు వాడి వల్ల ఇబ్బంది గా ఉంది ఎంత చెప్పినా ఎన్ని

తిట్టినా వినడం లేదు

నేను మార్నింగ్ కాలేజ్ కి రాకుంటే ఇప్పటి వరకు ఇడియట్ లా కాలేజ్ గేటు ముందు వెయిట్ చేయడం ఎంటి పిచ్చిగాని పట్టిందా వాడికి అంటూ అరిచింది ఆమె,

శ్రావణి నిట్టూరుస్త

పిచ్చి కాదు ప్రేమ నువ్వంటే ఇష్టం అందుకే నువ్వు వస్తావు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు

ఎండలో

నాకు వాడ్ని చూస్తే జాలి వేస్తుంది అందుకే నీకు కాల్ చేస్తున్న

అని విషయం చెప్పింది,

ఇందు నిట్టూరుస్తూ ఇదిగో ఇలాగే హింస పెడుతున్నాడు

నిన్నటికి నిన్న ఎంత టెన్షన్ పెట్టాడు తెలుసా మా ఇంటి పైకి ఎంతో

రిస్క్ చేస్తూ వచ్చి నాన్నగారు

ఇంట్లో ఉండగా నన్ను చేరుకుని

కిస్ చేసి వెళ్ళాడు తెలుసా అంటూ జరిగింది చెప్పింది

అంతే శ్రావణి షాక్ అయ్యి

ఎంటి కిస్సా ఓహ్ నో అంటూ అరిచింది

ఇందు దిగులుగా ఇది ఫస్ట్ టైం కాదు ఇది సికెండ్ టైం వాడికి హద్దే లేకుండా పోతుంది

అందుకే నేను కాలేజ్ మారిపోవాలని అనుకుంటున్న

లేదు అంటే చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోతాను అని దిగులుగా సిద్దు కారణం గా తను డిస్ట్రబ్ అవుతుంది అని క్లియర్ గా చెప్పింది,

శ్రావణి కి ఇందు ప్రాబ్లం అర్థం అయింది అందుకే సీరియస్ గా నువ్వు వెంటనే కెంటీన్ దగ్గరకి రా చెప్తా ఇది కరెక్ట్ కాదు సిద్దు ప్రేమ వల్ల నీ స్టడీస్ పాడవడం ఎంటి నువ్వు ఇంత ఫీల్ అవ్వడం ఎంటి నేను మాట్లాడుతాను నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి కాల్ కట్ చేసింది

ఇందు కి ఎం చేయాలో అర్థం కాలేదు ఎదీ ఏమైతే ఎం ఇందు నిర్ణయం తీసుకుంది

సిద్దు నీ ఆపాలి ఇవ్వల

ఊరుకున్నా రేపు వాడు మళ్లీ ఇంటి గోడ ఎక్కి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తాడు వీల్లేదు శ్రావణి మాట్లాడతా అంటుంది గా వెళతాను అని రెడీ అయి కాలేజ్ కెంటేన్ కి వెళుతుంది.

సిద్దు ఇందు ఇంక రాలేదు ఎందుకు రాలేదు తనకి హెల్త్ బాలేదా ఏమైనా అయ్యిందా చూడాలి అని ఆమె ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు

శ్రావణి వచ్చి అతడి చేయి

పట్టుకుని ఎక్కడికి హడావిడిగా బైలుదేరావ్ అని అడిగింది

అతడు అబద్ధం చెప్పకుండా

ఇందు రాలేదు శ్రావణి నాకు కంగారుగా ఉంది ఇప్పుడే వెళ్ళి తనని చూడాలి అంటూ ఉంటే

ఆమె కోపంగా రా నాతో అని కేంటీన్ వైపు తీసుకు వెళ్ళింది శ్రీరామ్ కూడా ఉన్నాడు

సిద్దు చిరాగ్గా ఇక్కడికి తీసుకు వచ్చావ్ ఎంటి నాకేం వద్దు నేను ఇందు నీ చూడాలి అని అంటుంటే

