Dawath Sainath

Drama Crime Thriller

5  

Dawath Sainath

Drama Crime Thriller

ఉత్కంఠ

ఉత్కంఠ

4 mins
656



         కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రీతీ అనే అమ్మాయి రోజులగే కాలేజీ కి వెళ్ళింది, కాంటీన్ లో టిఫిన్ చేసి తన క్లాస్ కి వెళ్ళింది, స్నేహితులతో సరదాగా గడిపింది, తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠం చెపుతుండగా ఉన్నట్టుఉండి ప్రీతీ కళ్ళుతిరిగి పడిపోతుంది. 


చుట్టు ఉన్నవాళ్లు ప్రీతీ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. హాస్పిటల్ కి వెళ్లే దారిలో ప్రీతి మరణిస్తుంది తన మరణానికి కారణం ఏంటో ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉంటుంది. 


ఇలా అ కాలేజీ కి చందిన వారు ఇంకా నలుగురు చనిపోతారు. వాళ్ళ మరణాలకు కారణం వాళ్ళు బ్రతకడానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నారు అని కాలేజీ విద్యార్థులు , కాలేజీ యాజమాన్యం భావిస్తారు. అల ఒక సంవత్సరం గడిచిపోతుంది. 


ప్రస్తుతం కాలేజీ లో సీనియర్ విద్యార్థులు , జూనియర్ విద్యార్థులకు స్వాగతం చెపుతూ ( freshersday ) సంబరాలు ఏర్పాటు చేసారు. 


ఏ విద్యార్ధి ఐనా కాలేజీ కి కొత్తగా ఒచ్చె విద్యార్ధి విద్యార్థులను ఆటపాటించిన , ఏడిపించిన , రాగ్గింగ్ లాంటివి చేసిన కఠినంగా శిక్షిస్తాను అని కాలేజీ ప్రిన్సిపాల్ సీనియర్ విద్యార్థులకు చెప్తారు. 


ఈ మాటతో సీనియర్స్ , జూనియర్స్ ని సంతోషంగా కాలేజీ కి అహ్వానిస్తారు. అల మూడు నెలలు గడిచిపోతాయి . మల్లి కాలేజీ లో ఒక విషాదం చోటుచేసుకుంటుంది . 


కొత్తగా కాలేజీ లో చేరిన పృథ్వీ అనే వ్యక్తి మరణిస్తాడు. పృథ్వీ మరణానికి కారణం ఏంటో తెలియదు . ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో పృథ్వీ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ' కాలేజీ కి వెళ్ళాక నా కొడుకు చనిపోయాడు ' అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.


పోలీసులు విచారణ మొదలు పెడతారు. కాలేజీ లో జరిగిన మరణాలు సహజ మరణాలేనని ,జీవితం పైన ఇష్టం లేక చనిపోయారు వాటితో కాలేజీ కి ఎటువంటి సంబంధం లేదు అని పోలీసులు నిర్ధారిస్తారు. 


అందరు పోలీసులు చెప్పింది నిజమేనని భావిస్తారు కొన్ని రోజులు గడిచాయి మల్లి కాలేజీ లో ఇంకో వ్యక్తి మరణిస్తుంది. ఈ విషయం ఏంటో పోలీసులకు కూడా అంతుచిక్కదు . 


ఈ కేసు ని దర్యాప్తు చేయమని సిబిఐ ఆఫీసర్ ఐనా దుర్గ కి అప్పగిస్తారు. పోలీసులు తాము సేకరించిన వివరాలను సిబిఐ ఆఫీసర్ దుర్గ కు ఇస్తారు. 


కేసుని పరిశీలిస్తున్న దుర్గకు ఎటువంటి ఆదరం దొరకదు దాంతో కాలేజీ కి వెళ్తే ఉపయోగం ఉంటుంది అని అనుకుంటుంది దుర్గ. 


