Dawath Sainath

Drama Fantasy Others

4  

Dawath Sainath

Drama Fantasy Others

ఆశ్చర్యకరమైన పెళ్లి

ఆశ్చర్యకరమైన పెళ్లి

6 mins
258


ఓక నిర్మనుష్యమయిన చోటు, శేఖర్ ఇంకా దీపికా బైక్ పై వెలుతుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. 

అదే సమయంలో గుడిలో శేఖర్ తల్లి తండ్రులు ఇంకా దీపిక తల్లి తండ్రులు నిశ్చితార్ధం ఏర్పటులో ఉంటారు.


శేఖర్ వాలా నాన్నకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. శేఖర్ ఇంకా దీపిక కి యాక్సిడెంట్ అయింది అని. 


ఆ వార్త వినగానే శేఖర్ ఇంకా దీపిక తల్లి తండ్రులు హాస్పిటల్ కి బయలుదేరుతారు.


కొన్ని సంవత్సరముల ముందు


శేఖర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతునాడు. అదే కాలేజీ లో దీపిక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది.


దీపిక వాలా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అవ్వడంతో బదిలీలు అవుతుంటాయి. అలా వాలా నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో దీపిక హైదరాబాద్ లో శేఖర్ చదువుతున్న డిగ్రీ కాలేజీ లో చేరుతుంది.


శేఖర్ కి పోలీస్ అవ్వాలి అని కోరిక. పోలీస్ అవ్వాలి ఆనే ఆశయం తో చాల కష్టపడి చదివేవాడు.

ఒకరోజు శేఖర్ లైబ్రరీలో ఉండగ దీపిక ని చూస్తాడు. 


శేఖర్, దీపిక ని చూసే సమయనీకి, దీపిక లైబ్రేరియంతో గొడవపడుతూ ఉంటుంది. తను సంవత్సరం మధ్యలో ఒచ్చను, తన లైబ్రరీ కార్డ్ పెట్టుకొని రెండు పుస్తకాలు ఎక్స్‌ట్రా ఇవ్వమని లైబ్రేరియంతో గొడవపడుతూ ఉంటుంది. ఆ లైబ్రేరియన్ ఓక కార్డ్ ఉన్నపుడు 3 పుస్తకాలు ఇస్తాం అని చెప్తూ ఉంటాడు. 


ఇ గొడవ చూసిన శేఖర్ తన లైబ్రరీ కార్డ్ దీపిక కి ఇచ్ఛి పుస్తకాలు తీసుకోమని చెప్తాడు. అలా తన లైబ్రరీ కార్డ్ ఇచ్చిన శేఖర్ ని, దీపిక కోపంగా చూస్తుంది. తనూ వెంటపడుతున్నాడేమో అనుకోని దీపిక అక్కడ నుండి వెళ్లిపోతుంది.


తరవాత రోజు కాలేజీలో సీనియర్స్ కొత్తగా ఒచ్చిన వాలని ర్యాగింగ్ చేస్తు ఉంటారు. దీపిక ను సీనియర్స్ మొదటి సంవత్సరం అనుకోని తనని కుడా ర్యాగింగ్ జరిగే చోటుకి పిలుస్తారు.


సీనియర్లు దీపిక ని తన గురించి చెప్పమని అడుగుతారు. దీపిక తన గురించి చెప్తుండగా ఒక సీనియర్ దీపిక పైనా చేయీ వేయడానికి ప్రయాత్నిస్తాడు.


దీపిక ఆ సీనియర్ నీ కొడుతుంది. దీపిక కి కరాటే తెలుసు. తన పద్దతిలో దీపికా సీనియర్స్ కి సమాధానం చెప్తుంది.


కరాటేలో నేషనల్ కి వెళ్ళాలి అని దీపిక కోరిక. కానీ వాలా నాన్నకి బదిలీలు అవ్వడంతో తను ఒకచోటే ప్రాక్టీస్ చెయ్యలేక తన కోరికను పక్కానా పెడుతుంది కనీ తన డిగ్రీ అయిపోయాక కరాటే నేర్చుకొని నేషనల్ కి వెల్లాలి అని దీపిక ఎదురు చూస్తుంది.


సీనియర్స్ కి దీపిక తనదైన శైలిలో సమాధానము చెప్పడము శేఖర్ కి నచ్చుతుంది. 


కొన్నాళ్లకి కాలేజీ లో ఓకా ఫెస్ట్ జరుగుతుంది. వేరు వేరు కాలేజీ వారికి క్విజ్ పోటీ జరుగుతుంది.


శేఖర్ చదివే కాలేజీ నుండి అయిదుగురు ఇంకా వేరే కాలేజీ నుండి అయిదుగురు క్విజ్ లో పాల్గొంటారు.

