ranganadh sudarshanam

Inspirational

4.1  

ranganadh sudarshanam

Inspirational

మల్లి విరిసింది(ఓ వేశ్య కథ)

మల్లి విరిసింది(ఓ వేశ్య కథ)

4 mins
776



వేణు బెరుకుగా భయం భయంగా ఆ ఇంటిముందు తచ్చాడుతున్నాడు.


చలి కాలమైన  అతని వళ్లంతా చెమటలు పడుతున్నాయి. 


అక్కడక్కడ వెలిగే వీది దీపాలు తప్ప వీదంతా నిర్మానుష్యoగా ఉంది.


పక్కనుండి ఒక కుక్క అతడిని వాసన చూస్తూ వెళ్లి పోయింది.


ఇంటి లోపలనుండి అప్పుడప్పుడు మత్తైగా సన్నగా మూలుగుతున్న  శబ్దాలు వినిపిస్తున్నాయి.


మెల్లగా గుండె చిక్కబట్టుకొని..తడబడే అడుగులను పట్టి పట్టి వేస్తూ..తలుపుదగ్గర నిలబడి పిలిచాడు, 


ఏవండి .....


గొంతు పెగలటం లేదు.. 


అతడి మాటలు అతడికే వినిపించడం లేదు. 


గొంతు తడి ఆరిపోయింది,


నాలుక పిడుచ కట్టినట్లుంది...


ఆరిపోతున్న పెదవులను నాలుకతో తడుపుకొని.. 

మళ్ళీ పిలుద్దామనుకున్నాడు..


కానీ గొంతు పెగలటం లేదు.


గుండె వేగంగా కొట్టుకుంటున్న చప్పుడు స్పష్టనగా... వినిపిస్తుంది.


చెట్టుపై ఉన్న పిట్టలు చలికి ముడుచుకుంటు టప టప లాడిస్తూ సరిచేసుకుంటున్న రెక్కల శబ్దం కూడా చాలా పెద్దగా వినిపిస్తుంది. 


ఆకాశంలో చందమామను త్వరగా పట్టి బంధించాలన్నట్లు ఆతృతగా మేఘమాలికలు పరుగులు పెడుతున్నాయి. 

అప్పుడప్పుడు ముసుగేసిన మబ్బులను విదిలించుకుంటు బైటికి వస్తున్న చంద్రుణ్ణి ...మళ్ళీ ముసుగులు కప్పి మబ్బులు దాచేస్తున్నాయి.... 

బైటికి వస్తున్న చంద్రుడు..

చంద్రుణ్ణి కప్పేస్తున్న మబ్బులు ...

దోబూచు లాడుతూ.. సయ్యట లాడుతూ.. చెలియ చుక్కలకు కనువిందు చేస్తున్నాయి.


 తలుపు పై నా చేయి వేసే లోపే... తలుపులు తెరుచుకున్నాయి...


ఒక పురుషాకారం నన్ను ఎగా దిగా చూస్తూ నన్ను దాటి గబ గబా... వెళ్ళిపోయింది.


నేను కలవాలనుకున్న ఆమె పెదవుల మధ్య జడ క్లిప్పు పట్టుకొని రెండు చేతులతో జడ అల్లుకుంటూ బైటికి వచ్చింది.


సగం వూడిన జాకెట్ హుక్స్ నుండి..బైటికి వస్తున్న అందాలను మధ్యలో వేలాడుతున్నట్లున్న పవిట దాచలేక పోతుంది.


అప్రయత్నంగా నా చూపులు ఆవైపు వెళ్లాయి..నా గుండె లయ తప్పింది..ఒంట్లో ఆవిర్లు పొంగుతున్నట్లునిపించింది.


ఏయ్..ఏంగావలె..ఎందుకొచ్చినవ్, ధమాక్ గిట్ల పాడైందా.. ఏంది అంది మల్లిక.


చూసిన కాడికి సాలుగాని... ఇగ నడువు అంది నన్ను గంజి లో ఈగను తీసినట్లు చులకన చేసి...


అది...నాకు..నాకు... పెళ్లి.....అన్నాను

నా మాట పూర్తి కాకముందే...


చుప్ బె...నాకు..గీకు..

ఆఫీసుల జూసినప్పుడు జర మంచి పోరనివని పలకరించిన.. 

నువ్వు అందరిలెక్కనేనా...

చల్ నడువ్ అంది గట్టిగా అరుస్తూ..


నా ఒళ్లంతా.. చల్లబడింది..కళ్లుతిరుగుతున్నట్లు,కాళ్ళు లాగుతున్నట్లు..మెదడు మొద్దు బారినట్లనిపించింది...


అది..అది... పెళ్లికి ముందు.. ఒకసారి అనుభవం ఉంటే మంచిదని ఫ్రెండ్స్ అంటే...

తడ బడుతూ సగం సగం మింగుతూ ఏం మాట్లాడుతున్నానో..నాకే అర్ధం కాకుండా మాట్లాడుతున్నాను.


ముయ్యవయా...నీ సోది నువ్వు...దమాక్ కరాబ్ అయిందా ఏంది అంది...కసురుకుంటూ...


ఈలోగా పోలీస్ విజిల్ వినిపించింది.


ఏయ్..పోరగా నేను చెప్పేదాక బైటికి రాకు ఆల్ల చేతిలబడితే ఆగమై పోతావ్.. అంటూ నన్ను గదిలో దండెం మీద వేలాడే బట్టల వెనుకగా నిల బెట్టింది.


నాకు వాళ్ళు కనిపిస్తున్నారు..కానీ నేను వారికి కనిపించను.


ఓ బట్టతల పోలీస్ ఏoదే... మల్లి మస్తు ఉషారుగున్నావ్ మంచి గిరాకీ తగిలినట్లుంది..అంటూ..కూర్చొని చేతిలో ఉన్న మందు బాటిల్ విప్పి... మందు.. నీళ్లు కలుపుకొని తాగిండు.


ఏయ్...ఇట్రావే.. అంటూ మల్లి చెయ్యి పట్టి గుంజి పక్కన కూసోబెట్టుకుండు..

చేయి ఎక్కడెక్కడో తడుముతుంది.


ఆమె అడ్డు చెప్పలేదు కాని... అయిష్టత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది...తప్పదన్నట్లు అతనికి లోబడిపోయింది.


ఏం సార్...మస్తు ఉషారుగున్నావ్..

పస్థుల కాపురమా..అంది.


ఆ... ఏం చెప్పమంటావే...

ఇంటి దగ్గరేముంటదే....

రావే అంటే...

కాళ్ళ నొప్పులు,

నడుం నొప్పి, 

అని రోగాల పేర్లన్నీ చదివి

చేతకావట్లేదంటే ఉన్న మూడ్ పాడైపోతది..మూసుకొని పడుకోవడం తప్ప ..ఇంకేముంటుందే...


అందుకే అప్పుడప్పుడు నీదగ్గర కక్కుర్తి పడటం అన్నాడు..


ఏం.. సార్ బిళ్ళలు ఒకటా రెండా.. జోరుపెరిగింది.


ఏయ్..అదేం లేదే..నీ మీద మోజు పెరిగింది.


అబ్బో...లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర నిజం చెపితేనే తెలుసుకుంటారు..

మాదగ్గర కాదు సారు..

బట్టతల మీద చెమటలు,కాలిపోతున్న వళ్ళు,అల్లాడిపోతున్న గుండె చప్పుడు నాకు తెల్వదా సార్ అంది.


ఓర్నియమ్మా...డాక్టర్ కంటే ఎక్కువ చెపుతున్నావేంటే...


గంతే కదా సార్...

సేత గాక పోతే మా ఆడొల్లమ్ మూసుకొని కూసుంటం... 

మీరేమో సేతగాకపోయినా ...

