alekhya eluri

Drama

2  

alekhya eluri

Drama

ఇల్లాలి ప్రేమ...

ఇల్లాలి ప్రేమ...

4 mins
11.8K


అర్ధరాత్రి...ఒంటిగంటైనా తన భర్త అయిన ప్రేమ్ రాలేదని గేట్ బయటకు వచ్చి ఎదురుచూస్తుంది వెన్నెల...


అతని ఫోన్ కి చేస్తుంటే కలవడం లేదు...ఎప్పుడు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే మనిషి ఇంకా రాలేదు ఏంటా అని ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ఆఫ్ వచ్చింది...ఇక తప్పక భయం వేసి ప్రేమ్ కొలీగ్ కి ఫోన్ చేస్తే ఎప్పటిలానే ఆఫీస్ క్లోజింగ్ టైం కి బయలుదేరాడు...కంగారు పడొద్దు ...ఏమన్నా పని ఉండి ఆగిపోయాడేమో అని చెబితే ఇంకొంచెం సేపు ఎదురుచూద్దాం అని ఆగింది...


అలా ఎదురుచూస్తే పన్నెండు అయ్యింది...ఇక భయంగా ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతూ అలాగే ప్రేమ్ రాక కోసం ఎదురుచూస్తుంది...


తనకి ఏమి కాకూడదు అని వేల దేవుళ్ళని ప్రార్థిస్తుంది...కళ్ళుమూసుకుని...


ఇంతలో తన మొఖం మీద బైక్ లైట్ పడితే కళ్ళు తెరిచి చూసి ఆనందంగా ఏవండి అంటూ ఎదురువెళ్లింది...


ఆ సమయంలో వెన్నెలను అక్కడ చూడగానే షాక్ అయ్యి...బైక్ ఆపి కిందకి దిగి చెంపపై కొట్టాడు...


బుద్ది ఉందా...నీకు యీ టైం లో ఇక్కడ ఒంటరిగా...ఎందుకు ఉన్నావు...



అంటే మీరు రావడం ఆలస్యం అయ్యింది...పైగా ఎపుడూ ఇంత లేట్ అవలేదు...మీ మొబైల్ స్విచ్చాఫ్ వస్తుంది అందుకే...మీకోసం ఎదురుచూస్తూ ఇక్కడే ఉన్నాను..అంది కళ్లల్లో నీళ్లు జల జల రాలుతుంటే...



అయితే మటికి వచ్చేస్తావా...నేను మగాడిని నాకేం కాదు...నువ్వు ఆడదానివి ఇలా అర్ధరాత్రి బయట ఎంత ప్రమాదమో నీకు తెలుసా...పద లోపలికి అంటూ కసిరాడు...


ఇద్దరూ లోపలికి వచ్చారు...


ఏమన్నా తిన్నారా...


తిన్నాను.అనుకోకుండా..నా డిగ్రీ క్లాస్ మేట్ వస్తే వాళ్ళతో డిన్నర్ కి వెళ్ళాను...వాళ్ళతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు...నీకు ఇన్ఫోర్మ్ చేద్దామనుకునేసరికి మొబైల్ స్విచ్చాఫ్ అయ్యింది...ఇంక నీ నెంబర్ నాకు గుర్తులేదు అందుకే చేయలేదు...


ఏమి మాట్లాడలేదు వెన్నెల...


ఏంటి నమ్మడంలేదా...



అలా ఏమీ లేదు...


తెలుసు..నాకు తెలుసు నువ్వు నమ్మవని...ఇదిగో మొబైల్ ఛార్జింగ్ లో పెడుతున్న ఆన్ చేసాక వాళ్ళ నెంబర్ కి ఫోన్ చేసి కంఫర్మ్ చేసుకో..మనఃశాంతిగా ఉంటుంది...


అయ్యో...నేను నమ్మనని మీరు ఎందుకు అనుకుంటున్నారు...


ఎందుకా...నా కొలీగ్స్ లో ఇద్దరి ఆడవాళ్ళని అనుమానించి..అవమానించావుగా అందుకు...



మీకు చెప్పా కదండీ...వాళ్ళు ఏమాత్రం పరిచయం లేని నాతో మన బెడ్ రూమ్ విషయాలు అడిగితే అది ఫాస్ట్ కల్చర్ అని సరిపెట్టుకోవాలా నేను...అండ్ మాట్లాడితే నోట్లో నుంచి అన్ని వ్యగంగా మాట్లాడడమే నాకు నచ్చక అవాయిడ్ చేసినా నన్ను ఎదో ఒకటి అంటుంటే కొంచెం గట్టిగా సమాధానం చెప్పాను...అది తప్పా...


