Chintapalli SivaSanthosh

Crime

4.8  

Chintapalli SivaSanthosh

Crime

సావిత్రి

సావిత్రి

7 mins
23.6K


సావిత్రి LLB

Written by – Santhosh

జూన్ 1,సమయం ఉదయం 9.45 సమయం, కలకత్తా జిల్లా కోర్టు ప్రాంగణంలో

 రిపోర్టర్ గీతా మాటల్లో…

గతనెలలో సంచలనం రేపిన జరిగిన జూనియర్ డాక్టర్ స్వప్న హత్య కేసులో కలకత్తా జిల్లా కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన డాక్టర్ త్రినా5 ను పోలీసులు కాసేపట్లో కోర్టు వద్దకు తీసుకురానున్నారు. అయితే మరో పక్క ప్రధాన నిందితుడు త్రినాథ్ తరుపు న్యాయవాది అయిన సావిత్రి పై ఇక్కడ మహిళ సంఘాలు నిరసనలు చేపట్టాయి.ఒక అమ్మాయి హత్యకేసులో నిందితుడు తరుపు వాదించ రాదు అంటూ ఆందోళన లు చేపట్టాయి. ఇన్ని వివాదాలు,నిరసనలు మధ్య కలకత్తా జిల్లా కోర్టు ఇరువురి వాదనలు విన్న తరువాత ఎలాంటి తీర్పు ఇస్తుందో అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.


సావిత్రి ఆఫీస్, ఉదయం 10 గంటల సమయం….


తన మూడేళ్ళ కూతుర్ని రెడీ చేస్తూ,తన జూనియర్ లాయర్ కీర్తి కి కొన్ని సూచనలు చేస్తోంది. ఈ కేసును ఇద్దరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని కేసుకు సంబంధించిన ఆధారాలు సంపాదించారు.కోర్టులో వాళ్ళు అనుసరించాల్సిన విషయాలు చర్చించుకున్న తర్వాత తన కూతురుని వాళ్ళ అత్తగారి అప్పచెప్పి,ఆశీర్వాదం తీసుకుని తన జూనియర్ కీర్తి ని తీసుకుని కోర్టుకు బయలుదేరింది.


మే 02,ఆనంద్ హాస్పిటల్, సమయం


డాక్టర్ త్రినాద్, ఒక పేషెంట్ కు సర్జరీ చేసి వచ్చి ముఖం కడుక్కొని తన గదిలో విశ్రాంతి తీసుకుంటు ఉండగా తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ స్వప్న నెంబర్ అది. మొదట కాల్ వచ్చింది త్రినాథ్ ఆ కాల్ ను కట్ చేసాడు. మరో కాల్ వచ్చింది దానిని కూడా కట్ చేసాడు.మూడోసారి కాల్ తప్పక లిఫ్ట్ చేసాడు.తనను కాపాడమని తనను చంపబోతున్నారని చెపుతూఉండగా కాల్ కట్ అయింది.

త్రినాద్ వెంటనే స్వప్న ఇంటికి బయలుదేరాడు.చాలా వేగంగా స్వప్న ఇంటికి చేరాడు.డోర్ తీసుకుని స్వప్న గదిలోకి చేరగా అప్పటికే స్వప్న రక్తపు మడుగులో శవమై కన్పించింది. వెంటనే స్వప్న ను ఆసుపత్రికి తీసుపోవడానికి ప్రయత్నస్తూఉండగా స్వప్న తల్లి దండ్రులు లోపలికి ప్రవేశించారు.తన కూతుర్ని హత్య చేశాడు అంటూ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చారు.తను హత్య చేయలేదు అని ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోలేదు.ఇంతలో పోలీసు వచ్చారు.త్రినాద్ ను ప్రాధిమిక నిందితుడు గా కేసు నమోదు చేశారు.త్రినాద్ ను రిమాండ్ కు తరలించారు.

