స్వర్గానికి నిచ్చెనలు
స్వర్గానికి నిచ్చెనలు
తెలుగు భాషను నేర్వని, మాట్లాడని, సరిగా రాయలేని తెలుగు వారు తెలుగులో విద్యాబోధన అని ఉద్యమ వాసనా భరిత వ్యాసములు, మాటలు గుప్పించేస్తూంటారు.
నిర్దుష్టంగా సాంకేతిక, పారిభాషిక పదాలు లేని భాషలో సెకను సెకనుకీ పెరిగి పోతున్న జ్ఞాన భాండాగారాన్ని
విద్యార్థులకు ఎలా అందించగలరు?
అభిమానం తప్ప ఆచరణ, శ్రద్ధ లేని జాతి ఏమీ చేయలేదు. అంతర్జాల సామాజిక సాలెగూళ్ళలో వాపోవడం, వాళ్ళకీ వీళ్ళకీ సలహాలు ఇవ్వడం తప్ప.
జ్ఞాన సముపార్జనకు భాషాధ్యయనం తప్పని సరి. తెలుగైనా, ఇంకే భాష అయినా ముందు భాషను నేర్చుకోక విద్యాబోధనకై అర్రులు చాచడం పసితనం. సర్టిఫికెట్ చదువులు ఏ బాషలో అయినా ఒకటే. భాష సరిగా నేర్వక సర్టిఫికెట్ పొందాలనుకోవడం స్వర్గానికి నిచ్చెనలు వేయడం.
నోట్: ఇంతకీ ఏ తెలుగు మాండలికంలో విద్యాబోధన జరుగుతుంది? యాసల భాషలు చదువుకు పనికిరావు. చదువు రాజకీయం కాదు. చదువు శ్రద్ధ, జ్ఞాన సముపార్జన.