శక్తి ఆగమనం..9
శక్తి ఆగమనం..9
*"" ఇంటికి చేరుకున్న ఇందు ఎవ్వరితో మాట్లాడలేదు మౌనం గా ఆమె గదిలోకి వెళ్లి కూర్చుంది.
ఆమెకు అంతా అయోమయం గా ఉంది తన విషయం లో
జరిగింది నిజమా అని
అనుమానం గా అర్థం కానట్టు ఆలోచిస్తూ
ఆవిడ ఎవరు నన్ను ఎలా సిద్దు ఉన్న గదిలోకి తీసుకు వెళ్ళింది
అసలు నేను ఎలా ఆవిడతో
ఆ గోడ దాటి వెళ్ళాను
అంతా మాయలా ఉంది
పాపం సిద్దు మీద ఎవరో బలం గా దాడి చేశారు
నేను చూసాను ఆ గాయం
కానీ ఇప్పుడు అది లేదు
ఎలా సాధ్యం
నేను కుంకుమ పెట్టిన వెంటనే నయం అయ్యింది
తను నన్ను చాలా లవ్
చేస్తున్నాడు నాకోసం చాలా
ఆరాట పడుతున్నాడు
తనని విడిచి రావడం
నాక్కూడా కష్టం గా ఉంది
కానీ తను శివరాం అంకుల్
కొడుకు తనని నేను మీట్ అయ్యాను అని తెలిస్తే నే
నాన్న గారు పెద్ద గొడవ చేస్తారు అలాంటిది
తను నన్ను లవ్ చేస్తున్నాడు
అని తెలిస్తే ఇంకేమైనా ఉందా చంపేస్తారు
తనని దూరం పెట్టాలి
ఎంత కష్టం అయినా సరే
సిద్దు నీ అడ్డుకోవాలి
నన్ను లవ్ చేయడం కరెక్ట్ కాదు
అని వార్నింగ్ ఇస్తాను
అని ఆలోచిస్తూ జరిగింది
అంతా విడిచి పెట్టీ స్నానం చేసి వద్దాం అని బెడ్ మీది నుంచి
లేచి వాష్ రూం వైపు తిరిగింది.
అంతే.....
ఆమె ఎదురుగా ఎదో భయంకర రూపం నిలుచుని
కనిపించింది ఒక్కసారిగా గుండె వణికిపోయింది
ఇందు భయం గా కయ్ మని కేక వేసి అలాగే స్పృహకొల్పోయింది.
ఆ వికృత ఆకారం
భయంకరం గా నవ్వుతూ
ఆమెను హతమార్చే ప్రయత్నం చేస్తూ ఆమె మీదికి వెళుతూ
ఉంది సరిగ్గా అప్పుడే ఇందు.
అమ్మ.....నాన్న గారు ఆమెకు
ఎం జరిగిందో అని కంగారుగా గదిలోకి వచ్చారు
వాళ్ళు రావడం తో
ఆ దుష్ట శక్తి ఇందు నీ ఏమి చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఆ దుష్ట శక్తి ఆమెను
వెంటాడటం అక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు
ఆమె అలా పడిపోయే సరికి
ఇదేదో దుష్ట ప్రభావం అని
ఆమెను కంగారుగా బెడ్ మీద పడుకో బెట్టి దేవుని కుంకుమ
బొట్టు పెడుతూ దుర్గ మాత
రక్ష తెచ్చి కట్టారు
ఆమె వళ్లు వేడిగా అగ్గి నిప్పులా కాలిపోతూ ఉంది.
ఎన్ని చేసినా ఆమెలో స్పృహ రాలేదు భూషణ్ వెంటనే
డాక్టర్ నీ పిలిపించాడు
ఆ డాక్టర్ పరీక్షించి
వీక్ గా ఉంది ఇంజక్షన్ చేస్తాను మార్నింగ్ కి సెట్ అవుతుంది కంగారు పడకండి అని చెప్పి వెళ్ళింది
భూషణ్ డాక్టర్ వెళ్ళాక
కూతుర్ని పట్టుకుని చాలా దిగులు పడుతూ ఇంకా ఎన్నాళ్ళు
నా బిడ్డ ఈ భాధలు పడాలి అని విచారిస్తూ ఉంటే
అతడి
భార్య ఇంకాస్త భాధ పడిపోతూ ఉంది
ఇదంతా ఆ ఇంట్లో పని
వాళ్ళు చూసి కంగారు
పడిపోయి
భూషణ్ నీ కంట్రోల్ చేస్తూ
ఇదంతా దుష్ట శక్తి పనే మన
ఇందు అమ్మ కోసం
నెళ్ళిపూడి పరిసర ప్రాంతాల్లో
ఉన్న కొండ దోర నీ కలిస్తే
ఏమైనా తెలుస్తుంది అన్న
అని సలహా ఇచ్చారు .
