చెలామణీ
చెలామణీ
మనం సమాజాన్ని గౌరవిస్తూ, సాంప్రదాయం లేదా మన చదువులు చెప్పిన మంచి మాటలను అనుసరిస్తూ; కొండొకచో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దామని అనిపించినా, సమాజానికి భయపడి మన "పేరు ప్రతిష్టలను" "కాపాడుకుంటూ" జీవిస్తాము.
కాని, మనలోని చాలామంది చెయ్యవలసిన అన్ని వెధవ పనులూ చేసేస్తోంటారు; సమాజంలో మాత్రం వారి "పేరు, ప్రతిష్టలు"
అలాగే ఉండాలి. ఈ టైపు మనుషులు అన్ని రంగాల్లోనూ ఉండి సమాజాన్ని నడుపుతున్నారు. అందువల్లే కోర్టులలో నిరూపించ వీలుకాని విధంగా వెధవ పనులు చేస్తూ, సమాజంలో దర్జాగా జీవిస్తున్నారు.
మన అందరి
జీవితాలు అస్తవ్యస్తం అవడానికి ఈ ఊసరవెల్లులే కారణం.
న్యాయం, నీతి, గౌరవాలు, మర్యాదల గురించి మాట్లాడతారు అంతే. ప్రవర్తనలో ఇసుమంతైనా చూపించరు. కాని వారి గౌరవ మర్యాదలకే లోటు రారాదు. పెద్దమనుషుల్లా చెలామణీ అవ్వాల్సిందే.
పూర్వకాలంలో దుష్టులు తాము దుష్టులమని బాహాటంగా చెబుతూ బహిరంగంగా వ్యవహరించే వారు. ఇప్పుడు చాలామంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయ్యి, సంఘం సుఖశాంతులు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
దుష్టులు మంచివారిగా చెలామణీ అయ్యే కాలం ఇది. అన్ని హంగులు వారికే.