raparthi anuradha

Horror Action Fantasy

4.5  

raparthi anuradha

Horror Action Fantasy

శక్తి ఆగమనం..6

శక్తి ఆగమనం..6

6 mins
522


ఇంటికి చేరుకున్న

ఇందు ఎప్పటిలా కాకుండా

కాస్త తేడాగా కనిపించింది.... 

ఆమె ఎందుకో కాస్త

హుషారుగా ఇల్లంతా

తిరుగుతూ ఉంటే 

ఆమె తల్లి అడ్డుకుని

ఏమైంది ఇందు ఇవ్వాళ చాలా హుషారుగా ఉన్నావు

అని అడిగింది


ఇందు నవ్వుతూ ఎం లేదు

అమ్మ మా కాలేజ్ లో అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు నాకు అక్కడ ఎలాంటి భయం లేదు.....

అంతే కాకుండా నేను నా కాలి పట్టి తిరిగి తెచ్చుకున్న చూడు 

సో ఇంక నువ్వు నన్ను దద్దోజనం అని పిలవను అని

ఒప్పుకోవాలి అంటూ

చెప్పి కాలర్ ఎగరెస్తున్నట్టు 

బిల్డప్ ఇస్తుంటే 

ఆవిడ నవ్వుతూ అరే విచిత్రం గా ఉందే ఇదెలా దొరికిందే 

నమ్మలేక పోతున్నాను 

మూడు తులాల బంగారు పట్టి నీకు ఎవరు తిరిగి ఇచ్చారు

ఎలా తెచ్చుకున్నావు

అని ఆరాలు తీయడం 

మొదలు పెట్టింది. 


ఇందు నవ్వుతూ సింపుల్

బిరియాని తిని తిరిగి 

తెచ్చుకున్నా అని నోరు జారీ ఎలాగోలా తెచ్చుకున్న 

ఇప్పుడు అది కాదు 

ముఖ్యం నేను మాట నిలపెట్టుకుని పట్టి తెచ్చుకున్న ఇంక నన్ను ఇందు ధైర్య వంతూరాలు అనాలి

తప్ప దద్దోజనం అనకూడదు

అని ఆర్డర్స్ వేసి ఆమె గదిలోకి వెళ్లిపోయింది 


ఎప్పుడు లేని ఉత్సాహం

కూతురు లో చూసి ఆవిడ 

సంతోష పడింది పోనీలే

అమ్మాయి లో మార్పు వస్తుంది అనుకుని ఊరుకుంది.


రాత్రి ఇంటికి తన 

మనుషులతో వచ్చి హాల్ లో కూర్చుని మందు కొడుతూ ఆ శివరాం ఆట కట్టిస్తాను అని రగిలిపోతూ ఉన్నాడు

భూషణ్ అతడి 

అనుచరులు కూడా శివరాం ఎలక్షన్స్ ప్రచారం ఎలా

చేయాలి అని ప్లాన్ 

చేస్తున్నాడు తెలుసుకున్నాం

అంటూ వివరాలు 

చెబుతున్నారు గదిలో 

కూర్చుని చదువుకుంటున్న

ఇందు మెడలో త్రిశూలం

లాకెట్ నీ మాటి మాటికి 

తాకుతూ మనసులో దేవి స్మరణ చేసుకుంటూ ఉంది. 


అంతలో ఆమె గది డోర్

కొట్టారు ఎవరో 

ఆమె ఉలిక్కి పడి అటు వైపు

చూసి వెళ్లి డోర్ ఓపెన్

చేసింది ఇంట్లో పని కుర్రాడు ఇందమ్మ నీకు పోన్ వచ్చింది అన్న పిలవమనిండు అని చెప్పారు. 


ఆమె వాచ్ వంక చూసి టైం పన్నెండు కావస్తుంది ఈ టైం లో ఫోన్ చేశారు అని కాస్త కంగారుగా వచ్చింది ఆమెకు భూషణ్

రిసీవర్ అందిస్తూ అమ్మా

ఇందు నీ ఫ్రెండ్ అంట ఎదో 

నోట్స్ కావాలి అంటుంది 

అని ఇచ్చాడు 

ఇందు కి అర్థం కాలేదు

నా ఫ్రెండ్ నా శ్రావణి అయి ఉంటుందా అనుకుని

ఫోన్ అందుకుని హాలో 

అనింది 


అవతలి నుండి గట్టిగా ఓ ముద్దు శబ్ధం వినిపించింది. 