కలకత్తా లోని జూనియర్ డాక్టర్ లు అందరూ స్వప్నకు,తల్లిదండ్రులకు న్యాయం జరగాలి అంటూ ఆందోళనలు చెప్పట్టారు.

పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసులకు విచారణ లో తెలిసిన విషయాలు,

స్వప్న సొంత ఊరు తిరుకురు,బిల్వాడు,కలకత్తా. తల్లిదండ్రులు రమేష్,పద్మ.వారిది సంపన్న కుటుంబం.స్వప్న చదువుల కారణంగా ఎప్పుడు నుండో కలకత్తా లో నే ఉంటుంది. తనకు తన డాక్టర్ వృత్తి పట్ల అమితమైన ఇష్టము ఉండటంతో అనేక విషయాలు నేర్చుకోవాలి అని తనకు ఉండేది అని కానీ డాక్టర్ త్రినాద్ తనకు సహకరించ కుండా తనను హింసిస్తూ ఉండేవాడు అని, అనేక సార్లు వాళ్లిద్దరూ మధ్య అనేక గొడవలు జరిగాయని అందుకే తనను చంపి ఉంటాడని ప్రాధమిక విచారణలో తేలింది.


మే 11,కలకత్తా జిల్లా కోర్టు,కేసులో మొదటి విచారణ


స్వప్న తరుపు న్యాయవాది స్వామి వాదన ప్రారంభం అయింది.మై లార్డ్ పది రోజులు కిందట నా క్లయింట్ అయిన రమేష్ యొక్క ఒక్కగాని ఒక కూతురు స్వప్నను నిందితుడు త్రినాద్ పట్టపగలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో హత్య చేశాడు అని ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు ఇచ్చిన వాగ్మూలం మై లార్డ్. ఇదే ప్రధాన సాక్ష్యం మై లార్డ్.

త్రినాదే హత్య చేయడానికి కారణం ఏంటి అని అడిగారు జస్టిస్,

దానికి సమాధానం ఇచ్చారు న్యాయవాది స్వామి, మై లార్డ్ హత్య గావించబడ్డ స్వప్న కు డాక్టర్ వృత్తి పట్ల ఎంతో ఇష్టం గా ఉండేదని,కొత్త విషయాలు నేర్చుకోవాలి అని స్వప్నకు ఉండేదని కానీ త్రినాద్ దానికి సహకరించే వాడు కాదు అని తద్వారా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతు ఉండే వాని పోలీసు విచారణ లో తేలింది మై లార్డ్. ఆ కక్ష్య తోనే చంపాడు మై లార్డ్.

మీరే హత్య చేశారని ఆరోపింస్తున్నారు,మీరు చెప్పవలసింది మీరు చెప్పండి అన్నారు జస్టీస్.

దానికి త్రినాద్ సమాధానం: “ సార్! స్వప్న మంచి అమ్మాయి తెలివైననది.తనకు నాకు అపార్థాలు వచ్చేవి అది నిజమే, తన స్థాయికి మించి వైద్యం అందించాడానికి నేను ఒప్పుకునేవాడ్ని కాదు అందుకే గొడవలు జరుగుతూఉండేవి కానీ వేరే ఉద్దేశ్యం కాదు. ఇంకా హత్య విషయానికి వస్తే నేను హత్య చేయలేదు నేను ఈ మాట మొదట నుండి చెప్తున్న ఎవరు వినడం లేదు.అసలు ఆ రోజు ఏమి జరిగిందంటే నాకు స్వప్న కాల్ చేసి తనను చంపబోతున్నారు సార్ అంది,నేను వెంటనే అక్కడికి వెళ్ళేసరికి స్వప్న చనిపోయి ఉంది.

త్రినాద్ చెపుతు ఉండగా లాయర్ స్వామి “ అతను చెప్పేది అబద్ధం మై లార్డ్, ఆ గదిలో దొరికిన కత్తి పై ముద్దాయి వేలిముద్రలు ఉన్నాయి .ఇతను హత్య చేయకపోతే ఆ కత్తి పై న ముద్దాయి వేలిముద్రలు ఎలా వస్తాయి మై లార్డ్.

