ranganadh sudarshanam

Comedy Drama

4.4  

ranganadh sudarshanam

Comedy Drama

చారుమతి శపథం

చారుమతి శపథం

4 mins
861ఉదయం నిద్రలేవగానే రెడియో వినడం అలవాటైన మూర్తి లేచి కళ్ళు నలుపుకుంటూ...రెడియో ఆన్ చేసాడు.


శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వస్తుంది..


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరాశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.


ఏమోయ్... లేచావ లేదా నీకు సుప్రభాతం పాడమంటావ అన్నాడు మూర్తి.


పాపం దేవుడనే గాని ఎలా భరిస్తున్నాడో ఇన్ని బాధలు..

రాత్రి ఏ ఒంటిగంటకో పవళింపు సేవ..

మళ్లీ ఉదయం మూడు గంటలకల్లా మేలుకొలుపు సుప్రభాతా సేవ.

చలి ..ఎండ..లేని.. అభిషేకాలు,

ఎంతబరువున్న మోయకతప్పని నగలు నట్రా..

పూల మాలలు..ఊపిరాడాని

హారతులు

నైవేద్యాలు,

సేవలు 

అబ్బాబ్బా..

భక్తుల ఆర్తనాదాలు వింటూ,వారికి దర్శనం ఇస్తూ...వారు కోరిన కోర్కెలు వింటూ..తీర్చుతూ..

అయ్యో దేవుడా....


మనుషులo మేమే నయం కదయ్యా.. 

ఇష్టమైనప్పుడు నిద్ర ,

ఇష్టమైనప్పుడు మేలుకోవడం,

ఇష్టమైతేనే స్నాన పానాదులు..

స్వామి నీ బాధలు మాకు లేవయ్యా అంటూ దండకంలా చదువుతున్న భర్తను..


చాల్లేoడి సంబడం పొద్దున్నే రేడియో గోల మీరూను అంది విసురుగా..చారుమతి


ఇదిగో..ఏమోయ్ ఇప్పుడే చెపుతున్నా....నన్నేమైన అంటే అను, కానీ నా రేడియోను అంటే మాత్రం ఒప్పుకోను గాక ఒప్పుకోను..అన్నాడు మొఖం చిట్లిస్తూ ..


నాకు తెలియక అడుగుతాను.. అసలు..అసలు రేడియో అంటే ఏమనుకున్నావోయ్...అన్నాడు మూర్తి


అయ్యా... మహానుభావా.. మీ రేడియో చరిత్ర దాని గొప్పతనం..విని విని నా చెవుల తుప్పు రాలి పోయింది...మీకో నమస్కారం వద్దు బాబు వద్దు వినలేక చస్తున్నాను. ఏదో ఒకరోజు దాని పీక పిసికి ఆవలపారేస్తే గాని పీడా విరగడవ్వదు అంది రుస రుస లాడుతూ చారుమతి. 


చారుమతికి రేడియో అంటే ఒకప్పుడు ఇష్టాంగానే ఉండేది కానీ .


రాను రాను మూర్తిగారు ఏది వదలకుండా వినిపించే పందుల పెంపకం,కొళ్ళపెంపకం,

పశువులధాణ.. లాంటి చెత్తా చెదారం ..విని..విని.. రేడియో వినాలంటేనే ఎలర్జీ వచ్చింది. 


మూర్తి గారేమో....పుష్పక విమానంలో కమలహాసన్ టైపు  .... 

రేడియో మోగందే ఏపని చేయరు...  ఎప్పుడు ఇంట్లో రేడియో...మోగాల్సిందే.


అమ్మమ్మ మ్మా....వేగలేక చేస్తున్నాను..ఇవ్వాళ తాడో పేడో... తేలిపోవాలి ,ఉంటే ఆదిక్కుమాలిన రెడీయో అయినా ఉండాలి, లేదా నేను... ఎట్టి పరిస్థితిలోనూ... దాని సంగతి తేల్చాల్సిందే ...ఒక్క తన్నుతో దాన్ని పదహారు వక్కలు చేస్తే తప్ప మనఃశాంతి లేదనుకొని డిసైడ్ అయి గయ్యిన లేచింది చారుమతి.


సరేనోయ్ ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి ఇదిగో...నీకో అవకాశం ఇస్తాను..


ఒక పందెం కాస్తాను


నువ్వు గెలిచావో నువ్వెప్పుడంటే అప్పుడు రేడియో కట్టేస్తాను..ఒక వేళ నేను గెలిచాననుకో... మళ్ళీ జీవితం లో రేడియో గురించి ఒక్కటంటే ఒక్కమాట అనొద్దు సరేనా అన్నాడు.


చారుమతి ఆలోచించి ఇదేదో బాగానే వుంది ఓడాననుకో ఎలాగో ఈ బాధ భరిస్తూనే ఉన్నానుగా..


కానీ గెలిస్తే అబ్బా దీని బాదనుండి విముక్తి లభిస్తుంది అనుకుంది.


