Veeresh Darshanam

Others

5.0  

Veeresh Darshanam

Others

భార్య ? భర్త ?

భార్య ? భర్త ?

4 mins
489


అంతా అనుభవించేసినా సన్యాసి మాటలకి కుర్రాడు బలైనట్టు ......

కొన్ని సంవత్సరాల కిందటే పెళ్ళైన విజయ్ కాపురంలోని చిచ్చు కొత్తగా పెళ్ళై ఇంకా పూర్తిగా ఏ అచ్చట ముచ్చట తీరని రాజు కాపురంలో తంటాలు తెచ్చి పెట్టింది . ఎలా అంటే , రాణి ..నా స్నేహితుడు విజయ్ లేడు ....పాపం వాడి భార్య సంగీత వాణ్ని ముప్పుతిప్పలు పెడుతుందట , కాదు కాదండి నేను సంగీతతో మాట్లాడాను విజయ్యే తనతో అనవసరంగా చిన్న చిన్న వాటికి తగువులు ఆడుతున్నాడట . ఆ ..

దొందు దొందే మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళకు కాక మగవారి వంతున ఎప్పుడు మాట్లాడతారని ,

తప్పెవరిది అనే స్పష్టత లేకుండా సాటి స్త్రీ అని మద్దతిస్తున్నావు అంటూ విసుకున్నాడు రాజు.

మరి మీరు మాత్రం మీ స్నేహితుడని తన వంతున మాట్లాడుతున్నారుగా ..అయిన ఏంటండీ మీ

మగాళ్ల గొప్ప ఊరికే భార్యల మీద నోరు పారేసుకోవడం తప్పితే ఏం తెలుసు మీకు అని గట్టిగా అరిచేసింది రాజు పైన . ఇంక రాజు ఊరుకుంటాడా , తను కూడా కోపంతో అసలు మా మగాళ్ళే లేకపోతే మీకు తిండి ఎక్కడ నుంచి వస్తుందే అంటూ ఊగిపోయాడు. మా ఆడవాళ్ళు లేకుంటే వంట ఎవరు చేసి పెడతారు అని కౌంటర్ ఇచ్చింది రాణి. ఇలా మాట మీద మాట పెరుగుతూనే

పోతుంది తప్ప తగ్గట్లేదు . చివరకు రాణి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది . ఏమైన

చేసుకుంటుందేమోనన్న భయంతో రాజు కూడా లోపలికి పరుగు తీసాడు . బాధలో రాణి దేవుడి

పటం దగ్గర నిలబడి స్వామి ఎన్ని రోజులు మాకి కష్టాలు , ఈ మగాళ్ళకి మా బాధ అర్ధమైయ్యేలా

చెయ్యి స్వామి అని మొర పెట్టుకుంది . వెంటనే అవును స్వామి ఈ ఆడవాళ్ళకు కూడా

అర్ధమైయ్యేలా చెయ్యి స్వామి అంటూ తను కూడా దేవుడికి అర్జీ పెట్టుకున్నాడు . ఉన్నట్టుండి

దేవుడు ప్రత్యక్షమయ్యాడు . అలా ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షమయ్యేసరికి వారి నోట వెంట మాట

రాలేదు . ఇది కలా లేక నిజమా అర్ధం కావడం లేదు . రాణి తడబడుతూ స్వా..స్వా..స్వామి నా మొర

ఆలకించి నిజంగానే వచ్చరా? నేను నమ్మలేకపోతున్నా..!

కోరికలతో మమ్ములను చంపుతారు.

ఎదురైతే ఇలా వింతగా చూస్తారు. నీ కోరిక ఏమిటో ఇప్పుడు కోరుకో అని దేవుడు వరమివ్వగా ....

సంసారంలో భార్యనే గొప్ప అని ఈ మగవాళ్ళకి తెలిసేలా చెయ్యి స్వామి అని రాణి కోరుకుంది .