ఆమె సీరియస్ అవుతూ అమే ఇక్కడికి వస్తుంది నువ్వు కాస్త ఆగితే బాగుంటుంది

అసలు నీ ఉద్దేశం ఎంటి సిద్దు

ఆమె కాలేజ్ కి రాలేదు అంటే నేరుగా ఇంటికి వెళ్లిపోవాలి

అని చూస్తున్నావు మీ నాన్నగారు ఇందు నాన్నగారి కి బద్రసతృవు తెలుసుగా ఆయన సన్ అయిన నువ్వు ఎలా భూషణ్ అంకుల్ ఇంట్లోకి వెళతావ్ అంటూ అడిగింది

సిద్దు విసుగ్గా నీకు తెలుసు గా నేరుగా ఎలా వెళతాను వెనుక నుంచి వెళతాను అంటూ ఉంటే

ఆమె సీరియస్ అవుతూ ఇందు నీ చూడాలి అంటేనే ఇంటి వెనుక నుంచి వెళ్ళాలి అలాంటి నువ్వు ఆమె చేయి పట్టుకుని ఇంటి అల్లుడిగా ఎలా ఇంట్లో ఎంట్రన్స్ వైపు నుండి వెళ్ళగలవ్ హా

అని అడిగింది

శ్రీరామ్ కలుగు చేసుకుని

ఏంటిది శ్రావణి ఎందుకు వాడ్ని ఇబ్బంది పెడుతున్నావ్

ప్లీజ్ అలా మాట్లాడకు అంటుంటే

ఆమె కోపం గా ఎందుకు

మాట్లాడ కూడదు శ్రీ....

వీడు చేస్తున్న పనులకు నా ఫ్రెండ్ ఎంత ఇబ్బంది పడుతుంది

తెలుసా వీడి కారణం గా తను కాలేజ్ కి రాను అంటుంది

ఇంట్లోనే ఉందిపోతాను అని

భయ పడుతుంది తెలుసా

అని విషయం చెప్పింది

అంతే సిద్దు సీరియస్ అవుతూ అలా అని ఇందు నీతో చెప్పిందా.... నేను తనని భాధ పెడుతున్నా అని నా కారణం గా కాలేజ్ కి రాను అని చెప్పు అంటూ అడిగాడు

ఆమె విసుగ్గా అవును అనెలోగ అక్కడికి వచ్చిన ఇందు అవును చెప్పాను అంటూ పలికింది

సిద్దు ఉలిక్కి పడి ఆమె వైపు చూసాడు

ఆమె దిగులుగా అతడి వైపు

చూసి మొహం తిప్పుకుంది

సిద్దు రెప్పవేయకుండా ఆమెను చూస్తూ ఏంటిది ఇందు

నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా ప్రేమిస్తున్నాను అంతే

నా కారణం గా నువ్వు కాలేజ్ మానేయడం ఎంటి నావల్ల నీకు ఇబ్బంది ఎంటి అని దిగులుగా అడిగాడు

ఇందు ఓపిక లేనట్టు ఇబ్బంది

లేదు అని ఎలా అంటావ్ హా

ఎంత ఇబ్బంది పెడుతున్నావు

నేను వద్దు అంటు ఉన్న ఇంటి వరకు వస్తున్నావు నన్ను కిస్ చేస్తున్నావు ఇదంతా ఇబ్బంది కాదా

ప్లీజ్ నన్ను లవ్ చేస్తున్న అనేది వదిలేయ్ నన్ను ఇబ్బంది పెట్టకు

నా మట్టుకు నన్ను చదువు

కోనివ్వు అంటూ ఉంది

సిద్దు ఆమెకు దగ్గరగా వెళ్ళి

నేను అంటే నీకు ఇష్టం లేదు అని ప్రేమ లేదు అని నన్ను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని నా కళ్ళలోకి చూసి చెప్పు అని అడిగాడు

ఆమె అతడి వైపు సీరియస్ గా చూస్తూ చెప్తే అర్థం కాదా నాకు నువ్వు అంటే ఇష్టం లేదు ప్రేమ లేదు చాలా ఇంక ఈ గొడవ విడిచి పెట్టు అని ఎంతో కష్టం మీద చెప్పి మొహం తిప్పుకుంది

