raparthi anuradha

Fantasy Inspirational

4  

raparthi anuradha

Fantasy Inspirational

దిలీపుడు చూపిన ధర్మం..!

దిలీపుడు చూపిన ధర్మం..!

18 mins
335


*" దిలీపుడు చూపిన ధర్మం ...!!!

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రయత్నించని

వర్గానికి చెందిన కథ రాస్తున్నాను...

ఏమన్నా తప్పులు ఉంటే మన్నించాలి

కథ చదివి మీరు ఎలా ఉందో...

కథ వలన ఎలాంటి ఉపయోగం కలిగిందో

తెలియ చేయ కోరు చున్నాను...

ఇంక కథలోకి వెళితే....!!

**""పూర్వం...సింహ పురం అనే రాజ్యం లో

విక్రముడు అనే రాజు ఉండే వారు

ఆయన ఎంతో దయామయుడు...

ప్రజలని కన్న బిడ్డల వలె చూసుకుంటూ

ఉండే వారు

దేశం లో ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా

చూసుకోడానికి ఎల్లప్పుడూ

ప్రయత్నిస్తూ... ఉండేవారు..

విక్రముడు అంటే దేశ ప్రజలంతా ఎంతో గౌరవిస్తూ

ఉండే వారు...

ఆయన పరిపాలన లో ప్రజలు

ఎంతో తృప్తి చెంది ఉన్నారు...

అలా కొంత కాలం గడిచింది... !!

*"రాజావారి కి... ఎంత సంపద కలిగినా

ఎన్ని రాజ్యాలు జయించినా సంతానం లేదు అనే

బాధ వెంటాడుతూ వచ్చింది

ఆయన వివాహం జరిగి...పది ఐదు ఏళ్ళు

గడిచినా

తన భార్య... రత్న మంజరి కి,

పిల్లలు కలుగ లేదు...

అందుకు కారణం తెలుసుకునే ప్రయత్నం లో

మంత్రి గారు ఒక సలహా చెప్పారు.....

 మీ సమస్యకు

పరష్కారం సుదర్శన మహర్షి గారు

చెప్పగలరు

మీరు ఆయనను ఆహ్వానించి ఎంతో భక్తితో

సేవించి మీ పరిస్తితి

వెళ్ళబుచ్చుకో మని చెప్పిరి...!

*" రాజా విక్రముడు సరే అని చెప్పి

తానే స్వయంగా

 ఆశ్రమము కి వెళ్లి సుదర్శన మహర్షి నీ

తన రాజ్యముకి విచ్చేయమని అతిథి సత్కారం

స్వీకరించ ప్రార్థించి పిలిచాడు...!

*" ఆయన రాజు మదిలో వేదన తెలుసుకుని

అటులనే నాయినా అని చెప్పి మరుసటి రోజు

విక్రముడు రాజ్యానికి విచ్చేసి నారు

ఆయన్ని విక్రముడు రత్న మంజరి ఎంతో భక్తి గా

పూజించి అతిథి మర్యాదలు చేసి

ఆయన తృప్తి చెందేలా నడుచుకుంన్నారు...!!!

*"సుదర్శన మహర్షి సంతోషించి...

అమ్మా రత్న మంజరి నీ మనసు లో దిగులు నాకు

తెలుసు... రాజా నీకు సంతతి లేదు అని

విచారించకు...

నీకు త్వరలో వారసుడు పుడతాడు...

కాకుంటే...వాని ఇరువది ఒక్క యేండ్ల వరకు

పిల్లవాని చే....

ప్రతి రోజూ ఒకరికి దానం ఇప్పించాలి 

స్వర్ణ కంచము లో ఫలహారాలు పట్టు వస్త్రములు

నూరు వరహాల తో సహా దానం యాచించి 

వచ్చిన

వానికి ఇవ్వాలి

అలా చేస్తే నీ కుమారుడు పుణ్యాత్ముడు

అవుతాడు...

నీ కీర్తి పెరుగుతుంది...

ఇదిగో ఈ ఫలం స్వీకరించి...

సంతోషించండి అని ఒక మామిడి పండు

ఆ దంపతులకు అందించి ఆశీర్వదించారు...!!

*"రాజ దంపతులు ఆయన పాదాలకి మృోక్కి

ధన్యులము మునివర్యా దానము ది ఏముంది

తప్పకుండా చేయిస్తాము అని చెప్పుకున్నారు....!

*"సుదర్శన మహర్షి తన సిశ్శ్యుని తో కలిసి

ఆయన ఆశ్రమం కి తిరిగి వెళుతుంటే

మార్గమున ఒక పూరి గుడిసెలో ఉన్న

దంపతులు

సాంతుడు"" అతని భార్య...సుమతి...

ఆయనకి ఎదురొచ్చి ఎంతో భక్తి గా నమస్కరించి

ఆయన పాదాలపై పూలను వేసి అయ్యా

మునివర్య మేము కడు భీద వాళ్ళము

రాజావారి కోట లో కొలువు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము,,

మీవంటి ఋషి వర్యులను

సేవించుకునే అంతటి వాళ్ళము కాకున్నా

ఒక్క పరి మిమ్ము దర్శించాలి అని వేకువ నుంచి

వేచి చూస్తున్నా ము మా యందు దయ ఉంచి

మిమ్మూ పూజించు కునే భాగ్యం ఇమ్మని

వేడుకున్నారు

*""/మహర్షి ఆ దంపతుల మదిలో బాధ అర్థం చేసుకుని

వారీ ఇంట అడుగు పెట్టినారు

ఆయన శిష్యులు వింతగా చూస్తూ ఉన్నారు

*" సాంతుడు ,,

సుమతి ఎంతో సంతోష పడిపోతూ

మహర్షి కి తమ ఇంటి వెనుక చెట్టుకి పండిన జామ

పండు కోసి తెచ్చి అయ్యా మా వద్ద మీకు ఇచ్చేందుకు

ఏమి లేదు... ఈ ఫలాన్ని స్వీకరించ కొరు చున్నామూ

అని వేడుకున్నారు

అయన నవ్వుతూ అహా ఎంతటి భక్తి మీలో ఉంది

దిగులు పడకండి మీ పేదరికం నా సేవకు ఆటంకం కాదు

ఈ ఫలం సాక్షాత్తు ఆ ఈశ్వరుని ప్రసాదం

అనుకుంటున్నను

అని ఫలం స్వీకరించి ఆ దంపతులను ఆశీర్వదించి

సీగ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు ,,

శాంతా....నీ తనయుడు మిక్కిలి నీతి మంతుడు

అయి

అతని కీర్తి లోకానికి చాటు కుంటాడు

త్వరలో మీ ఇంట

వజ్రం లాంటి పసివాడు పుడతాడు అని

ఆశీర్వదించారు

*" ఆ దంపతులు ఎంతో సంతోష పడుతు...