క్విజ్ చివరి రౌండ్ ఒచ్చేసరికి శేఖర్ ఇంకా దీపిక ఇద్దరే ఉంటారు. ఎంతో ఉత్కంటగ సాగిన ఈ క్విజ్ పోటీలో శేఖర్ ఇంకా దీపిక చివరి సమాధానం చేపల్సి ఉంటుంది. ఇంకో 3 సెకండ్లు ఉన్న టైమ్ లో శేకర్ సమాధానం చెప్పాడు.


శేఖర్ సమాధానం చెప్పక ఆ చోటు పూర్తిగా నిశబ్దంగా ఉంటుంది.


తన సమాధానం కరెక్ట్ అని క్విజ్ మాస్టర్ చెప్పగానే దీపిక ఇంకా శేఖర్ ఒకరిని ఒకరు అభినందించుకుంటారు.


అలా దీపిక ఇంకా శేఖర్ లా పరిచయం అవుతుంది. ఆ తర్వాత రోజు కాలేజ్ లో కలవడం కలిసి లంచ్ చేయడం కలిసి కాలేజీ కి రావడం వెళ్ళడం చేస్తారు.


శేఖర్ నీ ఇంకా దీపిక నీ చూసిన వారంతా వాళ్ళిదరు ప్రేమలో ఉన్నారు అని అనుకునే వారు, కానీ శేఖర్ ఇంకా దీపిక పరస్పరం సహాయం చేసుకుంటారు ఎవరు ఏం అనుకున్నా దీపిక ఇంకా శేఖర్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు.


కొన్ని రోజుల తర్వాత కాలేజీలో ఎలక్షన్స్ మొదలౌతాయీ


ఎన్నికలు అంటే ఏంటి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఒక విద్యార్ధిగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడే మన సమాజం బాగుంటుంది అనే నమ్మే వ్యక్తి కాలేజీ ప్రిన్సిపాల్ ఫణేద్ర జోషి. 


ఆ ఎలక్షన్స్ లో దీపిక పోటీ చేస్తుంది. దీపిక కి పోటీగా అరుణ్ అనే వ్యక్తి పోటి ఉంటాడు. అరుణ్ వాలా నాన్న పెద్ద వాయ్పరవేత తనకీ ఉన్న డబ్బు పలుకబడితో కాలేజీ లో అదరిని బెదిరిస్తు బయపెట్టిస్తు ఉంటాడు.


ఈ కాలేజీ ఎలక్షన్స్ లో ఎలా అయినా గెలవాలి అని అనుకుంటాడు, ఎలక్షన్స్ కోసం ఎం చెయ్యడానికి అయినా సిద్ధమ్ అవుతాడు.


ఆ క్రమంలో కొందరి విద్యార్ధులకు డబ్బులు ఇచ్చి తన దారిలోకి తెచ్చుకుంటాడు. దీపిక ఇంకా శేఖర్ నీజయితగా ఉంటారు.


చాల వరకు విద్యార్ధులు దీపిక కి ఓటు వేస్తారు అని తెలిసిన అరుణ్, దీపిక నీ ఎలక్షన్స్ నుండీ తపించాడానికీ ఎన్నికలు రోజు కాలేజీలో గొడవ మొదలు పెడుతాడు అరుణ్.


ఆ గొడవలో దీపిక ను కాపాడబోయే సమయంలో శేఖర్ కి చాల గాయలు అవుతాయీ. యెన్నో ఆటంకాలని దాటుకొని దీపిక ఎలక్షన్స్ లో గెలుస్తుంది. 


ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకు పరీక్షలు మొదలయ్యాయి శేఖర్ ఇంకా దీపిక పరీక్షలు రాసి సెలవులకు వెళతారు. 

శేఖర్ ఫైనల్ ఇయర్ అవ్వడంతో పరీక్షల ఫలితాలు ఒచ్చక తన సర్టిఫికెట్లు తీసుకొని, పోలీస్ అవ్వడానికి ప్రయాతింస్తుంటాడు. ఈ క్రమంలో శేఖర్ దీపికను పూర్తిగా మరిచిపోతాడు.


శేఖర్ ను డిస్టర్బ్ చేయకూడదు అని దీపిక, శేఖర్ ను కలవడం మానేస్తుంది.


పోలీస్ వ్రాత పరీక్ష క్లియర్ చేసిన, శేఖర్ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చెయ్యలేక పోతాడు.


ఆ రోజు కాలేజీ ఎలక్షన్స్ లో జరిగిన గొడవలో శేఖర్ కలికి దెబ్బ తగలడంతో కాలు ఫ్రాక్చర్ అవుతుంది. అప్పటినుండి శేఖర్ ఎక్కువ పరిగెతలేకపోతాడు. ఇ కరణంతో పోలీస్ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చెయ్యలేక పోతాడు.


