STORYMIRROR

Sainath Dawath

Tragedy Fantasy Thriller

3  

Sainath Dawath

Tragedy Fantasy Thriller

కాలింగ్ బెల్- ది హిడెన్ ఐ

కాలింగ్ బెల్- ది హిడెన్ ఐ

8 mins
5

ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది గంటల తరువాత ఆ అమ్మాయి చనిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది?ఆది హత్య! లేదా ఆత్మహత్య? ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన ఆ అబ్బాయి ఎవరు?


కథ ప్రారంభం:-

                       గోపి (గోపాల కృష్ణ) ఒక డెలివరీ బాయ్. కొరియర్, ఫుడ్, గ్రాసరీ (కిరాణా సామాగ్రి) ఇలా అన్నీ వస్తువులు డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

తనకు సొంత బైక్ లేదు. ఒక సొంత బైక్ కొనాలి, తనకంటు సొంతంగా ఒక డిపార్టుమెంటల్ స్టోర్ ఏర్పాటు చేయాలి అని గోపి కాలా. ఆ కాలా కోసమే కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకుంటున్నాడు.


గోపి కి తండ్రి లేడు, తల్లి ఇంట్లోనే టైలరింగ్ వర్క్ చేస్తూ ఆర్థికంగా గోపికి అండగా ఉంటుంది. 

ఒక రాత్రి, గోపి ఒక డెలివరీ కోసం వెళ్ళాడు. డెలివరీ టైమ్ 11:00PM. కానీ ఆ రాత్రి భారీ వర్షం కురుస్తోంది. డెలివరీ ఆలస్యం అవుతుంది. డెలివరీ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో, రాత్రి 1:00AM అవుతుంది.


భారీ వర్షం, రోడ్డుపై అంధకారం, లైట్ లు లేవు. ఆ సమయంలో, రోడ్డుపై ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కార్ బ్రేక్ డౌన్ అయి, సహాయం (లిఫ్ట్) కోసం చూస్తు ఉంటుంది.

ఆ అమ్మాయిని చూసి, గోపి కాస్త ఆగుతాడు. ఆ అమ్మాయి తనకు లిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది. తనకు వెళ్ళాల్సిన చోటు సన్‌షైన్ అపార్ట్‌మెంట్ దగ్గర అని చెబుతుంది.

రాత్రి 1:00AM… వర్షం కురుస్తోంది… రోడ్డంతా భీకరంగా ఉంది.


గోపి ఆ అమ్మాయిని తన బైక్ మీద తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఎందుకో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాయ చేసేలా ఉన్నట్లు అనిపిస్తుంది.


వీధి వెలుతురులు అంతా ఆరిపోయాయి… వర్షం అల్లకల్లోలం చేస్తోంది. గోపి బైక్ స్టార్టు చేసి, ఆ అమ్మాయిని వెనుక కూర్చోబెట్టుకుని వెళ్తాడు.


గోపి, తనవంతు సాయంగా ఆ అమ్మాయిని సన్‌షైన్ అపార్ట్మెంట్‌ దగ్గర వదిలేసి, తను తన పని చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అంతా వర్షపు వాతావరణంలో నిశ్శబ్దంగా ముగిసినట్టే అనిపించింది.


మరుసటి రోజు:


గోపి తన పనిలో బిజీగా ఉంటాడు, డెలివరీ కోసం వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా పోలీస్ జీప్ ఆగుతుంది. ఊహించని విధంగా పోలీసులు గోపిని ఆపి, స్టేషన్‌కి తీసుకెళ్తారు. దారి పొడవునా గోపి గుండె బరువెక్కుతుంది, ఏం తప్పు చేశానో తెలియక కంగారు పడుతున్నాడు.


పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్ళాక, గోపి ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు.

ఇంటరాగేషన్ రూమ్ లో, చీకటి గదిలో, ఒక్క బల్బు వెలుతురులో, గోపి చేతులు వెనుకకు కట్టేయబడతాయి. SI గోపి నీ ఇలా అడుగుతాడు – “ఆ అమ్మాయిని ఎందుకు చంపేశావు?”


గోపి కళ్ళు పెద్దవిగా అవుతాయి. అమ్మాయి ఎవరు సార్?-- అని అడుగుతాడు .


SI: నిన్న రాత్రి 1:00 AMకి ని బైక్ మీద తీసుకెళ్ళిన అమ్మాయి? అనిత ఆమె పేరు?

“సర్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు! కేవలం లిఫ్ట్ అడిగింది, వర్షంలో జాలి వేసి లిఫ్ట్ ఇచ్చా సర్! నేనేమీ చేయలేదు!” – అని గోపి చెబుతాడు.


SI: ఆమె సన్‌షైన్ అపార్ట్మెంట్ లో డెడ్ బాడీగా దొరికింది. నిన్న 1:00 AMకి నువ్వే ఆమెను తీసుకెళ్ళావు. నిజం చెప్పు గోపి!”


గోపి వణుకుతున్నాడు. తనపై పడ్డ ఆబాధలు, అసలు తనకు తెలియని నిజాలు… అతడి మనసు గందరగోళంగా మారింది.


