దీపావళి రంగుల పండగ
దీపావళి రంగుల పండగ


చుంచు బుడ్డీల సుందర దీపావళి
వెన్నముద్దల వెన్నెల దీపావళి
పీకముక్కల బర్మాలు
కుండ పిచ్చుకలా ఈల శబ్దాలు
తిరుగుడి చక్రాలు ఈ పేర్లు కూడా
అందరమూ మరచిపో్యుంటాము
ఇవన్నీ మన చిన్ననాటి మతాబులు
అవికూడా మన ఇళ్లల్లోనే చేసుకునే మతాబులు
ఆహ దీపావళి అంటేనే మతాబులకొలహలం
ఆ రోజులు మరల తరలి రావు
మేఘాన్ని మందుగా
మెరుపులని ఒత్తిగా
ఆకాశమంత కాగితంలో
సందేశమనే మతాబులు
ఖర్చు లేకుండా పంపు తున్నా
దీపావళి శుభాకాంక్షలు
అమ్మ చేసే పిండివంటలు
నాన్న తెచ్చే మతాబులు
టైలర్ ఎప్పుడు కుట్టేసిస్తాడా
కొత్త గౌను ఎప్పుడు వేసుకుంటామో
అనే ఆనందం
ఇవన్నీ అలనాటి అలమరికలు లేని
ఏ చింత లేని పండగ హరివిల్లులు
ఇప్పటి పిల్లలకి ఈ మతాబుల
పేరులైన తెలుసునా
అనేది ప్రశ్న్తార్ధకం
ఎంతటి వారికైనా ఈ పండగ
ఓ అందమైన పండగ
హిందూ ముస్లిం క్రైస్తవులందరికి
ఇది పండగ