బిల్లలు ఏసుకొని మొగోళ్లమనుకుంటరు...

ఎందుకు సార్ లేనిది కొనుక్కొని..

గింత ఆరటపడటం...

వూకుంటే ఎవ్వరడుగుతారు సారు అంది.


ఏయ్..వూకోవే దొంగ.....డా,

నేనేమైన సన్యాసం తీసుకున్ననా..వూకోడానికి.


అవునుగాని ఎప్పుడు ముడుసుక పోయేదానివి..లైట్ తీయ మనే దానివి...ఎందే ఇయ్యాలా ఫుల్లు కోపరేషన్ చేస్తున్నావ్ లవ్వు పేరిగినట్లుందే... నా మీద అన్నాడు.


ఏం చేస్తాం సార్...మా బతుకులే గట్ల .

నవ్వు రాకున్నా నవ్వాలి,

ప్రేమలేకున్నా..సూపెట్టాలి..

వచ్చినోడు మళ్ళీ రావాలిగదా సార్..అంది.


మల్లి...నియవ్వ..నీ దగ్గర ఎదో మాయిందే.... ఆకలేస్తే బిర్యానీ తినాలినిపించినట్లు,,ఈ ఆకలైతే నువ్వే గుర్తొస్తావే.. నీ మీద ఒట్టు అన్నాడు..రొప్పుతూ..


సార్ గీ బిర్యానీ రేండ్రోజులు తింటే మోఖం కొడ్తది..గదే అన్న మైతే ఎప్పుడు తిన్నా ఇంకా  కావలనిపిస్తది..ఇంట్లో పెళ్ళాం కూడా అన్నం లాంటిదే సారు అంది మల్లి.


అబ్బో... వేదాంతం బాగానే చెప్తున్నావే.. అంటూ పైకి లేచి బట్టలు వేసుకొని ఇగో వే ఇయ్యాలా ఖుషీలో...మొట్ట మొదటి సారి నీదగ్గర తీసుకోకుండా నికే...ఇస్తున్నా అంటూ..డబ్బులు చేతిలో పెట్టి బైటికి నడిచాడు.


ఏయ్..పొరగా బైటికి రా..అంది.


చూసినవా....

నువ్వు చూడాలనే ఇయ్యాలా వానికి ఒళ్ళు వదిలిన...


ఎంత చెడి పోయినా.. మాకు మనసుంటదయ్యా...


శరీరం అమ్ముకుంటాము గాని మనసు కాదుగా..


దేవుడు ఆకలిని ఎందుకిచ్చాడో గాని,జానెడు పొట్టకోసం... ఈ పాపపు పని చేసినప్పుడల్లా మనసు పడే రoపపు కోత..మీకేం తెలుసయ్యా..


మేము ఆకలి కోసం..

పిల్లల కోసం..

గుండెలు మండుతున్నా..కడుపుమంట సల్లార్చుకోటానికి రోజు సస్తూ.. బతుకుతున్నాము...


వద్దయ్య నువ్వెట్ల నీ భార్య నీకే మొదటి సుఖం ఇవ్వాలనుకుంటావో..


నీ భార్య గుడా గట్లనే అనుకుంటది.


జీవితంలో జీవితాంతం గుర్తుండేది మొదటి రాత్రేనయ్యా...అది చాలా  పవిత్రంగా వుండాలయ్యా...అది శరీరాల సుఖం కాదయ్య..మనసుల పవిత్ర కలయిక..ఈ రోజు కోసమే కన్నెపిల్ల కలలు కంటుంది..ఈ రోజు తరువాత ఆమెను  కన్నెపిల్ల అనరయ్యా అంది.


చాపకు..ఈత .. కోయిలకు పాట..పసి పాపకు పాలు తాగడం ఎవరు నేర్పరయ్యా...ఆ దేవుడే నేర్పిస్తాడు.. ఇది అంతేనయ్యా..


