కవిత్వ భావం-నర్ర పాండు
కవిత్వ భావం-నర్ర పాండు


కవిత్వ భావం
కనులకు తోడుగా
కలం రాల్చే సిరా అనే ద్రవమే కవిత్వం
హృదయం మోయలేని బరువుని
కాగితంపై పెట్టడమే కవిత్వం
మనసులోని మాటలను
మౌనరాగంగా మలచడమే కవిత్వం
వింతలను కవ్వింతలుగా మార్చి
భయభ్రాంతులను బహిర్గతం చేయడమే కవిత్వం
అక్షరాలకు శిక్షణ ఇచ్చి
లక్ష విధాలుగా లక్షణంగా చెప్పడమే కవిత్వం
ఒక్కోసారి ఆనందభాష్పాలు
ఒక్కోసారి చేదు అనుభవాలు
ఒక్కోసారి మర్చిపోలేని జ్ఞాపకాలు
భాష ఏదైనా
భావం మాత్రం మనసులోని ఆలోచనలే
నాలో లేని నేను-పాండు