జీవితం సాగిన ఓ చిరు జ్ఞాపకం
జీవితం సాగిన ఓ చిరు జ్ఞాపకం

1 min

314
ఉదయం 4గంటలకు సుచి లేచి భర్తతో ఏమండీ మీకు కూడా మేమేమి వండుకుంటున్నామో అదే క్యారియర్ కట్టేయన అని అడిగిన వెంటనే ఒసేయ్ నీ దుంపదెగ నీ ఆరటానికి ఒక హద్దు లేదా 12గంటలకీ ట్రైన్ కీ నాలుగు గంటలకే వండేసావ్.
ఔనండి ఏమిటో గాని అసలు నిద్ర పట్టడం లేదు. చిన్ననాటి నా స్నేహితులని 35 సంవత్సరాల తరవాత కలుస్తున్నాం. ఆ సంతోషం లో నిద్ర రాలేదు అందుకే అన్ని వండేశాను.
- వెంటనే భర్త మీ స్నేహితులు అంటున్నావు మనం ఎప్పుడు మీ ఊరిలో కలవలేదే ఎప్పుడు డిగ్రీ స్నాహితులతోనే తప్ప ఈ చిన్ననాటి స్నేహితులను నువ్వు చూపించ లేదు అని నవ్వుతూ అడిగి నెమ్మదిగా నిద్ర లోకి జారుకున్నాడు. ఇక పనులన్నీ పూర్తి చేసుకొని కుర్చీలో కూర్చుంటు, సుచి ఆలోచిస్తుంది. చిన్నపటి విషయాలు ఒక్కకటిగా తన కళ్ళ ముందు ఓ మెరుపుల కదలడాయి. చిన్నప్పటి ఉసిరికాయలు, నాలుగుస్తంభాలాటలు, కబడి కొక్కో లు ఇలా ఒకటేంటి అన్ని తలుచుకుంటూ ఓ మందహాసంతో అన్ని జ్ఞాపకాలను పదిలపరచుకొని ట్రైన్ ఎక్కడానికి బయలుదేరింది. ఏంతటి పెద్ద వాళ్లయిన చిన్ననాటి సాగిన ఆ చిరు జ్ఞాపకాలు మాయని ఓ అందమైన కలల సంచలనాలు.