కష్ట సుఖాల త్రాసు
కష్ట సుఖాల త్రాసు
సుందర్రామ్మయ్య గారికి నలుగురు కూతుళ్లు. అందరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. పెద్దమ్మాయి సునీత లాయరు, రెండవ అమ్మాయి పోలీస్ సూపరిండెంట్, మూడవ అమ్మాయి చాటర్డ్ అకౌంటెంట్, ఇక ఆఖరు అమ్మాయి డాక్టర్ కి చదువుతుంది. అతని మిత్రుడు వెంకటరమణ గారికి ఇద్దరు కొడుకులు.రమేష్, సురేష్. ఇద్దరినీ పెద్ద ప్రయివేటు స్కూల్ లో చదివించేరు.
చాలా కాలం తరువాత ఇద్దరు ఓ రోజు గ్రంధాలయం లో కలిసారు. ఒకరి కష్టాలు ఇంకొకరితో చెప్పుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు పెళ్లిళ్లు చెయ్యాలి అని సుందరరామయ్య గారు చెపితే ఇద్దరు మొగ పిల్లల్ని కానీ పెంచాను వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆస్తులన్నీ అమ్మేసానని చెప్పారు వెంకట రమణ గారు. ఇంకా భార్య పోయింది పిల్లలు ఇద్దరు ఉదయం వెళితే సాయంత్రం వస్తారు అని చెప్పారు.
తనకి ఆఫీస్ లో చాలా మర్యాదగా చూస్తున్నారు ఇంకో రెండేళ్లలో పదవి విరమన వస్తుంది అన్నారు. సుందర్రామ్మయ్య సరే అన్ని అవే సర్దుకుంటాయి అని చెప్పి ఇంటికి వెళ్లారు.
మరుచటి రోజు ఆఫీస్ లో ఒక్కక్కరు వచ్చి తమ తమ పనులలో నిమగ్నం అయి వున్నప్పుడు సుందర్రా మయ్య గారు అందరు సంతోషం గా పనులు చేసుకుంటున్నారు వీళ్ళకి కష్టాలే లెవా దేవుడా అని
మనసులో అనుకున్నారు.
సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో ఆఫీస్ లో అందరు సంతోషం గా పనిచేస్తున్నారు వాళ్ళకి కష్టాలు లేవా అంటూ స్నానికి వెళ్లారు.
రాత్రి కలలో దేవుడు వచ్చి ఓ కల్యాణమండపం లో ఓ 100 మందిని కూర్చోపెట్టి ఒక్కొక్కరిని మీ కష్ట సుఖాలు చెప్పండి అన్నారు. ఒకరు డబ్బులు చాలావని, ఒకర్రు భార్య సరిగ్గా గమనించడం లేదని ఎవరి కష్టాలు వారు చెప్పారు. అప్పుడు దేవుడు సరే మీ కష్టాలు ఒకరి తో ఇంకొకరు మార్చు కొండి అన్నారు. అందరు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ దేవుడి తో మా కష్టాలు మాతోనే ఉందనీయ్యండి అంటూ చెప్పారు.
వెంటనే సుందర్రామ్మయ్య లేచి ఆమ్మో మన కష్టాలే మేలు రా భగవంతుడా అంటూ లేచి నీళ్లు త్రాగి పడుకున్నారు
కష్టసుఖాలు ఏవి శాశ్వతం కావు