భూషణ్ ఆ వివరాలు తెలుసుకుని వెంటనే ఆ కోయ దొర నీ
కలిసే పనిలో ఉన్నాడు.
ఇందులో భయం జ్వరం గా మారింది
ఆమె మేలుకుని నార్మల్ గా మాట్లాడే వరకు ఆమె తల్లి కంటి మీద కునుకు వేయకూడదు
అన్నట్టు చూస్తుంటే
ఇంట్లో పనివాళ్ళు సర్ది చెప్పి అమ్మాయి కి ఇంజక్షన్ చేశారు గా ఉదయానికి మామూలు అయిపోతుంది
మీరు విశ్రాంతి తీసుకోండి
అని వేడుకున్నారు
ఆవిడ విచారం గా
పూజగదిలో కూర్చుని
నా కూతురు ఎందుకు
ఇంత భాధ పడుతుంది
ఆమెకు ఎదురవుతున్న
దుష్ట శక్తి ఏమిటి ఇంకెప్పుడు
దానికి విముక్తి అని ఖడ్గ మాల చదువుతూ కూర్చుంది.
***"""
సిద్దు ప్రస్తుతం నార్మల్ అయ్యాడు అతడికి వెంటనే ఇందు నీ చూడాలి అని ఉంది
ఆమె తనని మీట్ అయ్యింది
మళ్లీ ఎలా ఆ వాల్ లోపలి
నుంచి బైటకు వెళ్లి పోయిందో తెలుసుకోవాలి అంతే
కాదు నన్ను లవ్ చేస్తుందో లేదో తెల్చూ కోవాలి అసలు
వెంటనే ఆమెను చూడాలి
అని ఫిక్స్ అయ్యాడు,
శ్రీరామ్ కి కాల్ చేసి నేను
బాగానే ఉన్నాను అని చెప్పి
మీ చెల్లిని చూడాలి రా
నాకు హెల్ప్ చెయ్యి అని
అడిగాడు
శ్రీరామ్ కంగారుగా రేయ్ నీకు
హెల్త్ బాలేదు పైగా మీ డాడ్ చాలా సీరియస్ అవుతున్నారు
ఇలాంటి పరిస్తితి లో నువ్వు
బైటకు వెళితే పెద్ద గొడవ అవుతుంది
అంతే కాదు ఇందు వాల్ల డాడ్ కూడా గొడవ చేస్తారు
నా మాట విను వద్దు
మార్నింగ్ కాలేజ్ లో మీట్ అవుదువు అని అడిగాడు
సిద్దు విసుక్కుంటూ అదేం
కుదరదు నువ్వు నాకు హెల్ప్ చేసినా చేయక పోయిన నేను
ఇందు నీ చూడాలి వెంటనే
చూసి తీరతాను అంటూ గొడవ చేశాడు,
శ్రీరామ్ టెన్షన్ గా రేయ్ ఆమె
నిన్ను చూడాలి అని హాస్పటిల్ కి వచ్చింది మేము అంతా వచ్చాం
మీ డాడ్ ఎవర్ని నిన్ను కలవనివ్వలేదు అందుకే బైట
నుంచే వచ్చేశాం
కానీ నువ్వు నార్మల్ ఆయ్యావ్
అని ఆమెకు మెసేజ్ చేశాం లే
తను టెన్షన్ లేకుండా ఉంటుంది మార్నింగ్ మీట్ అవుతుంది
ఈ ఒక్క నైట్ వెయిట్ చెయ్యి అంటూ ఉంటే
సిద్దు ఆలోచనలో పడ్డాడు
వీడెంటి ఇందు హాస్పటిల్ కి
వచ్చి నన్ను మీట్ అవ్వకుండా వెళ్ళింది అంటున్నాడు
తను నన్ను మీట్ అయ్యింది గా నాకు కుంకుమ బొట్టు పెట్టి
బలమైన గోడలో దూరి మరీ వెళ్ళింది
హు ఆ విషయం వీడికి చెప్పిన
వెస్ట్ ఎలాగూ నమ్మాడు
