RA Padmanabharao

Tragedy

5.0  

RA Padmanabharao

Tragedy

నీవు లేని నేను

నీవు లేని నేను

2 mins
535


రాధా!రాధా! అంటూ అర్ధరాత్రి దాటాక పలవరిస్తూ లేచాడు చలపతి

రాధా! కొంచెం మంచినీళ్లు ఇవ్వు! అంటూ భార్యను లేపాడు

పక్కమీద ఆమె కనిపించలేదు. బాత్రూం లోకి చూశాడు. లేదు. లేచి కూర్చున్నాడు.

గుండెజారి పోయింది. సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెట్టుకొని ఫ్రిజ్ లో నుంచి బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి సోఫా లో కూర్చున్నాడు

పక్క ఇంటిలో ఉండే కొడుకు సుందరానికి ఫోన్ చేద్దామని లేచాడు. తొట్రుపాటు లో పడబోయి సోఫా లో కూర్చున్నాడు

చలపతి ఆఊళ్ళో పెద్ద డాక్టర్. 50 ఏళ్ళ క్రితం ఆ కుగ్రామంలో ప్రాక్టీస్ పెట్టాడు

తిరుపతి లో యం.బి.బి.యస్ చేసి సొంత ఊరికి సేవచేయాలని హాస్పిటల్ లోకల్ యం.యల్.ఏ. చేతుల మీదుగా ప్రారంభం చేయించాడు

బెడ్ మీద పడుకొన్న చలపతికి ఇటీవల సంఘటన లు గుర్తు కొచ్చాయి

తన భార్య రాధా కుమారి సరిగ్గా 13 రోజు లకింద చనిపోయింది

ఉగాది రోజున తలస్నానం చేసి కొత్త పట్టు చీర కట్టుకుని ముఖానికి, కాళ్ళకు పారాణి పూసుకుని బొట్టు పెట్టుకుని

పక్క వీధిలో రామాలయానికి వెళ్లి వచ్చింది

భర్త కాళ్ళకు నమస్కరించి రోజూ తాను కూచునే బుట్ట ఉయ్యాల లో ఊగుతూ కూచుంది

చలపతి విష్ణు సహస్రనామ స్తోత్రం పెద్దగా చదువు తున్నారు

మడితో వంటమనిషి తెచ్చి పెట్టింది కాఫీ.కుర్చీలో కూచొని ఒక సిప్ చేసి, ఏమండీ! అని గట్టిగా పిలిచింది

చలపతి హడావిడి గా లేచి వచ్చి చేయిపట్టుకుని పల్స్ చూశాడు

ఎంత పనిచేశావు భగవాన్! అంటూ కుప్ప కూలాడు

కొడుకు కూడా డాక్టర్. కబురంది పరుగు పరుగున వచ్చి చేయిపట్టుకుని పల్స్ చూశాడు

అమ్మ హార్ట్ ఎటాక్ తో పోయిందని గొల్లున ఏడ్చాడు

చలపతిని నర్సింగ్ హోం లో చేర్చారు. సాయంకాలం వేళ ఆయన కుదుట పడ్డాక రాధా కుమారి శవదహనం చేశారు

ఊరు ఊరంతా కదిలివచ్చి అశ్రునయనాల తో నివాళులర్పించారు

కర్మక్రతువులు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజు ఊరందరికీ బంతి భోజనాలు పెట్టారు

12 రోజులు కాగా నే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోయారు

ఈరోజే చలపతికి ఒంటరి రాత్రి. ఆ విషయం గుర్తు కొచ్చింది

రాధా! అంటూ భార్య ఫోటో దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు

బెడ్ మీద పడుకొన్న చలపతికి గతం గుర్తుకు వచ్చింది

రాధతో పెళ్లి అయి శోభనం రోజు ఆమె గదిలో కొచ్చిన రోజు గుర్తు కొచ్చింది

అప్పటి కామెకు 18 సంవత్సరాలు నిండాయి.

గదిలో కొచ్చిన రాధ బెడ్ మీద ముభావంగా కూచుంది

చలపతి ముద్దు పెట్టాడు. ఊరు కుంది.

పడుకొందా మన్నాడు. ఊహూ! అంది.

ఇష్టంలేని పెళ్లి చేశారా! అన్నాడు.

లేదు.లేదు! అని అతని నోరు మూసింది

చలపతి గాఢంగా హత్తుకుంటూ ముద్దు పెట్టాడు

ఆమె సైకాలజీ ఫ్రిజిడిటీ పసిగట్టి కధలు చెప్పనా! అంటూ మొదలుపెట్టాడు

సుభద్రను అర్జునుడు ఎలా లాలించాడో తొలి అడుగు లు ఎలా వేశాడో కళ్ళకు కట్టేలా వర్ణించాడు

వ్యాసుడు అంబికను సంగమిస్తే ఆమె కళ్ళు మూసుకుని పడుకుందన్నాడు

ఇవన్నీ నాకెందుకో! అని బుంగమూతి పెడుతూ అంది

ఇంతలో కెవ్వు మని కేక్ వేసి భర్తను గట్టి గా కౌగలించుకొని వొణికి పోయింది

గోడమీద రెండు బల్లులు ఒకదానికొకటి దగ్గరగా చేరి రాధా కుమారి వైపు చూస్తూ ఉన్నాయి

ఆవిడకి బల్లి అంటే భయం.

పక్కమీద పడుకున్నారు ఇద్దరూ. కొత్తదంపతులకు తెల్లవారిందని తెలియనే లేదు

గతంగుర్తు కొచ్చి చలపతి చలించిపోయాడు

రెండూ ఒంటరి రాత్రులే! అయినా ఎంత మాయ! అనుకొంటూ ఫోన్ చేద్దామని లేచాడుRate this content
Log in

Similar telugu story from Tragedy