వనమిత్ర సహదేవ
వనమిత్ర సహదేవ


హైస్కూల్ మైదానంలో అసెంబ్లీలో హెడ్ మాస్టర్ సహదేవుడు పిల్లలు ఎలా నడుచుకోవాలో చెబుతున్నారు
చెట్టు తనను నరికేవాడికికూడా నీడనిస్తుంది. గొడ్డలి పట్టుకునే కర్రకూడా చెట్టుదే!
మీరంతా చెట్లను పాడుచేయమని ప్రతిజ్ఞ చేయిస్తాను.నేను చెప్పినట్లు మీరూ పలకండి:
ఓ వృక్షరాజమా!
పిల్లలందరూ కలిసి _ ఓవృక్షరాజమా! అని గట్టిగా పలికారు
మాకు నీడనిచ్చి గూడు నిచ్చి కూడు పెట్టే నీవు భూలోకంలో కల్పవృక్షం వంటి దానివి.మా జీవనాధారం. నీ రక్షణకు మేం ప్రతిన చేస్తున్నాం.
సహదేవుడు సంతోషంగా జనగణమన గీతాన్ని ఆలపించారు
సహదేవుడు అదే స్కూల్లో టీచర్ గా 20 ఏళ్ళు పనిచేసి జనవరిలో అక్కడే హెడ్ మాస్టర్ అయ్యారు
ఇటీవల కాలంలో రేడియో లో ప్రధాన మంత్రి మోడీ ప్రతినెలా మన్ కీ బాత్ లో చెప్పే సందేశం విని ప్రభావితం అయి స్కూల్ విద్యార్థులకు మంచి మాటలు
చెప్పి ఉత్సాహం నింపుతున్నారు. ఆదివారం 11 గంటలకు స్పెషల్ క్లాస్ పెట్టి ఆ రోజు ప్రధాని ప్రసంగం అనంతరం అందులో అంశాలు ఒక్కో విద్యార్థిచేత
వివరంగా మాట్లాడిస్తున్నాడు
సాయంకాలం వేళ స్కూలు ఆవరణలో చెట్లకు నీళ్లు పోసి పెంచే పని అప్పగించారు
శనివారం ఒక్కో విద్యార్థిచేత ఊళ్ళో ఒక చెట్టు నాటిస్తున్నారు
ఊళ్ళో యువకులు సైతం వినూత్న ఆలోచనలకు అనుగుణంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఊరి నానుకొని ఉన్న అడవిలో చెట్లు వంటచెరకు కోసం కొట్టడం మాన్పించి ప్రధాని పధకం ద్వారా గ్యాస్ సిలిండర్ల సౌకర్యం కల్పించారు
పాండవుల లో సహదేవుడు గుర్తుకొచ్చాడు ఊళ్ళో వాళ్ళకు
ఆయన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా జిల్లా అంతటా వ్యాపించి కలెక్టర్ స్వయంగా ఆ స్కూల్ కొచ్చారు
మీస్కూలుకు ఏం కావాలి మేష్టారు! అని అడిగారు
స్కూలు పక్కనేవున్న
పెద్ద చెరువు లోకి పక్కనే ఉన్న ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ పదార్థాలు వదలకుండా ఆర్డర్ వేయించ మన్నాడు
ఆఫ్యాక్టరీ జిల్లా పరిషత్ చైర్మన్ గారిది.
కలెక్టర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
త్వరలో ఆయనతో మాట్లాడి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు
గ్రామస్తులు ఆమహమ్మారినుండి కాపాడమని వేడుకున్నారు
సహదేవుడు పట్టు వదలని విక్రమార్కుడు.రెండు నెల రోజుల్లో రికార్డు సృష్టించి ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూతపడే లా చేశాడు
ఆయనను బదిలీ చేయించాడు ఆ ఫ్యాక్టరీ పెద్ద మనిషి
ఉద్యోగికిని దూరభూమి లేదని సహదేవుడు వెళ్లి పోయారు
########
ప్రధాని ప్రసంగం లో చెప్పిన ప్లాస్టిక్ వ్యర్ధాలు అనే అంశంపై ఆయన ఆ కొత్త స్కూలు పిల్లలకు అసెంబ్లీ లో చెప్పారు
స్కూలు అయిపోగానే విద్యార్థులు వీధుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరి , వాటి ని తగలపెట్టేవారు
అది మేజర్ పంచాయతీ. సర్పంచ్ కుర్రవాడు. తన పారిశుద్ధ్య సిబ్బందిచేత శ్రధ్ధగా పనిచేయించి ఆదర్శగ్రామంగా జిల్లాలో బహుమతి పొందాడు
ఊళ్ళో చాటింపు వేయించాడు
కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరి పంచాయతీ ఆఫీసు కు తెచ్చి ఇస్తే వారికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడం ద్వారా ఇది సాధ్యపడింది
సహదేవుడు సంతోషంగా తన పని తాను చేసుకుంటూ పరీక్షా ఫలితాలు నూటికి నూరు శాతం సాధించారు
కేంద్ర ప్రభుత్వం వనమిత్ర ప్రకటించింది
అంతకు ముందు పనిచేసిన ఊళ్ళో ఘనసన్మానం చేశారు
రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం తీసుకుని వచ్చిన సహదేవుడు స్కూలు అసెంబ్లీ లో దానిని చూపించి, ఇది మీ అందరూ సహకారం అందించి నందున
వచ్చింది _ అని కండువా తో కన్నీళ్లు తుడుచుకుంటూ నిలుచున్నారు
సహదేవుడు మేష్టారు కి జై అంటూ పిల్లలు చప్పట్లు కొట్టారు