అంతే ఆమె గుభ గుయ్యు 

అనింది తుళ్ళి బడి రిసీవర్

దూరం పెట్టేసి కంగారుగా

తండ్రి వంక చూసి అతడు

డౌట్ గా చూస్తున్నాడు 

అని వేరే దారి లేక రిసీవర్ చెవి

దగ్గర పెట్టుకుని హాలో ఎవరు 

అని అడిగింది

అవతలి సిద్దు నవ్వుతూ.... 

ఎంటి మేడం... కంగారు పడ్డావ నేనే.... సిద్దు అన్నాడు

అంతే అమే కంగారుగా 

నువ్వా ఎంటి నాకు ఫోన్ చేశావ్ అది కూడా ఈ టైం లో అని అరవాబోయి 

పెద్ద గొంతు చేయలేక 

నెమ్మదిగా అడిగింది


సిద్దు నవ్వుతూ ఎం

చేయకూడదా నీ బాబే నన్ను ఎందుకు ఫోన్ చేశావ్ అని అడగకుండా నీకు ఫోన్ పిలిచి ఇచ్చాడు గా ఇంకేంటి టెన్షన్ 

అని నవ్వాడు 


ఇందు భయ పడుతూ నాన్న

నువ్వు అమ్మాయి అనుకుని ఇచ్చారు ఇలా ఒక అబ్బాయి చేశాడు అని తెలిస్తే నిన్ను వెతుక్కుని వచ్చి మరీ చంపేస్తారు ప్లీజ్ ఫోన్ పెట్టేయ్ అంటూ

కాల్ కట్ చేయబోతే 

సిద్దు డైలాగ్ వేశాడు నువ్వు

కాల్ కట్ చేస్తే మళ్లీ కాల్

చేస్తాను లిఫ్ట్ చేయకపోతే

నేరుగా ఇంటికి వచ్చి నీ బాబు చేతిలో చావడానికి కూడా నేను

రెడీ అన్నాడు 


అంతే ఆమె భయ పడిపోయి 

అమ్మో వద్దు ప్లీజ్ చాలా

ప్రమాదం అని ఆపింది. 


సిద్దు ఆమె మనసు అర్థం

చేసుకుని సరే అయితే రానులే అన్నాడు 


ఇందు అడుగుతుంది 

అసలు నీ ప్రాబ్లం ఎంటి 

ఎందుకు కాల్ చేస్తున్నావ్ 

అని 


సిద్దు అడుగుతున్నాడు

నన్ను ఎందుకు అన్నయ్యా 

అన్నావ్ అని అడిగాడు 

ఆమె అర్థం కానట్టు ఎం

అనకూడద అందులో తప్పేం ఉంది అని ప్రశ్నిస్తుంటే 


సిద్దు మండి పడుతు తప్పె 

ఉంది అలా ఎలా అన్నయ్య అంటావ్ నేను నిన్ను చెల్లెలు అనుకోనప్పుడు నువ్వెలా

నన్ను అన్నయ్య అంటావ్

అందుకే మనసు చాలా భాధ పడింది ఇంటికి కూడా 

పోలేదు నేరుగా మీ ఇంటికే

వచ్చి చేరాను ఎందుకు

నన్ను అన్నయ్య అని

పిలిచావు....

అని ప్రశ్నించడానికి 


మరీ ఇంట్లోకి వస్తె బాగోదు

అని మీ బిల్డింగ్ ఎంట్రన్స్ వద్ద నుండి కాల్ చేస్తున్న 

అని చెప్పాడు అంతే ఇందు 

గుండె ఆగిపోయింది

ఎంటి ఇంటి ముందు ఉన్నావా

అని అరిచి పక్కనే ఉన్న నాన్న గారు అనుమానం గా చూస్తూ

ఉంటే చిన్నగా నవ్వుతూ

చెప్పే శ్రావణి ఎక్కడ ఉన్నావ్

నీకు నోట్స్ రేపు కాలేజ్ కి 

తెచ్చి ఇస్తానే అని మాట్లాడుతూ కవర్ చేస్తూ విండో నుంచి

బైటకు చూసింది 


సిద్దు రోడ్ మీద కార్ పైకి ఎక్కి కూర్చుని తనతో మాట్లాడుతూ కనిపించాడు

ఆమె విండో వైపు చూసేసరికి ఆమెకు చేయి ఊపుతూ

హాయ్ అంటూ ఉన్నాడు


ఇందు కి భయం గా ఉంది

అతడు ఫుల్ గా ఇరికించే లా ఉన్నాడు నాన్న గారికి అతడు కనిపిస్తే నరికేశారు ఇప్పుడెలా

అని ధైర్యం తెచ్చుకుని 

ఇప్పుడు నీకు ఏం కావాలి 

చెప్పు అని అడిగింది. 