సిద్దు సీరియస్ అవుతూ అబద్ధం నువ్వు అబద్దం చెప్తున్నావు

నీకు నేను అంటే ఇష్టం ప్రేమ ఉన్నాయ్ పరిస్థితులకి భయపడి నన్ను దూరం పెడుతున్నావు

ప్లీజ్ ఇందు నిజం ఒప్పుకో అంటూ రిక్వెస్ట్ చేశాడు

ఇందు మనసులో భాధ పడుతు

పైకి కోపం చూపిస్తూ అలా అని నీకు ఎవరు చెప్పారు

అని అడిగింది

సిద్దు సీరియస్ అవుతూ నువ్వు నువ్వే చెప్పావ్ నీకు నేను అంటే ఇష్టం లేక పోతే రాత్రి మీద నీ బెడ్ రూమ్ లో దూరి నిన్ను కిస్ చేశాను అప్పుడు మీ అమ్మకి నన్ను పట్టించే ప్రయత్నం ఎందుకు చేయలేదు

నిన్న నీ బాల్కనీ వద్దకు వచ్చి కిస్ చేశాను అప్పుడు మీ నాన్న అక్కడే ఉన్నారు ఎందుకు ఆయనతో నన్ను వీడు ఇబ్బంది పెడుతున్నాడు

అని చెప్పలేదు

ఎందుకంటే నీకు నేను అంటే ఇష్టం అందుకే చెప్పలేదు

ఒప్పుకో నేను శివరాం అంకుల్ కొడుకు అని నిజాన్ని చెప్పలేక పోతున్న అని

నీకు నేను అంటే ఇష్టం అని అరుస్తుంటే

ఆమె సీరియస్ అవుతూ నాకు నిన్ను పట్టించడం ఇష్టం లేదు ఎందుకంటే పాపం అనిపించింది మొన్ననే హాస్పటిల్ కి వెళ్ళొచ్చావ్ గా మళ్లీ ఏమైనా అవుతుంది అని జాలి పడ్డాను అంతే

అంటూ అరిచింది

సిద్దు అవేశం గా నాకు నీ జాలి వద్దు ప్రేమ కావాలి అది నువ్వు ఇవ్వలేక పోతే నేను భరించలేను

నీకు నిజంగా నామీద ప్రేమ లేక పోతే ఇప్పుడే అంకుల్ కి నా విషయం చెప్పు

నన్ను కొట్టించు ఆలస్యం చేయకు నేను చేసింది అంతా చెప్పు అంటూ ఆమె మొబైల్ లాక్కుని భూషణ్ కి కాల్ చేస్తుంటే ఇందు

భయపడి పోయి ఫోన్ లాక్కుని నీకేమైనా పిచ్చా నాన్నగారికి

తెలిస్తే నిన్ను చంపేస్తారు

అర్థం చేసుకో అని రిక్వెస్ట్ చేసింది

సిద్దు కన్నీళ్లు పెట్టుకుంటు చంపేయని నేను బ్రతకాలి అనుకోవడం లేదు

నువ్వు కాదు అంటే నేను ఎలాగూ బ్రతకను చచ్చిపోతాను

చెప్తున్న నిన్ను చూసిన దగ్గర నుండి తిండి లేదు నిద్ర లేదు

ఇప్పుడు కూడా నేను ఫుడ్ తీసుకుని రెండు రోజులు దాటింది నిద్రపోయి ఎన్ని రోజులు అయ్యిందో తెలియదు అంటూ అతడి

పరిస్తితి చెప్పుకున్నాడు

ఆ మాటలు విని ఇందు భాధగా చూస్తుంటే

శ్రావణి కలుగు చేసుకుని ఏంటిది సిద్దు ఇలా నువ్వు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అమ్మాయిలు చచ్చిపోతామ్

అంటే భయపడి ఓకే చెప్పేస్తారు అనుకుంటున్నారు అంతా

ఒకేలా చేస్తున్నారు అని

అంటూ ఉంది

సిద్దు ఇందు రెండు భుజాలు పట్టుకుని నేను శ్రావణి అంటున్న పోకిరి లాంటి వాడిన

నా ప్రేమలో నీకు మోసం కనిపిస్తుందా చెప్పు ఇందు

అవును అంటే ఈ క్షణమే ప్రాణం తీసుకుంట అంటూ ఎమోషన్ అయ్యాడు

ఇందు దిగులుగా ప్లీజ్ సిద్దు

నువ్వు మొండి గా చేయకు

అర్థం చేసుకో మన రెండు ఫ్యామిలీలకి సెట్ అవ్వదు

అంటూ ఉంది

సిద్దు సీరియస్ అవుతూ చేస్తాను మొండిగా చేస్తాను అంతే 

ఇప్పుడే కాళీమాత కొండ ఎక్కి

నీ అంగీకారం కోసం  

వెయిట్ చేస్తాను నువ్వు వచ్చి

నన్ను ప్రేమిస్తున్న నిజం చెప్పావా సరే లేదు అంటే ఈ రోజు రాత్రి పది గంటలకి అదే కొండ మీది నుండి దూకి చస్తాను