ఆయన పాదాలకు నమస్కరించి నారు

ఆయన నవ్వుతూ ఇంక సెలవు అని

వెళ్లిపోయారు....!!

*"రాజ మందిరంలో మహారాణి మహర్షి చెప్పినట్టే

మగ బిడ్డకు జన్మ ఇచ్చింది

 విక్రముని ఆనందం కి అవధులు లేవు

అంతా మహర్షి ఇచ్చిన వరం అని ఆ బిడ్డకు

సూరవర్మా అని నామకరణం చేశారు

ఋషి వర్య చెప్పినట్టు గానే బిడ్డ పుట్టిన రోజు నుంచి

దానం ఇవ్వడం మొదలు పెట్టారు...

నిజానికి మహర్షి వాళ్లకి దానం ఇమ్మనటం

ఒక పరీక్ష...!!

*""అలాగే సాంతుడి భార్య సుమతి కూడా బిడ్డని

కనింది వెన్నెల కంటే చల్లని చూపులతో శాంతం

కి ప్రతి రూపంగా వెలుగు రేకలాంటి బాలుని

చూసి ఆ దంపతులు మురిసి పోయారు

అంతా మహర్షుల వారి వరం అనుకుని ఆ బిడ్డ గొప్ప

క్ష్యాతి నొందాలి అని పిల్ల వానికి దిలీపుడు అని

నామకరణం చేసినారు....

బిడ్డ పుట్టిన సుభతరునం లో ఆ దంపతులు

తమ దగ్గర ఉన్నదానితో పదిమందికి భోజనం

పెట్టీ తృప్తి చెందారు....!!

*""అలా కొద్ది కాలం గడిచింది విక్రముడు

ఎన్నో రాజ్యాలు జయించి ఎంతో కీర్తి

సంపాదించుకుని ఒకనాడు అనుకొని విధముగా

నిద్రలో కన్ను మూశారు....

వారసుని చేతుల మీదుగా ఆయన అంతిమ

సంస్కారం పూర్తి అయ్యింది..

రాజు లేని రాజ్యము లో యువరాజు సూరవర్మ

త్వరలో రాజు గా పట్టాభషిక్తుడై ప్రజల్ని

పరీపాలిస్తాడు అని జనులంతా ఎదురు చూస్తున్నారు...!

*""" శాంతుడు రాజ మందిరంలో సేవకుడు గా

కాలం గడుపుతున్నాడు

వయసు మీద పడుతున్నా ఆయనకు

విశ్రాంతి అవసరం

ఆయన కుమారుడు విద్యాభ్యాసం

పూర్తి చేసుకున్నాడు...

తండ్రి కష్టము చూసి ఇంక మీరు విశ్రాంతి తీసుకోండి

తండ్రి నేను రాజ సేవకున్ని అవుతాను అని శాంతుడు నీ

ఇంటి దగ్గరే ఉండమని చెప్పి

తాను కోట లో కొలువుకు వెళ్ళడం

మొదలు పెట్టాడు....!!

*"" సూరవర్మ ,, ఒక మహారాజు కి కొడుకు కావడం తో

పుట్టిన దగ్గర నుంచి ఎంతో గర్వం స్వార్థం పేద వారంటే

చిన్న చూపు కష్టం లో ఉన్నవారం టె ఎట్టి దయా లేకుండా

తల్లి గారం లో మరింత మూర్ఖుడు గా

పెరిగాడు అందుకే అతనికి ఎదుటి వారి కష్టం

తెలియదు తండ్రి చనిపోవడానికి ముందు రోజు

కొడుకు నీ పిలిచి ఆయన మెడలో ఉన్న ఒక

స్పటిక హారం సూరవర్మ మెడలో వేసి

మార్తాండ పురం లో మహారాజు ,,

శశి శేఖరుడు నా స్నేహితుడు..

నీవు ఎదో ఒకనాడు ఆయన్ని వెళ్ళి కలవు

అని చెప్పి మాట తీసుకున్నారు

*" తండ్రి ఎందుకు అలా చెప్తున్నారో సూరవర్మ కి

అర్ధం కాలేదు

అలాగే వెళతాను అని తండ్రి కి మాటిచ్చాడు

ఆయన మాట తీసుకున్న రాత్రే కన్ను మూశారు

శూరవర్మ తండ్రికి ఇచ్చిన మాట కూడా మరచి

పోయాడు...?!!

*""దిలీపుడు కోటలో సేవకుడు గా చేరాడు

కాబోయే మహారాజు దిలీపుడు నీ

తన వద్ద ప్రథమ సేవకుడు గా ఎన్నుకుని

అతని చే తన పనులన్నీ చేయించు కుంటు

ఉన్నాడు కొద్ది రోజులు గడిచింది,,

సూరవర్మా కి దిలీపుడు అంటే స్నేహం ఏర్పడింది

ఇద్దరు ఒక వయసు వారు కావడం తో

దిలీపుడు నీ స్నేహితుడుగా భావించాడు యువరాజు..!

*"అతని తెలివి మంచితనం సూరవర్మ పరీక్షిస్తూ అప్పుడప్పుడు ఆశ్చర్య పడుతు ఉండేవాడు...

అలా కాలం గడుస్తుండగా

దిలీపుడు యువరాజ అని పిలవడం తనకి

నచ్చలేదు అని మిత్రమా అని పిలవాలి అని ఆజ్ఞా

వేశాడు సూరవర్మ

*"దిలీపుడు యువరాజు స్నేహానికి ఎంతో సంతోషించి

ఆ క్షణం నుంచి అతన్ని మిత్రమా అని పిలవడం మొదలుపెట్టాడు...

యువరాజు దిలీపుడు తో స్నేహం గా ఉండటం

రాజ మంజరి తెలుసుకుని... ఒకనాడు కుమారుణ్ణి

దిలీపుడు నీ పిలిచి ఒక మాట చెప్పింది

మార్తాండ పురం లో రాజావారి స్నేహితుడు

శశి శేఖర మహారాజు...

తన కుమార్తె కు వివాహం జరిపించాలి

అనుకుంటున్నట్టు తెలిసింది,,

""నీవు మీ యువరాజు నీ వెంట పెట్టుకుని

వెళ్ళి విషయం చక్కపెట్టుకుని

పెళ్లి కుదుర్చుకుని రా అని... చెప్పారు

దిలీపుడు అటులనే మాతా అని చేతులు జోడించి

చెప్పాడు..