అనిత చనిపోయిన ఆపార్ట్‌మెంట్:-

పోలీసులు ఇప్పుడు అనిత చనిపోయిన ఆపార్ట్‌మెంట్ దగ్గర ఉన్నారు.


బాత్‌టబ్ లో…


అనిత… బాత్‌టబ్ లో నిశ్శబ్దంగా, రక్తస్రావంతో… అశ్రుదారగా ఉన్నది. తన గొంతు దగ్గర గాయమో లేక రక్తమో విరుచుకుపోయిన రక్తపు మచ్చలు ఆ భయానక వాతావరణాని గుర్తు చేస్తున్నాయి.


తన చేతి పైన రక్తపు గాయాలు, అనిత ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అని అనిపిస్తుంది. బాత్‌రూం సమస్తం రక్తపు మరకలతో నిండినది.


పోలీసులు ఒక్కో రూం చూసారు. హాల్, కిచెన్, బెడ్‌రూమ అన్ని చూసారు. ఎవరైనా వచ్చారా? బయటకు వెళ్ళారా? ఏదో ఆత్మహత్య మాదిరిగానో, అని డౌటు.


అనిత గది వెనక బాగం లో ఉన్నా నిచ్చెన కి ఓక బట్ట ముక్క కనిపిస్తుంది అదీ ఒక షర్ట్ క్లాత్ లాగా ఉంటుంది. అలాగే అపార్ట్‌మెంట్ వెనక బాగం లో  కొన్ని పాదముద్రలు ఉంటాయీ. పోలీసులు వారు సేకరించిన సాక్ష్యం ఫోరెన్సిక్ కి ఇస్తారు.


ఫరెన్సిక్ రిపోర్ట్ బయటపెట్టిన నిజాలు:

షర్ట్ క్లాత్: ఒక మనిషి దుస్తుల భాగం.

పాదముద్రలు: సుమారు 5.5 inch (సాధారణంగా స్త్రీల పాదం కంటే కొంచెం పెద్దది, కానీ కొందరికి సరిపోతుంది). వీటివల్ల అనుమానితుడి ఎత్తు, బరువు కూడా పోలీసులు అంచనా వేస్తారు.


పోలీసులు కేసు మొత్తం తీసుకుని, ఆ రాత్రి జరిగిన ప్రతీ విషయంలో అసలు నిజాలను వెతుకుతున్నారు. అనిత చనిపోవడానికి ముందుగా, అంటే దాదాపు వారం రోజులు ముందు ఆమె ఎక్కడెక్కడికి వెళ్లిందో, ఎవరితో మాట్లాడిందో పోలీసులు తన ఫోన్ కాల్ హిస్టరీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ – ఒక్కరిని విడిచిపెట్టకుండా దర్యాప్తు చేస్తున్నారు.


ఇంటరాగేషన్‌లో చీకటి నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.


ఆ రాత్రి, అనిత తన కబోయే భర్త కోమల్ ని కలవడానికి వెల్తుంది. ప్రీ వెడ్డింగ్ పార్టీ, అలాగే బాచిలర్ పార్టీ కోసం. పార్టీ కి అనిత ఎక్స్-బాయ్‌ఫ్రెండ్, రాహుల్ కూడా వస్తాడు. రాహుల్ – అనితకు కాలేజ్ డేస్‌ నుండి ప్రియుడు. కానీ, ఆ లవ్ స్టోరీ చీకటి అంచుల్లో ముగిసింది.

రాహుల్, అనిత దగ్గర డబ్బు తీసుకుని,  బ్యాటింగ్‌లో ఆ డబ్బు మొత్తం గల్లంతు చేశాడు. 


ఆది తెలుసుకున్న అనిత – రాహుల్‌ని పక్కన పెట్టేసి, జీవితాన్ని కొత్తగా మొదలెట్టింది.

కానీ పార్టీలో రాహుల్‌ని చూడగానే, అనితకి పాత జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తున్నాయి. ఆ వాతావరణం, రాహుల్ చూపులు ఇవన్నీ ఆమెను బాగా అశాంతిగా చేశాయి. అంతే, ఆ పార్టీ నుంచి బయటికి వస్తుంది అనిత.


తనకి ఒంట్లో బాలేదు అని చెప్పి పార్టీ నుండి ఇంటికి బయలుదేరుతుంది అనిత.

మార్గ మాధ్యమంలో తన కారు బ్రేక్‌డౌన్ అవుతుంది. ఆ రాత్రి, ఆ వర్షపు చీకటి  అనితని పూర్తిగా భయపెడుతుంది. సహాయం కోసం ఎదురు చూస్తు ఉంటుంది. ఆ సమయంలో గోపి తన బైక్ మీద ప్రత్యక్షమవుతాడు. తన ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాడు.


