Dr.R.N.SHEELA KUMAR

Inspirational

3  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

కాలిపోతున్న గుడిసె

కాలిపోతున్న గుడిసె

1 min
31


తెల్లవారుజామున గిరిగాడు ఒరేయ్ మల్లన్న నీ కొడుకు కోడలు వెళ్లి అరేళ్ళైయ్యింది కదా ఒక్క సరైన పట్టణం పోవేట్రా నువ్వు, పాపం చెల్లమ్మకి పిల్లల్ని సూడాలన్న ఆశ ఉంటది కదరా బావ అని గిరి మాటాడుతూ పొలం కి వెళ్ళాడు. పనులన్నీ చేసి మధ్యాహ్నం భోజనాలు సమయం అయ్యేసరికి భార్య సుభద్ర బుట్టలో అన్నం కూర పులుసు అన్నీ తెచ్చి చేను గట్టులో భర్త కి వడ్డీస్తూ, మావ ఎన్నేళ్లుగా ఇలా కష్ట పడతావు మనము ఏదో పని చూసుకొని పట్టణం పోదాం మావ అని పోరు మొదలుపెట్టింది. వెంటనే గిరి కి కోపం వచ్చి నీ కొడుకు ఆ మల్లన్న కొడుకు మాటలు విని సెడిపోనాడు, పచ్చని ఊరోదిలి పోనాడు ఇప్పుడు నువ్వు మొదలెట్టినావు, నేనున్నంత వరకు ఈ భూమినోదిలి నేను రాను. నీకంత కష్టంగా ఉంటే నువ్వు పో అని కసిరాడు. చేసేదేమి లేక సుభద్ర పాత్రలు తోమి ఇంటికి వెళ్ళింది.

సాయంత్రం అయ్యింది ఊరి పెద్దమనుషులంతా రావిచెట్టు కింద బాతాకాని కొడుతూ కాలం గడిపేశారు. రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. ఆడి సలికాలం అవ్వటం తో తొందరగా ఊరు నిశ్శబ్దంగా అయిపొయింది పోరీగాళ్ళు కొందరు రాత్రంతా అక్కడ ఇక్కడ తిరుగుతూ సలి కాసుకోవడానికి గుడిసె ముందు నిప్పు రాజేసి పులిమేకా ఆడుకుంటూ ఉన్నారు ఈ లోపు రాజిన నిప్పు కాస్త గుడిసె కు పట్టి అతి వేగంగా పక్కనున్న గుడిసెలు కూడా కాలడం

ప్రారంభమయ్యాయి వెంటనే ఊరి జనం వచ్చి మంటలు ఆర్పీ రెండు రోజులలో మళ్ళీ గుడిసెలు కట్టి చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడే సుభద్రకు అర్ధమయ్యింది పల్లెటూరు ఎంత మంచిది అని 


Rate this content
Log in

Similar telugu story from Inspirational