ముసలి పనిమనుషులు
ముసలి పనిమనుషులు
విదేశాలకు చదువు, ఉద్యోగాల కోసం వెళ్ళిన భారతీయులను గొప్పవారు అనుకోవడం మన సాంప్రదాయం.
అక్కడి వారి జీవనం గురించి మనకేమీ తెలియదు. రెండు మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చి ముఖం చూపించి మన adulation అందుకొని మళ్ళీ వాళ్ళ జీవనానికి వెళ్లి పోతారు.
ఎవరైనా డబ్బు, హోదా, పేరు ప్రతిష్టలు సంపాదిస్తే వారు గౌరవనీయులు అవుతారు.
దానికి సంబంధించిన దర్పమూ వారికి అబ్బుతుంది. జీవనాలలో హెచ్చు తగ్గులు సహజం.
కాని విదేశాలకు వెళ్ళిన వారిలో ఎవరూ వారి ఇంటి బాధ్యతలు నిర్వహించే సావకాశం లేదు.
పై పైచ్చు తమ తల్లిదండ్రులను, అత్తమామలను అక్కడికి రప్పించుకుని చాకిరీ చేయించుకుంటున్నారు. మన పిల్లలే కదా అని ఈ ముసలాళ్ళు ముక్కుతూ, మూలుగుతూ అయినా చాకిరీలు చేస్తున్నారు. ఇదంతా అన్యాయం.
అమెరికా లాంటి దేశాల్లో పని మనుషులు ఉండరు. అన్ని
పనులూ మనమే చేసుకోవాలి. వాళ్ళకి పిల్లలు పుట్టగానే ఈ అమెరికా పిల్లలు తమ పెద్దవాళ్ళని పనిమనుషులుగా పిలుస్తున్నారు. అంతా విపరీతంగా జరుగుతోంది.
40 ఏళ్ళ క్రితం ఉన్న ఫారిన్ మోజు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది. మానవ బంధాలు, సంబంధాలు తమ విలువను కోల్పోయాయి. ఇప్పుడు ముసలాళ్ళుగా ఉన్న తరం, విదేశంలో అయినా, మన దేశంలో అయినా పనిమనుషుల స్థాయికి దిగజారింది.
ఒక తరం ఇంటిని వదిలేసి బయటకు హక్కుల కోసం వెళ్ళినపుడు ఆ ఇంటిని ఈ ముసలాళ్ళు చూస్తున్నారు. మనుమలు/మనుమరాళ్ళను పెంచుతున్నారు. ఇంటో అంత చాకిరీ చేస్తున్నారు. కూతురో, కోడలో ఉద్యోగం చెయ్యడానికి ఇంటి భారం అంతా మళ్ళీ మోస్తున్నారు.
ఈ పరిస్థితి బాగులేదు. అమానుషంగా ఉంది.
ముసలాళ్ళు, పసికందులు అనాథలుగా వదిలి వేయబడుతున్నారు. వాళ్ళకి డిగ్నిఫైడ్ లివింగ్ లేదు. ముఖ్యంగా ముసలాళ్ళైన స్త్రీలకు.