Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Veeresh Darshanam

Others


3  

Veeresh Darshanam

Others


నేటి బంధాలు

నేటి బంధాలు

4 mins 273 4 mins 273

ఆఫీసులో పని చేస్తుండంగా మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది . హలో అన్నానో లేదో మా ఆవిడ ఏమండి..ఏమండి.....అని కంగారు కంగారుగా.... అంటూ త్వరగా ఇంటికి వచ్చేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఇంట్లో శాంత (సుబ్బారావు భార్య) ఒక్కతే ఏడుస్తూ... కూర్చుంది, సమయానికి వాళ్ళ అత్తగారు

కూడా లేరు బయటకు వెళ్ళారంట, నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది.అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఎందుకంటే మేము పక్కపక్క ఇళ్ళలో ఉంటామనే కానీ సొంత బంధువుల లాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం ,అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్ లకు వెళుతూ ఉంటాము. అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. పైగా అయనది పెద్దవయసు కూడ కాదు,వాళ్ళకు పెళ్లయి పది సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయడంటే నమ్మలేకపోయాను, వెంటనే మా బాస్ దగ్గర

అనుమతి తీసుకొని ఇంటికి బయల్దేరాను. నాకు బైకు నడపడమంటే చాలా ఇష్టం . బైకు నడుపుతుంటే వచ్చే మజాని ఎప్పుడూ అస్వాదించెవాడిని, ఇప్పుడు కూడా బైకు పైనే ఇంటికి వెళ్తున్నాను కానీ ఎందుకో ఆ మజా ఇప్పుడు అసలు రావటం లేదు. ఒక్క సారిగా.... సుబ్బరావు గారితో ఉన్న అనుబంధం ఆయన కుటుంబం తో సరదాగ గడిపిన

క్షణాలు అన్ని కళ్ళ ముందు తిరగసాగాయి.

సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి ,కొత్త వారితోనైన సరే ఇట్టే కలిసిపోగల మనిషి మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. భహుశ వారి కుటుంబం తో మేము

ఇంత సన్నిహితంగా మెలగడాని ఆయన మంచి వ్యక్తిత్వమే కారణం..... ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను ఇంకో ఐదు నిమిషాలలో ఇంటికి చేరతాను. ఎప్పుడు నవ్వుతూ పలకరించే సుబ్బారరావు గారి మొఖాన్ని మాత్రమే ఎరిగిన నేను,ఇప్పుడు అసలు జీవకలే లేని ఆయన వదనాన్ని చూడాలంటే మనసు రావట్లేదు,ఇలా నాకు ఇంటికి వెళ్ళాలనిపించని సందర్భం ఎప్పుడూ రాలేదు. ఇలా అనుకుంటుండగానే ఇంటి దగ్గరకు వచ్చాను. ఇరుగుపొరుగు జనం తో సుబ్బారావు ఇల్లు నిండిపోయి ఉంది. లోపలికి వెళ్ళి సుబ్బరావుని అలా నిర్జీవంగ చూసేసరికి నాకు తెలియకుండగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయ్. సుబ్బారావును చూస్తుంటే ప్రశాంతంగ నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది కానీ

చనిపోయడంటే ఇంకా నమ్మబుద్ది కావట్లేదు. నా భార్య శాంత ని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది ,కానీ శాంత ని సముదాయించటం తన వళ్ళ కావట్లేదు. ఇంతలో సుబ్బారవు అమ్మగారు

వచ్చారు.సుబ్బారావు ని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు,

గుండెలుపగిలేల ఏడవసాగింది. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు....వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు.ఒక అరగంట తర్వాత శాంత అమ్మనాన్నలూ వారి తరపు బంధువులు అక్కడికి వచ్చారు.ఒకటి రెండు కన్నీటి బొట్టులు అలా రాల్చారోలేదో శాంత వాళ్ళ నాన్నగారు శాంత 'బీరువ తాళాలు' ఎక్కడున్నాయమ్మ'ఆస్తి పత్రాలు' చూడాలి అని అడిగారు.ఆ మాట విన్న మాకందరికి 'మతిపోయింది'. సుబ్బారావు చనిపోయి ఇప్పటికి ఇంకా రెండు గంటలే అవుతుంది,ఇంకా ఏ కర్యక్రమాలు పూర్తికాలేదు కానీ అప్పుడే ఆయన ఆస్తి

గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనుకోవలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది.లాగి పెట్టి చెంప మీద చె.......ల్లు.......మని ఒక్కటి ఇవ్వాలనిపించింది.