*" ఆవిడ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది

మీరు..... మార్తాండ పురం కి పయనం కావాలి

కాకుంటే మీరు సామాన్యులు లా పయనం

కావాలి రాజ మంది మార్భలం మీ వెంట

ఉండకూడదు ఇది రాజావారీ కోరిక తన తనయున్ని అన్ని యోగ్యతులు ఉన్నవానిగా శశి శేఖర రాజావారు

స్వీకరించాలి కేవలం స్నేహితుని కుమారుడు గా

ఎన్నుకో కూడదు అని... ఆయన నిర్ణయం

తీసుకున్నారు అంచేత మీరు వెళ్ళి ఆయన్ని

కలిసి ఆయన అంతట ఆయన గుర్తు పట్టే వరకు

మౌనం వహించాలి అని

అన్ని వివరంగా చెప్పి ప్రయాణానికి సిద్ధం

చేసింది ఆవిడ

*"అక్కడే ఉన్న సూరవర్మ తండ్రి చెప్పిన మాట

మెడలో వేసిన హారం గుర్తు చేసుకుని అలాగే అమ్మ

మీ కోరిక మేర నేను ఆ మార్తాండ పురం వెళతాను

మా గొప్పతనం చాటుకుని వస్తాను నాకు

తోడుగా ఈ దిలీపుడు ఉన్నాడు గా

అని నవ్వుతూ చెప్పాడు...!!

*"దిలీపుడు ఇంటికి వచ్చి తల్లి తండ్రులకి విషయం

చెప్పాడు యువరాజ వారితో ప్రయాణం

అని

అతని తల్లి ఇల్లంతా వెతికి కొడుకు కడుపు

నింపేందుకు

ఏమి లేక కాస్త బియ్యం ఉంటే ఉడికించి

అతని ముందు పెట్టింది

దిలీపుడు అదే పరమాన్నం

అనుకుని గబగబా తింటూ ఉంటే సాంతుడు

కొడుకు వైపు దిగులుగా చూసి నాయినా

దిలీపా యువరాజుల వారు నీకు సన్నిహితంగా

ఉంటారు అని రాజ్యం అంతా చెప్పుకుంటుంది

*'ఆయన మన కష్టం తెలుసుకుని సహాయం చేస్తే

బాగున్ను గా నువ్వైనా ఆయన్ని కోరి మన కష్టాలు

తీర్చమని చెప్పొచ్చు గా అని బాధ పడుతు

అడిగారు...??

*" దిలీపుడు భోజనం ముగించి తండ్రి కళ్ళలో

ఆవేదన గమనించి తండ్రి గారు యువరాజు ల

వారు నన్ను సేవకుడు గా అనుకుని ఉంటే నా

కష్టం చెప్పుకుని సహాయం కోరే వాన్ని

ఆయన నన్ను స్నేహితుడు అనుకుంటున్నారు

ఒక స్నేహితుని కష్టం తెలుసుకుని తానంతట తాను

సాయం చేస్తే ధర్మం

అదే నేను సాయం కోరటం అధర్మం...

అది స్నేహం ముసుగులో.. నా స్వార్థం చూపినట్టు

అవుతుంది నేను నీతి తప్పలేను

మిత్రుడు నన్ను పిలిచి సాయం చేస్తే కాదు

అనను అలా అని నేను స్వయంగా ఆయన్ని

యాచించను అని చెప్పి

తల్లి తండ్రి కి నమస్కరించి రాజమందిరం కి

తిరిగి వెళ్ళిపోయాడు,,

*"" కొడుకు ధర్మ నీతి కి సంతోష పడాలో తమ

పరిస్తితి కి బాధ పడాలో వారికి అర్థం కాలేదు...!!

"" మరునాడు సూరవర్మ...దానం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది...

ఆరోజు అతిథి గా ఎన్నుకొ బడింది ఎవరా

అనుకున్నాడు దిలీపుడు...

చూడబోతే సూరవర్మ దిలీపున్ని పిలిచి మిత్రమా

ఈ రోజు సత్కారం నీకే చేయ దలిచాను

ఇన్ని నాల్లుగా నా చెంత సేవ చేస్తున్న ఎదీ

ఆశించలేదు అందుకే నీకు ఈరోజు ఈ అవకాశం

ఇస్తున్న అని పిలిచి కూర్చో పెట్టీ స్వర్ణ కంచంలో

పట్టు వస్త్రాలు వరహాలు రుచికరమైన ఫలహారాలు

ఏర్పాటు చేసి మంత్రోచ్ఛారణ తో దానం ఇచ్చాడు

దిలీపుడు ఆ దానాన్ని సంతోషంగా స్వీకరించాడు...!!

*" అంతలో వారి మధ్యకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు

ఎంతో అవస్థ పడుతూ వచ్చి,,

యువ రాజా....ఆకలి గా ఉంది

ఇంటిలో ఎన్నో ఇబ్బందులు భార్య బిడ్డలు పస్తులు

ఉన్నారు ఎన్నో అప్పులు వెంటాడు తున్నాయి

మీరు ఇచ్చే దానం తో నాకడుపు నిండుతుంది....

ఆ ధనం తో నా కుటుంబ భాధలు తొలగుతాయి...

అని వేడుకున్నాడు

*"సూర వర్మ విచారిస్తూ అరెరే వృద్దుడా

ఇప్పుడే నేను ఆ దానాన్ని వేరొకరికి ఇచ్చేశాను

సరే రేపు నీవు ఇదే సమయానికి రా నేను దానం

చేస్తాను ఇవాల్టి దానం పూర్తి అయ్యింది

అని ఆ వృద్ధుని పరిస్తితి అర్ధం చేసుకోకుండా

ఎంతో గర్వంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలి

అనుకున్నాడు...

*'""ఆ వృద్ధుడు దిలీపుని వైపు చూసి రేపటి వరకు నా ప్రాణాలు నిలుస్తాయో లేదో

నేను మరణిస్తాను అని దిగులు లేదు కానీ

ఆకలితో మరణిస్తే ఆత్మ శాంతించదు..

నన్ను నమ్ముకున్న వారు అనాధలు అయిపోతే

నా జన్మకి అర్ధం ఉండదు అని ఎంతో బాధ పడుతు..

నిరసాగ వెనుదిరిగాడు,,

*" దిలీపుడు ఆయన్ని ఆపి... ఆర్య... ఆగండి""

మీరు చింతించ కండి ఇది నేను స్వీకరించిన దానం

పూర్తిగా నా సొంతం దీన్ని ఎవరికైనా తిరిగి దానం

చేసే హక్కు నాకు ఉంది

నేను ఇంకో నాలుగు రోజులు భోజనం చేయకున్నా

నేను మరణించను

మీ రక్తం పలచపడి ఉంది ఆహారం తీసుకోవాలి

అని చెప్పి సూరవర్మ ఇచ్చిన దానం తనకి ఎంతో

అవసరం అని తెలిసిన అంతకంటే అవసరం ఉన్న

వ్యక్తికి దాన్ని దానం ఇచ్చాడు...!!

*"ఆ వృద్ధుడు ఎంతో సంతోషించి నీ

ధర్మం నీతి నిన్ను ఎల్లప్పుడూ విజయానికి

చేరుస్తుంది నాయినా అని ఆశీర్వదించి ఇచ్చిన

వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు...!!