త్రినాద్ “ అది అబద్ధం సార్, ఆ కత్తి పై నా వేలిముద్రలు ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదు సార్.

జస్టీస్ : ముద్దాయిగా వున్నా త్రినాద్ గౌరావమై డాక్టర్ వృత్తి లో ఉన్న కారణంగా అతనికి నిరపరాధి గా నిరూపించుకోవాడానికి అవకాశం ఇస్తూ , న్యాయవాది ని నియమించుకుని తగిన ఆధారాలు సాక్ష్యా లతో వచ్చే నెల అనగా జాన్ ఒకటో తేదీన కోర్టుకు హాజరు కావాలసిందిగా ఆర్డర్ వేస్తూ తీర్పును వాయిదా వేయడం అయినది.

హత్యకు గురియైనది అమ్మాయి అందులోనూ జూనియర్ డాక్టర్ కారణంగా కలకత్తా లో జరుగుతున్న నిరసనలు అల్లర్లు మధ్య త్రినాద్ తరుపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు.  కోర్టు తీర్పు నేపధ్యంలో త్రినాద్ తరుపున వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఆ సమయంలో త్రినాద్ తరుపు వాదించడానికి ముందుకు వచ్చింది లాయర్ సావిత్రి.


జూన్ 1, సమయం 10 గంటల సమయం,కలకత్తా జిల్లా కోర్టు


పోలీసులు త్రినాథ్ ను కోర్టుకు తీసుకు వచ్చారు.కోర్టులో ప్రేవేశ పెట్టారు.విచారణ మొదలైనది…

జస్టీస్ డాక్టర్ త్రినాథ్ మీ తరపు న్యాయవాది ఉన్నారా?,

త్రినాద్ లేరు సార్ అని చెబుతుండగా , 

సావిత్రి, క్షమించాలి మై లార్డ్ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయింది.నేను త్రినాద్ తరుపు వాదించడానికి నాకు అవకాశం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నా మై లార్డ్….

జస్టిస్, పర్మిషన్ గ్రాంటెడ్.

సావిత్రి, థాంక్స్ మై లార్డ్.

లాయర్ స్వామి, మై లార్డ్ ముద్దాయే హత్య చేశాడు అని నిరూపించే ఆధారాలు మీ సబ్మిట్ చేసాం మై లార్డ్ వాటిని పరిగణలోకి తీసుకుని ముద్దాయికి శిక్ష విధించవలసినదిగా కోరుతున్నా మై లార్డ్. అంతే

జస్టిస్, మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి సావిత్రి…

సావిత్రి, థాంక్స్ మై లార్డ్ ,ముందుగా ఈ కేసు విచారించిన CI ముకుంద్ తో మాట్లాడేందుకు అనుమతి కోరుతున్న మై లార్డ్,

జస్టిస్, పెర్మిషన్ గ్రాంటెడ్

సావిత్రి, మీరే నా ఈ కేసును దర్యాప్తు చేసింది.

ముకుంద్, అవును

సావిత్రి, ఎవరు ఎవరిని మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు?

ముకుంద్, అమ్మాయి తల్లిదండ్రులు ను,ముద్దాయిని, ముద్దాయి పని చేస్తున్నా ఆసుపత్రి సిబ్బందిని ఇన్వెస్టిగేషన్ చేశాం.

సావిత్రి, ముద్దాయి అనుకుంటున్న త్రినాద్ ఏమి చెప్పారు మీకు,

ముకుంద్, హత్య తను చేయలేదు అని, హత్య జరిగిన రోజు తన నాకు కాల్ చేయబట్టే నేను అక్కడి వెళ్ళాను అని, కానీ నేను వెళ్ళే సమయానికే స్వప్నను ఎవరో హత్య చేశారని చెప్పరూ.