లేదు స్వామి మగాళ్ళే గొప్ప అని వాళ్ళకి తెలిసేలా చెయ్యి అంటూ రాజు కోరుకున్నాడు. సరే

మీకిరువురిలో ఎవరు గొప్ప ? ఇంకా ఎవరి అవసరం ఇంటికి ఎక్కువ ఉంటుంది అని తెలిసేలా

చేస్తాను . మీకిద్దరికి ఒక నెల రోజుల పాటు మీ ఆత్మలను ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరం లోకి

మారుస్తున్నాను .కానీ బయట ప్రపంచం మీలో జరిగిన మార్పును గుర్తించలేదు . గొంతు కూడా

మారాదు . కేవలం ఆత్మలను మాత్రమే మారుస్తున్నాను , నెల రోజుల తర్వాత మరలా వచ్చి మీ ఆత్మలను యదాతదంగా మార్చేస్తాను అంటూ దేవుడు అన్నట్టు గానే వారి ఆత్మలని మార్చేసి

మాయమయ్యాడు. ఇప్పుడు తెలిసోస్తుంది మా విలువ అని ఎవరికి వారు మనుసులో అనుకుంటూ

పడుకున్నారు. ఇక పొద్దున లేచాక ఒకరి పనుల్లో మరొకరు అంటే రాజు శరీరంలో ఉన్న రాణి

ఆఫీసుకి వెళ్లడానికి తయారు ...రాణి శరీరంలో ఉన్న రాజు ఇంటి ...నిమగ్నమయ్యారు.

మొదటి రోజు ఇద్దరికీ బాగానే గడిచింది. మరుసటి రోజు వంట కాస్త ఆలస్యమవటంతో అరగంట

ఆలస్యంగా వచ్చిన రాణిని బాస్ తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు.రాణికి అదే మొదటిసారి అన్ని

తిట్లు భరించడం . ఇంట్లో భర్త రాజు తిడితే క్షణం ఆలస్యం చేయకుండా కౌంటర్ ఇచ్చే రాణి బాస్ కావడంతో ఏమి అనలేక తిట్లన్నీ భరించాల్సి వచ్చింది. ఒకరోజు పనివేళలో ఉన్నప్పుడూ ఆరోగ్యం

బాగాలేదని రాజు నుంచి ఫోన్ వచ్చింది.కాసేపు అనుమతి తీసుకొని రాజుని ఆసుపత్రికి తీసుకొచ్చినా

...రాణికి ప్రశాంతత లేకుండా పోయింది ,కాసేపు కూడా కాక ముందే ఆఫీసు నుంచి రమ్మని ఫోన్

వచ్చింది. ఇక్కడేమో ఇంకా పని అవ్వలేదు కానీ అక్కడ నుంచి ఒకటే కాల్స్ . రాజుని డాక్టర్ దగ్గర

చూపించి ఇంటి దగ్గర వదిలి పెట్టి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవ్వటంతో బాస్ చేత

మళ్ళీ మాటలు పడాల్సి వచ్చింది. ఆలస్యం అయినప్పుడు ఒకసారి ,పని అవకపోవటం వలన

ఒకసారి , పనిలో తప్పులు జరిగినప్పుడు ఒకసారి ..ఇలా ఏదొక విషయంలో రాణి రోజు తిట్లు తినాల్సి వస్తూనే ఉంది. ఒకరోజు పనిలో ఏకంగా లక్ష రూపాయిలు తేడా వచ్చింది. ఎందుకు అంత తేడా

వచ్చిందో ఎంత ఆలోచించిన అర్ధం కావట్లేదు రాణికి . అది కనుక్కోలేకపోతే తను సొంతంగా తన

డబ్బు లక్ష కట్టాల్సి వస్తుందన్న భయంతో రెండు రోజులు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు, ఎలాగో

మూడో రోజు కనుక్కోగలిగింది . అది కనుక్కునే వరకు రాణి పడ్డ మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు . గండం నుంచి బయట పడ్డా అనుకునే లోపు ఇంకో తలనొప్పి వచ్చిపడింది. రాజు స్నేహితుడు

డబ్బులు అవసరమై అప్పు అడగడంతో ఇచ్చింది రాణి. అతను తిరిగిచ్చే లోపే రాజు తండ్రి కూడా

డబ్బులు అవసరమై ఫోన్ చేశాడు . మామగారికి ఎలాగైనా డబ్బు సర్దాలి అనుకుని బయట నుంచి

అప్పు తెచ్చి ఇచ్చింది. కొద్దిరోజులకి ఒకవైపు అప్పిచ్చినవాడు డబ్బు ఇవమంటూ ఒత్తిడి

పెడుతున్నాడు. ఇంకోపక్క రాజు స్నేహితుడి నుండి ఏ అలికిడి లేదు. ఇప్పుడు వాడి అప్పు ఎలా

తీర్చాలో తెలియక జుట్టు పీక్కునెంత ఒత్తిడిలో పడిపోయింది రాణి. ఇలా రోజు ఏదొక ఒత్తిళ్లతో ఉన్న

రాణి ఉత్తి పుణ్యానికే రాజు మీద అరిచేసేది కూడా. చూస్తుండగానే నెల కూడా అయిపోవస్తుంది .

