ఓ బంగరు రంగుల చిలకా
ఓ బంగరు రంగుల చిలకా


అమ్మా వాళ్ళు చెప్పలేదు.
నేను ఇష్టంగా పెంచుకునే చిలుక చనిపోయిందని.ఎగిరిపోయిందని చెప్పారు.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో కబుర్లు చెప్పేది.మొదట నేను నమ్మలేదు.చాలా వెతికాను.ఎదురు చూశాను.
నా ఎదురు చూపులు చూసి ఇక చెప్పేశారు నా ఫ్రెండ్ అని చెప్పుకునే చిలుక చనిపోయిందని.
చాలా ఏడ్చాను.కొన్నాళ్ళు ఎవరితో మాట్లాడలేదు.అప్పటి నుంచి చిలుకలు పంజరంలో పెట్టే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు.
ఏ ప్రాణికైనా స్వేచ్ఛ లేన్నపుడు ప్రాణం ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాను.