RA Padmanabharao

Tragedy

5.0  

RA Padmanabharao

Tragedy

సహస్ర చంద్ర దర్శనం

సహస్ర చంద్ర దర్శనం

2 mins
686


మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా అని పురోహితులు మంత్రం చెబుతున్నారు

రఘురామయ్య సీత మెడలో మూడు ముళ్లు మూడోసారి వేశారు లాంఛనంగా.

సీతారాముల కళ్యాణం చూతము రారండి అన్నట్లుగా బంధు మిత్రులు అందరూ వచ్చారు

కొడుకులు, కోడళ్ళు,మనవలు,మనవరాండ్రు సంబరంగా జరుపుకునే సహస్ర చంద్ర దర్శనం ఆపల్లెలో ఊరందరికీ పండుగ వాతావరణం.

రఘు రామయ్య, సీతమ్మ ఆఊర్లో అందరికీ తలలో నాలుకలా వుంటారు

వారికి షష్టి పూర్తి,సప్త్తతి పూర్తి లోగడ కొడుకులు ఇద్దరు ఘనంగా నిర్వహించారు

అమ్మా నాన్నల రుణం తీర్చుకునే అవకాశం వచ్చి ఇప్పుడు 82 ఏళ్ళు నిండాయి. సహస్ర చంద్ర దర్శనం ఆపల్లెలో మూడు రోజుల పెళ్లి లా చేశారు

బంధువులు స్నేహితులు వెళ్ళిపోయారు

పెద్దకొడుకు హరి ఢిల్లీ లో, చిన్నోడు గిరి హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు

సెలవు పెట్టి వచ్చారిద్దరు కొడుకులూ

అమ్మా నాన్నల ప్రేమను పంచుకున్నారు ఇద్దరూ

హరి మీద నాన్న కు, గిరి మీద అమ్మకూఅధిక ప్రేమ

ఇద్దరి నీ ఢిల్లీ రమ్మన్నాడు హరి. పెద్దవాళ్ళు అయ్యారు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని బలవంతం చేశాడు

గతస్మృతులుహరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి

తనకు పదేళ్ల వయసులో డెంగ్యూ ఫీవర్ వచ్చి నప్పుడు అమ్మ నిద్రాహారాలు మాని కంటికి రెప్పలా కాపాడింది

తాను ఇంజనీరింగ్ కాలేజీలో యూనియన్ గొడవ ల్లో చదువు చట్టుబండలు చేసినప్పుడు నాన్న గీతోపదేశం తన దృక్పథం మార్చి వేసింది

ప్రేమ పెళ్లి గురించి నాన్నకు తనకు రెండేళ్ళు మాటలు లేవు.అమ్మ మధ్యవర్తిత్వం ఫలించి పెళ్లి తన ఇష్ట ప్రకారం సుగుణ తో జరిగిపోయింది

కానీ పెద్ద కోడలికి, అత్తగా రికీ ఏవో చిన్న మాట పట్టింపులు. రాకపోకలు తగ్గాయి. చుట్టపు చూపు గా ఢిల్లీ వచ్చి మా కిక్కడ ఏం తోస్తుంది రా

అని వారం తిరగ్గానే రైలు ఎక్కేస్తారు

నాన్న కు యూరిన్ ప్రాబ్లం వచ్చింది. ప్రాస్టేట్ ఆపరేషన్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేసినప్పుడు గిరి సెలవు పెట్టాడు

పొలం అమ్మి కొడుకు లిద్దరికీ చెరో పది లక్షలు బ్యాంకు ఖాతా ల్లో జమచేశాడు నాన్న

మీరు మూడో భాగం వుంచుకోవాలి గదా! అన్నాడు చిన్నోడు

మీరు ఉన్నారు గా! మాకు దిగులెందుకు? అన్నాడు తండ్రి

రెండు మూడు సార్లు హరి వాళ్ళను ఢిల్లీ రమ్మన్నాడు

పల్లెలో ఉంటామని ఉండిపోయారు

గిరి వాళ్ళను హైదరాబాద్ లో పదిరోజులు వుంచుకొన్నా వాళ్ళు పల్లెతల్లివొడిలో కన్నుమూస్తామని వెళ్లి పోయారు

వాళ్ళిద్దరూ పట్టుదల మనుషులు! అని దీర్ఘాలు తీసింది చిన్న కోడలుRate this content
Log in

Similar telugu story from Tragedy