*"దిలీపుడు చేసిన పని సూరవర్మకి నచ్చలేదు ఎంత పొగరు నేను ఇచ్చిన దాన్ని తిరిగి వెరేవరికో ఇస్తాడా అని

అతనికి వస్తున్న కోపం మనసులో దాచుకుని

ఈ రోజే మార్తాండ పురం ప్రయాణానికి సిద్దం కమ్మన్నాడు

కాకుంటే తన ఆహారం తననే తెచ్చుకోమని

చెప్పాడు మిత్రుడు అలా ఎందుకు చెప్పాడో దిలీపుడు

అర్ధం చేసుకుని నవ్వుతూ అటులనే మిత్రమా

అని ఇంటికి వచ్చి జరిగింది తల్లి తడ్రులకి చెప్పాడు

ఆ దంపతులు కుమారుని నీతి కి ఎంతో

సంతోషపడి నవ్వుతూ ప్రయాణం కి సిద్ధం

కమ్మన్నారు తల్లి సుమతి కొడుకు మార్గం మధ్యలో తినేందుకు ఏమి లేక మట్టి కుండలో ఉన్న కాసింత

గంజి మేతుకులని చూసి కన్నీళ్లు పెట్టుకుంటు ఉంటే

*"దిలీపుడు అది చూసి అహా సద్ధి అన్నం

చలువ ఇంతకంటే ఏముండాలి తల్లి అని

అదే తనతో తీసుకుని పోయినాడు...!

*"కుమారుని నీతి ధర్మం ఆ దంపతులను

ఎంతో తృప్తి పడేలా చేస్తుంది

ఆపూటకి చల్లటి నీళ్లతో కడుపు నింపుకున్న

వారికి పొరుగూరు నుంచి ఒక బంధువు వచ్చి

కలిసి తన తోటలో కాసిన కొన్ని ఫలాలు ఇచ్చి వెళ్ళాడు

అంతా ఈస్వరీచ్చ అనుకుని వారి కడుపు నింపుకున్నారు..

*"అంతా దివ్య దృష్టి తో గమనిస్తు ఈ కథ

నడుపుతున్న

సుదర్శన మహర్షి దిలీపుడు చేతికి వచ్చిన

దానం వృద్ధుని రూపం లో లాక్కున్నారు

ఇప్పుడు

చిరునవ్వు నవ్వుతూ ఒక కాకి రూపం దాల్చి వారి

ఇరువురి వెంటా తాను కూడా పయనం

అయ్యారు...!!

*" సూరవర్మ...దిలీపుడు తో సరిగా మాట్లాడకుండా

అడివి మార్గం గుండా నడుస్తున్నాడు

మిత్రునికి కోపం వచ్చింది అని ఎంతో వినయంగా

నన్ను క్షమించు మిత్రమా

నేను నీ మనసు నొప్పించి ఉన్నాను

అని వేడుకున్నాడు దిలీపుడు

*" దాంతో అతని అహం సాంతిచలెదు

అతన్ని దెప్పి పొడుస్తూ కూటికి గతిలేక పోయిన

నీతి ధర్మం అని వెలాడుతు నీకెందుకు ఈ తిప్పలు

దిలీపా నన్ను వేడుకుని ఉంటే నీకు కావలసిన

అన్ని సౌకర్యాలు సమకూర్చే వాడినిగా

అని నవ్వాడు

*"దిలీపుడు స్నేహితుని మాటకు

చిన్న చిరునవ్వు నవ్వాడు

అంతే యువరాజు కి మరింత మంట

కలిగింది హు..

ఎంత పొగరు నా ముందే వీడి గొప్ప చూపుకోవాలి

అని చూస్తున్నాడు

ఈ ప్రయాణం పూర్తి కాని వీణ్ణి కొలువు నుంచి

తొలగిస్తాను అప్పుడు ఆ కాసిన్ని గింజలు కూడా

లేకుండా మాడి చస్తాడు అనుకుని రుస రస లాడుతు ముందుకు నడిచాడు

*"దిలీపుడు మనసులో అనుకున్నాడు

నా కొలువుకు కాలం చెల్లే సమయం వచ్చింది

రాజ మాత కి ఇచ్చిన మాట పూర్తి చేసుకుని శలవు తీసుకుంటాను అనుకున్నాడు...!!

"" కొంత దూరం నడిచాక బాగా అలసిపోయారు వాళ్ళు

ఒక మామిడి చెట్టు కింద కూర్చుని...

ఆయాసం తీర్చుకుంటూ ఉంటే

యువరాజు తెచ్చుకున్న పాలహారాల మూట

విప్పదీసి దిలీపునీ ముందు చూపిస్తూ

అతనికి పెట్టకుండా తానొక్కడే తినడం మొదలు

పెట్టాడు,,

*" దిలీపుడు అది చూసి యువరాజు మంచినీళ్లు

లేకుండా ఆహారం తీసుకుంటున్నారు అనుకుని

అక్కడ కి దగ్గర లో ఉన్న కొలను దగ్గరకు వెళ్లి పెద్ద

అరిటాకు తెంచి ఒక పాత్రలా చేసి యువరాజు నీళ్ళ

కొరకు చూసే సమయానికి అతనికి అందించాడు

"" సూరవర్మ అతని వైపు కళ్ళెగరేసి చూస్తూ..హు...

అనుకుని మంచినీళ్లు తాగి ఊపిరి తీసుకున్నాడు

అంతలో అక్కడికి వచ్చిన ఒక కాకి రాజు చేతిలో లడ్డు

చూసి కావ్ కావ్ మంటు అరవడం మొదలు పెట్టింది

రాజు ఆ కాకి వైపు చూసి హు...

ఇదే ఆఖరిది దీన్ని తినే ప్రాప్తం నీకు దక్కింది

అని నేలమీద కి విసిరి కొట్టాడు...!!

*"మట్టిలో పడిన లడ్డు చూసిన కాకి..

ముక్కుతో ఒకసారి దాన్ని పొడిచి హు..మట్టిపాలు

అయిన ఆహారం నాకు వద్దు అనుకుని చెట్టెక్కి

కూర్చుంది...?

*' సూరవర్మ అహం దెబ్బ తింది

ఎంత పొగరు ఈ పక్షికి నేను ఆహారం పెడితే వద్దు

అని పోతుందా మా ముందు నిలుచుని అరవడానికి

కూడా దానికి అర్హత లేదు అలాంటి దాన్ని అందలం ఎక్కించాలి అనుకున్నాను ఎక్కడికి పోతాయి లేకి

బుద్ధులు అని పక్కనే ఉన్న ధిలీపున్ని ఉద్దేశించి

అన్నాడు అతను...!?