అబ్బా ఈ ఆలోచనే ఇంత ఆనందాన్నీ ఇస్తే ఇక గెలిస్తే... ఈ పందెం.. ఏదైనా ఎలాగైనా ఖచ్చితంగా గెలవాలని మనసులో మంగమ్మ శపథం చేసుకుంది..చారుమతి.


ఒసే చారు డోంట్ మిస్ ఇట్..

చూపించు నీ తడాఖా అని తన జబ్బను తానే గట్టిగా చరుచు కొని అబ్బా అంది.


అయ్యా మహానుభావా ఇక ఆ రేడియో కట్టేసి మీ పందెం సంగతి చెప్పండి అంది.


ఇవ్వాళ ఎలాగో ఆదివారం కదా..నాకు ఉద్యోగ పర్వం లేదు, ఇప్పటి నుండి సాయంత్రం వరకు ఏది చెప్పాలన్న ...ఏది అడగాలన్న ఓ పాట రూపంలో అడగాలి బదులు రాక పోయిన..పాటలో సమాధానం చెప్పలేక పోయినా ఒడిపోయినట్లే..


ఉషారుగా ఓకేనా..అన్నాడు మూర్తి గారు


కొంత తటపటాయించినా...వేరే దారి లేక ఒకే అంది చారుమతి.


మూర్తిగారు ఉత్సాహంగా అందుకున్నారు..


తెల్లవారకముందే పల్లే లేచింది

తనవారినందరిని తట్టి లేపింది....

ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి

అదిరిపడి మేల్కొంది అదేపనిగా కూసింది...అంటూ...మొదలెట్టి...


ఏవండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ తెల్లారింది

ఇల్లు వూడ్చాలి..కాళ్లాపి చల్లాలి...

అన్నాడు.


తానేం తక్కువా... అనుకోని చారుమతి అందుకుంది..


ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా

ముత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా..

ముద్దుమురిపాలొలుకు ముంగిళ్ళలోన

మూడుపువ్వులు ఆరు కాయల్లు కాయ

.......

తీరైన సంపద ఎవరింట ఉండు

దినదినము ముగ్గుల్ల మింగిళ్ల నుండు...

అంటూ ముగ్గు వేయటం పూర్తి చేసింది.


మూర్తి గారికి చాయి అందిస్తూ..


ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్

ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్

ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,

ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్

ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్

ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్

ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్

ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్||


అంటూ.. అందించింది చారుమతి..


ఇంతలో మా పనిమనిషి


కోలు కోలోయన్న కోలో నా సామి

అని మొదలు పెట్టి...


ఆడుతూ పాడుతూ పను చేస్తుంటే 

అలుపు సొలుపేమున్నది..ఇద్దర మొకటై..చేయి కలిపితే ఎదురేమున్నది మనకు బెదురేమున్నది అంటూ ముగించింది.


దీని దుంపతెగా...అనుకున్నాను..


ఏవండి..నేను..


జలకాలాటలలో... గలగల పాటలలో

ఏమిహాయిలే హలా ...

అంటూ స్నానానికి వెళ్ళింది చారుమతి.


స్నానం కాస్త లేటైనట్లుంది

మూర్తిగారు...ఇలా మొదలు పెట్టారు...


చిన్నారి బుల్లెమ్మా.. సిగ్గెందుకు లేదమ్మా

చన్నీటి స్నానాలు చాలమ్మ..

అన్నారు..


అయిపోయింది అన్నట్లు చారుమతి


చీరకట్టి కాటుక పెట్టి

చేమంతులు నా జడలో చుట్టి...అoది.


బొట్టు కాటుక పెట్టి

నే కట్టిన పాటను చుట్టి అంటూ.. మార్తి గారు ముక్తాయించారు.


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

పూలిమ్మని రెమ్మ రెమ్మకు అని చారుమతి మొదలెట్టి పూజకు పువ్వులు కోస్తుంది.


పూజలు చేయ పూలు తెచ్చాను

నీ గుడిముందే నిలిచాను

ఇయ్యరా దరిశనము రామా తియ్యరా తలుపులను రామ..అంటూ మూర్తిగారు దేవుడి ముందు కూర్చొని అందుకున్నారు.


ఇక చారుమతి వంట చేస్తూ..


ఆహా ఏమి రుచి అనరా మైమరిచి ...

తాజా కూరలలో రాజా ఎవరంటే..అంది 


ఆహా... అలాగా...


వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఓహ్హోహో నాకె ముందు


ఔరర గారెల్లల్ల అయ్యారే బూరెలిల్లా

ఓహ్హోరె అరిసెలుల్లా ఇవెల్ల నాకె చల్ల


భళీరె లడ్డు లందు వహ్ ఫేణిపోణిలిందు

భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు


మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు

వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు..


అని తనకు కావాల్సిన మెనూ వివరించారు..


అబ్బో బలే దెబ్బకొట్టారే ఎలా ఆనుకొని


ఏడంతస్థుల మేడ ఇది

వడ్డించిన విస్తరిది.. అంటూ భోజనానికి పిలిచి


వేడి అన్నం కాచిన్నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి 

వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం ..(గోపాలం సినిమా ) అంటూ భోజనాలు ఇద్దరికి పెట్టి ముగించింది చారుమతి.