తెలుసు గా నేను మొండి

నీకోసం చంపడానికి అయినా చావడానికి అయినా నేను సిద్ధం అంటూ ఆమె అడ్డుకుంటున్న శ్రీరామ్ శ్రావణి ఆగమంటున్న అతడు ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు

, ఇందు భయం గా ఎంటే శ్రావణి వాడు అలా చెప్పి వెళుతున్నాడు పరిస్తితి అర్ధం చేసుకోడనికి ట్రై చేయకుండా చస్తా అంటాడు ఎంటి అని ఏడుస్తుంటే

శ్రీరామ్ కలుగు చేసుకుని

ఒక్కటే మాట చెప్పాడు

చూడు ఇందు మీ రెండు ఫ్యామిలీ సమస్యలే మీ ప్రేమకు అడ్డం అని నువ్వు అనుకుంటే అందుకూ ఎదో ఒక మార్గం ఉంటుంది

వాడు మొండి తెలుసుగా

ఏమైనా చేసుకుంటాడు వెళ్లి ఆపు లేదు నాకు వాడిపై ప్రేమ లేదు అంటావా ఎవడో ఎక్కడో పడి చస్తే నీకెందుకు అని సైలంట్ గా ఊరుకో మెం వాడ్ని ఆపలేం వాడు బ్రతకాలో చావాలో వాడు ఎన్నుకున్న కాళీమాత ఆలయం నిర్ణయిస్తుంది అలాగే నీ నిర్ణయం వాడ్ని ఆపగలుగుతుంది ఆ తరువాత నీ ఇష్టం అని ఆమెకు మాట్లాడే ఛాన్స్ యివ్వకుండా అరుస్తూ

శ్రావణి చేయి పట్టుకుని ఇంక చాలు నువ్వు రా అని ఆమెను లాక్కుని వెళుతూ

ఇందు వైపు కోపం గా చూస్తూ

నా స్నేహితుడు ఏమైనా అయితే

ఆ పాపం నీదే గుర్తు పెట్టుకో అని ఆమె భరించ లేని మాట అని వెళ్ళాడు

ఇందు కన్నీళ్లు పెట్టుకుంటు

ఇల్లు చేరుకుంది.

సిద్దు అవేసంగా ఎత్తైన కాళీమాత ఆలయం చేరుకుని ఆ మాతకి నమస్కరించాడు తరువాత

కొండ శివార్లలో కూర్చుని

ఇందు కోసం చూస్తూ

కూర్చున్నాడు.

ఇందు ఇంటికి చేరుకుంది

ఆమెకు సిద్దు కోసం దిగులుగా

ఇంకా భయం గా ఉంది

వాడు నిజంగా ఏమైనా చేసుకుంటాడు ఏమో

ఓహ్ గాడ్ నేనేం చేయాలి

వాడికి ఎలా నచ్చచెప్పాలి

అని దిగులుగా ఉంది

ఆమె ఇంటికి వచ్చాక

శ్రావణి కాల్ చేసి ధైర్యం చెబుతూ నువ్వు సిద్దు బలవంతాన

ఏమి ఓకే చెప్పకు ఇష్టం ఉంటేనే ఓకే చెప్పు వాడేం చచ్చిపోడు

శ్రీరామ్ ఓవర్ రీయాక్ట్ అయ్యాడు నీకు ఎది అనిపిస్తే అదే చెయ్యి

ఎవరి బవంతం తో నువ్వు వాడికి ఓకే చెప్పకు అని ఫ్రెండ్ కి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పింది

ఇందు నిజమే సిద్దు నన్ను భయపెట్టడానికే అలా అన్నాడు వాడేం చావడు అని ధైర్యం చెప్పుకుని కొంత సమయం గడిచింది

ఆమె మనసు ఎంత వద్దు అన్నా సిద్ధూ ఇంటికి వెళ్ళాడో లేదో ఏమన్నా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంది

ఆమె ఇబ్బందిగా వాచ్ వైపు చూసింది టైం ఏడు దాటింది

ఆమె కంగారుగా సిద్దు మొబైల్ కి కాల్ చేసింది అతడు దిగులుగా

కాల్ లిస్ట్ చేసి హాలో అన్నాడు

ఆమె కంగారుగా సిద్దు నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని అడిగింది

అతడు కోపం గా ఎక్కడ ఉంటాను అని చెప్పాను అక్కడే ఉన్నాను

అని ఆన్సర్ ఇచ్చాడు

ఆమె భయంగా చూస్తూ

ప్లీజ్ సిద్దు మొండిగా చేయకు ఇంటికి వెల్లు నాకు కంగారుగా ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంటే

అతడు సీరియస్ గా

అరిచి చెప్పాడు ఐ లవ్ యూ ఇందు నువ్వు లవ్ యూ టూ అని నా దగ్గరకు వచ్చి చెప్పు

ఇంటికి వెళతాను లేదా ఇక్కడి నుండి దూకి చస్తాను ఇంకా

త్రీ అవర్స్ మాత్రమే ఉంది

ఇలా ఇంకోసారి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను మొబైల్ ఆఫ్ చేస్తున్న

అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు

అంతే ఇందు లో భయం ఎక్కువయింది అయ్యో చెప్పేది వినకుండా వీడు ఎంటి ఇలా చేస్తున్నాడు నాకు భయం వేస్తుంది అని అటు ఇటు తిరుగుతూ

ఉంటే ఇంటికి వచ్చిన భూషణ్ కూతురు దగ్గరకు వచ్చి ఎమ్మా కాలేజ్ కి వెళ్ళలేదు అంట

నీరసం గా ఉంది అన్నావ్ అంట బాగానే ఉంధా ఇప్పుడు అని దగ్గరకు తీసుకుంటూ ఉంటే

ఆమె తడబడుతూ బాగానే

ఉన్న నాన్నగారు అని చెప్పి పంపించి

భయం భయం గా నాన్నగారు వచ్చేశారు నేను బైటకు వెళ్లలేను వాడు మొబైల్ ఆఫ్ లో పెట్టుకున్నాడు ఇప్పుడెలా

అని కన్నీళ్లు పెట్టుకుంటు ఉంటే అక్కడ

ప్రత్యక్షం అయిన అమరావతి నవ్వుతూ ఎలా అంటె ఏముంది కాళీ మాత గుడికి చేరుకోవడమే

నీ మనసులో దాగి ఉన్న ఇష్టాన్ని చెప్పడమే అంటూ ఆమె పక్కన వచ్చి కూర్చుంది

అంతే ఇందు ఆశ్చర్య పోతూ

మీరా ఇక్కడికి ఎలా వచ్చారు మిమ్మల్ని ఎవరు చూడలేదా అంటూ అడిగింది

ఆవిడ నవ్వుతూ నీకు తెలుసుగా ఇందు నా దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది నేను తపస్సు చేసి ఓ అద్భుతమైన వరం పొందాను అందుకే ఎక్కడికైనా ఎలా అయిన వెళ్లగలను ఏమైనా చేయగలను పవిత్రమైన మనసు గల మనుషులకి మాత్రమే కనిపిస్తాను

వాల్ల ప్రేమ గెలిపిస్తాను

నాకు అర్థం అయ్యింది

నువ్వు సిద్దు నీ సిద్దు నిన్ను పవిత్రంగా భావిస్తారు అలాగే ప్రేమిస్తున్నారు అందుకే నేను మీకు సహాయం చేయడానికి వస్తున్న నాకోసం

మీకు తప్ప

అన్యులకు తెలియ కూడదు

అంటూ ఆవిడ ఇందు కి షాక్ ఇచ్చింది

ఇందు కన్నీళ్లు పెట్టుకుంది నాకు మీరు ఎం చెప్పారో సరిగా అర్థం కాలేదు కానీ అక్కడ సిద్దు మొండి గా చేస్తున్నాడు టైం చూస్తే తక్కువ ఉంది బైట నాన్నగారు ఉన్నారు నేను బైటకు ఎలా వెళ్లాలి చెప్పండి ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలి

అప్పుడు అందర్నీ కదలకుండా చేశారు గా అలా చేయండి

నేను ఆ సిద్దు నీ ఆపి వచ్చేస్తా అంటూ ఉంటే ఆవిడ నవ్వుతూ నువ్వు సిద్దు ఉన్న కొండ దగ్గరకు వెళ్ళాలి అంతేగా వెలతావ్లే

