Dawath Sainath

Children Stories Inspirational Children

4  

Dawath Sainath

Children Stories Inspirational Children

అహం ( ego )

అహం ( ego )

2 mins
406


చిన్న పిల్లలు ప్రశ్నలు ఎక్కువ వేస్తారు అలానే దేవన్ష్ కూడా తన అమ్మ నీ ఒక ప్రశ్న అడిగాడు.


దేవన్ష్:- అమ్మ! ఈరోజు నేను స్కూల్ కీ వెళ్ళేటప్పుడు వీధి చివర్లో ఉన్న పూజ అక్క వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది కదా ఎందుకు అమ్మ ఏం గొడవ జరిగింది, పూజ అక్క నీకు అహం! ఎక్కువ అని గట్టిగా అరిచింది. అహం అంటే ఏంటి అమ్మ?


అమ్మ తనకు తెలిసింది దేవన్ష్ తో ఇలా చెపుతుంది.


"అహం" అంటే

నేనె గొప్ప,

నాకు తెలిసినంత ఎవరికి తెలియదు,

నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు,

నా మాటకి ఎవ్వరు ఎదురు చెప్పకూడదు,

నేను చెప్పేది ఎదుటివారు వినాలి,

మన అనుకునే వారికి మర్యాద ఇవ్వకపోవడం,

వాళ్ళ మాటలని పాటించుకోకపోవడం.


ఈ లక్షణాలు ఆహంకారనికి సంకేతాలు దేవన్ష్.


కానీ అహంకారం అనేది మనుష్యులో ఉండకూడదు దేవన్ష్, అహం మనలో ఉంటే మనుష్యుల నుండి దూరం అవుతాం, ప్రేమ కీ దూరం అవుతాం, అన్ని ఉన్న ఎవరు మనకి లేరు అనే బాధ నీ తట్టుకోలేం దేవన్ష్.


మన అని అనుకున్న వారితో ప్రేమ గా ఉండాలి, ప్రేమ గా మాట్లాడాలి.


వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పుల్ని మనం సమానంగా చూడాలి. తప్పు చేసినపుడు ఒకలగా, ఒప్పు చేసినపుడు ఒకలగా ఉండకూడదు.


మన అనుకునే వారికి ఎప్పుడు తోడుగా ఉండాలి ఇంకా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తు ఉండాలి.


మనలో అహం ఉంది అంటే, మనతో కొంతమంది మాత్రమే ఉంటారు. అదే మనము ప్రేమ గా, నవ్వుతూ నవ్విస్తు ఉంటే అందరూ మనతోనే ఉంటారు.


దేవన్ష్:- అమ్మ! కోపము, బాధ అంటే ఏంటి?


"కోపం":- సరైన చోట చూపిస్తే మనకు విజయం. అదే కోపం ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర చూపిస్తే మనకు అపాయం.


"బాధ":- మన సంతోషం కోసం ఎదుటివారిని ఏడిపించానా, లేద మన వల్ల ఎదుటివారు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఏడుపు మనల్ని సంతోషం నుండి దూరం చేస్తుంది. మనం సంతోషంగా లేము అంటే మనము బాధలో ఉన్నట్లు.


అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తు అందరితో ప్రేమగా, సంతోషంగా ఉండాలి.


కోపం, అహం ఎంత తక్కువ ఉంటే మనకు బంధాలు, బంధువులు, స్నేహితులు మన మంచి కోరుకునే వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటారు అలాగే బాధ కూడా మనకి దూరంగా ఉంటుంది.


దేవన్ష్:- సరే అమ్మ నేను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తు అందరితో ప్రేమ గా, సంతోషంగా ఉంటాను అమ్మ. ఎవరితో కోపంగా ఉండను, అహం అనే మాటకి దూరం గా ఉంటాను.


Rate this content
Log in