ఆ తరువాత..


అందం ఇందోళం..ఆధరం తాంబూలం..అంటూ తాంబూలం అందించింది చారుమతి.


అబ్బా.. బలే దెబ్బకొట్టాఓయ్..చారు అంటూ


ఆకులు పోకలు ఇవ్వొద్దు

నా నోరు ఎర్రగా చేయొద్దు

ఆశలు నాలో రేపొద్దు

నా వయసుకు అల్లరి నేర్పద్దు..పాప.పాప..

అన్నాడు మూర్తి...


ఇక సాయంత్రం అయ్యింది..


డాబామీద మల్లెలు కోస్తు చారుమతి


ఇది మల్లెల వేళయని

ఇది వెన్నెల మాసమని...అని మొదలు పెట్టింది


ఆహా..


మల్లియలారా మాలికలారా

మౌనముగా ఉన్నారా 

మాకథనే విన్నారా...అన్నాడు మూర్తి


మల్లెలు పూచే వెన్నెల కాచే

ఈ రేయి హాయిగా అంది చారుమతి..


మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన

వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా..అన్నాడు మూర్తి.


చీకటి పడింది...ఇంటికి దీపం ఇల్లాలు

ఆ దీపకాంతుల కిరణాలే... అంటూ లైట్స్ ఆన్ చేసాడు..మూర్తి


ఇంతలో కరెంట్ పోయింది..


చీకటిలో కారు చీకటిలో..

కాలమనే కడలిలో...శోకమనే పడవలో

అంది చారుమతి...


చీకటి కొంత వెలితురుకొంతా

ఇంతే జీవిత మంతా...

కల చెదిరింది..కథ మారింది... అన్నాడు మూర్తి


చీకట్లో చిందులాట కొందరికి

ఆ చీకట్లో దొంగలాట కొందరికి అంది చారుమతి.


ఒక దీపం వెలిగింది

అనురాగం పలికింది 

అంటూ కరెంట్ రాగానే పాడాడు మూర్తిగారు .


మళ్ళీ భోజానాలై పోయాయి


బైట సన్నగా వాన జల్లు మొదలైంది


ఆకుచాటు పిందె తడిసే

కొకమాటు పిల్ల తడిచే

ఆకాశ గంగోచ్చింది..అందాలు ముంచెత్తింది..అన్నాడు మూర్తి..


బదులుగా....


చిట పట చినుకులు పడుతూవుంటే

చెలికాడే సరసనవుంటే

చెట్టా పట్టగా...చేతులు చాచి

చెట్టునీడకై పరుగెడుతుంటే...

చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వుంటుందోయి....అంది చారుమతి


రాత్రి పడుకోవడానికి...సిద్ధమయ్యారుతెల్లా తెల్లని చీరెలోన చందమామ 

పట్టపగలే వచ్చినావు చందమామ..అన్నాడు మూర్తి


తెల్ల చీర కట్టుకున్న దెవరికోసము

మల్లెపూలు పెట్టుకున్న దెవరి కోసము..అంది చారుమతి.


ఓహో..


ఈ రేయి తియ్యనిది

ఈ చిరుగాలి సొగసైనది....అన్నాడు మూర్తి


మంటలు రేపే నెలరాజ 

ఈ తుంటరి తనము నీకెలా...అంది చారుమతి


చలివేస్తుంది చంపేస్తుంది..అన్నాడు మూర్తి


చలి చలిగా ఉందిరా వైరామ వైరామ..అంది చారుమతి.


దుప్పట్లో దూరాక దూరమేముంది..అన్నాడు మూర్తి...


సరసాలు చాలు శ్రీవారు..వేళకాదు...

అంటూ గుంజుకుంటూ...అటూ ఇటూ దొర్లుతుంది చారుమతి...


ఏయి.. చారు లే...కలేమైన వచ్చిందా అంటూ తట్టి అటు ఇటు దొర్లుతున్న శ్రీమతిని లేపాడు మూర్తి.


నేనే గెలిచా...నేనే గెలిచా అంది చారమతి...కలవరిస్తూ..


తలపై ఒక్కటివ్వగానే..ఆ..ఆ...అంటూ ఈ లోకంలోకి వచ్చి లేచి కూర్చుంది చారుమతి.


విషయం చెప్పుకొని భార్య భర్త లిద్దరు హాయిగా నవ్వుకొన్నారు..


మూర్తిగారు చారుమతికి సారి చెప్పి...ఇకపై

రేడియోలో చారుమతికి ఇష్టమైన ప్రోగ్రామ్స్ మాత్రమే పెడతానని మాటిచ్చి ..


బదులుగా


మళ్ళీ ఇద్దరూ దుప్పటి కప్పుకున్నారు.


దూరంగా...మైకులో


ఉందిలే మంచికాలం ముందు ముందునా

అందరూ సుఖపడాలి నందనందనా...అంటూ మొగుతుంది.......సమాప్తం....Rate this content
Log in

Similar telugu story from Comedy