కాలేజీ కి వెళ్ళాక దుర్గకి ఒక విషయం తెలుసుంది . చనిపోయిన వారి అందరి పేర్లు( names ) ఇంగ్లీష్ అక్షరం P తో మొదలుఅవుతుంది అని ప్రీతీ , ప్రసాద్, పృథ్వీ ,ప్రణీత ,ప్రశాంత్. 


వెంటనే దుర్గ కాలేజీ ప్రిన్సిపాల్ ని కలిసి తాను తెలుసుకున్న విషయం వివరిస్తుంది . మరణించిన విద్యార్థుల వివరాలు కావాలి అని ప్రిన్సిపాల్ ని అడిగి వాళ్ళ వివరాలు తీసుకుంటుంది దుర్గ . 


అల వారి వివరాలు తీసుకునే సమయంలో గాలి వీచి తాను తీసుకుంటున్న పేపర్లు కిందపడతాయి. కింద పడిన పేపర్స్ ని తుసుకొని దుర్గ తన ఆఫీస్ కి బయలుదేరుతుంది.


ఆఫీస్ కి వెళ్తుండగా తన ఇంటి నుంచి పని అమ్మాయి ఫోన్ చేసి " బాబు కి ఒంట్లో బాగాలేదు ఇంటికి తొందరగా రండి అమ్మగారు " అని చెప్తుంది. 


దుర్గ ఇంటికి వెళ్లి బాబు ని చూసి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. దుర్గ కి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు ఉంటున్న బాబు తన బాబు కాదు తన దగ్గర పని చేసిన రామయ్య , జానకి ల కొడుకు. 


దుర్గ ముంబై లో పని చేస్తున్నపుడు రషీద్ భాయ్ అనే గ్యాంగ్స్టర్ ( gangstar ) ని చంపేస్తుంది . అ కోపంతో రషీద్ భాయ్ తమ్ముడు రఫిక్ , దుర్గ ని చంపాలి అని తన ఇంట్లో బాంబు పెడతాడు. కానీ అ సమయం లో దుర్గ ఇంట్లో ఉండదు. 


రామయ్య, జానకి లు తమ కొడుకు తో ఉంటారు . తన ఇంట్లో బాంబు పెట్టిన విషయం తెలుసుకున్న దుర్గ తన ఇంటికి వెళ్తుంది వెళ్లేసరికి రఫిక్ బాంబు ని పిలుస్తాడు . తన కొడుకుని కాపాడుకొని రామయ్య, జానకి మరణిస్తారు . ఈ సంఘటన తర్వాత దుర్గని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ ( transfer ) చేస్తారు. దుర్గ ఆ బాబు తో హైదరాబాద్ కి వస్తుంది .


హాస్పిటల్ నుంచి ఒచ్చాక దుర్గ ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరాలు చుస్తూఉంటుంది. అల చూస్తుండగా సంబంధం లేకుండా ఒక పేపర్ కనిపిస్తుంది ఆ పేపర్ లో " నన్ను చంపేస్తున్నారు అని రాసి ఉంటుంది ". 


అది చుసిన దుర్గ తర్వాత రోజు కాలేజీ కి వెళ్లి చనిపోయియినా వారిలోతాను చుసిన పేపర్ లో ఉన్న చేతిరాత సరిపోతుందా అని చూస్తుంది . కాలేజీ లో ఉన్న విద్యార్థులను అ చేతిరాత గురించి అడుగుతుంది . 


చనిపోయియినా వారి ఇంట్లో వారిని, బంధువులని అందరిని అడుగుతుంది కానీ ఏ విషయం తెలియదు. అదే రోజు సాయంత్రం దుర్గ స్టేషన్ లో ఉండగా ఒకరు ఎడమ చేతితో ( lefthand ) రాయడం చూస్తుంది.


అది గమనించిన దుర్గ చనిపోయియినా వారిలో ఎవరు ఎడమ చేతితో రాస్తారో అడుగుతుంది కానీ చనిపోయియినా వారిలో ఎవరు ఉండరు. చనిపోయియినా వారి మెయిల్ , ఫేసుబుక్ అన్ని చూస్తుంది. 