నెల చివరి రోజున రాణి రాజు వద్దకు వచ్చి నన్ను క్షమించండి కాపురంలో భర్తె గొప్ప. రోజు

ఆఫీసులో ,ఇంట్లో ఒత్తిళ్లతో మగవారు ఎంత సతమతం అవుతారో అర్థం అయ్యింది. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా భార్య వరకు కష్టం రానివకుండా ఒక ఇంటిని నడిపించటానికి , ఇంటి బారానంత బుజాన

వేసుకుని మోస్తారు . ఎన్నో మాటలను భరిస్తారు. సమాజం లో తన కుటుంబాన్ని ఒక స్థాయిలో

ఉంచడానికి ఎంతో కష్టపడతారు. నిజంగా మీరే గొప్పండి అంటూ తన ఓటమిని ఒప్పుకుంటున్న

సమయం లో , లేదు లేదు రాణి భార్యలే గొప్ప. మొదట్లో ఏమో అనుకున్న కానీ చేస్తుంటే తెలిసింది

ఎంత కష్టం అని , మేము మీకు ఏమాత్రం సాటిరాము. ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసి ,వంట చేసి భర్తను ఆఫీసుకు పంపి తిన్న బాసర్లన్ని తోమెయ్యాలి .భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి

వస్తున్నాడంటే గంటన్నర ముందు నుండే వంట పని మళ్ళీ మొదలెట్టాలి. ఇకపోతే సాయంత్రం

ఇల్లు ఊడ్చి మిగిలిన పనులు చేసుకుని మళ్ళీ రాత్రికి వంట చేసి మళ్ళీ బాసర్లు తోమాలి .ఇలా

రోజంతా పని చేస్తూనే ఉండాలి.మాకైనా సాయంత్రం నుంచి కాలీనే , మీకు అది కూడా ఉండదు.

ఇంక పిల్లలున్న వాళ్ళ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఒక వైపు భర్త, ఇంకో వైపు పిల్లల పనులతో

తలప్రాణం తోకకొస్తుంది. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పనులు చేసే ఆడవారి గురించి ఎంత

చెప్పినా తక్కువే.కాబట్టి భార్యలే గొప్ప అని రాజు అన్నాడు. లేదండీ మీరే గొప్ప అని రాణి , కాదు

మీరే గొప్ప అని రాజు , ఇలా వారి మాటామంతీ చిన్నగా తగాదాకు దారి తీయబోయే క్రమంలో దేవుడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు .ఒక సంసార జీవితంలో భార్య, భర్త ఇద్దరు సమానమే. మానసికంగా శారీరకంగా ఇద్దరికీ ఒత్తిళ్ళు ఉంటాయి. ఎవరు ఎక్కువ కాదు ,ఎవరు తక్కువ కాదు అని మీరు తెలుసుకోవాలనే మీ ఆత్మలని మార్చాను .భర్త ఒక మాట అన్నా లేక ఒక దెబ్బ వేసినా భార్య

సర్దుకుపోవాలి .అదే భార్య తిట్టిన ,కొట్టిన భర్త సర్దుకుపోవాలి .ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని, ఒకరి

పనికి ఇంకొకరు గౌరవం ఇస్తూ సాగిపోతుండాలి .ఇది తెలియక చాలా మండి నువ్వేంత నువ్వేంత

అనుకుంటూ పచ్చని కాపురాలని నాశనం చేసుకుంటున్నారు.ఇక మీదనైనా సుఖ సంతోషాలతో

నలుగురికి ఆదర్శంగా నిలిచేలా జీవించండి అంటూ దీవించి మాయమైపోయాడు. భార్య భర్తల

బంధాన్ని అర్థం చేసుకున్న రాజు రాణి మధ్య తరువాత ఎప్పుడూ గొడవ జరగలేదు.


Rate this content
Log in