*" దిలీపుడు అతని వైపు వినయంగా చూస్తూ

యువరాజ బుద్ధి అన్నది జాతిని బట్టి కలగదు

మనం నేర్చుకున్న ధర్మాన్ని బట్టి దాని యొక్క నీతి నీ

అర్ధం చేసుకున్న పరిస్థితిని బట్టే కలుగుతుంది

నీవు చేసిన పొరపాటు ఏమిటి అంటే ఆ ఆహారం అలా మాట్టిపాలు చేయకుండా నీ చేతితో పెట్టీ యున్నా

ఆ పక్షి ఇష్టం గా తిని ఉండేది ఎమో అని నా ఉద్దేశం

అని చెప్పి మౌనం వహించాడు...!!

*" యువరాజు విసుక్కుంటూ చాలించు నీ పెలాపన

నా చేత్తో పెట్టినంత అర్హత దానికి లేదు

అని గర్వం తో చెప్పి అక్కడే కళ్ళుమూసుకుని

విశ్రాంతి తీసుకోవడం మొదలు పెట్టాడు....!!?

*" దిలీపుడు ఆకలి కలిగి సద్ది మూట విప్పదీసాడు

ఆకలిగా అందులో చేయి పెడితే పిడికెడు

మెతుకులు మాత్రమే దొరికాయి

వాటిని ముద్ద చేసి పట్టుకున్నాడు...

అంతలో చెట్టుపై ఉన్న కాకి అరుస్తూ అతని చెంత

వాలింది దిలీపుడు నవ్వుతూ పక్షి రాజా

ఈ పిడికెడు అన్నం నా ఆకలి తీర్చలేదు

కానీ నీ ఆకలి తీరుస్తుంది

ఇదిగో స్వీకరించు అని ఎంతో మన్నన గా

వేడుకుంటూ

అతని అరిచేతిలో ఉన్న అన్నం ముద్ద

చూపిస్తూ ఆహ్వానించాడు...!!

ఆ కాకి సంతోష పడి వచ్చి గబ గబ అన్నం ముద్ద

పొడుచుకుని తింటుంది....!!

*"సూరవర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్య పోయాడు,,

నేను తియ్యని ఫలహారం పెడితే వద్దు అని పొగరు

చూపిన ఈ పక్షి ఆ పులిసి పోయిన అన్నాన్ని ఇష్టంగా

తినటం ఏమిటి అంతేలే ఎంతైనా ఆ జాతి

అటువంటిది మధుర ఫలహారం తినే అదృష్టం

ఇలాంటి పక్షులకు ఎక్కడ కలుగుతుంది అని దిలీపుడు

తో కలిపి అన్నట్టు హేళన చేశాడు

ఆ పక్షి అన్నం మొత్తం తిని కావు కావు అంటూ

వెళ్ళి చెట్టు మీద కూర్చుంది,,

*"దిలీపుడు కి ఇప్పుడు ఎంతో తృప్తిగా అనిపించింది

అతని కడుపు నిండిన భావన కలిగింది

మిగిలిన గంజి తాగి తృప్తిగా బ్రేవ్....మని తేనిచి హు....ఇప్పుడు తృప్తిగా ఉంది అనుకున్నాడు

అక్కడే ఉన్న సూరవర్మ దిలీపు న్నీ అసహ్యంగా

చూస్తూ చీ...కాకి ముట్టిన చేతిని పోయి కడుక్కుని రా...

అని ఆజ్ఞా వేశాడు,,

యువరాజు ఆజ్ఞా అని కొలను దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కుని కాసిన్ని మంచి నీళ్ళు తాగి తిరిగి

వస్తున్నాడు దిలీపుడు....!!

*" అంతలో చెట్టు కింద కూర్చుని ఉన్న

యువరాజు కి

ఒక గొంతు వినిపించింది,,

"" యువరాజ...

నేను ఆకాశవాణి నీ మాట్లాడుతున్నాను

నీకు త్వరలో మృత్యువు సంభవించ బోతుంది

దాని నుంచి నీవు తప్పించు కోవాలి అంటే నీ

మెడలో ఆ స్పటిక హారం ఉండకూడదు,

దాన్ని తక్షణమే తీసి వేసెయ్

కాకుంటే దాన్ని నేలపై పడవేయకు మరింత ప్రమాదం

అదిగో వస్తున్నాడే నీ సేవకుడు

వాడి మెడలో వేసేయి అని చెప్పి

ఆ స్వరం మాయం అయ్యింది....!!

*"'సూరవర్మ భయపడి పోయాడు

ఇప్పుడెలా ఈ హారం వాని మెడలో వేసేయ్యాలి

అనుకుని దూరంగా నడిచి వస్తున్న దిలీపునికి

ఎదురెళ్లి నవ్వుతూ ఎంటి మిత్రమా ఇంత ఆలస్యం

చీకటి పడే లోగా మనం మార్తాండ పురం చేరుకోవాలి

ఇంక బయిలుదేరుధామా...??? అని అడిగాడు

*"స్నేహితుడు అంత త్వరగా నవ్వుతూ

మాట్లాడటం తో దిలీపుడు సంతోషించాడు...

అలాగే మిత్రమా అని తాము కూచున్న దగ్గరకు

వచ్చి అక్కడి వస్తువులు అన్ని మూట కట్టి....

యువరాజు వైపు చూసి నవ్వాడు

*" అదే అదునుగా యువరాజు మెడలో హారం తీసి

దిలీపుడు మెడలో వేసి నువ్వు నాతో కలిసి పక్క

రాజ్యం కి వస్తున్నావు

నీ మెడలో ఏమి లేకుండా ఉంటే నాకు అవమానం

గా ఉంటుంది ఈ హారం నీ మెడలో ఉంచు అని ఆజ్ఞా వేసినట్టు చెప్పాడు

*" దిలీపుడు నవ్వుతూ...

తప్పకుండా ఉంచుకుంటాను మిత్రమా

ఈ హారం నాకు హాని చేసినా పరవాలేదు

మీరు క్షేమంగా ఉండాలి మిమ్మల్ని కాపాడటం నా

కర్తవ్యమ్ అని నవ్వుతూ ఆ మాటలు నాకు కూడా వినిపించాయి అని చెప్పకనే చెప్పి ముందుకు

కదిలాడు...!!

*' స్నేహితుని గొప్ప ధర్మ నీతి కి ఆశ్చర్యపోతూ

స్వార్థం తో మూసుకు పోయిన కనులు తెరుచుకునే

సమయం రాక హుష్....అనుకుని అతనితో పాటు

ముందుకు కదిలాడు....!!

*"శశి శేఖరుడు..

విక్రముడు... మంచి స్నేహితులు...

వారిద్దరి స్నేహం బంధుత్వం కావాలి అన్నది

విక్రముడు కోరిక అందుకు శశి శేఖరుడు,,

సంతోష పడి ఒక మాట చెప్పాడు

నా కుతురు కి కాబోయే వరుడు

నీతి మంతుడు సత్యవంతుడు ధర్మాన్ని తప్పని

ఉత్తముడు అయి ఉండాలి

ఆ లక్షణాలు నీ కుమారుడు లో ఉంటే అతనే

నా అల్లుడు అవుతాడు

ఈ రాజ్యానికి రాజై ఎలుతాడు

అని చెప్పి పూజ గదిలో ఉన్న ఒక హారం తెచ్చి

స్నేహితుని మెడలో వేసి ఈ హారం నీతో పాటు

ఉండనీ మిత్రమా...

*"అది నీతో పాటు నీచుట్టు ఉన్న వారిని

పరిసలిస్తు ఉంటుంది దీనికి మంచి ఎదో చెడు ఎదో

తెలుసు... నీ కుమారుడు నా రాజ్యం కి ఈ హారం తో

కాలి నడకన వచ్చి చేరుకుని నా చెంత నిలుచుంటే

వానికి నేను కోరుకునే అన్ని లక్షణాలు ఉన్నట్టే తప్పకుండా

నా అల్లుడిగా చేసుకుంటాను అమ్మాయి వరున్నీ....

ఈ హారమే ఎన్నుకుంటుంది అని

*"'సుదర్శన మహర్షిగారు నాకు ఈ హారం కానుక గా ఇచ్చినారు...

ఆయన ఆశీర్వాదం తో నాకు సంతతి కలిగింది...

అందుకే ఆయన అనతి మీర

నేను నిన్ను ఈ కోరిక కోరుతున్నాను అని చెప్పి

అమ్మాయి పెళ్లి సమయానికి అబ్బాయి ఈ హారం

వేసుకుని కోటలోకి ప్రవేశించాలి అని కోరారు

*" విక్రముడు స్నేహితుని మాటలు విని

సంతోష పడి నువ్వు కోరిన కోరిక న్యాయమైనది

నీ కుమార్తెకు అన్ని యోగ్యతలు ఉన్న వాన్ని

వరుడు గా తేవాలి అనుకుంటున్నావు

సుదర్శన మహర్షి ఆశీర్వాదమే నా కుమారుడు కూడా

వాడు ఈ పరీక్షలో నెగ్గుతాడు అని నమ్మకం తో

స్నేహితుడు కోరిక ప్రకారమే అంతా ఏర్పాటు చేశాడు...

కానీ జరిగేది ఎంటో ఎవరు ఊహించలేరు గా....!!

*" శశి శేఖరుడు విశ్రాంతి మందిరం లో విశ్రాంతి

తీసుకుంటూ ఉన్నాడు ఆ సమయం లో అతని

తల దగ్గరకు ఒక కాకి వచ్చి,, అరుస్తూ చెప్పింది

*"రాజా.... ఓ రాజా నీ కార్తె పరిణయం అడబోయే

వరుడు రాజ వంశీయుడు కాదు

అలా అని నీవు కోరుకున్న యోగ్యతలేని వాడు

కాదు

ధర్మాన్ని దయని తప్పని నీతి మంతుడు

నీవు పరీక్షించి తెలుసుకో...

రేపు నీ సభా మధ్యకు ఇద్దరు యువకులు

అతిథులు గా వస్తున్నారు...ఎంతో మర్యాదలు చేసి ఆహ్వానించు

*"వారిలో ఒకరి మెడలో స్పటిక హారం ఉంటుంది

కానీ ఆ హారం నీ స్నేహితుని చేతితో అతని మెడలో కి

రాలేదు కాసేపటి క్రితమే అతని మెడలో కి వచ్చింది

వచ్చిన వారిలో నీ స్నేహితుని కొడుకు హారం లేని వాడు

నిజం చెప్పాను గా ఇంక పరీక్షించి సరైన వాన్ని ఎన్నుకో....

కానీ నీవు వారి ముందు నిజం తెలిసినట్టు

ప్రవర్తించకూ...

ఇది ధర్మ నీతి కి పరీక్ష...

అని చెప్పి ఆ కాకి ఎగిరిపోయింది...!!!

*""శశి శేఖరుడు ఆలోచనలో పడ్డాడు ,,

ఈ కాకి కబురుకి అర్ధం ఏమిటి రేపు

జరగ బోయేది ఏమిటి...

మహర్షుల వారు ఇచ్చిన హారం యొక్క ఆంతర్యం

ఏమిటి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి

వచ్చాడు...!!

*"'మరుసటి రోజున అతని అంతః పురం కి ఇద్దరు

యువకులు అతిథులు గా వచ్చారు ,,

వారిని చూసి రాజు గారు ముందుగా ఏర్పాటు చేసిన

అతిథి మర్యాదలు చేయమని ఆజ్ఞాపించారు

ఒక పెద్ధామే పట్టు వస్త్రం పన్నీరు తెచ్చి వచ్చిన

వారిలో ముందుగా సూరవర్మా పాదాలు కడిగి

పట్టు వస్త్రం తో తుడుస్తూ సేవ చేసి మీరు

పక్క రాజ్యం నుంచి వచ్చినారు మీకు ఇదే మా ఆహ్వానం

అని పలికింది,,

అక్కడ ఉన్న కొంతమంది చెలికత్తెలు

పూలు విసిరి అతనికి

ఆహ్వానం పలికారు,,,

సూరవర్మ గొప్పగా అతిథి మర్యాదలు

అందుకున్నాడు...!!

*"" అలాగే ఆ పెద్దామే

దిలీపుని పాదాలు కూడా కడిగి సేవచేసుకోవాలి

అనుకుంది...""' దిలీపుడు తన తల్లి కంటే పద్ధదైన

ఆమె పాదాలు టక్కున పట్టుకుని

మాతా మీరు నా తల్లితో సమానం

మీరు నా పాదాలు కడుకట ఎంత తప్పు

అని అమే పాదాలు అతను కడిగి

మాతృ సేవ చేసుకున్న భాగ్యం కలిగింది

అనుకుని సంతోషంగా ఆమె పాదాలకు నమస్కరిచాడు

*"/ ఆ దృశ్యం చూసిన శశి శేఖరుడు

ఆలోచనలో పడ్డాడు దిలీపుడు కిందకి వంగి నప్పుడు

అతని మెడలో స్పటిక హారం దర్శనం ఇచ్చింది

అది చూసిన రాజావారి వళ్ళు వణికింది

ఎంతో తేజోవంతంగా వేలుగు తున్న రూపం కనిపిస్తుంది

అతని నిర్మలమైన నేత్రాలు నీతి ధర్మం దయ

పెద్దల పట్ల మర్యాదా అన్ని యోగ్యతలు కలిగి ఉన్న

అతన్ని చూసి ఎంతో సంతోష పడ్డాడు

 రాజావారు నవ్వుతూ...

*"కావాలనే సబ్బాష్ సూరవర్మ...నీవు ఎంతో

గొప్పవాడివి... నీవే నాకు కాబోయే అల్లుడు వి

ఈ రాజ్యం యువరాణి నీ సొంతం అని గొప్పగా చెప్తూ

అతనికి ఆశ పెట్టాడు...!!

*" దిలీపుడు అర్ధం కానట్టు చూస్తున్నాడు

సూరవర్మ ఆవేశ పడుతు..

ఆగండి ఎంటి విపరీతం సూరవర్మ నేను

వాడు నా సేవకుడు దిలీపుడు....

అని అరిచినట్టు చెప్పి నేను మీ స్నేహితుడు రాజా

వీక్రముడి తనయున్ని...మీ అమ్మాయిని

వివాహం చేసుకొనుటకు మీరు కోరుకున్న విధంగా

వచ్చాను అని గొప్పగా చెప్పాడు,,

*"/ రాజావారు నవ్వుతూ అందుకు అవకాశమే లేదు...

నేను నా స్నేహితుడు కి ఈ హారం ఇచ్చాను

ఇక్కడికి యువరాజునీ పంపించే టప్పుడు వాని

మెడలో ధరించి పంపించమని ఇదిగో

హారము యువరాజు మెడలో ఉంది

అని నవ్వుతూ చెప్పారు ,,

*"సూరవర్మ కంగారు పడుతు.... లేదు...మీరు పొరపడుతున్నారు...

ఈ హారం కాసేపటి క్రితం నేనే స్వయంగా వీని మెడలో

వేసాను కావాలంటే వాన్ని అడగండి అని కోపంగా

దిలీపుడు వైపు చూసాడు,,

"""*/ శశి శేఖరుడు దిలీపు డి వైపు చూసి నిజం

చెప్పు యువరాజ ఈ హారం నీదే అని చెప్పు

అలా చెప్తే ఈ రాజ్యం నా కుమార్తె నీ సొంతం

అవుతుంది నీవు ఈ రాజ్యానికి రాజుగా ఎలుతావు

ఎవరి బలవంతం మీదా ఈ హారం నీది కాదు అని

చెప్పకు అని ఆశ పెట్టారు ఆయన,,

"" దిలీపుడు నవ్వుతూ ఆ హారం తీసి శశి శేకరుని

చేతికి

ఇచ్చి ఇది నాది కాదు రాజా.... ఈ హారం

యువరాజు ల వారు నా మెడలో వేశారు...!!

అయినా కేవలం హారం నీ దృష్టిలో పెట్టుకుని

మీరు వరున్నీ ఎన్నుకోకుండా మీ అమ్మాయికి

తగ్గవాన్ని ఎన్నుకోండి అప్పుడే ఆమె అలాగే

ఈ రాజ్యం సుఖపదుతుంది అంతే నేను చప్పాలి అనుకున్నది...!!

*" నిజానికి నేను సూరవర్మ గారి సేవకున్ని మాత్రమే

అంతకు మించి నాకు ఎటువంటి అధికారాలు

కల్పించ కండి అని చేతులు జోడించి వేడుకున్నాడు...

*"దిలీపునీ నిజాయితీ చూసి సూరవర్మ

ఆశ్చర్యపోయాడు...

"" రాజావారు కూడా అతని రాజ భక్తి ధర్మం తప్పని

అతని మాటలు విని ఆశ్చర్యపోయారు

సభలో ఉన్న వారంతా కూడా అతన్ని చూసి

ఎంత గొప్ప ధర్మ నీతి ఇతనిది అనుకున్నారు...

""అంతలో అక్కడికి ఒక కాకి కావ్ కావ్ మనుకుంటు

వచ్చి వాలింది

రాజావారు తో సహా అంతా ఆ కాకి వైపు చూసారు

ఆ కాకి ఉన్నపళంగా మర్షుల వారుగా మారింది...

*" ఆయన్ని చూసి శశి శేఖరుడు దిలీపుడు సూరవర్మా

చేతులు జోడించి

ప్రణామం చేశారు

""ఆయన నవ్వుతూ.... సూరవర్మ వైపు చూసి....ఏమిటి యువరాజ అర్ధం అయిందా

ఇకనైనా నీవు నీ స్వార్థం విడిచి పెట్టు...యువరాజ

ధిలీపుని ధర్మం కి తల వంచు

నీవు ఉన్న వాడివి వందల మందికి సహాయం

చేయగల స్థోమత నీకున్న రోజుకి ఒక్కనికే దానం చేస్తాను

అని గర్వంతో నీ చెంతకు చేతులు చాచి

వచ్చిన వృద్దున్ని అవామానించావు

నీవు ఇచ్చిన దానం తప్ప తనదగ్గర విలువైనది

అంటూ ఏమీ లేదు అని అది తనకు ఎంతో అవసరం

అని తెలిసినా కూడా కాస్త కూడా స్వార్థం

చూపకుండా అందుకున్న దానాన్ని తిరిగి తన వంతు

దానంగా

ఇచ్చేసిన దిలిపుని దానగుణం ముందు నీ

ఇన్నేళ్ల దానం ఎటువంటి పుణ్యాన్ని పొందలేక

పోయింది....!!

*" దిలీపుడు ఆ ఒక్క దానం తో నీకంటే వందరెట్లు

పుణ్యం సంపాదించుకున్నాడు...

నీ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి

అని భయపడి పక్కవాని ప్రాణాలు పోయినా పర్వాలేదు

అని నీ మెడలో హారం అతని మెడలో వేసావు

ఇది ఒక రాజుకి ఉండకూడని లక్షణం

నీకు రాజయ్యే అర్హత ఉంది అంటావా

*""ప్రాణాలు పోతాయి అని తెలిసిన

కర్తవ్యము నిర్వర్తించే ధర్మం తన పై ఉందని

మెడలో హారం వేయించుకున్నాడు దిలీపుడు

ఒక రాజుకి ఉండాల్సిన లక్షణం ఇది

తన ప్రాణాలు పోయినా పర్వాలేదు తనని

నమ్ముకున్న వారిని కాపాడటం తన ధర్మం గా

బావించి నిజమైన రాజైయ్యాడు...!!

*" పెద్దవారిని గౌరవించాలి అనే

విచక్షణ కూడా లేకుండా తల్లిలాంటి ఆమె చేత

పాదాలు కడిగించుకుని నీవు సంస్కారం లేని

వాడివి అని నిరూపించుకున్నావు...

*"తన తల్లి లాంటి ఆమె పాదాలు గంగకంటే

పవిత్రంగా భావించి సేవించిన దిలీపునీ సంస్కారం

కొరకు వివరంగా నీకు చెప్పనక్కర లేదు...

అలాగే నీ హారం తో ఇప్పుడు నీకు పని పడింది

కావున

ఆ హారం నాది నేనే ధీలీపుని మెడలో వేసాను అని చెప్పుకున్నావు

*' ఆ హారం తనది అని చెబితే రాజ్యం యువరానీ తో పాటు

ఎన్నో బోగాలు తన సొంతం అవుతాయి

అని తెలిసినా అసత్యం పలకలేదు

ఎంతో గొప్ప సత్యవంతుడు గా నిరూపించుకుని....

