STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Inspirational

4  

Narra Pandu

Tragedy Fantasy Inspirational

దేవుడు గొప్పా..?మనిషి గొప్పా

దేవుడు గొప్పా..?మనిషి గొప్పా

1 min
672

దేవుడు గొప్పా..?

మనిషి గొప్పా....?

పుక్కిటి పురాణాల వలన

పుట్టిన దేవుళ్ళ కంటే

పురిటి నొప్పులలో

పుట్టెడు బాధతో

పుట్టిన మనిషే గొప్ప

బండరాళ్లలో బతుకుతూ

భజనలు అందుకుంటున్న దేవుని కంటే

భయంతో బతుకు బండిని లాగిస్తున్న మనిషే గొప్ప

రాతి విగ్రహం కంటే

రాతి గుండె మనిషే గొప్ప

మాటలు వినలేని

మాయదేవుళ్ళ కంటే

మనతో మాట్లాడని మనిషే గొప్ప

తనని తాను కాపాడుకోలేని దేవుని కంటే

తల్లడిల్లుతూ తనువు చాలించే మనిషే గొప్ప-నర్ర పాండు✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy