Sudheer Kaspa

Crime

4.6  

Sudheer Kaspa

Crime

విహంగం-2

విహంగం-2

10 mins
555


సర్రున కారు వచ్చి ఆగింది.అక్కడే నిలబడి కానిస్టేబుల్ సెల్యూట్ చేసాడు.డి.ఎస్.పీ దీక్ష చుట్టూ చూసింది. బెల్లం చుట్టూ ఈగల్లా వరూ నాన్న చుట్టూ మూగి ఉన్న మీడియా జనాలు దీక్షని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి ఆమె చుట్టు ముట్టేసారు. ఒక్క అరగంట కూడా మీడియాకు లీక్ అవ్వకుండా ఆపలేరా అన్నట్టు ఎస్సై వైపు చిరాగ్గా ఓ లుక్ ఇచ్చింది దీక్ష.

“మేడం ఇంత దారుణమైన హత్య జరిగింది.నగరంలో ఈ నెలలో ఇది మూడో హత్య.దీనికి పోలీసుల వైఫల్యమే కారణమా? “ అడిగాడు ఓ కళ్ళజోడు విలేఖరి.

“ఇంత కంటే కొత్త ప్రశ్నలు రావా మీకు?” చిరాగ్గా దీక్ష

“మేడం ఈ హత్య అంతర్రాష్ట్ర ముఠా పనే అనుకుంటున్నారా”

“ముందు మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి”

“ఆ అమ్మాయికి ఉన్న ప్రేమ వ్యవహారమే కారణం అని తెలిసింది.ఆ కోణంలో ఎవరినైనా అనుమానిస్తున్నారా?

ఏం మాట్లాడలేదు ఆమె.అసహ్యంగా ఓ చూపు చూసింది.ఆమె తీక్షణమైన కళ్ళకు ఆ శక్తి ఉన్నట్టుంది. ఏ భావమైనా ఇట్టే అర్ధమైపోతాయి అవతలి వాళ్ళకి.నోర్మూసుకున్నాడు విలేఖరి.

ఇక చాలు ప్లీజ్ లెట్ అస్ డు అవర్ వర్క్ .....అని గుంపును పక్కకి జరిపి దీక్షని సంఘటనా స్థలానికి తీస్కెళ్ళాడు ఎస్సై.మేడంకి చిరాకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు.

మీడియా వాళ్ళు, తందూరి పొయ్యి అంటే ఏంటి?? ...అసలు మర్డర్ ఎలా జరిగి ఉంటుంది??.ఆ అమ్మాయి పేరు,కాలేజి, ఇంటి అడ్రెస్సు,లవ్ అఫైరు ఇంకా ఏవేవో లైవ్ లో బ్రేకింగ్ న్యూస్లు చెప్పేస్తూ బిజీ అయిపోయారు.

మొత్తం పరిశీలించి క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ తో మాట్లాడిన తరువాత.....

“అతని పేరేంటి?” ఆ పక్కన కూలబడి గుండెలు అవిసేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన వరూ నాన్నని చూస్తూ అడిగింది దీక్ష.

“శివమూర్తి మేడం”

దగ్గరగా వెళ్ళింది. ఐ యాం సారీ మిస్టర్ శివ. మీరు ఇలాంటి సమయాల్లో ధైర్యంగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. Please get back soon అని లేచింది. కొంచెం చూస్కోండి అని కానిస్టేబుల్ కి చెప్పి కదిలింది అక్కడి నుండి.ఎస్సై ఆమె వెనకే ఫాలో అవుతున్నాడు.

“ఏంటి వీడు కాస్త తేడాగా ఉన్నాడు.కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చెయ్యండి వీడిని” సీరియస్ గా చెప్పింది దీక్ష.

“అయ్యో అదేం లేదు మేడం పాపం కూతురు పోయిన దుఖం కదా మేడం!! గంటల తరబడి ఏడుస్తూనే ఉన్నాడు.అతడి గుండె బద్దలైపోయింది పాపం” కళ్ళలో సన్నగా మొదలైన కన్నీటిని ఆపుకుంటూ ఎస్సై ...

“ఏయ్ ...నీ పేరేంటి?” అతడి చాతిపై ఉన్న నేం ప్లేట్ చూసి .....”ఏయ్ దివాకర్ !!....మూస్కోని చెప్పింది చెయ్యవయ్యా ...పోలీస్ వేనా నువ్వసలు ...ఇలాంటోళ్ళని చాలా మందిని చూసా నేను....” అధికార దర్పం ఆమె స్వరంలో ఖంగు మంటుంది.

“చీ వెధవ బతుకు ...ఆఖరికి ఆడదాని చేతిలో తిట్లు తినాల్సి వస్తుంది. “ ఎస్సై దివాకర్ మనసులోనే తిట్టుకుంటున్నాడు.

కార్ ఎక్కబోతూ రేపు సాయంకాలానికి ఒక ఫైనల్ పిక్చర్ వచ్చేయాలి ఏం చేస్తారో నాకు తెలియదు.” సీరియస్ గా ఆర్డరు వేసి వెళ్ళిపోయింది.

మీడియా వాళ్ళ అత్యుత్సాహం పుణ్యమా అని వరూ తల్లి ,న్యూస్ లో బొగ్గులా మాడిపోయిన తన చిట్టితల్లి దేహాన్ని చూసి తట్టుకోలేక పోయింది సొమ్మసిల్లి పడిపోతే వీధిలో జనాలు హాస్పిటల్ లో చేర్చారు.

మర్నాడు ఉదయం

వీధి చివర టీ కొట్టు దగ్గర బెంచి పై కూర్చొని, నోట్లో సిగరెట్టు వెలిగిస్తూ “ఏంటయ్యా ఈ వీధిలో అమ్మాయిని ఎవరో చంపేసారటగా? అడిగాడు ఒక నడివయసు వ్యక్తి.

“అవునండి పాపం .....చక్కని పిల్ల ....ఇలా ఐపోతుందని ఎవ్వరూ అనుకోలేదు” టీ కొట్టాయన.

“ఏదో అఫైర్ అంట కదా “ కళ్ళు తిప్పుతూ గుసగుసగా

“చ చ అదేం అయ్యుండదు సార్ ...ఆ పిల్ల అలా ఎపుడూ కనిపించలేదు “

“ఊరికే ఎవడు చంపేస్తాడయ్యా? ఏదో చేసే ఉంటాది ఏం ఈ వీధిలో ఎవడూ ఆమె వెనక పడలేదా ఏంటి?బాగానే ఉన్నట్టు ఉందిగా? ఆమె పాత ఫోటోలు తెగ వేస్తున్నారుగా టీ.వి లో ??

“ఆమె ఎత్తిన తల దించదు సార్ ....ఇక్కడ ఓ ఆటో వాడు ఆమె వెనక పడే వాడు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు ఎపుడూ .”

“ఆటో వాడా ఎవడాడు ??”

“షబ్బీర్ అని పక్క వీధిలోనే ఉంటాడు లెండి”

“సర్లే ఇవన్నీ నాకెందుకు? మన పని చూస్కోడం బెటర్ అసలికే రోజులు బాలేవు “ లేచి వెళ్ళిపోయాడు.

అతడు మఫ్టిలో ఉన్న పోలీసు అని కొట్టు వాడితో పాటు అక్కడ టీ తాగుతున్న ప్రతి వాడికి అర్ధమైపోయింది.అతడిని ఈ ప్రాంతంలో ఎపుడూ చూడలేదు మరి.అయినా ఎంత నటించినా పోలీస్ కళ్ళు ఎపుడూ మామూలుగా చూడవుగా! నోర్లు మెదపకుండా అతడు ఆ సందు దాటే వరకూ అలా చూస్తూ ఉండిపోయారు.

నోవా కాలేజి ప్రిన్సిపాల్ చాంబర్లో ఎస్సై దివాకర్ ......

స్టూడెంట్స్ ని స్టేషన్ కి పిలిస్తే మీడియాతో పెద్ద రగడ .అందుకే ఇక్కడే ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు.

సూటిగా కళ్ళలోకి చూస్తూ దివాకర్.....

పక్కనే తెల్ల కాగితాలు పెన్ను పట్టుకొని రెడీ గా ఉన్నాడు రైటరు ప్రతి చిన్న మాటా రికార్డు చేస్కొడానికి.

“వర్షిణి నువ్వూ లవర్స్ అంటున్నారు నిజమేనా “

“పెదవులు పదే పదే తడుపుకుంటూ మొఖానికి పట్టిన చెమటను చేత్తోనే తుడుచుకుంటూ.కళ్ళజోడు సర్దుకుంటూ ....ఊ ...అవును” అన్నాడు హర్ష

“ఎన్నాళ్ళ నుండి ?”

“అంటే వన్ ఇయర్ అవుతుంది”

“ఐతే నిన్న సాయంత్రం కాలేజ్ అయ్యాక ఆమె ఎక్కడికి వెళ్ళింది?నీకు తెలిసే ఉంటుందిగా చెప్పు.”

“ నో నాకు తెలియదు “

“రేయ్..స్టుడెంటు అని చక్కగా మాట్లాడుతున్నా ...సాయంత్రం స్టేషన్ కి తీస్కెళ్ళి వేలాడదీసి తోలు వలిచేస్తా....లవర్ అంటున్నావ్ నీకు తెలియకుండా ఆమె అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు.చెప్తే బతికిపోతావ్.”

“సార్ నిజంగా నాకు తెలీదు.అసలు ఆమె నాతో మాట్లాడదు.”

“లవర్ అన్నావ్?”

“నేను లవ్ చేశా ....తను కూడా నన్నే ఇష్టపడింది కానీ బైటకి చెప్పలేదు అంతే”

“నీకెలా తెలుసు బైటకి చెప్పకపోతే?”

“న్యూ ఇయర్ రోజు అందరికీ మామూలుగా విష్ చేసింది.నా ఒకడికే షేక్ హ్యాండ్ ఇచ్చింది.అండ్ అపుడపుడు నా వైపు చూసి నవ్వుతుంది కూడా ....ఐన ఇవన్నీ కాదు నా మనసుకి తెలుసు ఆమె నన్ను ఇష్టపడుతుందని.”

“పిచ్చ ఎదవా “ అన్నట్టు ఓ చూపు చూసాడు దివాకర్.

“తను నా బంగారం ...ఎలా అయిపోయిందో ఎంత ఏడ్చిందో అలా కాలిపోతున్నపుడు .......తన స్కిన్ పసి పిల్లలా ఉందేది ...మొత్తం బొగ్గులా ఐపోయింది ........” పిల్లోడిలా ఏడవటం మొదలు పెట్టాడు.

కాలేజి బ్యాగ్ లోకి మొహం పెట్టి ఏదో తీసాడు బైటకి ...హెయిర్ క్లిప్పు

“ఇదిగో ఇది చూడండి తన బర్త్ డే రోజు తను పెట్టుకొచ్చిన క్లిప్పు,ఇదిగో ఈ లాకెట్టు చూసారా తను మొదటి సారి నాతో మాట్లాడిన రోజు ఆమె గుండెల్ని తాకుతున్న లాకెట్టు ఇదీ...ఇదిగో ఈ పెన్ను అందమైన తన వేళ్ళను నెలల తరబడి తాకుతూనే ఉంది.ఎంత అదృష్టమో దీనిది ....” ఒకొక్కటి తీస్తున్నాడు బైటకి .....అలా చెప్తున్నప్పుడు అతడి మొఖంలో ఓ రకమైన ఉద్రేకం,బాధ స్పష్టంగా కనిపించాయి దివాకర్ కి.

“ఇవన్నీ ఎక్కడివి ఆమె ఇచ్చిందా?”

“నో ......నాకు దొరికాయి ......అంటే తెలీకుండా తీస్కున్నా” తల దించుకొని ఇబ్బందిగా చెప్పాడు.

ఈ ప్రేమ పిచ్చోడిని ఓ కంట కనిపెట్టాలి అనుకొని హూ సరే వెళ్ళు అని పంపేశాడు.

కళ్ళు తుడుచుకుంటూ బైటకి నడిచాడు హర్ష.

“వీడు ఏదో కథ చెప్పేసి ఉంటాడు “అతడి మొఖం లోకే చూస్తూ మనసులోనే అనుకుంది శ్రావ్య....

తరువాతి వంతు ఆమెదే ...

మెల్లగా లోపలికి అడుగేసింది ...పోలీస్ ఇంటరాగేషన్ అంటేనే వణుకు వచ్చేస్తుంది ఆమెకు.తిడతారేమో?సినిమాలో చూపించినట్టు కొడతారేమో ??......అనుకుంటూ లోపలికొచ్చింది.

“సో...నువ్వు శ్రావ్య??Please be comfortable ….నిన్న వర్షిణితో జరిగిన ప్రతి చిన్న విషయం గుర్తు తెచ్చుకొని చెప్పు “ దివాకర్ ప్రశాంతంగా మొఖం పెట్టి అడిగాడు.

దివాకర్ చాలా ప్రశాంతంగా ఫ్రెండ్ లాగా మాట్లాడుతుండటంతో కాస్త కుదుటపడింది ఆమె మనసు.

“ఉదయం వచ్చినప్పుడే కళ్ళు ఎర్రగా ఉన్నాయ్ సార్. ఇంట్లో ఏదో గొడవ అయినట్టుంది.నిద్ర మొహంతో ఉంది. నెక్స్ట్ అంత పెద్దగా గుర్తుపెట్టుకొనే విషయాలు ఏం లేవు. సార్.మాములుగానే క్లాస్ ఐంది.సాయంత్రం ఇంటికి బయల్దేరి వెళిపోయింది. అంతే.”

“ఏం గొడవ ఏమైనా చెప్పిందా?”

“అడిగా సార్ ..ఈరోజు జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే ...అని చెప్పింది ఏంటి అని అడిగితే ఏం చెప్పలేదు కానీ ఇలా అయిపోతుంది అనుకోలేదు’

“ఇవి కాకుండా ఇంకేం లేదా బాగా గుర్తుతెచ్చుకో “

“అంటే ఎపుడూ లేనిది ప్రొఫెసర్ తో క్లాస్ లోనే వాదన పెట్టుకుంది.ఇంతకు ముందు ఎపుడూ అలా లేదు తను”

“ఏం వాదన దేని గురించి ?”

“మామూలు సబ్జెక్టు లోనే సార్ “

“కాస్త వివరంగా చెప్తావా ??”

“ప్రొఫెసర్. పాత్రో గారి క్లాస్ ...”Impact of cultural shift on economy” అని ఒక హార్వర్డ్ స్టూడెంట్ రాసిన ఒక ఆర్టికల్ గురించి డిస్కషన్......

“ఒక దేశం యొక్క ఆచారాలు అలవాట్ల నుండి ఆ దేశ ప్రజలు దూరం జరిగే కొద్ది ఆ దేశ ఎకానమీ దెబ్బ తింటుంది అని ఈ రిసెర్చ్ లో ప్రూవ్ చేసారు.తరతరాలుగా ఉన్న అలవాట్లనే ఆచారాలుగా పిలుస్తున్నాం.ఒక దేశలో ఉండే వాతావరణం మరియు ఆహార లభ్యత ఆధారంగానే ఈ ఆచారాలు పుట్టాయి. వాటిని పక్కకు నెట్టి కొత్త పరాయి అలవాట్లు చేస్కోడం వలన ఆ మేరకు ఆ దేశానికి నష్టం వాటిల్లుతుంది “అని ప్రొఫెసర్ చెప్తుండగా షాలిని లేచింది మధ్యలో ...

“సర్ ...ఆచారం కి ఎకానమీ కి ఏంటి సంబంధం ..గ్లోబలైసేషన్ తో దూసుకుపోతున్న రోజుల్లో ఆచారాలు ఎకానమీని దెబ్బ తీయటం ఏంటి...రిడిక్యులస్”

“ Yeah let me explain …ఉదాహరణకు ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పండి మీలో ఎంత మంది వేరుశనగ ఉండలు,నువ్వుల ఉండలు లాంటి స్నాక్స్ గా తింటున్నారు?”

ఒక్కరూ పలకలేదు ....

“ఒకప్పుడు స్నాక్స్ అంటే అలాంటివే ఉండేవి ...వేర్వేరు పండగలలో వేర్వేరు వంటకాలు ....బెల్లం అరిసెలు, కొబ్బరుండలు ఇలా ఎన్నో. కానీ వాటిని ఇప్పుడు పూర్తిగా పక్కకు నెట్టేసాం...కేవలం విదేశీ కంపెనీల పిజ్జా బర్గర్ KFC chicken తినటమే గొప్ప అనుకుంటాం.యెస్ కొత్తదనం మంచిదే .కానీ మనం పాత ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వలన ఆ మేరకు వాటిని తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమలు కనుమరుగు ఐపోయాయి.వేరుశనగలు,నువ్వులు వంటి పంటలకు డిమాండ్ తగ్గి మన దేశ రైతులు నష్టపోయారు తీవ్రంగా. కొత్త వాటిని ఆహ్వానించడం తప్పు కాదు కానీ మన వాటిని చిన్న చూపు చూస్తూ పూర్తిగా నిరోధించి పూర్తిగా కొత్త అలవాట్లు పద్ధతులకి మళ్లటాన్నే కల్చరల్ షిఫ్ట్ అంటారు.”

ఇంతలో సడెన్ గా లేచింది ...వర్షిణి .”అంటే ఇప్పుడు అన్ని వదిలేసి పంచెలు చీరలు కట్టుకొని తాటి ఆకులు మీద నోట్స్ రాస్కోమంటారా సార్..?” ఎప్పుడూ పెద్దగా మాట్లాడని వర్షిణి ఒక్కసారి అలా లేచి అడిగే సరికి అవాక్కై చూస్తున్నారు అంతా.....

“I have not expected such a question from you varshini …ok చెప్తా విను పసుపులో,వేపాకులో మెడిసినల్ వేల్యూస్ ఉన్నాయని కనిపెట్టింది ఎవరో తెలుసా? అమెరికా మరియు యూరప్ వాళ్ళు....

ఏంటి ఆశ్చర్యంగా ఉందా ..మా తాతల తాతలు కూడా అదే చెప్పారు వాళ్ళు కనిపెట్టడం ఏంటి అంటావా? కానీ వాటి పై పేటెంట్ హక్కులు వాళ్ళే సాధించారు మరి.కొన్ని సంవత్సరాల పాటు మనోళ్ళు నానా పాట్లు పడి అవన్నీ మా పురాతన విజ్ఞానం,ఇందులో మీరు కనిపెట్టినది ఏంటి? అని కోర్టులలో వాదించి ఆ పేటెంట్స్ రద్దు చేయించుకున్నారు.ఇప్పుడు వారికీ ఆ పేటెంట్ ఉండి ఉంటే ఏమౌతుందో తెలుసా ? మీ పేస్టులో వేప ఉందా మీ సబ్బులో పసుపు ఉందా అని మన లోకల్ కంపెనీలు ఏవి ఫ్రీ గా వాడుకోవడానికి వీలు లేదు.పేటెంట్ ఉన్నవాడికి డబ్బు కట్టాల్సిందే.అది చాలు మన దేశంలో తీవ్ర ఆర్ధిక నష్టం వాటిల్లడానికి.ఇలాంటివి కొన్ని వేలు ఉన్నాయి. మనమేమో పంచె కట్టుకోవాలా అని ఎగతాళిగా మాట్లాడుతూ కాలం గడిపేస్తాం. ఆధునికం తప్పు కాదు కానీ మన పాత వస్తువులు,అలవాట్లని పూర్తిగా బహిష్కరించడం,అవి పాటించే వారిని ఎగతాళి చెయ్యడం మూర్ఖత్వమే కాదు నన్ను అడిగితే అది పెద్ద ఆర్ధిక నేరం.” ప్రొఫెసర్ ఎంత చెప్పినా పెద్దగా కన్విన్స్ ఐనట్టు లేరు షాలిని వరూ మొఖాలు తిప్పుకున్నారు.

ఉండబట్టలేక “ ఐతే ఏంటి సార్ విదేశీ కంపెనీల వల్ల మనకేం లాభం లేదా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళు?” ఉక్రోషంగా అడిగింది వరూ.

“యెస్ అవును ఏ దేశం కూడా విదేశీ కంపెనీలను వద్దు అనదు, అనకూడదు కూడా.ప్రపంచ ఆర్ధిక విధానాలు అలానే ఉంటాయ్. But not at the cost of our own life style. నేను ఒడిషా రాష్ట్రం వాడిని కానీ మీ ఆంధ్రా కి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చేది రాజసం ఉట్టి పడే ఆరు అడుగుల పైగా ఎత్తు ఉండే ఒంగోలు గిత్తలు.మా చిన్నప్పుడు ఆంధ్ర వచ్చినప్పుడు అబ్బురంగా చూసే వాళ్ళం వాటిని.మన నిర్లక్ష్యం వల్ల వాటిని కోల్పోయాం.అసలు సిసలైన ఒంగోలు గిత్తలు దాదాపు కనుమరుగు.అది ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న జాతి.1960 లోనే బ్రెజిల్ వాడు కొన్ని లక్షల గిత్తలు ఎత్తుకుపోయి అభివృద్ధి చేసి ఇప్పుడు మనకే అమ్ముతున్నాడు.ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల రూపాయల డీల్ తెలుసా ఎవరికైనా??ఇలాంటివి కొన్ని వేల సంఘటనలు ఉన్నాయ్,మన విజ్ఞానం పై వాళ్ళు పేటెంట్స్ పొందినవి. మనది పనికిమాలినది పక్కనోడిది గొప్పది అనే భారతీయుల మనస్తత్వం వల్లే మన దేశం ప్రపంచానికి పెద్ద వ్యాపార స్థలం గా మారింది అభివృద్ధి చెందుతూనే .....ఉన్న దేశంగానే ఉండిపోయింది..విదేశాలు మాత్రం PRODUCTION CENTRES గా అభివృద్ధిలో దూసుకెల్తున్నాయ్.”

మాస్టారి పాఠం మరీ లోతుగా పోయే సరికి ఇంకెవరికి మాటల్లేవ్. కానీ షాలిని వరూ మాత్రం చాలా ఇబ్బందిగా మొఖాలు పెట్టి పుస్తకం వైపు చూస్తున్నట్టు కాసేపు నటించి ఊరుకున్నారు.....