సరే అదంతా కాదు రా
నేను ఇందుతో మాట్లాడాలి
శ్రావణి కి చెప్పు నాకు తనతో మాట్లాడించమని
ఊరుకుంటాను నేను
కాల్ చేస్తే తను ఎలాగూ లిఫ్ట్ చేయదు అని చెప్పి ఆర్డర్ వేశాడు
శ్రీరామ్ విసుక్కుంటూ
ఓకే అని శ్రావణి కి మేటర్
చెప్పాడు సిద్దు గొడవ చేస్తున్నాడు ఎలా అయిన ఇందులో మాట్లాడాలి అంటున్నాడు అని
ఆమె కంగారుగా అమ్మో పెద్ద
గొడవ అవుతుంది నేను కాల్ చేసి విషయం చెప్తా అని ఇందు
మొబైల్ కి కాల్ చేసింది
ఆమె మొబైల్ ఎవరు లిఫ్ట్ చేయలేదు,
అందుకే ల్యాండ్ లైన్ కి చేసింది ఇంట్లో పనివాళ్ళు లిఫ్ట్ చేసి
ఇందు అమ్మ కి వంట్లో బాలేదు జ్వరం మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉంది అని చెప్పారు
అంతే వాళ్ళు కంగారుగా ఆ విషయం సిద్దు కి చేరవేశారు.
ఇంక సిద్దు క్షణం ఆలస్యం చెయ్యకుండా
ఆమెను చూడాలి అని ఫిక్స్ అయ్యాడు
శ్రీరామ్ శ్రావణి వీడు ఎదో కొంప ముంచే లా ఉన్నాడు అని
ఇందు ఇంటికి ఆ రాత్రి మీద ప్రయాణం అయ్యారు
సిద్దు ఇంట్లో శివరాం
ఇందు ఇంట్లో భూషణ్
ఇద్దరు ఓకే సారి ప్రయాణం మొదలు పెట్టారు
వాళ్ళు వెళ్ళాలి అనుకున్న
గమ్యం తెలుసుకోవాలి
అనుకున్న వాస్తవం ఒక్కటే.
*""సిద్దు అతడి బెడ్ రూం బ్యాక్
సైడ్ నుండి సీక్రెట్ గా బైటకు వచ్చాడు.
ఇందు ఇంటి లోపలికి
శ్రావణి శ్రీరామ్ వచ్చారు
వాళ్ళని చూసి ఇందు తల్లి గారు విషయం ఏమిటి అని అడిగారు వాళ్ళు ఎదో ఎగ్జామ్ విషయం మాట్లాడాలి అంటూ ఉంటే
ఆవిడ విచారం గా అమ్మాయికి ఒంట్లో బాలేదు అదిగో
ఆ బెడ్ రూం లో తెలివి లేకుండా నిద్రపోతూ ఉంది
డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి
వెళ్లారు వాల్ల నాన్నగారు ఎదో ఊరు వెళ్లారు అది ఉదయం వరకు
మెలుకోదు అంతా మా కర్మ ఇంకా ఎన్నాళ్ళు బిడ్డ ఇలా భాధ
పడాలో అని కన్నీళ్లు పెట్టుకుంటు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్ అందించింది
వాళ్ళు అక్కడ కూర్చుని
భాధ పడుతూ అలాగా
అంటూ అయ్యో ఎంత పని అయ్యింది
మాకు తెలియదు అసలు
ఈవినింగ్ వరకు మాతోనే ఉంది గా అని అంటూ ఉన్నారు
అవతలి వైపు లైన్ లో ఉన్న
సిద్దు ఇప్పటి వరకు ఆ మాటలు అన్నీ విన్నాడు