ఇంకా తను పోలీస్ అవ్వాలి అనే కలకు శేఖర్ దూరం అవుతాడు. వాళ్ల నాన్న పేరు చెప్పి పోలీస్ అవ్వొచ్చు కానీ శేఖర్ కి అలా సంపాదించె పోలీసు ఉద్యోగం ఒద్దు అని అనుకుంటాడు.


తను పోలీసు అవ్వలేను అని తెలిసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాడు. 


శేఖర్ ఇంటెలిజెన్స్ బ్యూరో లో సెలెక్ట్ అవుతాడు. శేఖర్ కి ముంబై లో పోస్టింగ్ వస్తుంది. తన తల్లి తండ్రులతో శేఖర్ ముంబై కి షిఫ్ట్ అవుతాడు.


5 సంవత్సరాల తరవాత:


ఒకరోజు శేఖర్ విచారణ పని పైనా బస్సు రిజర్వేషన్ ఆఫీస్ కి వెలతాడు.


అక్కడ దీపికను చూసి ఆశ్చర్యపోతాడు, ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, దీపిక తో ఉన్న సమయం శేఖర్ కి గుర్తు వస్తుంది. దీపిక ను ఆశ్చర్యపరచాలని తన దగ్గరకి వెళతాడు.


శేఖర్ ని చూసిన దీపిక చాల ఆనందిస్తుంది.

"నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ కరాటే లో ఛాంపియన్ అయ్యి ఉంటావ్ అని అనుకున్నా." అని శేఖర్ దీపిక తో అంటాడు.


దీపికా వాలా నాన్న బదిలీ కరణంగా దీపికా కరాటే ఛాంపియన్ కావలి అనే కోరికను ఒదిలేస్తుంది. దీపిక ఫైనల్ ఇయర్ అయిపోయాక వాలా నాన్నకి ముంబై ట్రాన్స్ఫర్ అయింది. ముంబై ఒచ్చక తన కరాటే కలను పక్కన పెట్టి జాబ్ చేస్తు ఉంటుంది.


అలా దీపిక ఇంకా శేఖర్ వాళ్ళు కలిసి ఉన్న రోజులు కాలేజీ రోజులు గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.


అంతలో శేఖర్ కి ఫోన్ రావడంతో, దీపిక ఫోన్ నంబర్ తీసుకొని తన ఫోన్ నంబర్ దీపికకు ఇచ్చీ అక్కడ నుండి బయలుదేరుతాడు.


ఒక రోజు తరవాత:


దీపిక, శేఖర్ నీ కలవాలని శేఖర్ కి ఫోన్ చేస్తుంది. శేఖర్ కూడా దీపిక కలవాలని అనగానే సరే అనే చెప్పాడు.

ఒక కాఫీ షాప్ లో శేఖర్ ఇంకా దీపిక కలుస్తారు. శేఖర్ నీ ప్రేమిస్తున్న విషయం దీపికా శేఖర్ కి ఇలా చెపుతోంది.


"శేఖర్ మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అని అనుకున్నా, నువ్వు నా నుండి దూరం అయ్యాకే నాకు తెలిసింది, నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను అని. కాని పోలీస్ అవాలనే ప్రయత్నంలో నువ్వు ఉన్నావ్. 


అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను విషయం చెప్తే ఎక్కడా ఒద్దు అటవో అనే భయం అందుకే నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు. నా కలని ఇంకా నా ప్రేమ ని అక్కడే వదిలేసి ముంబై కి వచ్చాను.


ముంబై కి ఒచ్చక నీ గురించి తెలుసుకోవాలి అని ప్రయతించును, కాని తెలుసుకోలేకపోయాను. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాని నాకు ఎవరు నచ్చడం లేదు అని మా అమ్మ నాన్నకి చెప్తున్నాను.


నిన్ను ఎలా అయినా కలవాలి ఇంకా నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాలి అని హైదరాబాద్ కి రావడానికి టికెట్ బుక్ చేయడనికి వెళ్ళాను


అదే సమయంలో లో నా కోసం అన్నట్లుగా నువ్వు నా దగ్గరకి ఒచ్చావు. నిన్ను చూసాకా నేను ఎంత సంతోషంగా ఉన్నాను దేవుడికి ఎన్ని సర్లు థాంక్స్ చెప్పాను నాకే తెలీదు.


నిన్ను మిస్ అవకూడదు అని నీకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను." అని దీపిక తన ప్రేమని శేఖర్ కి చెప్తుంది. 