తప్పు కాదు..నిన్ను..చేసుకోవడమే నా తప్పు...ఏ ముహూర్తాన నీ మెడలో తాళి కట్టానో కానీ ఆ రోజు నుండి నరకం చూస్తున్న...కాసేపు నీ ప్రేమతో,ఇంకాసేపు నీ పోసిసివ్ నెస్ తో నాకు ఊపిరి ఆడనివ్వడంలేదు నువ్వు..నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతకనియ్యి తల్లి అని దండం పెట్టాడు..


ప్రేమ్ ప్రవర్తనతో వెన్నెల మనసు గాయపడింది...


ఆరోజు మొదలు ...వెన్నెల ప్రేమ్ తో మాట్లాడం తగ్గించేసింది...ఏదన్నా అవసరం వరకే మాట్లాడుతుంది...టైం కి అతనికి ఏమి కావాలి సమకూర్చి పెట్టడం వరకే చేస్తుంది...అంతకు మించి మాటలు లేవు వాళ్ళ మధ్య...


ప్రేమ్ కి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లుగా ఆనందపడ్డాడు...వెన్నెల మౌనాన్ని చూసి బాగానే కంట్రోల్ లో పెట్టాను అనుకున్నాడు...


పడక గదిలో వాళ్ళ మధ్య సాన్నిత్యం కూడా కరువైంది...



ప్రేమ్ జీవితంలో తను కోల్పోయాననుకున్న సరదాలు..స్నేహితులు అందరూ తిరిగి వచ్చారు...


రెండు నెలలు ఆనందంగా గడిచింది...



ఒకరోజు ప్రేమ్ స్నేహితులు అందరూ వాళ్ళ పెళ్ళాలు గురుంచి మాట్లాడుకుంటున్నారు...


ఒకరు నా పెళ్ళాం..నేను ఇంటికి వచ్చేసరికి టీవీ ముందు నుంచి లేవదు సరికదా తనని పట్టించుకోదు అని,


సరేలే...ఇంకా మీ ఆవిడ టీవీ దగ్గర అన్నా ఆగింది...మా ఆవిడ ఉంది 24 గంటలు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుంది...ఎం ఉంటుందో అంత మాట్లాడుకోడానికి నాకు అర్థం కాదు ఇక నాకు కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు అని ఇంకొకరు...


మీ పెళ్ళాలు చాలా బెటర్..నా పెళ్ళాం ఊరికి ముందు సంఘ సేవ అంటుంది ఇంట్లో మొగుడ్ని వదిలేసి అని ఇలా చెప్పుకుని నవ్వుకుంటు...


ఎంతన్న మన ప్రేమ్ అదృష్టవంతుడు...అతని భార్య వాడిని ఎంత ప్రేమగా చూస్కుంటుందో...మీకు గుర్తు ఉందా వాడు మనల్ని లంచ్ కి ఇన్వైట్ చేసినపుడు ఆవిడ ఎంత బాగా మర్యాదగా మనతో ఉంది...ఇంకా మనల్ని మర్యాద చేస్తూనే ప్రేమ్ కి ఏమి కావాలో ఒక కంట కనిపెడుతూ జాగ్రతగా చూసుకుంది...ఎంతో ప్రేమ ఉంటేనే అలా ఉంటారు అన్నారు ఒకరు...


సర్లే...ఆ ప్రేమని మన వాడు అనుమానం,అతి ప్రేమ అని చెప్పుకుని తెగ బాధపడిపోతాడు...


లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే..ఉండి ఇదిగో ఇలాంటి ఇలా ఉంటారు..ఏం చేస్తాం అంతా విష్ణు మాయ అని నవ్వుకున్నారు...


వెన్నెల రూపం కళ్ల ముందు కనపడింది...అంతే ఆగకుండా తనకోసం ఇంటికి పరుగుపరుగున వెళ్ళాడు...




కాలింగ్ బెల్ కొట్టాడు...


వెన్నెల వచ్చి డోర్ తీసింది...


ప్రేమ్ పలకరించే లోపే తల దించుకుని లోపలికి వెళ్ళింది...


ఇదివరకు అయితే ప్రేమ్ రాగానే నవ్వుతూ ఎదురువచ్చి మంచినీళ్లు ఇచ్చి కాఫీ కావాలా అని అడిగే వెన్నెల ..ఇపుడు మౌనంగా వెళ్లిపోవడం తనకి బాధకలిగించింది...


అయినా కూడా బాధపడకుండా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి తన కోసం ఎదురుచూస్తుంటే టిఫిన్ ,కాఫీ తెచ్చి టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయింది...


ప్రేమ్ కి చాలా కోపం వచ్చింది..కానీ ఆపుకున్నాడు...తనేగా రెండు నెలల నుంచి అక్కడ పెట్టు అని వెన్నెలకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉన్నాడు...


బయటకు వచ్చి టీవీ చూస్తూ వెన్నెల ని అబ్సెర్వ్ చేసాడు...


యీ మధ్య వెన్నెల చాలా చిక్కి పోయింది...మొఖం లో ఇది వరకు కళ లేదు నా వల్లే అనుకుంటూ తిట్టుకున్నాడు..ప్రేమ్..


వెన్నెలతో మాట్లాడడానికి,టైం స్పెండ్ చేయడానికి ట్ర్య్ చేసిన వెన్నెల చాలా తక్కువ రెస్పాండ్ అయ్యేది...


ఒకరోజు ఏదో పని ఉంది...కబోర్డు ఓపెన్ చేస్తే అందులో మెడికల్ ఫైల్ ఉంది..ఏంటా అని చూసాడు...


వెన్నెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఉంది అందులో...నాకు చెప్పలేదు ఎందుకు నిలదీయాలి అని అనుకుని ఎందుకో ఒకసారి డేట్ చెక్ చేసాడు...అది తను వెన్నలని చేయి చేసుకున్న రోజు...


బాధేసింది ప్రేమ్ కి...పిచ్చిది నాకోసం ఎదురు చూసి కంగారు పడి ఉంటుంది...ఎంత బాధపెట్టాను అని వెన్నెల దగ్గరికి వెళ్ళాడు...


హాస్పిటల్ కి వెళ్దాం...రెడి అవ్వు...



వెన్నెల కి అర్థం అయ్యింది ప్రేమ్ కి తెలిసింది. అని..


పరవాలేదు..నేను ఆల్రెడీ చెక్ అప్ చేయించుకున్నా...మళ్ళీ 15 డేస్ తరువాత వెళ్ళాలి...మీకు అపుడు టైం ఉంటే మాకోసం వద్దురుగాని...


నీకోసం,మన బిడ్డ కోసం నాకు టైం ఎందుకు ఉండదు...అన్నాడు కోపంగా...


నేను అలా అనలేదు..ఇప్పటి నుంచే వీడు కూడా నాలాగే మిమల్ని సతాయిస్తాడు అని అంటున్న...మీకు ఇబ్బంది కలగకూడదు అని...


అందుకని నా బిడ్డకు నన్ను అపరిచితుడిలా ఉంచుతావా...


అయ్యో..మీరు అపరిచితుడు ఏంటి...మీరు మాకు తెలుసున్న అపరిచితుడు..కదా...కాబట్టి మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ ఏమి ఉండదు లెండి...


వెన్నలని కోపంగా చూస్తూనే...తన బొజ్జను ప్రేమగా తడిమి చూడు కన్నమ్మ మీ అమ్మ ఏమంటుందో...నేను అపరిచితుడుని అంట...నాన్నని ఎలా అంటుందో...నువ్వు తొందరగా పెద్ద అయిపోయి బయటకు వచ్చేయి...అమ్మ పని చెబుదాం అని సోరి రా...అంటూ వెన్నలని హాగ్ చేసుకున్నాడు...


యహే...పో...నీ సోరి నేను ఒప్పుకోను...


సర్లే...తప్పు చేసాగా..పనిష్మెంట్ ఇచ్చేయి...


అయితే...వెన్నెల సోరీ అంటూ 100 గుంజిళ్ళు తీయండి...


అయ్యబాబోయ్...100...నా వల్ల కాదు...


అయితే సరే...100 పక్కన ఇంకో సున్నా కలిపి 1000...


హి..హి...ముందుదే కంఫర్మ్ చేసుకో బంగారం...అంటూ స్టార్ట్ చేసాడు...


ఒక పది గుంజిళ్ళు తీసాక వెన్నెల దగ్గరికి వచ్చి లేవండి అంది..


ఇంకా అవలేదు...


ఇంకెప్పుడన్నా...నా ప్రేమ అతి ప్రేమ అంటారా...


చచ్చినా అనను...అంటూ లెంపలు వేసుకుంటుంటే...


రెండు చేతులతో ఆపి ప్రేమ్ ని హాగ్ చేసుకుంది వెన్నెల...


Rate this content
Log in

Similar telugu story from Drama