ఇదే సార్ జరిగింది కానీ ఆ మాత్రం దానికి వాళ్ళు సాయంత్రం వరకు మొఖాలు మాడ్చుకొని ఎందుకున్నారో ....నాకర్ధం కాలేదు.”

“ఏయ్ ఏంటి అక్కడేం చేస్తున్నావ్ ...రా ఇటూ ......” ఆ గది బైట కానిస్టేబుల్ అరిచాడు గట్టిగా ....

తత్తరపడుతూ ..హా ఓకే వెళ్ళిపోతున్నా అని జారుకున్నాడు హర్ష .చాటుగా వింటున్నాడు ఇంత సేపూ శ్రావ్య ఏం చెప్తుందో అని.

బైట సౌండ్ కి కాస్త చిరాగ్గా అటు చూసి మళ్ళి కొనసాగించాడు దివాకర్ ..

“ఈ షాలిని ఎవరు?”

“తను కాస్త రెబెల్ సార్ మా క్లాస్ లో. అనుకున్నది చేసి తీరుతుంది అది ఎంత కష్టమైనా ఎవరేం అనుకున్నా.కొన్ని సార్లు నచ్చుతుంది కానీ కష్టం ఆ అమ్మాయితో ఉండటం.”

“ఉందా? నువ్వు వెళ్లి తనని రమ్మను “

“లేదు సార్ ...హనీ మూన్ కి వెళ్ళింది “

“ఓ!! పెళ్లి కూడా ఐందా అపుడే “ఆశ్చర్యంగా దివాకర్

“లవ్ మేరేజ్ సార్ ....ఇంట్లో ఒప్పుకోలేదు ....హనీ మూన్ కి ఇండోనేషియాలో బాలి వెళ్తా అంది.వారం రోజుల ట్రిప్ కొంచెం సౌండ్ పార్టీ సార్ “

“ఇంట్లో ఒప్పుకోకపోతే అంత డబ్బు ఎక్కడిది టూర్ కి ?”

“ఏమో సార్ ...అయినా దానికి అదో పెద్ద లెక్క కాదు.దాని అకౌంట్ లోనే డబ్బు చాలా ఉంటుంది ఎపుడూ “

“హ్మ్ సరే వర్షిణి ని ఆఖరి సారిగా ఎక్కడ చూసావ్ ??”

“కాలేజ్ ఐపోయాక ఆటో ఎక్కి వెళిపోయింది అంతే అదే సార్ ..ఆఖరి సారి చూడటం

“హ్మ్ సరే మా నువ్వెళ్ళు ...”

“ఆటో ఎక్కి వెళ్ళిందా? .....ఉదయం కానిస్టేబుల్ చెప్పిన ఆ షబ్బీర్ ఆటో ఏనా లేక వేరేదా ??ఈ షబ్బీర్ గాడు దొరికాడో లేదో ??కానిస్టేబుల్ కి ఫోన్ చేసాడు.షబ్బీర్ గాడు రాత్రి నుండి ఊర్లోనే లేడు సార్ అని సమాధానం వచ్చింది అటునుండి.

ఇంకొంత మందిని విచారించి అక్కడి నుండి బయల్దేరాడు దివాకర్ నేరుగా ఆటో స్టాండ్ కి.

“చూడండి ..ఈ కేసు ఎంత సీరియస్ అనేది మీకు అర్ధమయ్యే ఉంటుంది.రాష్ట్రం మొత్తం ఫోకస్ ఇటు వైపే ఉంది.అనవసరంగా ఏదో దాచి మీ జీవితాలు నాశనం చేస్కోకండి.మర్యాదగా తెలిసింది మొత్తం క్లియర్ గా చెప్పండి.తెలుసుగా స్టేషన్ కి వెళ్తే ఎలా ఉంటుందో?”సీరియస్ గా ఆటో వాళ్ళని ప్రశ్నించాడు దివాకర్.

“సార్ షబ్బీర్ గాడు ఆ అమ్మాయి వెనక తిరిగింది నిజమే కానీ వాడికి దీనికి ఏం సంబంధం లేదు సార్ అసలు నిన్న వాడు ఊర్లోనే లేడు” చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఒక డ్రైవర్.

“సార్ ఎప్పుడూ ఆ అమ్మాయి వచ్చే టైం కి వెళ్లి ఆటో ఎక్కించుకొని వెళ్ళడమే తప్ప,ఎపుడూ తప్పుగా ఏం చెయ్యలేదు సార్ వాడు మంచోడు సార్ “ చెప్పాడు ఇంకొకాయన.

“సరే వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడు?”

“తెలియదు సార్ “ సణుగుతున్నారు అందరూ

“కొడకల్లారా... ఇన్ని కబుర్లు చెప్పారు కదరా ...ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? పిచ్చి నా కొడుకుని అనుకుంటున్నారా?”

“సార్ ఎప్పుడూ చెప్పే వెళ్తాడు.ఈసారి చెప్పలేదు.ఉదయం ఆటో కూడా తియ్యలేదు.ఆ అమ్మాయిని కూడా నిన్న ఎక్కించుకోలేదు.నా ఆటోలోనే వెళ్ళింది నిన్న కాలేజికి.” చెప్పాడు మెల్లగా ఓ కుర్రాడు.

“ఇంత వరకు వెనక దాక్కున్నావేంరా ?? చెప్పు ఏం ఐంది “

“ఏం లేదు సార్ ....ఆటో ఎక్కింది కాలేజిలో దిగింది సార్ అంతే”

“మధ్యలో ఎవరికైనా ఫోన్ చేసిందా ?”

“లేదు సార్ “

“సాయంత్రం ఆమె కాలేజ్ దగ్గర నుండి ఎక్కించుకొని వచ్చిన ఆటో ఎవడిది మీలో ఉన్నాడా??”

“లేదు సార్ మాకు తెలియదు “

దీర్ఘంగా ఊపిరి తీస్తూ పక్కకి వెళ్లి ,ఫోన్ చేసాడు హెడ్ కానిస్టేబుల్ కి. “కాలేజ్ బైట సిసి కెమెరా ఫుటేజ్ తీస్కోండి,అక్కడ ఒక కానిస్టేబుల్ నీ ఉండమని చెప్పండి.ఆ హర్షా గాడిని ఫాలో చెయ్యండి. వర్షిణి ఇంటిని సెర్చ్ చేసారుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా ??”

“యెస్ సార్ .. డి.ఎస్.పీ మేడం గారు కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు సార్ ..ఇందాకే మాట్లాడారు .ఈవెనింగ్ కల్లా ఏదో ఒక కన్క్లూజన్ కి రాకపోతే కష్టమే సార్...చంపేస్తుంది ఆవిడ ”చెప్పాడు హెడ్డు.

“ఈవిడ ఏంటి ఎస్సై ని నాకు చెయ్యకుండా హెడ్డు కి డైరెక్టుగా చెప్తుంది? ఏంటో తేడా మనిషిరా బాబూ” అని మనసులోనే అనుకుంటూ ఫోన్ పెట్టేసాడు.

“రేయ్ ఏదైనా విషయం తెలిస్తే వచ్చి నాకు చెప్పాలి.ఇక్కడ ఏం తేడా జరిగిందని నాకు తెలిసినా ప్రతి ఒక్కడిని లోపలేస్తా అర్ధమైందా ??”వేలు చూపిస్తూ తీవ్ర స్వరంతో దివాకర్.

“సార్ .... “ అన్నాడు మెల్లగా ఓ కుర్రాడు

“ఏంట్రా ?”

“ఆ అమ్మాయి ఊరు చివరున్న బంగ్లా కి వెళ్ళింది సార్ ఒక రోజు “

“ఎప్పుడురా ?”

“ఒక నెల రోజుల క్రితం సార్ ...ఆమె కాలేజి దగ్గర ఎక్కింది సార్ నా ఆటో నేరుగా అక్కడికే వెళ్ళింది సార్ ....15 కిలోమీటర్లు సార్ ...ఊరు చివర రిటర్న్ బేరాలు ఉండవు రాను అన్నానండి అక్కడే వెయిట్ చెయ్ రిటర్న్ కూడా వస్తా అంది.రెండు గంటలు వెయిట్ చెయ్యించి వచ్చిందండి.నాకు కోపమొచ్చి రాను పోనూ చార్జీలు వెయిటింగ్ చార్జి కలిపి వెయ్యి అన్నాను సార్.బేరం కూడా ఆడకుండా తీసి ఇచ్చేసింది.అందుకే బాగా గుర్తుంది సార్ ...”

“పద బండెక్కు ......ఆ చోటు చూపించు ....”

“సార్ ....”

