STORYMIRROR

kamala sri

Romance Tragedy Fantasy

4  

kamala sri

Romance Tragedy Fantasy

అరవింద నిరీక్షణ

అరవింద నిరీక్షణ

5 mins
313




''అరవిందా...అరవిందా.. ఏం ఆలోచిస్తున్నావ్.. పిలుస్తుంటే పలకకుండా..."

''అదీ... బావా... నువ్వూ... నువ్వెప్పుడు వచ్చావు.ఏదో ఆలోచిస్తూ ఉండి. నువ్వు రావడమే గమనించిలేదు".

''నా రాకను కూడా గమనించనంత ఆలోచనేంటే నీకూ??!!"

''నీ కోసమే... బావా.. నువ్వు వస్తాను అని చెప్పావు గా ఈసారైనా వస్తావో,లేక మళ్ళీ పనుందని ఆగిపోతావో అనుకుంటూ ఆలోచన.ఈ సారి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఆ కట్ట మైసమ్మ తల్లి దేవాలయం కి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి''.

''అవునా.. ఈ సారి ఏం మొక్కు కున్నావు?"అంటూ దగ్గర కు వచ్చి అన్నాడు.

''మా బావ పని లో ఉన్నప్పుడు మనసు చలించకుండా.. పని పైనే దృష్టి పెట్టాలని.. కోరుకున్నా.."

''అదేంటి అరవిందా.. ఎవరైనా తన జ్ఞాపకాలతో రోజంతా గడపాలని కోరుకుంటారు గా. మరి నువ్వేంటి ఇలా.. "

''వాళ్ళు వేరూ... నువ్వు వేరు బావా.. "

''ఓహ్.. ఇంకా ఏం చేయాలి అనుకున్నావ్" అంటూ అరవింద ఒడిలో తల పెట్టి పడుకుని అడిగాడు.

''ఈసారైనా మామయ్య వాల్లతో తిరుపతి వెళదాం బావా..ఎప్పటినుంచి అడుగుతున్నారో కుటుంబం మొత్తం కలిసి తిరుపతి వెళదామని... ప్రతీ సారీ ఏదో ఒక ఆటంకం.మనకు కొడుకు పుడితే వస్తామని మొక్కుకున్నారు.బాబు పుట్టి అయిదు నెలలు కూడా అయ్యింది. తలనీలాలు తీయించవచ్చు. వారికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. పాపం ఈ వయసులో వారిని ఎవరు చూస్తారు. మనమే గా!"

''మా అమ్మ నాన్న ల మీద నీకెంత ప్రేమ విందా!" అంటూ ఆమె తల ని చేతితో క్రింది కి దించి ముద్దు పెట్టుకున్నాడు.

''పో... బావా.. మాట్లాడుతుంటే ముద్దు పెడతావేంటి" అంది ఇష్టం లేనట్టు ముఖం పెట్టి.

''ఏం విందా! ముద్దు నచ్చలేదా.. లేక పెట్టిన ప్రదేశం నచ్చలేదా.. " అంటూ ఆమె నడుము పై ముద్దు పెట్టాడు.

''అది కాదు బావా నే చెప్పేది శాంతం విను.. మధ్య లో ఏ చిలిపి పనీ చేయకు" అంది అరవింద.

''చిలిపి పనా నేనేం చేశానే??? "అన్నాడు అమాయకంగా.

''మరీ అంత అమాయకంగా ముఖం పెట్టకు బావా... చేసిన వన్నీ చేసి అమాయకంగా ముఖం ఎలా పెట్టాడు చూడు" అంది సిగ్గు తో.

''ఏం చేశాను ఇక్కడ ముద్దు పెట్టానా అని మెడ వంపు లో ముద్దు పెట్టాడు.. లేదా ఇక్కడ అంటూ బుగ్గ లపై"ఇలా ఆమె తనువంతా తన చుంబనాలతో ముంచెత్తుతుంటే అరవింద కళ్ళు తమకం తో అరమోడ్పు లైనాయి.

మెల్లగా ఆమె లోని శృంగార దేవత నిద్ర మేల్కొంటూ తమకం తో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలి కి అతని లోని మన్మథుడు ఉత్సాహం తో ఆమె నడుం ని దగ్గరగా తీసుకొని రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని తన పెదాలతో ఆమె పెదాలపై యుద్ధం చేసాడు.మకరందం కోసం పువ్వుల పై వాలిన తుమ్మెద లా ఆమె తేనెలూరు పెదాలలోని తియ్యని రుచిని తన పెదాలతో సేవించి...

సున్నితమైన ఆమె నాభి పై తన నాలుక తో నాట్యం చేసాడు. ఆ చర్య కి అరవింద మత్తుగా ''హ్హా.. "అంటూ మూల్గింది.కళ్ళు మత్తుగా వాలి పోతుంటే ఇంక ఆగలేక అతన్ని పైకి లాగింది.

