Veeresh Darshanam

Tragedy

4  

Veeresh Darshanam

Tragedy

murder

murder

2 mins
339


దాదాపు కొన్ని సంవత్సరాలయ్యింది వాడిని కలిసి , ఎప్పుడో నాలుగు ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు. మరెన్నో తీపి జ్ఞాపకాలుగా మారనున్న రాబోవు రోజులు. తెల్లవారితే వాడొస్తాడు. ఎప్పుడెప్పుడు కలుస్తాన...మళ్ళీ కలుస్తున్నాము... అన్న ఈ ఆలోచనతో నాకు నిద్దుర కూడా రావట్లేదు. ఏవేవో ప్లాన్స్ వేస్తున్నా అక్కడికి వెళ్ళాలి , ఇక్కడికి వెళ్ళాలి అని. అంత ఇష్టం వాడంటే. మామూలుగా అయితే సమయం ఇట్టే గడిచి పోతుంటుంది. కానీ ఈ రాత్రెంటో ఎంత సేపైనా ముందుకు సాగటం లేదు. ఏదైతేనేం మొత్తానికి సూర్యుడు వచ్చాడు. తనతో పాటే రైలు కూడా వచ్చింది. సురేష్ దిగాడు. నేను పలకరించే లోపే రేయ్ విజయ్ ఎలా ఉన్నావ్ రా? అని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. మామా నేను బాగున్నా రా నువ్వెలా ఉన్నావ్ ? అని అడిగా , నేను సూపర్ అని బదులిచ్చాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ నేనుంటున్న పీజీ కి చేరుకున్నాము. ప్లాన్ చేసుకున్న విధంగానే మొదట పబ్ కి వెళ్ళాం . ఇలా పబ్ కి వెళ్ళటం ఇద్దరికీ మొదటిసారే. లోపల అంతా చీకట్లో ఇంద్రధనుస్సును తలపించి...మించిన రంగు రంగుల ఫోకస్ లైట్ల నడుమ తాగేవాళ్ళు తాగుతున్నారు, ఆడేవాల్లు ఆడుతున్నారు. ఇంకా మద్యం గురించి అయితే చెప్పనక్కర్లేదు.. బోర్ వేసినప్పుడు నీళ్ళు పొంగినట్టు ఇక్కడ మద్యం పొంగి పోర్లిపోతోంది. ఆ తరువాత సినిమాకి వెళ్ళాం. షాపింగ్ చేశాం. రాత్రి కూడా రెస్టారెంట్ కెళ్ళి బిర్యానీ తిన్నాం. మొత్తానికి రోజంతా బాగా ఎంజాయ్ చేశాం.మరుసటి రోజు ఉదయాన్నే ఎవరో గట్టిగా అరిచేసరికి మెలుకువ వచ్చి లేచాను. కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది నా ప్రియ మిత్రుడు సురేష్ మంచం మీద విగత జీవిలా పడి ఉన్నాడు, ఎవరో వాణ్ణి చంపేశారు. అలా వాణ్ణి చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు.

             సురేష్ లేవరా.. అంటూ ఎంతగా తట్టి లేపాడో , నీ ఫ్రెండ్ ని వచ్చాను ఒక్కసారి చూడరా .. ఎవరు చేశారు రా ఇలా అంటూ ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయాడు విజయ్. తాను ఒకటి తలిస్తే ..దైవం మరొకటి తలిచడని అన్నట్టు.. మరెన్నో తీపి జ్ఞాపకాలుగా మారనున్న రాబోవు రోజులు అని విజయ్ తలిస్తే ,జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకం మిగిల్చాడు ఆ దేవుడు. కాసేపటికి తేరుకున్న విజయ్ వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టాడు. పోలీస్ లు రాగానే అందరినీ ఒక పక్కన ఉండమని చెప్పి , క్లూస్ టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్లూస్ అన్ని సేకరించిన పిదప బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు సంబందించిన ఎంక్వైరీ మొత్తం చేసి పోలీస్ లు వెళ్ళిపోయారు. తన ఫ్రెండ్ మరణాన్ని జీర్ణించుకోలేని విజయ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.తాను చనిపోయక ఆత్మ అయిన సురేష్ .. పోలీసులు తన చావుని చేదిస్తారా లేదా అని ఎదురు చూస్తున్నాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ కేసును ఛేదించ లేక పోయారు. చివరకు అదొక అన్సాల్వుడ్ మిస్టరీగా మిగిలిపోయింది. దాంతో హమ్మయ్య.. అనుకుంది సురేష్ ఆత్మ . ఎందుకంటే సురేష్ నీ ఎవరు చంపలేదు, లవ్ ఫెయిల్యూర్ కావడంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఒక హత్యలా ఎందుకు చిత్రీకరించాడు అంటే ... ఆత్మహత్య చేసుకుంటే తననొక పిరికి వాడిలా సమాజం గుర్తిస్తుంది అది సురేష్ కి ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించి..పరిశోధించి దానికి తగ్గట్టుగా ఆత్మహత్య నీ , హత్య లా చిత్రీకరించాడు. కానీ తన మూలంగా ఈ కేసులో ఎవరు చిక్కుకోవడం తనకి ఇష్టం లేదు అందుకే ఏమి జరుగుతుందా అని ఎదురుచూసాడు . చివరిగా పైకి వెళ్లేటప్పుడు మాత్రం వర్ణనాతీతమైన తన తల్లిదండ్రుల బాధ , డిప్రెషన్ లోనున్న స్నేహితున్ని చూసి అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నా అని చాలా బాధపడ్డాడు సురేష్. 



Rate this content
Log in

Similar telugu story from Tragedy