అతడికి చాలా టెన్షన్ గా ఉంది ఎలా అయినా ఇందుని చూడాలి అదొక్కటే ఆలోచించాడు,,
శ్రీరామ్ కి మెసేజ్ చేశాడు
ఇందు రూం ఎటువైపు ఉంది
అని అతడు మెసేజ్ కి రిప్లై ఇస్తు వివరణ ఇచ్చాడు
అంతే సిద్దు పైప్ లైన్ పట్టుకుని
ఆమె ఉన్న రూం లోకి విండో సహాయం తీసుకుని ప్రవేశించాడు,,
గదిలో చూస్తే నిస్సహాయంగా
బెడ్ మీద పడి ఉంది ఇందు
అతడికి చాలా భాధ కలిగింది వెనకా ముందు ఏమీ
చూడకుండా ఆమె దగ్గరకు వెళ్ళి బెడ్ మీద ఉన్న ఆమెను గట్టిగా
హగ్ చేసుకున్నాడు
ఆమె కు స్పృహ రాలేదు
సిద్దు భాధ పడుతున్నాడు నాకారణాం గా నువ్వు జ్వరం పెట్టుకున్నావు నాకు తెలుసు
నువ్వు ఎంత సెన్సిటివ్ అన్నది
సారి రా అంటూ అమే పై ఎంతో హక్కు ఉన్న వాడిలా
హత్తుకుంటూ మనసులో
మాట బైటకు చెప్పుకుంటూ ఉన్నాడు
అంతలో అతడి నుందిటి పై
ఉన్న కుంకుమ రేణువు ఆమె నుదిటిన అంటింది
అంతే అమే టక్కున కళ్ళు
తెరిచింది
అమే ఉన్నది సిద్దు కౌగిల్లో
అన్నది తెలుస్తుంది,,,
ఆమె అయోమయం గా
చూస్తూ ఉంటే ఆమె కళ్ళు
తెరిచింది హమ్మయ్య
అనుకున్నాడు సిద్దు
అతడు ప్రేమగా ఎలా ఉంది రా ఫీవర్ తగ్గిందా అని ఆమెను
విడిచి పెట్ట కుండానే అడిగాడు,,
ఆమె అర్థం కానట్టు చూస్తూ
నేను కల కంటున్నానా
సిద్దు నా బెడ్ రూం లో నన్ను పట్టుకుని ఉన్నాడు
ఇది కచ్చితంగా డ్రీమ్
అనుకుంటూ ఉంటే
సిద్దు నవ్వుతూ కన్నుకొట్టి
ఇది డ్రీమ్ కాదు నిజమే నువ్వు
నేను ఉన్న హాస్పటిల్ కి ఎదో
మాయ చేసి ఒక స్ట్రాంగ్ సిమెంట్ వాల్ నుండి లోపెలికి వచ్చావ్
మరి నీ బెడ్ రూమ్ విండో
లోంచి నేను రాలేనా...????
ఎంటి హు ఇంతకీ ఎలా అలా వచ్చావ్ అని అడిగాడు
అంతే అది డ్రీమ్ కాదు నిజమే .
అని అర్థం అయింది అతడు ఆమెను హాగ్ చేసుకుని
ఉన్నాడు అని భయం గా అమ్మా అంటూ అరిచింది
ఆ అరుపు హాల్లో ఉన్న వాళ్ళు విన్నారు, శ్రావణి శ్రీరామ్ కొంప మునింగింది అన్నట్టు తలలు పట్టుకుంటున్నారు
ఇందు అరవడం చూసి సిద్దు కంగారు పడ్డాడు
ఎం చేయాలి అర్థం కాలేదు,,,
హేయ్ అరవకు మీ వాళ్ళు
వస్తారు అంటూ ఉన్న ఆమె అరుస్తునే ఉంది
అందుకే సిద్దు ఆమె పెదవులు అందుకుని కిస్ చేసాడు
ఆమె షాక్ అయ్యింది
అలాగే అరవలేక పోయింది
కొన్ని క్షణాలు ఆమెను కంట్రోల్ చేశాడు సిద్దు .