నేను ఇక్కడి సంగతి చూస్తా అని చెప్పి ఆమెను గది మూల వైపు తీసుకు వెళ్లి అందులో ప్రవేశించు అంటూ చెప్పింది

ఇందు కి ఆవిడ పవర్స్ సంగతి తెలుసు అందుకే క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ స్ట్రాంగ్ వాల్ లో ప్రవేశించింది

విచిత్రంగా చీకటిగా ఉన్న ఓ ప్రదేశం కనిపించింది

అది ఓ కొండ ప్రాంతం అమే

వెనక అడుగు వేయకుండా

ఆ కొండ శిఖరం చేరుకునే

ప్రయత్నం చేస్తుంటే

అమరావతి ఆవేదనగా

చూస్తూ ఉంది

అంతలో ఇందు తల్లి అమ్మా

ఇందు నాన్నగారు భోజనానికి పిలుస్తున్నారు రామ్మ అంటూ పిలిచింది

అక్కడ ఉన్న అమరావతి ఇందు లా మారి ఆ వస్తున్న అమ్మ అంటూ ఆవిడ వెంట వెళ్ళింది.

సిద్దు ఇందు రాలేదు అని

తన ప్రేమ అర్థం చేసుకోకుండా

నేనో పోకిరి అని అస్సలు చచ్చే ప్రయత్నం చేయను అనుకుంది

అని చాలా భాధ పడుతు ఉన్నాడు

అతడు ఆమెకు ఇచ్చిన సమయం గడిచింది ఇంక తను రాదు అని అవేశం గా కొండ పై నుండి దూకే ప్రయత్నం చేస్తున్నాడు

ఇందు పరుగులు పెడుతూ అతి కష్టం మీద ఆ చీకటిని కూడా లెక్క చేయకుండా వస్తూ సిద్దు కిందకు దూకే ప్రయత్నం చేస్తున్నాడు అని చూసింది

అంతే భయంగా సిద్దు అంటూ అరిచింది

అతడు కిందకు దూకే ప్రయత్నం మానుకుని వెనక్కి తిరిగి చూసాడు

తనకోసం ఇందు ఏడుస్తూ పరుగులు పెడ్తు వస్తుంది అంతే అతడి సంతోషం కి అవధులు లేవు అతడు కూడా పరుగులు పెడ్తూ ఆమెను చేరుకున్నాడు

ఇద్దరు ఒకర్ని ఒకరు గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటు ఉన్నారు అక్కడే ఉన్న

కాళీమాత ఆలయం లో గంటలు గాలికి ఆడుతూ శబ్ధం చేస్తున్నాయి

ఇందు సిద్దు నీ ఎటు కధలనివ్వ కుండా పట్టుకుని ఎందుకు రా ఇలా చేశావ్ ఎంత భయ పడ్డానో తెలుసా అని అరుస్తూ ఉంటే

సిద్దు ఆమెను చుట్టుకుని నాకు తెలుసు నువ్వు వస్తావు అని

నా ప్రేమ నిజమైంది అందుకే

నేను నిన్ను గెలిచాను అంటూ

ఉంటే ఆమె మరింత గట్టిగా ఏడుస్తూ అవును నీ ప్రేమ

నిజమైంది ఇంకా పవిత్రమైంది అందుకే మనకి అమరావతి సహాయ పడుతుంది నాకు నువ్వంటే ఇష్టం ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నా

ప్లీజ్ రా ఇంకెప్పుడు నన్ను ఇలా భయపెట్టకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది

సిద్దు సారి చెప్పి ఇంకెప్పుడు ఇలా చెయ్యను చెయ్యీల్సిన అవసరం లేదు నా అముల్బెబి నా లవ్ ఓకే చేసింది అంటూ ఆమెను

ముద్దుల్లో ముంచెస్తు ఉంటే

ఆమె అతడ్ని అల్లుకుపోయి

అంత వరకు పడ్డ టెన్షన్ మరచిపోయి సమయం కూడా గుర్తించకుండా ప్రేమ పారవశ్యంలో మునిగింది

మరీ నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియాలి అంటే కాస్త వేచి

చూడాలి 

ధన్యవాదాలు ఫ్రెండ్స్.Rate this content
Log in

Similar telugu story from Romance