సిద్దు నవ్వుతూ నన్ను

అన్నయ్య అన్నావ్ మనసు

భాధ పడింది నా మనసు సంతోష పడ్డ మాట అను ఇంటికి 

వెళతాను లేదు అంటే ఇక్కడే కూర్చుని నీకు ఫోన్ చేస్తూనే 

వుంటా అని ఆర్డర్ వేశాడు


ఆమె కంగారుగా ఎంటా 

మాట అని అడిగింది 


అతడు గట్టిగా ఊపిరి తీసుకుని 

హు బావా అని పిలువ అని అడిగాడు


ఆమె షాక్ తినింది ఏంటీ అని అరిచింది ఆమె పక్కన ఉన్న భూషణ్ ఏమైంది అమ్మా అని అడుగుతున్నారు


ఇందుకి ఎటూ తప్పించు కోలేనీ పరిస్తితి అందుకే నవ్వుతూ ఎం లేదు నాన్న నా ఫ్రెండ్ ఎగ్జామ్స్

కోసం చెబుతుంది

అని కవర్ చేసి సిద్దు మీద 

సీరియస్ అవుతూ నీకు బ్రెయిన్ పని చేయడం లేదా అలా

ఎవరైనా ముక్కు మొఖం

తెలియని వారిని బావా అని పిలుస్తారా అని అడిగింది

సిద్దు కూడా సీరియస్

అవుతూ మరైతే ముక్కు 

మొఖం తెలియని వాడ్ని అన్నయ్యా అని పిలిచేయవచ్చా

ఇదెక్కడి న్యాయం అయినా

శ్రీరామ్ నాకు బావా లాంటి

వాడు వాడికి నిన్ను చూస్తే చెల్లెలు అని పిలవాలి అనిపించింది

వాడు చెల్లిగా ఫిక్స్ అయ్యాడు మరలాంటప్పుడు 

నువ్వు వాడి ముందు నన్ను అన్నయ్య అంటే వాడు 

భాధ పడడు అందుకే 

చెబుతున్న నన్ను బావా అని పిలువు వాడ్ని అన్నయ్య అని పిలువ్వ్ లెక్క సరిపోతుంది

ఇంక నా మనసు సంతోష పడుతుంది ఇంటికి 

వెళ్ళిపోతాను హు పిలువ్ 

త్వరగా అని అర్థం లేని 

లాజిక్ చెబుతూ ఆమెను 

ఇరకాటం లో పడేశాడు 


ఇప్పుడు ఆమెకు అతడు పిలవమన్నట్టు పిలవడం తప్ప

వేరే దారి లేదు అందుకే 

సరే బావా పిలిచాగా

ఇంక ఇంటికి పో అని ఫోన్ పెట్టేయబోయింది


సిద్దు ఊరుకుంటాడా హాలో 

హాలో వెయిట్ వన్ మినిట్ 

నువ్వు ఇప్పుడు ఏమని పిలిచావు అని అడిగాడు 

ఆమె ఇబ్బంది గా బావా అని పిలిచాను వినబడలేద 

అని సీరియస్ అవుతూ 

ఉంటే సిద్దు తెలివిగా నిజం గా పిలిచావా అబద్ధం చెప్పడం 

లేదు గా అని అడిగాడు

ఆమె తల పట్టుకుని నీకేమన్నా చేవుడా అని అడిగింది 

అతడు నవ్వుతూ కోపం వద్దు నా అముల్ బేబీ

అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు 

నన్ను బావా అని పిలిచావా

అంటూ విసిగించాడు


ఆమె ఇంక సహనం లేనట్టు 

అవును ఆ దేవి మాత మీద ఒట్టు నేను నిన్ను బావా అని పిలిచాను అని చెప్పింది 


అతడికి రావలసిన ఆన్సర్ 

వచ్చింది అందుకే సంతోషం గా చాలూ ఈ మాట చాలు అమూల్ బేబీ

అంటే నువ్వే ఆ దేవి మాత మీద ఒట్టు పెట్టీ నన్ను 

బావ గా ఫిక్స్ అయ్యావు 

ఇంక నన్ను ఎప్పుడు బావ అనే పిలవాలి మార్చడానికి లేదు 

దేవి మాత కొప్పడుతుంది అర్థం అయిందా మరదలి పిల్ల అని 

లాస్ట్ లో ఇంకొంచం గట్టిగా కిస్ అందిస్తూ గుడ్ నైట్ బంగారం అంటూ ఫోన్ పెట్టేసాడు.


ఆమె బిగుసుకు పోయి

నిలుచుంది. 

సిద్దు వెళ్ళిపోయాడు ఇందు ఇంకా అక్కడే ఉండటం చూసి భూషణ్ అనుమానిస్తూ ఏమైంది

అమ్మ ఇంకా ఫోన్ పట్టుకుని ఉన్నావ్ అని కదిల్చారు


ఆమె ఉలిక్కి పడి ఏమిలేదు 

నాన్న గారు ఎగ్జామ్స్ కొంచం 

టఫ్ గా ఉంటాయి అని చెబుతుంది నా ఫ్రెండ్ అంతే అని ఆమె 

గదిలోకి వెళ్లి రాత్రంతా సిద్దు మాటలు గుర్తు చేసుకుంటూ

అతడు ఎందుకు ఇంత గొడవ చేశాడు అసలు అతడి ఉద్దేశం ఏమిటి అని తిట్టుకుంటూ దేవి మాత మీద నేను ఎందుకు ఒట్టు వేశాను ఇంక వాడు బావ అని

ఫిక్స్ అయిపోతాడు 

ఈ విషయం నాన్నగారికి తెలిస్తే అంతే సంగతులు అని భయపడుతూ 

నిద్ర పోయింది.


*" మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరామ్ తన బైక్ క్లీన్ చేసుకుని శ్రావణి వస్తుంది తన బైక్ ఎక్కుతుంది అని ఆశగా

ఎదురు చూస్తూ నిలుచున్నాడు


*" బట్ ఆమె అంత త్వరగా

అతడి దారికి వస్తుందా

శ్రీరామ్ చూస్తుండగానే ఆమె స్కూటీ స్టార్ట్ చేసుకుంటూ

ఓయ్ టైం అయ్యింది ఇంకా రెడీ అవ్వలేద త్వరగా అంటూ

ఆర్డర్స్ వేసి ముందుకు 

కదిలింది 

ఆమె అలా వెళ్లిపోతుంటే శ్రీరామ్ నిరాశగా చూస్తూ నిలుచుండి పోయాడు 


శ్రావణి అతడి ఫీలింగ్ తెలిసిన దానల నవ్వుకుంటూ

పాపం సారు చాలా ఎక్స్పర్ట్ చేసి నట్టు ఉన్నాడు అనుకుని

కాలేజ్ కి చేరుకుంది. 


ఆమెకు సిద్దు ఎదురై ఎంటి

సిస్టర్ మీ బావగారు ఇంకా 

కాలేజ్ కి రాలేదు అన్నాడు


అతడు సిస్టర్ అనడం తో 

శ్రావణి అతడిపై కోపం మరచి

పోయి వస్తున్నాడు ఎదో నీరసం

లో ఉన్నాడు లే అందుకే లేట్ అవుతుంది అని చెప్పి 

ఇందు కోసం ఎదురు చూస్తూ

ఉంటే


యాది కార్ డ్రైవ్ చేస్తున్నాడు

కారు వచ్చి ఆగడం తో అంతా అటు వైపు చూసారు ఇందు 

ఇబ్బందిగా కారు దిగి వాల్ల వద్దకు వచ్చింది 


యాది సిద్దు నీ చూసి ఇతడు

ఎంటి వద్దు అంటున్న ఇందమ్మ కి చేరువగా ఉంటున్నాడు

అయినా కాలేజ్ లొ దూరం గా ఉండటం ఎలా కుదురుతుంది

చూసి చూడనట్టు ఊరుకోవాలా అని వెళ్ళిపోయాడు...... 


