నీతి కథ
నీతి కథ
ఒక సామాన్యుడు బయట పనులు చేయడానికి శరీరం సాహకరించట్లేదు అని స్నేహితుడికి చెప్పాడు.
అపుడు ఆ స్నేహితుడు తనకు తెలిసిన బర్రె ఒకటి ఉంది ఆ బర్రెను కొని దాని బాగోగులు చూసుకుంటే అది ఈనినప్పుడు వచ్చే పాలను అమ్ముకొని బ్రతకవచ్చు అనే సలహా ఇచ్చాడు.
అప్పుడు సామాన్యుడు మంచి ఆలోచనే అని మరో నిమిషం ఆలోచించకుండా అతను చెప్పిన బర్రెను కొని ఇంటికి తీసుకొచ్చాడు.
ఆ బర్రెను కొన్నప్పటి నుండి ప్రతిరోజు దానికి మూడుపుటలా గడ్డి కుడితి పెడుతున్నాడు.
ఇలానే రోజులు గడుస్తున్నాయి
సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి
అలా ఐదు సంవత్సరాలు అయింది
అయిన, బర్రె ఈనలేదు.
ఆలోచనలో పడ్డాడు
సరే ఏలాగో ఐదు సంవత్సరాలు చూసుకున్నాను కదా ఇంకా కొన్ని రోజులు చూద్దాం అనుకోని అలాగే ప్రతిరోజు గడ్డి కుడితి పెడుతూనే ఉన్నాడు.
మరో రెండు సంవత్సరాలు అయింది
అయిన
బర్రె ఈనలేదు
పాలు ఇవ్వలేదు.
ఇప్పుడు బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు.
అప్పుడు అర్ధమైన విషయం ఏంటంటే తన స్నేహితుడు బర్రె అని చెప్పి దున్నపోతును కొనిచ్చాడు అని.
నీతి: సలహాలు ఇవ్వడం, అడగడం, తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి హానికరం మరియు సంతోషకరమైన జీవితం సర్వనాశనం
✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ
