Chintapalli SivaSanthosh

Drama

4.3  

Chintapalli SivaSanthosh

Drama

అన్నా చెల్లి

అన్నా చెల్లి

2 mins
549


ఉదయం 7.45, వరంగల్ సెంట్రల్ రైల్వేస్టేషన్

ప్రియ ,తన నాలుగేళ్ళ పాప,భర్త రాకేష్ తో పాటు రైల్వేస్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురుచూస్తుంది. తను తన పుట్టింటికి వెళుతుంది.కల్వపూడికి.

“ నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను,నేను లేను అని భోజనం దగ్గర అశ్రద్ధ చెయ్యద్దు.అసలే రోజులు బాగోలేదు.జాగ్రత్తగా ఉండడండి.” అంటూ భర్తకు జాగ్రత్తలు చెపుతుంది ప్రియ. ఇంతలో ట్రైన్ రానే వచ్చింది.

మాట్లాడుతూ నే ట్రైన్ ఎక్కి తన కూతురు చేత బై బై చెప్పించి ,వెళ్లి తన భోగిలో కూర్చింది.

ట్రైన్ కదిలింది.ట్రైన్ ముందుకు కదిలే కొలది తన చిన్ననాటి జ్ఞాపకాలోకి కదిలింది ప్రియ.

 కల్వపూడి గ్రామం,

ప్రియకు ఎనిమిది సంవత్సరాల వయస్సు

స్కూల్ కి వెళ్ళా డానికి ఏడుస్తుంది ప్రియ.తల్లి ఎంత చెప్పినా వినిపిచుకోకుండా ఏడుస్తునే ఉంది ప్రియ.

ఇంతలో ప్రియ అన్నయ్య వాసు వచ్చాడు.

“ ఎడవకు చెల్లి నేను నీతో వస్తాను, నేను అక్కడే ఉంటాను గా నువ్వు నాతో రా పర్వేలేదు అంటూ చెల్లెలు చేతిని పట్టుకుని స్కూల్ కి తీసుకుని వెళ్ళాడు వాసు.

అది జరిగిన తర్వాత ప్రియ ఎన్నడు స్కూలు కి వెళ్లడానికి భయ పడలేదు.

ఇంట్లో అమ్మానాన్న ఉన్న ప్రియకు మాత్రం అన్నయ్యే అన్ని అయ్యాడు.

 ప్రియ కాలేజ్ కి వెళ్లే రోజులు….

ఒక రోజు కాలేజ్ కు వెళుతున్న ప్రియకు యాక్సిడెంట్ అయ్యింది. జరిగిన ప్రమాదం పెద్దది కాకపోవడం వల్ల ప్రియ కు పెద్ద దెబ్బలు తగలేదు.కానీ అన్న వాసు మాత్రం తన ప్రాణమే పోయినంతగా కంగా రూ పడ్డాడు.దానికి కారణం తన చెల్లి అంటే తన ప్రాణం కంటే ఎక్కువ అయినందు వల్లే.

ప్రియకు అన్నయ్య వాసు తోడు ఉంటే ధైర్యం,

వాసుకు చెల్లి అంటే ప్రాణం.

ఇద్దరి చదువులు పూర్తి అయ్యాయి.

వాసు ఆర్మీ లో జాయిన్ అయ్యిడు.తన చెల్లెలిని వదిలిపెట్టడానికి వాసు మనసు ఒప్పుకోవడం లేదు.

కానీ ప్రియనే వాసుని ఒప్పించింది.

వాసు ఆర్మీకి వెళ్ళాడు.

వాసు ఆర్మీలో జాయిన్ అయ్యిన రెండు సంవత్సరాలు కు ప్రియ పెళ్లి అయింది.

ప్రియ పెళ్లి వాసు లేకుండానే జరిగిపోయింది. ఏవో కారణాలు వల్ల వాసు రాలేక పోయాడు.


ఇంతలో తను దిగవలసిన స్టేషన్ వచ్చింది.

ట్రైన్ దిగి బయటకు వచ్చి కల్వపూడికి వెళ్లే బస్సు ఎక్కి,ఇంటికి చేరుకుంది.

ఇంటికి చేరుకున్నాక ఇంట్లో వాళ్ళతో కాసేపు గడిపి,

అన్నయ్యకు రాఖీ కట్టి వస్తాను అని చెప్పి ,తన కూతురు ని వాళ్ళ అమ్మకు అప్పగించి బయలుదేరింది.

వాళ్ళ ఇంటికి కాస్తా దూరంలో వాళ్ళ తోట ఒకటి ఉంది.ఆ తోట అంటే వాసుకు ప్రియకు చాలా ఇష్టం .ప్రియ అక్కడకు చేరుకుంది.

“ అన్నయ్య ! రాఖీ కట్టడానికి వచ్చాను.ఎలా ఉన్నావ్ అంటూ”

తన అన్న సమాధి ని తాకింది.కళ్ళలో తిరిగే కన్నీళ్లు తో.

ప్రియకు పెళ్లి అయిన ఏడాదిలో జరిగిన ఒక ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో వాసు వీరమరణం పొందాడు.

ప్రియ తనతో తెచ్చిన రాఖీని వాసు సమాధి పై పెట్టింది.అక్కడే కాసేపు గడిపి తిరిగి ఇంటికి చేరింది.

రెండు రోజులు కల్వపూడిలో గడిపి తిరిగి వరంగల్ వెళ్ళిపోయింది.


Rate this content
Log in

Similar telugu story from Drama