అంతలో ఇందు అమ్మగారు అమ్మా ఇందూ ఏమైంది అంటూ
డోర్ ఓపెన్ చేశారు
సిద్దు చాటుగా వచ్చి దాగున్నాడు
అతడు ఇచ్చిన కిస్ కి ఇందు
షాక్ అయ్యి మైండ్ బ్లాక్ అయినట్టు చూస్తూ ఉండిపోయింది,,
ఆమె తల్లి కంగారుగా ఏమైంది నాన్నా అని అడుగుతుంటే
ఆమె ఎదురుగా ధాగుని ఆమెకు కనిపిస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పకు అని సైగ చేస్తున్నాడు సిద్దు,
ఇందు కంట్రోల్ చేసుకుంటూ
ఎం లేదు అమ్మ ఎదో పీడ కల వచ్చింది నేను బాగానే ఉన్నాను అని చెప్పింది
శ్రావణి శ్రీరామ్ కంగారుగా
వచ్చారు వాళ్ళని చూసి ఇందు చిన్నగా నవ్వింది
ఇందు మదర్ దిగులుగా ఇదండీ అమ్మాయి పరిస్తితి ఎప్పుడు పీడకలలు ఏవో దుష్ట శక్తులు వెంట పడటం పుట్టినప్పటి నుండి
భాధ పడుతూనే ఉంది అని
కన్నీళ్లు పెట్టుకుంటు మీరు మాట్లాడుకుంటూ ఉండండి
నేను పాప కి పాలు తీసుకుని వస్తాను అని వెళ్ళింది
ఆవిడ వెళ్ళాక సిద్దు బైటకు వచ్చాడు ఇందు టెన్షన్ గా
శ్రావణి చూడు సిద్దు నా గదిలోకి వచ్చాడు నాన్న వాళ్ళు చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది వీడ్ని వెంటనే వెళ్ళమని చెప్పు
అని మొహం తిప్పుకుంది
సిద్దు ఆమెకు దగ్గరగా వచ్చి
సారి రా
కోపం వచ్చింద నువ్వు అరుస్తుంటే ఎం చేయాలి అర్థం కాలేదు
సరే రేపు కాలేజ్ కి వస్తావు గా అక్కడ మాట్లాడతా ప్లీజ్ నేను చెడ్డవడిని కాదు నామీద కోపం వద్దు బేబీ అని రిక్వెస్ట్ చేస్తూ
మీ మమ్మీ వచ్చేలా ఉంది నేను వెళతాను బై అంటూ ఆమెను తనివితీరా చూసుకుని విండో నుంచి పైప్ లైన్ పట్టుకుని కిందకు వెళ్ళిపోయాడు
ఆమె అతడు వెళ్లే వరకు టెన్షన్ పడుతూనే ఉంది
సిద్దు బైటకు వెళ్ళిపోయాడు, శ్రీరామ్ వాడు చేసిన గొడవ చెప్పాడు అందుకే మేం వచ్చాం
అని విషయం చెబుతుంటే
ఇందు మదర్ పాలు తెచ్చింది
ఇందు గబగబా తాగేసి రేపు కాలేజ్ కి వస్తాగా మాట్లాడుకుందాం
నాకు నిద్ర వస్తుంది నేను బాగానే ఉన్నాను అని బై చెప్పి వాళ్ళని పంపించింది
వాళ్ళు కూడా హమ్మయ్య
అనుకుని వెళ్లిపోయారు.
ఇందు తల్లి ఒడిలో తల పెట్టుకుని సిద్దు చేసిన పని తలచుకుంటూ అయోమయం గా కళ్ళుమూసుకుంది.
సిద్దు ఇందుని కిస్ చేశాను తను ఎలా రియాక్షన్ ఇస్తుందో నన్ను చెడ్డవాడిగా అనుకుని ఇంకా కోపం తెచ్చుకుంటుంది
ఛ నేను కాస్త తొందర పడకుండా ఉండాల్సింది అని ఫీల్ అవుతూ ఉంటే
శ్రీరామ్ శ్రావణి అతడ్ని మీట్
అయ్యి ఇప్పటికీ అయినా తృప్తి పడ్డారు గా సార్ వెళ్లి రెస్ట్ తీసుకోండి లేదో మీ డాడ్ పెద్ద గొడవ చేస్తారు అని పంపించి వాళ్ళు ఇల్లు చేరుకున్నారు.
*"" సిద్దు ఇందు ఒకరికోసం ఒకరు ఆలోచిస్తూ గడిపారు.
*"" నెల్లిపూడి బైలుదేరిన
శివరాం భూషణ్ లు ఊరికి
దగ్గరలో తమ వెహికల్ ట్రబుల్ ఇవ్వడం తో వేరే మార్గం లేక అక్కడి చుట్టు ప్రక్కల వాళ్ళ సహాయం తీసుకున్నారు ఊరి వరకు ఆటో రిక్షా సహాయం తో వెళ్లారు
అక్కడి నుంచి తోర్లం పూడి చేరుకోవాలి అంటే ఒక్కటే మార్గం కాలి నడక దట్టమైన అడవి
ప్రాంతం మీదుగా ఆరు కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాలి
రోడ్ సదుపాయం లేక పోవడం తో ఆ ఇరువురు వాల్ల అనుచరులతో చేరో వైపు నుంచి నడక మొదలు పెట్టారు వాళ్ళకి అక్కడి వాళ్ళు మార్గం చూపుతూ సహాయ పడుతున్నారు .....