సావిత్రి, ఒకే మరి తల్లిదండ్రులు ఏమి చెప్పారు

ముకుంద్, త్రినాథ్ తమ కూతురు పట్ల సరిగా ఉండేవాడు కాదు అని , తనను ఎదో కారణం చేత తిడుతూ ఉండేవాడు అని చెపుతూ ఉండేదని వాళ్ళు చెప్పారు.ఆ కారణం చేత తమ కూతురుని చంపి ఉంటాడని వాళ్ళు చెప్పారు.

సావిత్రి,ఆసుపత్రి సిబ్బంది ఏమి చెప్పారు.

ముకుంద్, వాళ్ళు కూడా అదే చెప్పారు, త్రినాథ్ కు స్వప్న కు మధ్య తరుచు గొడవలు జరుగుతూఉండేవాని చెప్పారు.

సావిత్రి, అది సరే ఆసుపత్రి సిబ్బందిని మొత్తం అంటే ఏ ఒక్కరిని వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేశారా లేక త్రినాద్ కు సంబంధించిన వారినే మాత్రమే చేసా రా?

ముకుంద్, లేదు మొత్తం అందరిని ఇన్వెస్టిగేషన్ చేసాం.

సావిత్రి, ఒకే మరి ముద్దాయి చెప్పారు కదా తనకు ఆ రోజు ఫోన్ కాల్ రాబట్టే అక్కడికి వెళ్ళాను అని, మరి ముద్దాయి మొబైల్ ఎక్కడ ఉంది?

ముకుంద్, మా విచారణ సమయంలో మొబైల్ సంగతి మాకు తెలీలేదు.

సావిత్రి, note this point my lord, అలాగే ఆసుపత్రిలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సంజయ్ అనే పేరు వచ్చిందా ఎక్కడైనా???

ముకుంద్, లేదు సంజయ్ అనే ఉద్యో గి ఎక్కడ మా ఇన్వెస్టిగేషన్ లో రాలేదు.

సావిత్రి, my lord note this point . థాంక్స్ ముకుంద్ 

మై లార్డ్ అలాగే బాధితురాలు స్వప్న తల్లిదండ్రులు ప్రశించేందుకు అనుమతి ఇవ్వవలసినదిగా కోరుతున్న,

జస్టిస్, పెర్మిషన్ గ్రాంటే డ్

సావిత్రి, మిరేన స్వప్న తల్లిదండ్రులు???

లాయర్ స్వామి, ఇది అర్ధం లేని ప్రశ్న మై లార్డ్ ? ఏ తల్లిదండ్రులు కు అయిన ఇలాంటి ప్రశ్న ఎదురు అవ్వదు మై లార్డ్…

సావిత్రి, మై లార్డ్ కేసు కు సంబంధించి నంత వరకు ప్రతి ప్రశ్న అవసరమే మై లార్డ్,

డెఫిన్స్ లాయర్ గారు మాకు అడ్డు రాకుండా చూడవలసినదిగా కోరుతున్నా మై లార్డ్..

సావిత్రి, మిరేనా స్వప్న తల్లిదండ్రులు,

రమేష్, అవును మేమే

సావిత్రి, స్వప్న ఎప్పుడు పుట్టిందో చెప్పగలరా?

రమేష్,జనవరి 24 నా పుట్టింది,

సావిత్రి, ఎక్కడ పుట్టిందో చెప్పగలరా అంటే ఆసుపత్రిలో నా లేదా ఇంటి దగ్గరా అని

రమేష్, ఇంటిలోనే పుట్టింది.

సావిత్రి, note this point my Lord. 

సావిత్రి,అమ్మ మీరు చెప్పండి స్వప్నను మీరు చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవారు కదా చెప్పండి. స్వప్న ఏదైనా రాసేటప్పుడు ఏ చేతివాటం అంటే ఎడమ చేతితో రాస్తుందా లేదా కుడి చేతితో రాస్తుందా అని

పద్మ ,కుడి చేతి తోనే రాసేది

సావిత్రి, my lord note this point.  స్వప్న హత్య జరిగిన రోజు మీరు ఇంట్లో లేరు కదా ఎక్కడికి వెళ్లారు.