చరిత్రలో నిలిచిపోయాడు.... దిలీపుడు

ఇప్పుడు చెప్పు యువరాజ

నీకంటే లేకి వారు జాతి హీనులు ఎవరుంటారు....???

*"సూరవర్మ కళ్ళు తెరిచాడు వాస్తవాన్ని

తెలుసుకున్నాడు అతను ఎంత తప్పుగా

నడుచుకుంన్నాడో అర్ధం చేసుకుని చేతులు

జోడించి దిలీపుడు పాదాలు పట్టుకుని మిత్రమా...

నీ యొక్క ధర్మ నీతి ముందు నేను తల దించుకున్నాను

నన్ను మన్నించు...

నీకంటే గొప్పవారు ఎవరు లేరు...

ఈ రాజ్యము యువరాణి నీకే సొంతం అని

చెప్పి క్షమాపణ కోరాడు...!!

*""మహర్షుల వారు శశి శేఖరుడు వైపు

చూసి ఏమంటావు రాజా...??

నీకు పుత్రిక జన్మిస్తుంది అని నేను చెబితే ధర్మం

దయ సత్యం సంస్కారం అన్ని యోగ్యతలు ఉన్న

వాడు ఆమెకు వరుడు గా రావాలి అని కోరావు గా

ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగారు

*" రాజావారు సంతోషిస్తూ...

ధన్యూడను ఋషివర్యా అని చెప్పుకున్నారు....

*' మహర్షి వారి శిష్యుల సహాయం తో అక్కడికి ధిలీపునీ

తల్లి తండ్రులు సూరవర్మ తల్లి గారు చేరుకుని

జరిగినది అంతా తెలుసుకుని ఈ రాజ్యానికి రాజు

అయ్యే అర్హత దిలీపునికే ఉంది అని

నిర్ణయించుకుని....

అతనికి పట్టము కట్టాలి అని నిర్ణయించుకున్నారు

*" దిలీపుని తల్లి తండ్రులు

ఎంతో సంతోష పడి మర్షులకు ధన్యవాదాలు

చెప్పుకుని ఎంతో ఉత్తమున్ని మాకు పుత్రుడుగా

అనుగ్రహించారు మా జన్మ ధన్యం అని చెప్పుకున్నారు...!!

*"" సూరవర్మ... స్వార్థం విడిచి పెట్టి ధర్మాన్ని

అనుసరిస్తే ఆ ధర్మమే మనకు రక్ష అన్న విషయం

స్నేహితుని ద్వారా తెలుసుకుని...

నిజమైన రాజుగా స్నేహితుడు గా

మసలుకున్నాడు....

దిలీపుడు కి యువరాణి తో వివాహం

జరిపించి ఆ రాజ్యం

ఆధికారం అప్పజెప్పాడు...!!

*"దిలీపుడు వద్దు అని నేను ఈ అవకాశాన్ని

స్వీకరిస్తే స్వార్థం

అవుతుంది అని......వారించినా అక్కడ ఎవరూ ఒప్పుకోలేదు....!!!

*"' మార్షుల వారు

అతనికి సత్యం బోధించి

నీకొరకై జన్మించిన యువతి ఈ చంద్రమతి

నీవు ఈమె భర్త కావాలి అన్నది ఈశ్వరీశ్చ

అందుకే ఈ హారం నీ మెడకు చేరింది

కాదు అనకు అని ఆ హారాన్ని తిరిగి అతని

మెడలో వేసి వివాహానికి సిద్ధం చేశారు....

*" అక్కడే ఉన్న

చంద్రమతి వరమాల ఆలస్యం చేయకుండా

దిలీపుని మెడలో వేసి ఆమె అంగీకారాన్ని

చిరు నవ్వుతో తెలియ చేసింది...!!!

ఆమె ఇష్టాన్ని తెలుసుకున్న దిలీపుడు.....

వివాహానికి అంగీకరించాడు....!!?

*" ఆ వివాహ వేడుక లోనే సూరవర్మ వేరొక

యువరాణి నీ వివాహం చేసుకుని

స్నేహితుని వలె తానుకూడారాజ్య పాలన చేస్తూ

ధర్మాన్ని నీతి నీ తప్పకుండా నడుచుకుంటూ

స్వర్గస్థులు అయిన తండ్రి విక్రముని ఆత్మ కూడా

శాంతింప చేశాడు....!!!!

*" దిలీపుడు తనకి అప్ప చెప్పిన భాధ్యతనీ స్వీకరించి

ఎంతో నిజాయితీగా నడుచుకుంటూ

అందరి దృష్టి లో దీలీపుని ధర్మం....

ఎంతో నీతి వంతంగా ఉంటుంది అని

నిరూపించుకున్నాడు..!

రెండు రాజ్యాల ప్రజాలు ఆ రాజుల పాలనతో

 సంతోషంగా ఉన్నారు....!!

*"సుదర్శన మహర్షి ఆశ్రమం లో కూర్చుని

అక్కడి విద్య నేర్చుకునే పిల్లలకి కథనంతా

వివరించి ధర్మం తప్పని వారికి ఎన్నటికీ అపజయం

ఉండదు అని దిలీపు డి ధర్మం రుజువు చేసింది

అని తన చేత ఆ ఈశ్వరుడు ఆడించన ఆట

వివరంగా చెప్పి ధర్మం తప్పకుండా

నడుచుకోండి

అని నీతి భోధన చేశారు....!!

           *""' సామాప్తం...


*"'ఫ్రెండ్స్.... మీకు చెప్పేది ఒక్కటే మన

దగ్గర ఉన్నది కాస్త పక్కవారికి సాయం చేద్దాం

వీలైన అంత వరకు కనీస ధర్మం పాటిద్దాం

స్వార్థం కొంతలో కొంతైనా పక్కన పెట్టి

భాద్యతగా నడుచుకుంధాం....

మన జీవన శైలి ఎలా ఉండాలో దిలీపుడు తెలియ

చేశాడు.... అతని ధర్మం యొక్క నీతి తెలుసుకుని

జీవిద్ధం.... ఏమంటారు....???

*""నేను రాసిన ఈ కథ ఇవాళ

ఒక్కరోజులో రాసింది అసలు ఊహించలేదు

నేను పార్టిసిపేట్ చేస్తాను

అనుకోలేదు ఎందుకో మనసులో ధర్మం కొరకు

ఒక కథ రాయాలి అనిపించింది

ఒక పూటలో కూర్చుని పూర్తి చేశాను

ఎక్కడైనా తప్పులుంటే మన్నించండి

కథ చదివి ఎలా ఉందో తెలియ చేయాలి

అని ప్రార్థన....

         .   ....ఇట్లు

              

               మీ అనురాధ...!Rate this content
Log in

Similar telugu story from Fantasy