నిజానికి సుబ్బారావుకి కూడా తన మామ అంటే ఇష్టం లేదు.డబ్బు కు ఇచ్చే విలువ

మనుష్యులకు ఇవ్వరని, ఎప్పుడైన పండగకి అత్తగారింటికి వెళ్ళినప్పుడు తనకొకలాగ శాంతా చెల్లెలి భర్తకు ఒకలాగ మర్యాదిచ్చేవారు.మొదట్లో మాకు అంటే ఇద్దరు అల్లుళ్ళను సమానంగానే చూసేవారు, కానీ శాంత భర్తకి ఒకసారి

వ్యాపారం లో నస్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పటినుంచి తన దగ్గర 'డబ్బులేని కారణంగా తనకు క్రమంగా మర్యాద ఇవ్వటం తగ్గించాడు',

అతను ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు.డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ...లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం ఉన్న ఆయనంటే తనకు నచ్చేదికాదు అంటుండే వాడు సుబ్బారావు.ఇంతలో

మా ఇంటి దగ్గరే ఉండే తాయరమ్మ కలగజేసుకొని అల్లుడు చనిపోయడనే బాధ కూడా లేకుండ అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావ్ అసలు నువ్వు 'మనిషివే....' నా అని గట్టిగా నిలదీసేసరికి అంత మందిలో ఏమి మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటకు జారుకున్నాడు సుబ్బారావు మామ. ఎప్పుడూ అక్కయ్యగారు అని పిలిచే మీ మామ

ఇవాళ నువ్వు అలా వెళ్ళిపోగానే ఎలా మారిపోయాడో, బంధుత్వం ఉన్నాకనీసం మాట వరసకైన ఓదార్చడానికి దగ్గరికి రాలేదు కానీ ప్రాణం లేని ఆస్తిపత్రాల కోసం బీరువా దగ్గరకి వెళ్ళబోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే

మీ మామని చూడరా....... అంటూ కన్నీరు మున్నీరుగ విలపిస్తున్న ఆమెని చూసిన ఏ మనిషికైనా ఏడుపు రాక మానదు అంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కర్యక్రమాలు అయిపోయాక రెండు వారాలకు మళ్ళీ వచ్చాడు సుబ్బారావు మామ. ఆ రోజు సెలవు కావటం తో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. సుబ్బారావు రాక గమనించిన నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బరావు గారి మామ మళ్ళీ వచ్చాడు,బహుశ ఆస్తి కోసం వచ్చి ఉంటాడు, అసలే ఆ పెద్దావిడకు ఏమి తెలియదు.ఒకసారి వెళ్ళి ఆమె తరపున మాట్లాడి తనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది.అసలెందుకు వచ్చాడో తెలుసుకొని వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే, అనుకొన్నట్టుగానే ఆయన తన కూతురికి

రావల్సిన ఆస్తి గురించి మాట్లాడుతున్నడు. అది ఏమనంటే..... భీమాలు,పాలసీల తో కలిసి ఇంట్లో సగ భాగం శాంతకే చెందుతాయి. ఇంట్లో మిగిలిన సగ భాగం ఇంకా యాభైవేల రూపాయల చీటీ మాత్రమే మీకు వస్తాయని, కావలంటే చూడండి అంటూ తన కూతురు దగ్గర ఉన్న అన్ని పత్రాలు

చూపించసాగాడు. పత్రాలు అన్ని చూస్తే అంతా తను

చెప్పినట్లు గానే ఉంది. అయిన అత్తాకోడళ్ళు కలిసివుంటారు కదా, ఇబ్బంది ఏమి ఉందిలే ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్న కానీ రెండు రోజుల తర్వాత కానీ తెలిసింది శాంత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకుందని,నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిడని వదిలి వెళ్ళోద్దు ,ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుందని తోడుగ ఉండమని ఎంతో నచ్చజెప్పడానికి చూశాం,కానీ శాంత అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రి తో పాటు తనకు రావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంక తనను చూసుకునే వారే లేరు, ఒంటరి అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపొయిన శాంతను చూసి ఇరుగుపొరుగు

వారు మంచి అమ్మయి అనుకున్నాము ఇలా చేసిందేమిటి అంటూ ముక్కున వేలువేసుకునన్నరు. ఏదేమైన శాంత తన అత్తగారిని ఒంటరి చేసి తన జీవితాన్ని తను చూసుకోవడం మాకెవరికి నచ్చలేదు.పైగా అత్తగారిని చూడాల్సిన

హక్కు ఒక కోడలి గా తనకు ఎంతైనా ఉంది. ఇక చేసేదేమి లేక ఆ పెద్దావిడను అనాథాశ్రమం లో చేర్పించాల్సి వచ్చింది.ఇలా శాంతనే కాదు ,ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో అతని ఆస్తితో మాత్రమే బంధం ఉంది, అత్తమామలతో ఆడబిడ్డలతో మరిది తో మాకే సంబందం లేదు, వాళ్ళు మాకేమి కారు

అన్నట్టు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకుని అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా 'భార్యభర్తల' బంధం లోనే కాదు 'తల్లిదండ్రుల' దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకోని పిల్లలు,మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైన చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులను పిల్లలు..భార్యను

భర్త.. భర్తను భార్య.. చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా 'నేడు ప్రతీ బంధం లోను డబ్బుకు మాత్రమే విలువ' ఇవ్వడం చూస్తుంటే, మనం ఇంత చదువుకొని గొప్ప 'టెక్నాలజీ' ని మన సొంతం చేసుకున్నమని ఆనందపడుతుంటాము, కానీ అసలు మనం సాధించిందేమిటి, బంధాలు,సాంప్రదాయలు, మర్యాదలు ఏమి తెలియక 'క్రూర జంతువుల' లాగా బ్రతికిన 'ఆది...మానవుని ' దగ్గరికే వెళ్తున్నామా అనిపిస్తుంది .


Rate this content
Log in