రమేశ్, మనసు ప్రశాంతత కోసం పక్కనే ఉన్న గుడికి వెళ్లాం.

సావిత్రి, పక్కనే ఉన్న గుడి అంటే అక్కడ ఒకటే గుడి ఉంది వేణు గోపాల స్వామి గుడి అదేనా.

రమేష్, అవును ఆ గుడీకే వెళ్లాం.

సావిత్రి, my lord note this point ఇక మీరు వెల్లచ్చు. 

మై లార్డ్ నిజానికి రమేష్, పద్మ అని పిలవబడుతున్న వీరిద్దరూ స్వప్న తల్లిదండ్రులే కాదు.నిజానికి స్వప్న తల్లిదండ్రులు మరణించి నాలుగు సంవత్సరాలు అయింది. దానికి సంబంధించి వారిద్దరి డెత్ సర్టిఫికెట్ ఇవి.మీకు సుబ్మిట్ చేస్తున్నాం. 

స్వప్న పుట్టిన తేదీ సంబంధించిన బర్త్ సర్టిఫికెట్

 అలాగే స్వప్నది ఎడమచేతి వాటం అని ఫోర్నేనిక్స్ ఇచ్చిన రిపోర్ట్ మై లార్డ్.

అలాగే హత్య జరిగిన రోజు మేము గుడికి వెళ్ళాం అని విళ్లు చెప్పిన గుడి గత నెలలుగా మరమ్మతులు జరుగుతున్న కారణం గా దర్శనా లు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఇచ్చిన ఆర్డర్ సంబంధించిన నకలు మై లార్డ్. అంతే కాదు మై లార్డ్ నిజానికి

రమేష్, పద్మ అని పిలవబడుతున్న వీరిద్దరూ పేర్లు నిజానికి శంకర్,గిరిజా లు. వాటికి సంబంధించిన ఆధారాలు మై లార్డ్.

నిజానికి వీళ్ళిద్దరూ స్వప్న తల్లిదండ్రులు దగ్గర పనిచేసే పని వాళ్ళు.స్వప్న తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత స్వప్న ను చూసుకోవాదానికి కలకత్తా తరుచు వస్తూ వెళ్లడం తో స్వప్న చుట్టూ పక్క వాళ్ళు నిజానికి విల్లే తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు.దాని ఆసరా గా తీసుకుని స్వప్న చంపి ఆస్తి మొత్తం కాజేయలని ప్లాన్ చేశారు. దానికి గిరిజా తమ్ముడు అయిన సంజయ్ ను వాడుకున్నారు.వీళ్ళ ప్లాన్ రెండు నెలలు ముందే మొదలయింది. దానికి డాక్టర్ త్రినాథ్ ను వాడుకున్నారు. సంజయ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి అక్కడ త్రినాద్ స్వప్న మధ్య జరిగే విషయాలను పరిశీలించి, వాటి ఆధారంగా చేసుకుని స్వప్న మర్డర్ ప్లాన్ తయారు చేసా డు. దానికి సంబంధించి త్రినాద్ వేలిముద్రలు సంపాదించాడు.అనుకున్న ప్లాన్ ప్రకారం స్వప్న ను చంపి ,కత్తి పైన త్రినాథ్ వేలిముద్రలు ఉండేలా చేశారు.దానితో జనాలను పోలీసులును దారి తప్పించి త్రినాథ్ ను ఇరికించి స్వప్న హత్య చేసి ఆస్తి ని కాజేయలనుకున్నారు.కానీ వాళ్ళు ప్లాన్ బెడిసికొట్టింది మై లార్డ్. 