అందరి వివరాలు దొరుకుతాయి ప్రణీత అనే అమ్మాయి చేతిరాతతో సరిపోతుంది. ప్రణీత ఎవరో కాదు ప్రిన్సిపాల్ కూతురు . దుర్గ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది . మీ కూతురు చేతిరాత మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నార అని అడుగుతుంది దుర్గ . 


అప్పుడు ప్రిన్సిపాల్ ఏమి చెప్పకుండా అక్కడినుండి వెళ్ళిపోతాడు . ప్రిన్సిపాల్ ని ఫాలో చేస్తూ దుర్గ ప్రిన్సిపాల్ వెనకాలే వెళ్తుంది.


ప్రిన్సిపాల్ తన ఇంటికి వెళ్లి తన గదిలో నుండి తాను తయారు చేసుకున్న సీక్రెట్ గదిలో కి వెళ్తాడు . అది గమనించిన దుర్గ ప్రిన్సిపాల్ వెనువెంటనే వెళ్తుంది . 


అ గదిలో ప్రిన్సిపాల్ లాగా ఇంకో వ్యక్తి ఉంటారు అది చుసిన దుర్గ ఆశ్చర్యపోతుంది . ప్రిన్సిపాల్ ఇంకా అతని తమ్ముడు ఒకేలాగా ఉంటారు . 


ప్రిన్సిపాల్ తమ్ముడు మంచివాడు కాదు . అన్నయ ఆస్థి తీసుకుందాం అని ఆలోచనతో అతనిని బందించి అతని స్థానంలోకి ప్రిన్సిపాల్ గా కాలేజీ కి వస్తాడు . 


కాంటీన్ వారితో కలిసి కాంటీన్ లో తినే విద్యార్థులకి విషం పెట్టి వారిని చంపేస్తారు . డాక్టర్ తో మాట్లాడి చనిపోయియినా వారిది సహజమరణమే అని చూపిస్తాడు. ఇలా చేస్తే కాలేజీ మూతపడిపోతుంది అ స్థలం లో పెద్ద హోటల్ కట్టి ఇంకా డబ్బులు సంపాదించాలని ప్రిన్సిపాల్ తమ్ముడి ఆలోచనా. 


దొంగ ప్రిన్సిపాల్ అసలైన ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ " నా గురించి తెలిసిపోయింది అని నీ కూతురిని నీ అక్కడే అ రోజే అదేగదిలోనే చంపేస కానీ నీ కూతురు చాల తెలివిగా తనని చంపేస్తున్నారని పేపర్ లో రాసి అదే గదిలో స్టూడెంట్స్ లిస్ట్ లో దాచిపెట్టింది అది నేను చూసుకోకుండా అ పేపర్స్ ని సిబిఐ ఆఫీసర్ దుర్గ చేతికి ఇచ్చాను . 


ఇప్పుడు దుర్గ కి నా పైన అనుమానం ఒచ్చింది . ఇప్పుడు నువ్వు నా స్థానంలోకి వెళ్లి సిబిఐ ఆఫీసర్ దుర్గకి దొరికిపోవాలి అప్పుడు నువ్వు జైలు లో ఉంటావ్ . అప్పుడు నేను ని తమ్ముడు గా బయట పడతా నీ కాలేజీ లో ఉన్న స్థలం లో నేను హోటల్ కడతాను. నేను చెప్పింది చేయకపోతే నీ కొడుకుని కూడా చంపేస్తాను అని అంటాడు ".


ఈ విషయాలు మాట్లాడుతుండగా దుర్గ ప్రిన్సిపాల్ పై దాడి చేస్తుంది. అ దాడి లో దుర్గ అసలైన ప్రిన్సిపాల్ ని కాపాడి దొంగ ప్రిన్సిపాల్ ని చంపేస్తుంది.


తర్వాత రోజు నుండి యధావిధిగా విద్యార్థులు కాలేజీ కి రావడం మొదలుపెడతారు .


Rate this content
Log in

Similar telugu story from Drama