STORYMIRROR

kamala sri

Drama Tragedy Classics

4  

kamala sri

Drama Tragedy Classics

నీ ప్రేమ కోసం

నీ ప్రేమ కోసం

2 mins
399


*శీర్షిక :-❣️నీ ప్రేమ కోసం❣️

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఆఫీస్ లో బిజీ గా వర్క చేస్తున్నాడు ఆకాశ్.ఆ ఆఫీస్ కి మేనేజర్ అతను. ఊపిరి సలపని పని ఉంటుంది అతనికి. ఇంతలో ప్యూన్ వచ్చి "సర్" అని పిలిచాడు.

"ఏంటి రంగయ్యా!" అన్నాడు ఆకాశ్.

"మీకో ఉత్తరం వచ్చింది సర్."అని టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు రంగయ్య.

'తనకి ఉత్తరం రాసేది ఎవరబ్బా!అదీ వాట్సప్ లూ, ఈమెయిల్స్ ఉన్న ఈరోజుల్లో కూడానా.' అనుకుంటూ ఆ ఉత్తరాన్ని తన లంచ్ బ్యాగ్ పై పెట్టి పనిలో మునిగిపోయాడు.

సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వెళ్లడానికి లేస్తూ బ్యాగ్ పైన ఉన్న ఉత్తరం కూడా తీసుకుని బయటకు నడిచాడు.కార్ లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ ఉత్తరం తీశాడు ఆకాశ్.పైన ఫ్రమ్ అడ్రెస్ లేదు.టు అడ్రెస్ ఉంది గుండ్రటి అక్షరాలతో. ఎన్వలప్ కవర్ అది.అది చింపి నెమ్మదిగా చదవడం మొదలు పెట్టాడు.

"కన్నయ్యా!"అని మొదలు పెట్టి ఉంది. 

ఆ పదం చదవగానే 'ఈ ఉత్తరం... 'అనుకుంటూ చదవడం మొదలుపెట్టాడు.

"కన్నయ్యా! బాగున్నావా నాన్నా.ఇలా ఉత్తరం రాస్తున్నాను అని నీకు కోపం రావొచ్చు.కానీ ఏం చేస్తాం ఒకే ఇంట్లో ఉన్నా కూడా నీతో మాట్లాడి ఓ రెండేళ్లు అయ్యింది.ఈ రెండేల్లే రెండు యుగాలు గా అనిపించింది నాకు.

నాకు పుట్టిన ఏకైక సంతానం నువ్వు.నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను కన్నా.ఎన్నో ఏళ్లు పిల్లలు పుట్టలేదు నాకు.ఆ తర్వాత నా కడుపున పడ్డావు నువ్వు.ఐదో నెలలో అనుకుంటా విపరీతమైన కడుపులో నొప్పి.భయంతో హాస్పిటల్ కి పరుగుపెట్టా మీ నాన్నగారితో పాటు.

అక్కడ చెక్ చేసిన డాక్టర్ గారు చెప్పారు గర్భ సంచి కొద్దిగా జారి ఉంది.కుట్లు వేయాలని.అది చిన్న ఆపరేషన్ లానే.గర్బసంచికి కుట్లు వేశారు.ఓ రాత్రంతా హాస్పిటల్ లో ఉంచారు. 

ఏడో నెలలో మళ్లీ కడుపులో నొప్పి.వెంటనే హాస్పిటల్ కి వెళ్లాము.స్కానింగ్ చేస్తే నీకు ప్రేగులు చుట్టాయని, ఉమ్మ నీరు కూడా ఉండాల్సినంత లేదని,బి.పి పెరిగి నా హార్ట్ బీట్ పెరిగిందని,నీకు ఆక్సిజన్ అందాల్సిన స్థాయిలో అందక నువ్వు ఉక్కిరిబిక్కిరి అయ్యి ఆఖరి గడియలో ఉన్నావని తెలిసింది.

ఆ మాటలకి నా ప్రాణం ఆగినంత పని అయ్యింది. ఆపరేషన్ చేయమని చెప్పాను.కానీ ఆపరేషన్ చేయాలంటే నాకు బి.పి.తగ్గాలి.అది పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. 

ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతుకుంది కానీ బి.పి అలా ఉంటుండగా ఆపరేషన్ చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు.బి.పి తగ్గాక ఆపరేషన్ చేయొచ్చు"అని చెప్పారు డాక్టర్లు.

మీ నాన్న గారు కూడా అలాగే చేయమన్నారు.కానీ నేను ఒప్పుకోలేదు.ఎట్టి పరిస్థితి లోనూ ఆపరేషన్ చేయాల్సిందే అని ఒప్పుకోక పోతే అప్రెషన్ టైం లో నాకు ఏదైనా జరిగితే తమదే హామీ అని మీనాన్న తో సంతకం పెట్టించి అప్పుడు చేశారు ఆపరేషన్.

నా హార్ట్ బీట్ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.నేను పోయినా నా బిడ్డ మాత్రం ఈ భూమి మీదకి రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను.కాసేపటికి ఏడుపు వినపడింది.

నేను కోమాలోకి వెళ్లిపోయాను.ఎన్ని రోజులు అలా ఉన్నానో.ఒకరోజు డాక్టర్ లు చెప్పేశారు మీ నాన్నకి గ్యారెంటీ లేదని.మీ నాన్న నా దగ్గరికి వచ్చి ఏడ్వడం మొదలు పెట్టారట.ఆయన ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడ్వడం మొదలుపెట్టావట.

నువ్వు ఏడుస్తుంటే నాలో చలనం.అది గమనించి డాక్టర్ గారు ఏడుస్తున్న నిన్ను నా దగ్గర పెట్టారట. నువ్వు ఏడ్వడం ఆపకపోవడం తో నేను కొంచెం గా కదిలాను. నీ ఏడుపే నన్ను బ్రతికించింది. నిన్ను చూడాలన్న కోరికే నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది.

నిన్ను నా కంటిపాప లా పెంచుకున్నాను కన్నయ్యా.నీ పెళ్లి అయ్యాక కొంచెం దూరమైనావు.ఇప్పుడు మేనేజర్ అయ్యాక అస్సలు దూరం అయినావు.ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడకుండా ఉంటుంటే నేను ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నాను కన్నయ్యా.

బి.పీ వల్ల చాలా నీరసంగా ఉంటోంది నాన్నా.ఆకలి కూడా వేయడం లేదు.ఇంకా ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలీదు.నేను పోయే లోపైనా నీతో ఒకరోజు సరదాగా గడపాలని ఉంది కన్నయ్యా.నా కోరిక మన్నిస్తావు కదూ.

నీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న 

నీ తల్లి✍️.

ఉత్తరం చదవడం ముగించిన ఆకాశ్ కళ్లవెంబడి కన్నీరు ధారాళంగా కారుతుంటే కారు దిగగానే తల్లి దగ్గరికి పరుగున వెళ్లి ఆమె పాదాలపై పడిపోయాడు.కానీ ఆ పాదాలు నిర్జీవంగా ఉన్నాయి.

( *కన్న తల్లిదండ్రుల ను ఏ కారణం చేతనైనా దూరం పెట్టకండి.ఆ దూరం మనకి శాశ్వతం అయిపోతుందేమో??)* 

                      .... కమల'శ్రీ'✍️.



Rate this content
Log in

Similar telugu story from Drama