వెళుతున్న వాళ్ళకి ఎదో ఆటంకం కలుగుతుంది
విపీరీతమైన దాహం వేయడం ఉన్నట్టుండి ఈదురు గాలి
వీస్తు దుమ్ము రేగి మార్గం
కనిపించక పోవడం కాలికి ఏవో గుచ్చుకోవడం ఇలా అవాంతరాలు కలుగుతూ
ఉదయం పది గంటలకు చేరుకోవాల్సిన వాళ్ళు
మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకో గలిగారు
*"" వాళ్ళు ఆ కోయ దొర గూడెం చేరుకుని ఆయాసం గా ఊపిరి తీసుకుంటు
భూషణ్ శివరాం లు ఒకరి నీ
ఒకరు చూసి షాక్ అయ్యారు
రక్తాలు వచ్చినట్టు ఒకర్ని ఒకరు నరుక్కోవాలి అన్నట్టు ఆవేశ పడుతూ ఉన్నారు.
రెండు వైపులా అనుచరులు
వారిని అదుపు చేస్తూ గొడవ
వద్దు అన్న మనం వచ్చిన పని ఏమిటో చూసుకుందాం
అని నచ్చ చెబుతూ వాళ్ళని
కంట్రోల్ చేసుకుంటూ
పక్కకి తీసుకు వెళ్లారు....
కోయ దొర దగ్గరి మనుషులు వాళ్ళని చేరో పక్కా విశ్రాంతి తీసుకోమని చెప్పారు .
వెంటనే పెద్ద దొర నీ కలవడం కుదరదు అని మిట్ట మధ్యాహ్నం ఆయన మిమ్మల్ని చూడాలి అనుకోరు సాయంత్రం ఆకాశం చల్లబడాలి అందాకా మీరు విశ్రాంతి తీసుకోండి అని వేడుకున్నారు
వాళ్ళు చూపే మర్యాదలు నచ్చి శివరాం భూషణ్ ఇద్దరు చేరో పక్క గుడిసె లోకి వెళ్లి కూర్చుని
వాల్ల మనుషులని
అడుగుతున్నారు
వాడేందుకు ఇక్కడికి వచ్చాడు అంటూ శివరాం అంటుంటే
ఆ భూషణ్ కి ఇక్కడేం పని ఎదో ప్లాన్ లో వచ్చాడు అని అరుస్తున్నాడు, శివరాం
అతడి దగ్గర ఉన్న పనిమనిషి
శాంతి అయన్ని కంట్రోల్ చేస్తూ బాబుగారు ముందు మనం మన సిద్దు బాబు విషయం తెలుసుకుని వెళదాం ఇక్కడ ఎలాంటి
గొడవలు చేయొద్దు
పెద్ద దొర కి కోపం వస్థే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అని
ఆపింది,
భూషణ్ దగ్గర ఉన్న వాళ్ళు అలాగే చెబుతూ ఉన్నారు.
"" సమయం గడించింది.
ఆ ఇద్దరు దొర వద్దకు వెళ్లారు వాళ్ళని మాత్రమే అతడి పూజ మందిరం వద్ద కు రమ్మని చెప్పాడు పెద్ద దొర
ఆ ఇరువురు ఒకరిని చూసి ఒకరు పల్లు కొరుకుతూ బైటకు
వచ్చాక నీ సంగతి చెబుతా అనుకుంటూ వెళ్లి ఆ దొర ముందు కూర్చున్నారు....
అక్కడ ఉన్న పెద్ద దొర వాళ్ళని చూసి చిన్నగా నవ్వాడు
సో ఇప్పుడు అతడు
ఎం చెబుతాడు నెక్స్ట్
అప్డేట్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటె కాస్త వేచి
చూడాలి ఫ్రెండ్స్.
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....
చాలా లేట్ అయ్యింది
అప్డేట్ ఇవ్వడానికి మన్నించాలి....!!!