"ఏం విందా!  నేనెంత బుద్ది గా నా పని నేను చేసుకుంటూ పోతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు.మళ్ళీ నేను చిలిపి పని చేస్తున్నా అంటావు. ఇలా అయితే నేను నీతో మాట్లాడను పో..."అంటూ ఆమె పెదాలపై తన పెదాలను ఓ తియ్యని ముద్ర వేశాడు.

''మాట్లాడకుండా ఉండటం అంటే ఇదా! " అందామే సందేహం గా.

''ఏం నేనేమైనా మాట్లాడినట్టు నీకు వినపడిందా??" అని ఆమె చెవికి దగ్గరగా ముద్దు పెట్టాడు. ఆ చర్య కి అరవింద ఒళ్ళు ఒక్క సారిగా ఝల్లు మంది.

''బా...... వా.... " అంది చాలా కష్టం గా.

''ఏంటి విందా" అన్నాడతను అంతే మత్తుగా.

''కాసేపు మాట్లాడుకుందాం బావా... ప్లీజ్!!" అంది.

''సరే!" అని పక్కకి జరిగి వెళ్ళకిలా పడుకున్నాడు

''ఈసారి నువ్వు నాతో కనీసం ఓ వారం రోజులైనా గడుపు బావా..." అంది అతని ఛాతి పై తల పెట్టుకుని,అక్కడికి చేరగానే ఇన్నాళ్ళు అతన్ని మిస్ అయ్యాననే భావన పోయి... తన చేతులతో అతన్ని చుట్టేసి,

''పోయిన సారి వచ్చేటప్పుడు రైతుల సమస్యలపై చర్చించేందుకు కలెక్టర్ గారి ఆఫీసు చుట్టూ, ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరుగుతూ తిండి కూడా సరిగ్గా తినేవాడివి కాదు,

'మనకెందుకురా ఇవన్నీ' అని మామయ్య అంటే 'నేనేదో చేస్తాననే కదా నాన్నా వాళ్ళు నా దగ్గర కి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. అయినా అందరూ నాకెందుకు అంటే మరి ఆ సమస్య లపై పోరాడేది ఎవరు?

దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. అలాంటి రైతులు పండించిన పంటను ఆ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.కష్టపడి పంట పండించే రైతులకు వారు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.

అందుకే వారు పండించే పంట కు వారే గిట్టుబాటు ధరలను నిర్ణయించే అధికారం కోసం నా ప్రయత్నం!' అని ఉపన్యాసం ఇచ్చావు.

''నిజమే బావా! రైతు లు చల్లగా ఉంటే కదా మనకి ఐదువేళ్ళూ నోటి లోకి వెళ్ళేది.నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా బావా,

సమీర్... ఆర్మీ మేజర్. దేశం కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆ చల్లని చలి లో రక్తం గడ్డ కడుతుందేమో అనే ఆలోచన లేకుండా... నిద్రా హారాలు మాని...పక్క దేశాల ఆక్రమణ దారు లు మన దేశంలో చొరబడకుండా నిరంతరం గస్తీ కాస్తారు. విధి నిర్వహణలో వెన్ను చూపని వీరుడు నా భర్త.. ‌అని చెప్పుకోడానికి నేనెంత గర్వ పడుతున్నానో తెలుసా!"అంది ఓ రకమైన ఉద్వేగం తో.

''నేనూ... నిన్ను చూసి గర్వ పడుతున్నా అరవిందా.. ఓ శాస్త్రవేత్త గా నీ కొత్త కొత్త ఆవిష్కరణ లతో,  ప్రయోగాలతో దేశానికి ఎన్నో ఔషధాలను అందించే గొప్ప వ్యక్తి నా భార్య అని..."

"పో... బావా... నేనేం చెప్పినా...కాలికేస్తె మెడకి వేసి, మెడకేస్తే కాలికి వేస్తావ్! "అంటూ అతన్ని దూరంగా తోసింది.

                           ✊✊✊

అంతవరకూ హాల్ లో సోఫా పై పడుకున్న అరవింద ఒక్క సారిగా లేచింది.''ఏంటిదీ నేనెక్కడ ఉన్నాను.. బావా.. ఏడీ.. అనుకుంటూ చుట్టూ చూసింది. ఎవరూ లేరు. అప్పటికీ అర్థం కాలేదు ఆమె కి ఇంతవరకూ తాను కలగన్నాననీ.ఎంత తియ్యని కల. నిజమైతే ఎంత బాగుంటుంది.తన నిరీక్షణ త్వరలోనే ఫలిస్తుంది కదా! " అనుకుంది.

ఇంతలో డోర్ బెల్ మ్రోగింది. ఎవరూ.. అనుకుని వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఓ ఆర్మీ సోల్జర్.అతన్ని చూసి ఆశ్చర్యపోయి బయటకు వెళ్ళింది. బయట ఓ పది పదిహేను మంది ఆర్మీ సోల్జర్స్.. కొంచెం దూరంగా ఓ వ్యాన్.

అరవింద ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉంది. ఆమె గుండె ఎందుకో అదురుతోంది.మెదడు ఏవేవో సంకేతాలు మనసు కి అందిస్తుంది. కానీ తనూహించింది కాకూడదు అనుకుంటూ నిలబడిన ఆమె కెదురుగా ఓ పెట్టె తెచ్చి పెట్టారు.

అందులో...ఆ పెట్టె లో... తన బావ... తన ఆరోప్రాణం. తన సర్వస్వం... నిద్ర లో... కాదు.. కాదు శాశ్వత నిద్ర లో కనపడ్డాడు.

అరవింద ఒక్కసారి గా ఓ మూడడుగులు వెనక్కి వేసి అక్కడే కూలబడి పోయింది.

ఓ సోల్జర్ వచ్చి.. ''చొరబాటు దారులు మన దేశ భూభాగం లోకి వచ్చి..కవ్వింపు చర్యలకు పాల్పడితే, కోపంతో.. అంతకు మించిన దేశ భక్తి తో వారితో తలపడ్డారు మన సైనికులు.ఆ హోరాహోరీ పోరులో మన సైనికులు 20 మంది వీరమరణం చెందారు. వారి లో మీ భర్త మేజర్ సమీర్ ఒకరు.

అప్పటికే ఆయన సెలవులు మంజూరైయ్ ఇంటికి రావాల్సి ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్ లో రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోవడం తో లీవ్ కేన్సిల్ చేసుకున్నారు . ఒకవేళ ఆయన రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యుంటే ఇంతటి దారుణం జరిగేది కాదు. శరీరం లోకి ఏడు బుల్లట్లు వెళ్ళాయి.. వియ్.. ఆర్.. వెరీ.. సారీ మేడమ్" అంటూ ఇంకా ఏదేదో చెప్తున్నాడు. కానీ ఇవేవీ తనకి వినపడడం లేదు.

ఇంతవరకూ తన చెంతనే ఉన్న చెలికాడు...ఇప్పుడు కదలకుండా... ఒళ్ళంతా తూటాలతో....దేశం కోసం ప్రాణ త్యాగం చేసి అమరుడైనాడు. అందరి గుండెల్లో చిరంజీవి గా నిలిచాడు.

అతని మరణ వార్త దావానంలా వ్యాపించగా జనసందోహం ఏరులై పారింది.అతని ఛాతిపై జాతీయ జెండా కప్పారు.ఎప్పుడూ నా దేశం... నా జెండా.. నా ప్రజలూ అంటూ ఉండే సమీర్...దేశం కోసం ప్రాణాలొడ్డి ఆ జెండాను తన గుండె పై కప్పుకుంటే ఆ దృశ్యం చూసేందుకు ఎన్నో ప్రాంతాల ప్రజలు తండోప తండాలుగా వేంచేసారు.

సైనిక లాంఛనాలతో అతని అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ఇంక మాకు దిక్కు ఎవరు దేవుడా,,ఉన్న ఒక్క గానొక్క కొడుకు నీ దగ్గరకు వచ్చేసాడే ''అని ఏడుస్తున్న అత్తమామలను ఓదారస్తూ.. పుట్టి అయిదు మాసాలైనా తండ్రి చూపుకు నోచుకోని పసికందుని తన ఒడిలో పెట్టుకుని చనుబాలిస్తూ.. రేపటి మరో జవాన్ ని సిద్దం చేసేందుకు సన్నద్దురాలైయ్యింది.

                          💐💐💐

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రతీ సైనికులకు మరోసారి సెల్యూట్ చేస్తూ... వారి భార్యల మనోగతాలను మీ కల్లముందు ఆవిష్కరింప చేయాలని నా ఈ చిన్ని ప్రయత్నం.ఈ కథ ఈ విభాగంలో రాసానని నన్ను ఏమీ అనుకోకండి. వారి మనోగతాలు వివరంగా చెప్పాలనే,,, భర్త ప్రెజెన్స్ ని ఎంత మిస్ అవుతారో తెలియ జేయాలని ఈ విధంగా రాసాను. తప్పులు ఉంటే ఒప్పులుగా స్వీకరించి చదివి ఆధరిస్తారని కోరుతూ..

మీ

కమల'శ్రీ'



Rate this content
Log in

Similar telugu story from Romance