పట్టనపు పోకడ
పట్టనపు పోకడ


అది కొరనా మహమ్మారి ఊరినంత ఆవహించిన నిశి రాత్రి. సూర్య తనకు చాలా చలిగా ఉంది అని తన తల్లితో చెప్పింది. తల్లి సుమ ఈ రాత్రిప్పుడు ఈ పల్లెలో ఎక్కడనుంచి మందులు తెస్తాను రేపు ఎలాగో మనం సిటీ కి వెళ్ళిపోతాం కదా అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకుందాం అన్నది.
ఈలోపే ద్వారపు తలుపులు దబాల్ దబాల్ అని ఏవరో కొట్టేరు, సుమ తలుపులు తియ్యగా ఊరి సర్పంచు గారి పెళ్ళాం ఏదో చేతిలో ఒక పొట్లాన్ని తెచ్చి ఇచ్చింది. అమ్మాయి ఊరిలో ఏదో మహమ్మారి వచ్చిందంట రోజు ఈ పొడిని కాషాయం గ కాచుకొని తాగమన్నారు మన ఊరివైద్యులు అని వెళ్ళిపోయింది.
సుమ వెంటనే కాషాయం పెట్టి తల్లి కూతుర్లిద్దరు తాగేరు. తెల్లవారే సరికి చలి గాని జలుబు గాని ఏవి లేవు. సూర్య వాళ్ళ అమ్మతో అమ్మాయి ఇంకో 10రోజులు ఇక్కడే ఉంది వెళదాం అన్నది. తల్లి లేదమ్మా అక్కడ మీ నాన్నగారుఒంటరిగా ఉంటారు అని బయలుదేరమన్నది. సరే అంటూ సూర్య కు ఇష్టం లేకున్నా బయలుదేరారు.
అంతే పట్టణం పూర్తిగా కొరనా మహమ్మారితో నిండి పోయింది. సూర్య స్కూల్ టీచర్ తో కషాయం గురించి చెపితే నమ్మకుండా ఎగతాళి చేసారు. ఇక చేసేది లేక ఆ కషాయం పొడిని పల్లె నుండి తెప్పించి స్కూల్ లో ఓ రోజు అందరికి కషాయం ఏదో మా అమ్మ చేసింది త్రాగండి అని అందరిచేత త్రాగించింది. అంతే కొరనా దెబ్బకు పారిపోయింది. స్కూల్ ప్రిన్సిపాల్ సూర్య నో పొగిడి నీ ధైర్యానికి మెచ్చుకోవాలమ్మా మీటీచర్లు నిన్ను అవహేళన చేసిన పట్టించుకోకుండా మా అందరికి సహాయం చేసావు అదే పల్లె వాసన కాబోలు. ఈ పట్టనపు పోకడ ఎవరు ఎలా పోయిన పరవాలేదు మనం బావుంటే చాలు అనుకునే వాళ్ళ మధ్య ఓ మంచి గంధపు చెట్టువమ్మా నువ్వు అని ఆమెను అభినందించారు. సుమ తనవన్నీ వాళ్ళ బామ్మ పోలికలే అంటూ సంబర పడి సూర్య కి దృష్టి తీసి లోపలకు తీసువెళ్ళింది.