RA Padmanabharao

Drama


4  

RA Padmanabharao

Drama


నాహంకర్తా హరిఃకర్తా!

నాహంకర్తా హరిఃకర్తా!

2 mins 377 2 mins 377

నేను రుషీవ్యాలీ స్కూలు నుంచి ప్యాసయి వచ్చి ఖరగ్ పూర్ ఐ.ఐ.టీలో ఎం.టెక్ చేసే నాటికి మానాన్న రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం జాతీయ పార్టీల మధ్య సృష్టించిన ఖ్యాతి గడించారు.మూడు మార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మాఇంటి లో అనేకమార్లు డిన్నర్ కొచ్చారు

మా తాతగారు వంశీ కృష్ణ మోహన రావు గారికి బ్రిటిష్ ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ప్రదానం చేశి సత్కరించింది

మాది జమీందారు కుటుంబం. దానధర్మాలు చేయడం వల్ల మా నాయనమ్మ కు మంచి పేరు.

ఈ నేపథ్యంలో పెరిగిన నేను మూర్తీభవించిన అహంకారం అనే బిరుదు తెచ్చుకుని జీవితంలో తొలి అడుగు వేశాను

ఇంజనీరింగ్ పూర్తి కాగానే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ జరుగుతోంది

మానాన్న కది ఇష్టం లేదు. ఒకరి దగ్గర చేతులు కట్టి నిలబడి జమీందారు బిడ్డ బ్రతకడం నాకిష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పారు

నాలో అహం దెబ్బతింది. నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని ఎదిరించి పోరాడాను

ఆయన నాకంటే ఆరు ఆకులు ఎక్కువ చదివారు గా!

ఈ జమీందారు కుటుంబం నుంచి దూరం గా వెళ్లి నీజీవనపోరాటం కొనసాగించాలి! అన్నారు

మా తల్లిగారు ' వాని బ్రదుకు వాని కొదిలివేయండి! అని నన్ను సమర్ధించారు

ఇది తండ్రీకొడుకుల మధ్య అహం దెబ్బతినే అంశం! మహా రాణి గారు ఇందులో తలదూర్చి మా వంశప్రతిష్ఠను మంటలో కలుపు తున్నారు!

అంటూ తన పట్టుదల వదులు కోలేదు

పెళ్లి చేయడం, కోడలిని మన దేవిడీలోకి సగౌరవంగా ఆహ్వానించడం నా బాధ్యత! తమరు కఠినంగా వ్యవహరించాలని చూస్తున్నారు! నేనూ

జమీందారీ వంశం నుండి వచ్చిన దానిని. అది తమరు నిద్ర లో కూడా మరిచిపోకూడదు! అని తల్లిగారు నిష్కర్షగా చెప్పేసింది

మీ యిద్దరూ నాకోసం ఘర్షణ పడం నా కిష్టం లేదు! నేను అమెరికా వెళ్ళిపోయి నా బ్రతుకు తెరువు కొనసాగిస్తాను! అని మరుసటి నెలలో చికాగో

వచ్చి మిత్రుడు సుధాకర్ సాయంతో ఇంజనీర్ గా పని చేయడం మొదలుపెట్టాను

అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఆమె దుఃఖాన్ని తగ్గించే మార్గాలు వెదికాను. నాన్నగారు మాటపట్టింపుల కెళ్ళి ఫోన్ రెండు సార్లు తీయలేదు.

నేను ఆయన కొడుకు ను గదా! ఫోన్ చేయడం మానేశాను

అమ్మ పెళ్ళిప్రస్తావన చాలాసార్లు చేసి విఫలమై ంంంంది

చల్లపల్లి జమిందారు గారు తమ మనవరాలిని నీ కిస్తామని కబురు పంపారు. అమ్మాయి కుందనపు బొమ్మ. తానూ ఎం.టెక్ చేసి ఇన్ ఫో సిస్లో

అమెరికా లో పని చేస్తూ వుంది. నీకు నచ్చితే చేసుకో మని రెండు మూడు సార్లు ప్రాధేయపడింది

అమ్మా! జమీందారీ వంశం లో వాళ్ళకు నీకు లాగా పట్టుదల ఉంటుంది! నేను మీకొడుకునేగా! నా అహాన్ని సహించే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇక్కడే చేసుకుంటాను. అక్కడ చేసుకున్నా నాన్నగారు రారు. అని ఖరాఖండిగా చెప్పాను

ఔను బాబు! పెళ్లిళ్ళు మన చేతుల్లో లేవు.అంతా ఆ భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అందుకే

నాహంకర్తా హరిఃకర్తా! అన్నారు పెద్దలు అని అమ్మ ఫోన్ పెట్టేసారుRate this content
Log in

More telugu story from RA Padmanabharao

Similar telugu story from Drama