RA Padmanabharao

Drama

5.0  

RA Padmanabharao

Drama

నిర్భయ జీవితం

నిర్భయ జీవితం

2 mins
483


గురునాధానికి ఉద్యోగం వచ్చి పదినెలలు. బి.టెక్ అత్తెసరు మార్కులతో ఆరేళ్ళ కు పాసయ్యాడు. రెండేళ్ళకు నానా తిప్పలు పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్టార్టప్ కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించిన ఘనత సాధించాడు. నెలకు 20 వేల జీతంతో జీవితంలో సుఖ సంతోషాలను పొందాలంటే భయం.

' అంతకన్నా ఊబర్ డ్రైవరు ఎక్కువ సంపాదిస్తారు గదరా గురూ!' అని బావగారు వేళాకోళం చేశారు

ఇన్నాళ్లకు ఇన్నేళ్ళు వచ్చాక ఆ ఉద్యోగం అయినా వచ్చిందని తల్లీదండ్రులు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్ళి జరిపించారు

ఆవిడకి ఇన్ఫో సిస్ లో జీతం ఎక్కువ.అయినా భయం లేకుండా ఎలా నో పెళ్లి చేసుకున్నాడు

మూడు రాత్రుల ఏకాంతంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ భయంగా గడిపేశారు

హనీమూన్ కోసం సెలవు అడిగితే తన ఉద్యోగం పోతుందని భయం.

భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకు తెరువు కొనసాగిస్తా?రని భార్య గొడవ పడి సెలవు పెట్టించి సిమ్లా కెళ్ళారు

సిమ్లాలో మాల్ రోడ్డు పై చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సమయంలో కూడా గురూకి భయంగా ఉంది

వారం తర్వాత వెళితే ఉద్యోగం ఊడుతుందని భయం.

సిమ్లా నుంచి రాత్రి పదింటికి ఢిల్లీ లో దిగి తుగ్లక్ రోడ్ లో బావగారి ఇంటి కెళ్ళారు

ఆ ఉదయం టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు

గురూ! నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది. కానీ ఇంకా బాలికలపై లైంగికదాడి జరుగుతూనే ఉంది.కారణం ఏమిటి?

అని ప్రశ్నించారు బావగారు.

పొద్దున్నే లేచి నిర్భయ ఎందుకు గుర్తు వచ్చింది బావా! అని వేళాకోళం గా అన్నాడు గురునాధం

ఏం లేదు. నీ లాంటి వాళ్ళు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందా?అని భయపడకుండా నిర్భయ ఉద్యోగ చట్టం వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే లా మా యం.పి గారికి చెబుతాను! అని నవ్వుతూ అన్నాడు బావ.

మా తమ్ముణ్ణి పొద్దు పొద్దున్నే ఆటపట్టిస్తున్నారని అక్కయ్య వత్తాసు పలికింది

మర్నాడు ఉదయం పూట తిరుగు ప్రయాణం చేసి హైటెక్ సిటీ లో ఆఫీస్ కెళ్ళాడు భయంగా గురు.

పంచ్ చేస్తే కార్డు యాక్సెస్ కాలేదు

మేనేజర్ ఫోను ఎంగేజి.

హెచ్.ఆర్.డి వాళ్ళు -మీరు ప్రొబేషనరీ. పది రోజుల పాటు రాలేదు. రోల్స్ లో ంంంంచి తీసివేశామన్నారు

భయం నిజమైంది

మరో మంచి ఉద్యోగం వస్తుంది లెండి! అని భార్య ఓదార్చిoది.

మూడు నెలల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో తన జీవితంలో సుఖ మనేది లేదనే భయం వేసింది గురూ కి

ఆఫీసు నుండి తిరిగి వచ్చిన భార్య మీకో గుడ్ న్యూస్ అంటూ, మీరు నాన్న గారు కాబోతున్నారు అని చెప్పి స్వీట్ నోట్లో పెట్టింది

భయపడుతూ ఉంటే ఇలాంటి ప్రమాదం తప్పదు! అని సరిపెట్టుకున్నాడు

ఆరోజు రాత్రి సిమ్లాలో షికారు చేయడం మరిచితప్పున చీకటి తప్పు చేసిన విషయం గుర్తు కొచ్చింది.భార్యను నిరోధించలేదు

నిర్భయ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ భగవంతుని లీలలు అని నమ్మాడు

పండంటి కాపురం లో పండంటి బిడ్డ పుట్టగానే తన జీవితంలో సుఖ సంతోషాలతో పాటు మరో ఉద్యోగం వచ్చి తలుపు తట్టింది

పిల్లాడికి విక్రమార్క అని పేరు పెట్టాడు పట్టు వదలని విక్రమార్కుడు గురునాధం

బావగారి భేతాళ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.

70 ఏళ్ళ రాజ్యాంగ నిర్మాణ సంవత్సరం సందర్భంగా నిర్భయ జీవితం అనే చట్టం తీసుకురావాలని బావకి ఫోన్ చేశాడు గురునాధం


Rate this content
Log in

Similar telugu story from Drama