డాక్టర్ త్రినాథ్ నిరపరాధి మై లార్డ్. ఈ హత్యకు ప్రధాన కారకులు అయిన గిరిజా,శంకర్ అలాగే సంజయ్ ను శిక్షించ వాల్సినది కోరుతున్న మై లార్డ్.

జస్టిస్, వాదనలు ప్రతివాదనలు విన్న తరువాత త్రినాథ్ నిరపరాధి గా భావిస్తూ త్రినాథ్ ను విడుదల చేస్తూ,ఈ హత్యకు కారకులు అయిన శంకర్ గిరిజా అలాగే సంజయ్ ను పట్టుకొవలసింది గా ఆదేశిస్తూ,ముగ్గురికి యావజ్జీవ కారాగారం విధిస్తు తీర్పు ఇవ్వడం జరుగుతుంది.అతి తక్కువ టైం లో ఈ కేసు కు సంబంధించిన ఆధారాలను చాకచక్యంతో పట్టుకుని ఈ కేసులో విజయం సాధించిన లాయర్ సావిత్రి ని కోర్టు అభినందిస్తుంది.

సావిత్రి, థాంక్స్ మై లార్డ్.

నిజానికి ఇది నా మొదటి కేసు. ఎప్పుడో ప్రాక్టీసు వదిలేసిన నేను ఈరోజు నా భర్త త్రినాద్ కోసం తిరిగి లాయర్ గా మారా మై లార్డ్.

జస్టిస్,ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అని నిరూపించావ్ . ఇక పై మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ. కోర్టు సెలవు ప్రకటింస్తుంది.

కోర్టు నుండి బయటకు వస్తున్న సావిత్రిని

రిపోర్టర్ గీతా, మేడం మీ భర్త ను నిరపరాధి బయటకు తీసువచ్చారు.మీకు గర్వంగా ఉందా?

సావిత్రి, యముడి నుండి తన భర్తను కాపాడుకున్న సతి సావిత్రి కి లేని గర్వము, మాములు లాయర్ సావిత్రి కి ఎందుకు, నా భర్తను నేను కాపాడులేకపోతే నేను బతకడమే వృధా.

గీతా, అసలు వాళ్ళు స్వప్న తల్లిదండ్రులు లే కాదు అనే అనుమానం ఎందుకు వచ్చింది.

సావిత్రి, వాళ్లు చాలా తెలివిగానే ప్లాన్ చేశారు గాని స్వప్న చదువు గురించి, చదువు పూర్తి చేసిన ప్రతి చోట స్వప్న వివరాలు ను మార్చలేకపోయారు.

Fir లో ఇచ్చిన పుట్టిన తేదీకి , తన చదువుకి సంబంధించిన వివరాలు లో ఉన్న పుట్టిన తేదీకి చాలా తేడా ఉంది. అందుకే తన వివరాలు తెలుసుకుంటూ తన స్కూలింగ్ దాకా వెళ్ళా, అప్పుడు తెలిసింది అసలు తన తల్లిదండ్రులు ఎవరో,మరి కలకత్తా ఉన్న తల్లిదండ్రులు ఎవరు అని కనిపెట్ట దానికి బిల్వాడు వెళ్ళా అక్కడ నిర్ధారించుకున్న.తన తల్లిదండ్రులు చనిపోయారు అని కలకత్తా లో వున్నా తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు అని.దానితో మొత్తం అర్ధమైంది.విల్లే కావాలని చేశారు అని.

గీతా, మేడం…

సావిత్రి, థాంక్ యు…

గీతా,

జూనియర్ డాక్టర్ స్వప్న హత్య కేసులో తీర్పును ప్రకటించింది కలకత్తా జిల్లా కోర్టు.

ప్రధాన నిందితుడు గా ఉన్న డాక్టర్ త్రినాద్ నిర్దోషి గా విడుదల చేసి, తమే హత్య చేసినట్లు ఒప్పుకున్న శంకర్ గిరిజా మరియు సంజయ్ లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఇక పై సావిత్రి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ…



Rate this content
Log in

Similar telugu story from Crime