శేఖర్ కి అంత అయోమయం గా ఉంటుంది. ఎం చెప్పాలో అర్దం కాదు. కొంత సేపటికి దీపిక కి సరే నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే చెప్పే టైం కి, శేఖర్ వాలా నాన్న, శేఖర్ కి ఫోన్ చేసి రేపు నీకు నా ప్రాణ స్నేహితుడి కుతిరితో నీకు నిశ్చితార్ధం , రేపు ఏం పనులు పెట్టుకోకు అని అంటారు.


శేఖర్ కి ఎం చేయలో అర్దం కాదు.ఈ విషయం దీపిక కి చెప్తాడు.


ఈ సమయం లో తన తండ్రి ఏమి చెప్పిన వినరు అని తెలిసి శేఖర్ దీపిక వాల అమ్మ నాన్నని పెళ్లికి ఒప్పించడం మంచిది అని అనుకుంటాడు.


దీపికా వాలా అమ్మ నాన్నని పెళ్లికి ఒపించడానికి, దీపిక వల్ల ఇంటికి వెలతారు శేఖర్ ఇంకా దీపిక. 


దీపిక, వాలా అమ్మ నాన్న కి శేఖర్ విషయం చేపడానికి ఇంటి లోపలికి వెళుతుంది.


శేఖర్ బయట ఉంటాడు. దీపిక మాట్లాడినా తర్వత లోపలికి వెల్లాలి అని ఎదురుచూస్తు ఉంటాడు.


కాసేపాటికి దీపిక బయటకి ఒచ్చేస్తుంది. ఎం జరిగింది అని శేఖర్ అడుగుతాడు.


"మా నాన్న వాలా ఫ్రెండ్ వల్ల కొడుకుకి, నాకు రేపు నిశ్చితార్ధం అంటా. నాన్న ఇప్పుడే నాతో చెప్తున్నారు" అని దీపిక చెప్తుంది.

అలా ఇద్దరి ఇంట్లో నిశ్చితార్ధం అనేసరికి ఏం చేయాలో తెలియక దీపిక ఇంకా శేఖర్ ఓక ప్లాన్ వేస్తారు.


రిజిస్టర్ కార్యాలయం లో పెళ్లి చేసుకుందం అని అనుకుంటారు. నువ్వు ఈరోజు కలిసినా కాఫీ షాప్ లో రేపు ఉదయం 8 గంటాల వరకు ఓచెయీ నేను నీన్ను అక్కడ కలుసుకుంటాను. రిజిస్టర్ ఆఫీసులో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు రేపే మన పెళ్లి.


ఇలా దీపిక ఇంకా శేఖర్లు ప్లాన్ వేసుకుటరు, ఆ తర్వాత రోజు రిజిస్టర్ కార్యాలయం వెలుతుండగా శేఖర్ ఇంకా దీపికకు యాక్సిడెంట్ జరుగుతుంది.


ప్రస్తుతం :


శేఖర్ వాలా నాన్నకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, శేఖర్ ఇంకా దీపిక కి యాక్సిడెంట్ అయింది అని. 

ఆ వార్త వినగానే శేఖర్ ఇంకా దీపిక తల్లి తండ్రులు హాస్పిటల్ కి కంగారుగా వెళతారు.


శేఖర్ ఇంకా దీపిక కి చిన్న చిన్న గాయలు అవుతాయీ. శేఖర్ వాలా తల్లి తండ్రులు ఇంకా దీపిక వల్ల తల్లి తండ్రులు కలిసి ఉండాఉం చూసి శేఖర్ ఇంకా దీపిక ఆశ్చర్యపోతారు.


"మీ ఇద్దరికీ మేమే పెళ్లి చేద్దాం అనుకుంటే మేరేంటి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి పెళ్లి చేసుకుందం అని అనుకున్నారు. నిన్నే విడిని ( దీపికా వాలా నాన్న) కలిసాను వాడి కూతురి కోసం సంబందాలు చూస్తున్నారు అని తెలిసింది. నా స్నేహితుడు నా వియంకుడు కావాలి అని, నా మాట నువ్వు కాదు అనవు అనే నమ్మకంతో వెంటనే నీకు ఫోన్ చేసి చెప్పాను." అని శేఖర్ వాలా నాన్న అంటారు. 


అప్పుడు శేఖర్ ఇంకా దీపిక కు అర్దం అవుతుంది వాలా నాన్నలు ఇద్దరు ప్రాణ స్నేహితులు అని. 


ఇ విషయం శేఖర్ ఇంకా దీపిక కు తెలియక వారిద్దరికీ వేరే వాళ్లతో పెళ్లి అవుతుంది అని అనుకోని రిజిస్టర్ ఆఫీసు లో పెళ్లి చేసుకుందం అని అనుకుంటారు. 


చివరి కి నిజం తెలిసి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు.


            థా ఎండ్. 


Rate this content
Log in

Similar telugu story from Drama