“రేయ్ నిన్నేం అరెస్టు చెయ్యం లేరా బాబూ ..మళ్ళి ఇక్కడే తెచ్చి దించేస్తా “”

ట్రింగ్ ట్రింగ్ ఫోను మోగింది ....దివాకర్ ఫోన్

“సార్ ...డి.ఎస్.పీ మేడం గారు అర్జెంటుగా బయల్దేరారు, కేర్ హాస్పిటల్ కి. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అర్జెంటుగా ......”హడావిడిగా చెప్పాడు డి.ఎస్.పీ ఆఫీసు నుండి కానిస్టేబుల్.

“ఈవిడ ఒకర్తి ...మళ్ళి ఇప్పుడేం ముంచుకొచ్చిందో ‘ గొణుగుతున్నాడు దివాకర్ ...

“రేయ్ బాబు ఇప్పుడు కాదులే ...మళ్ళి వస్తా నువ్వు ఊరు వదిలి వెళ్ళకు నేను చెప్పే వరకు.రేయ్ మళ్ళి చెప్తున్నా ఇక్కడ ఏదైనా జరింగిందని అనుమానం వస్తే చచ్చారే....ముందే నాకు చెప్పేస్తే మంచిది...షబ్బీర్ గాడు ఎక్కడికి వెళ్ళాడో సాయంత్రం లోగా నాకు చెప్పాలి.మీలో ఏ ఒక్కడు ఊరు దాటి బైటకి వెళ్ళినా ....అదే మీకు చివరి రోజు గుర్తుపెట్టుకోండి.”

హడావిడిగా బయల్దేరి కేర్ హాస్పిటల్ కి వెళ్ళాడు.డాక్టర్ ఛాంబర్ బైటే నిల్చొని చూస్తున్నాడు.

“డాక్టర్!! ఇప్పుడు ఆమె ఎలా ఉంది?” అడిగింది దీక్ష

“SHEZ FINE madam, discharge చెయ్యొచ్చు ఇప్పుడు.’

“ok thankyou డాక్టర్ I’m pleased to meet you See you later ” లేచింది దీక్ష.

బైటకి వస్తూ ఇంత లేట్ ఏంటి అన్నట్టు ఓ చూపు చూసి ఫాలో మీ అంది.వార్డ్ దగ్గరకి రాగానే సుశీల ని అరెస్ట్ చెయ్ అంది.

“మేడం!!!????” అన్నాడు తెల్ల మొహమేస్కోని

“ఎవడిచ్చాడయ్యా ఉద్యోగం నీకూ? సుశీల అంటే వర్షిణి అమ్మ arrest her immediately “

దివాకర్ కి మతి పోయినంత పనైంది.ఆవిడని అరెస్ట్ చెయ్యమంటాదేంటి??

ఇంతలో లేడి కానిస్టేబుల్స్ దడ దడా వచ్చేరు సుశీల చేతికి సంకెళ్ళు వేసారు.

దిక్కు తోచని అయోమయంలో శివ మూర్తి “ఏంటి ఎందుకు నా భార్యని అరెస్ట్ చేసారు ...మేడం ప్లీజ్ చెప్పండి ....సార్ ఏమైంది ఏంటిది ?? అని పిచ్చోడిలా అరుస్తున్నాడు.

దీక్ష తన వెహికల్ లో దూసుకుపోయింది. సుశీలని జీప్ ఎక్కించారు కదులుతున్న జీప్ వెనుక శివమూర్తి పరుగెడుతున్నాడు.ఆపండి ఏంటి అన్యాయం ...నా భార్య ఏం చేసింది ?? సుశీలా ......”గొంతు చించుకు అరుస్తున్నాడు. అతని వంకే చూస్తూ ఉన్నాడు దివాకర్ కదులుతున్న జీప్ లోనుండి .

బ్రేకింగ్ న్యూస్ ......కన్న తల్లే కడతేర్చింది.......అక్రమ సంబంధానికి కూతురిని బలి పెట్టింది. అమ్మతనానికే మాయని మచ్చ ......

“రాష్ట్రం మొత్తం షాక్ కి గురైంది.సుశీల అరెస్టుతో రాష్ట్రాన్ని కుదిపేసిన ఘోరమైన హత్య కేసు ఒక ముగింపుకి వచ్చింది.కన్నతల్లే అక్రమ సంబంధం కోసం కూతురిని కడతేర్చిన వైనం మనం ఇప్పుడు చూస్తున్నాం “ మీడియా వాళ్ళు టివి లలో గగ్గోలు పెడుతున్నారు.

వరూ ని కన్న తల్లే ఎందుకు చంపుకుంది? తప్పు ఎవరిది? తరువాయి భాగంలో…….

సుధీర్.కస్పా

8985021055Rate this content
Log in

Similar telugu story from Crime