సిద్దు ఇందు వైపు నవ్వుతూ చూస్తున్నాడు 

అతడి స్మైల్ ఆమెను ఇరిటేట్ చేస్తుంది శ్రావణి హాయ్ ఇందు అంటూ విష్ చేసింది. 


సిద్దు కూడా హాయ్ అమూల్ బేబీ అన్నాడు. 

ఇందు అతడి వైపు కోపం గా చూస్తూ నా పేరు ఇందు 

అమూల్ బేబీ కాదు అని ధైర్యం గా ఆన్సర్ ఇచ్చింది 


అప్పుడే వాల్ల మధ్యకు శ్రీరామ్

వచ్చి దిగాలుగా నిలుచున్నాడు సిద్దు ఇందు మాటలకి 

ఆన్సర్ గా ఎవరికి నచ్చినట్టు 

వాళ్ళు ఎదుటి వాళ్ళని పిలుస్తున్నారు అందుకే నాకు నచ్చినట్టు నిన్ను అమూల్ బేబీ అని పిలిచాను 

ఉదాహరణ కి

నిన్న నువ్వు నీకు నచ్చినట్టు నన్ను బావ అని పిలవలేదు.... 

అలాగే నేను నిన్ను అమూల్ బేబీ

అని పిలిచాను అన్నాడు 


శ్రీరామ్ శ్రావణి షాక్ అయ్యి

ఎంటి అన్నట్టు చూస్తుంటే

ఇందు చిరాగ్గా నేను పిలిచాను

అది నువ్వు పిలవమంటే

అప్పుడు నేను ఉన్న సిట్యువేషన్ అలాంటిది అనింది

సిద్దు 


మాత్రం ఏమాత్రం తగ్గకుండా హా పిలవమంటే పిలిచేస్తావా 

నేనే నిన్ను దేవి మాత మీద ఒట్టు వేయమని చెప్పానా 

అంతా నువ్వే ఫిక్స్ అయ్యి పిలిచావ్వ్ ఇంకా మార్చడానికి 

లేదు అంతే


శ్రావణి నా సిస్టర్ నువ్వు వీడి సిస్టర్ సో శ్రావణి శ్రీరామ్ కి మరదలు అవుతుంది అలాంటప్పుడు

నువ్వు నాకు మరదలు 

అవుతావు ఇందులో తప్పేం లేదు ఏమంటావ్ సిస్టర్ అని 

శ్రావణి నీ కన్ఫ్యూజ్ చేశాడు

ఆమె అయోమయం గా హా అంతే అనింది శ్రీరామ్

ఆశ్చర్య పోతూ చూస్తుంటే 

ఇందు తల పట్టుకుని కర్మ రా 

బాబు అందరూ మెంటల్ కేసులే దొరికారు అనుకుని 

ముందుకు వెళ్లిపోయింది.


*"శ్రావణి ఆమె వెనకే ఏయ్

ఇందు ఆగు అంటూ వెళ్ళింది.


శ్రీరామ్ ఇంకా షాక్ లోనే 

ఉన్నాడు సిద్దు నవ్వుతూ

ఏంట్రా అలా అయిపోయావు

నా బంగారం నన్ను అన్నయ్య అంటే ఊరుకుంటానా

చూసావు గా ఎలా బావా అని పిలిచేట్టు చేశానో 

దటీజ్ సిద్దు అని నవ్వుతూ

ఇంక షాక్ అయ్యింది చాలు రా పోదాం త్వరలోనే నా లవ్ కూడా ఓకే చేసేలా ప్లాన్ చేయాలి

అంటూ కదిలాడు.


శ్రీరామ్ సిద్దు అన్నంత పని చేస్తాడు అనే నమ్మకం తో బావ నువ్వు సూపర్ బావా అంటూ

అతడి వెనకే కదిలాడు 


సో నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే కాస్త వేచి 

చూడాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ కొరకు నేను కొన్ని రీసర్జ్ చేయాల్సి 

వచ్చింది అందుకే లేట్ అయ్యింది ఇకనుండి అప్డేట్స్ ఇస్తాను

చదివి ఎలా ఉంది చెప్పాలి

ఓకే ధన్యవాదాలు....!!!



Rate this content
Log in

Similar telugu story from Horror