Varanasi Ramabrahmam

Tragedy

4  

Varanasi Ramabrahmam

Tragedy

ఇల్లాలి మరణం

ఇల్లాలి మరణం

3 mins
22.7K


 


ఇల్లాలు లేక ఇల్లు లేదు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. 

 నేటి నాగరికతా ఝంఝామారుతము, జీవన విధానము ఇల్లాలిని ఎక్కడికో ఎగరేసుకొని తీసుకుపోయి ఎక్కడో పడేసాయి.


ఇల్లాలిని వంటింటి, పడకటింటి బానిసగా అభివర్ణించి, ఆమెను ఇంట్లో లేకుండా చేసిన పుర్రచేతి భావముల మేధావులు దీనికి కారణమా? "విజ్ఞానము", సాంకేతికత ఇంతింతై, వటుడింతైగా

పెరిగి నభోవీధిని తాకిన పుణ్యఫలమా ఇల్లాలి "మరణం"? 


పసికందులను, ముసలి వగ్గులను నడివీధిన పడవేస్తున్న మనం, " ఇల్లాలు" తెచ్చే డబ్బుతో

వీరికి ఏమైనా ఉపకారం చేయగలమా? నడివీధిన పడిఉన్న పసికందులను, ముసలి వగ్గులను, అనాథలను సాకిన మదర్ థెరీసాని ఆకాశానికి ఎత్తేసి నోబెల్ బహుమానమిచ్చి మనలను మనం గౌరవించపకున్నాము, తృప్తి పరచుకున్నాము. ఆమె మతం వారు ఆమెకు సన్యాసం ఇచ్చి తమ మతప్రచారము చేసికున్నారు.


నడి వీధిలో పడిన అనాథలకు చేసిన సేవకు మదర్ థెరీసాకు నోబెల్ బహుమతి, సన్యాసం ఇచ్చుకొని ఆమె సేవను ప్రశంసించాము, అందరమూ, నవీన మేధావులు, నాస్తికులు, తర్కకర్కశ సింహాలు తో సహా.

అదే పనిని, ఇంటిలోని పసికందులు, ముసలివగ్గులు అనాథలై రోడ్డున పడకుండా కాకుండా తాను అమ్మయై, కోడలై కాపాడి సాకుతూంటే, మగవానికి బానిస, వంటింటికి, పడకటింటికి పరిమితమై తనలోని ప్రతిభావ్యుత్పన్నతలను, శక్తియుక్తులను సంఘానికి ఉపయోగించకుండా పనికిరాని ఇల్లాలిగా జీవితాన్ని వృథా చేసికుంటోంది స్త్రీ, అని డప్పు వేసి, అల్లరిచేసి, గొడవ, గోల చేసి ఇల్లాలిని లేకుండా చేయడంలో కృతకృత్యులము అయ్యాము. ఒకే పని చేసిన మదర్ థెరీసాను అందలం ఎక్కించాము. అదే పని చేస్తున్న ఇల్లాలిని, స్త్రీని ఇల్లాలు చేసినవారిని, ఎవరు చేశారో మనకు తెలియకపోయినా ఊహించేసి, నిరసించి మొత్తానికి ఇల్లాలు కనబడకుండా చేయగలిగాము. దీనివల్ల కలుగుతున్న కష్టనష్టాలను మనకళ్ళతోనే చూస్తున్నాము. ఒకప్పుడు మరణించేదాకా హుందాగా, కొడుకులు, కోడళ్ళు, మనుమల మధ్య ఉత్సాహంగా నూరేళ్ళు బ్రతికిన ముసలివగ్గులు ఎవరూ ప్రేమగా పట్టించుకోక వృద్ధాశ్రమములలో

జీవచ్ఛవాలలా బ్రతుకుతున్నారు. దీనికి ఇల్లాలిని వీధిలోకి లాగిన కుహనా మేధావులు ఏమీ సమాధానం చెప్పరు. చెప్పలేరు. కావలిస్తే అందరినీ తిట్టి పోస్తారు.

ఇంక పసికందుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మనశ్శాంతి.


మనం బ్రతికేది మహా అయితే 60, 70 ఏళ్ళు. అందులో ఇరవై ఏళ్ళ వరకు కుర్రతనంలో పోతుంది. ( ఇప్పుడు అది 40 ఏళ్ళదాకా పాకుతోంది). ఆపై ఉద్యోగం, స్త్రీలకైనా, పురుషులకైనా హుందా అయిన ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. 35, 40 ఏళ్ళకు అనారోగ్య సమస్యలు. ఆపై ముసలితనాలు. ఒకరికొకరము ఏమీ కాక, దాని వచ్చే అనర్ధాలను భరిస్తూ‌, చెప్పుకోవడానికి ఎవరూ లేక అలమటిస్తాము.


ఈ మాత్రము దానికి హక్కులు, బాధ్యతా రాహిత్యాలు, తిట్లు, విమర్శలు. ఆడిపోసుకోవడాలు. ఒకరికొకరు ఏమీ కాని మనుషులు ఎంత సంపాదిస్తున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేరు. మానవసేవయే మాధవసేవ అనే మనం ఆ మానవుల జాబితాలోకి భర్త, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులకు స్థానం ఇవ్వం. ఏమి వింత జనాలమో ఏమిటో.

ఏమైనా ఇల్లాలి మరణం, సంఘం యొక్క మానసిక, శారీరిక ఋగ్మతలు geometric progression లో వృద్ధి అవడానికి దారితీసింది. దారితీస్తుంది.


The emotional aspect of humans has been taken care of by women in the form of mothers, grand mothers, wives, sisters, daughters, daughters-in,-law and the like. Now we are missing that psychological support which will lead to insanity in the society. Unfortunate, that the so called intellectuals, women'-liberation activists and like social organizers and agitators miss this vital point and need.


Money alone is not panacea for our civilized living. Our emotional needs must be equally qualitatively fulfilled as our intellectual needs.


Let us mind this reality and construct our society.


Rate this content
Log in

Similar telugu story from Tragedy