ఇంకా నీకు ఈ నీచమైన సుఖ అనుభవం కావాలంటే రా... ఈ శవాన్ని..అనుభవించిన వారిలో నువ్వు చేరిపోతావు అంది.. కారుతున్న కన్నీళ్లు తూడ్చుకుంటూ..మల్లి


నేను చెడిపోయిన దానిని కావొచ్చయ్యా కానీ ఎవరిని చెడగొట్టలేదయ్యా...అంది..కుప్పగా కూలిపోతు..


అంతే... నా మనసులోని అపోహలన్ని తొలగి పోయాయి నిజంగా ఆ సమయంలో..తాను ఓ మూర్తీభవించిన..పవిత్ర మూర్తిలా..అర్జునునికి గీతోపాదేశం చేస్తున్న శ్రీ కృష్ణుని రూపంలా కనిపించింది.


క్షమించమని...అక్కడి నుండి బైటికి నడిచాను.


చాలా ప్రశాంతంగా అనిపించింది..

మనసు కాస్తా నెమ్మది పడింది..

శరీరం నా అధీనంలోకి వచ్చింది..

గట్టిగా శ్వాస తీసు కున్నాను..

శరీరానికి పట్టిన చెమటలు తగ్గిపోయాయి..

ఇప్పుడు నాకు చలి వేస్తుంది..


ఆకాశంలో మబ్బులన్ని తొలగిపోయి చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడు.


ఆ తరువాత...


నా పెళ్లి, శోభనం అన్ని బాగా జరిగాయి.


ఆమె చెప్పింది అక్షరాల నిజమనిపిoచింది.

ఎవరు ప్రత్యేకంగా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు...రేంజు శరీరాలు ఏం కోరుకుంటాయో..అదే జరుగుతోంది. అదో సృష్టిలో జరిగే పవిత్ర యజ్ఞం...ఆ సమయంలో అన్ని మనకు తెలియ కుండానే తెలిసి పోతాయి అంతే..అదే సృష్టి కార్యం.


ఆ తరువాత ఆమెను కలిసినప్పుడు,

అక్కా.. అని నోరారా పిలిచాను..

ఆమె పరవశించి పోయింది..పాప ప్రక్షాళన జరుగుతున్నట్లు...ఆమె కళ్ళు వెంట గంగ ఉప్పొంగింది.


ఆమెను ఆ పాప కూపంలోనుండి బైటికి రమ్ముని అడిగాను.


తమ్ముడిగా ఆజ్ఞాపిస్తే...ఇప్పటికిప్పుడు చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నని చెప్పింది.


నాకు కావాల్సింది అదే...నీ పాత జీవితాన్ని ఈరోజే చంపేయి.. నేను చెప్పినట్లు కొత్త జీవితంలోకి అడుగు వేయమన్నాను.


సరే తప్పకుండా అంది..


ఒక హాస్టల్లో ఉద్యోగంలో చేర్పించాను..


ఆమె ఇప్పుడు.. అన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. 

ఆ తరువాత తన కాళ్లపై తాను నిలబడింది... కష్టపడి... చదివి,ప్రభుత్వ ఉద్యోగంలో స్థిర పడింది.


ఆ తరువాత...

రాయిని ఆడది చేసిన రాముడు కాకున్నా..

గంగను తలా పై మోసే శివుడు కాకున్నా..


విషయం అంతా తెలిసిన..


ఒక మనసున్న మంచి మనిషి చేయి అందించాడు.

తమ్ముడిగా దగ్గరుండి...అక్క పెళ్లి చేసాను..


ఆమె చీకటి జీవితంలో... దీపం వెలిగింది


వాడిన మల్లి.. మళ్ళీ విరిసింది.


కడుపు మంట కోసం తప్పు చేసే వారిని వేశ్యాలనలేము..

కానీ ...

కoడ కావరంతో బరితెగించి చేసే వారిని వేశ్యలంటే తప్పుకాదు.


........సమాప్తం.....



Rate this content
Log in

Similar telugu story from Inspirational