ప్రస్తుతం:-


ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్ మరింత లోతులోకి వెళ్తుంది. పోలీసు స్టేషన్‌లో వాతావరణం మరింత తీవ్రమవుతోంది. ఈ కేసులో గోపి పక్కన, రాహుల్, అనితకు కాబోయే భర్త కోమల్ అందరి స్టేట్‌మెంట్‌లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు ఒక్కొక్కరినీ విచారిస్తూ ఉన్నారు, కానీ ఇంకా అసలు నిజం ఎవరి మాటల్లో దాగి ఉందో అర్థం కావడం లేదు.


ఇంటరాగేషన్ రూమ్లో:  కోమల్ – అనిత కి కబోయే భర్త!


కోమల్: “సర్, నేను అనితను మొదటిసారి పెళ్లి చూపుల్లోనే చూసాను. తన గురించి కానీ తన స్నేహితులు గురించి కానీ నాకు ఏం తెలియదు. ఆ రోజు కూడా అనితకి ఒంట్లో బలేదు అని చెప్పి పార్టీ మధ్యలోనే వెళ్లిపోయింది.”

కోమల్ నిజం చెప్పినట్టు అనిపిస్తోంది. కానీ పోలీసుల కళ్ళలో సందేహం మాత్రం అలాగే ఉంటుంది.


పక్క గదిలో: రాహుల్ – ఎక్స్-బాయ్‌ఫ్రెండ్!


రాహుల్: “సర్, ఆ పార్టీకి వెళ్ళింది నిజమే. ఆమెకు కంగ్రాట్స్ చెప్పడానికే వెళ్ళాను. మేమిద్దరం కాలేజ్ లో ప్రేమలో ఉండేవాళ్లం.”


“సార్, నాకు అనిత చాలా సార్లు డబ్బు ఇచ్చి సహాయం చేసింది. కానీ నేను ఆ డబ్బుతో బెట్టింగ్ చేసి పోగొట్టేశాను. అనితను మోసగించాను ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయాను.”

అనిత పార్టీ నుండి వెళ్లిపోవడం తో నేను అక్కడ నుండి వెళ్లిపోయాను.

రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావడానికి, పోలీసులు ఇంకా గోపిని, రాహుల్‌ని, కోమల్‌ని మళ్లీ మళ్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.


పోలీసులు మూడు కోణాలలో అనుమానిస్తునారు:

రాహుల్: పార్టీ కి వచ్చిన వాడు – తానేం చేయలేదన్నాడు.

కోమల్: భార్యను పూర్తిగా తెలిసినవాడు కాదు అన్నాడు.

గోపి: లిఫ్ట్ ఇచ్చిన వాడు మాత్రమే.

ఈ ముగ్గురిలో షర్ట్ క్లాత్ ఎవరితో మ్యాచ్ అవుతుంది అని పోలీసులు లు ఇన్వెస్టిగేషన్ చేస్తారు.


అనిత తల్లి-తండ్రి దర్యాప్తు:-

పోలీసులు ఇప్పుడు అనిత తల్లి-తండ్రి దగ్గర లోతుగా ప్రశ్నిస్తున్నరు. అనిత కుటుంబం కూడా పెద్దగా సహకరించలేకపోతున్నట్టు తెలుస్తోంది.


తల్లి-తండ్రి వద్ద పోలీస్ లా ప్రశ్నలు:-

“ఏమైనా ఫోర్స్ చేసారా ఈ పెళ్లి కోసం?”

“అనితకి ఇంకెవరైనా ప్రత్యేక స్నేహితుడు ఉన్నారా?”

“ఈ పెళ్లి ఒప్పందం ఎవరు తీసుకొచ్చారు?”

“అనిత ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనించారా?”


తల్లి: అనిత ఎప్పుడూ సంతృప్తిగా, సంతోషంగానే ఉండేది. ఈ పెళ్లి కూడా అనిత నిర్ణయంతోనే జరిగిందని నమ్మే వాళ్లం. ఎప్పుడూ దాపరికం లేదా కోపం చూపించలేదు.”


షర్ట్ క్లాత్ గురించి కూడా పోలీసులు విచారిస్తారు… 

ఆ క్లాత్ ఆకృతి-కలర్-బ్రాండ్ ట్రేస్ చేస్తున్నారు. సరిపడే రంగు, ఆకృతి హైదరాబాద్ చుట్టుపక్కల 200 shop ల్లో, 50 మాల్స్లో దొరకడం దానికి ఎక్కడితోనైనా లింక్ కనిపించటం లేదు.


CC TV దర్యాప్తు:


సన్‌షైన్ అపార్ట్‌మెంట్… ఆ రాత్రి 1:00AM CCTV ఫుటేజ్కి లోపం.

ఇంటర్‌నెట్ వైఫల్యం, వర్షం వల్ల స్పష్టత తగ్గిపోవడం. ఆ దారిలోని మెయిన్ రోడ్ ఫుటేజ్ కూడా ఏ సైకిల్ / కారు రికార్డు అవ్వలేదు.


సర్వే చేసిన తర్వాత పోలీసులు మూడు ముఖ్యమైన పోయింట్లు తేలుస్తారు:

అనిత తల్లిదండ్రులకు అసలు నిజం తెలియకపోవచ్చు… లేదా దాచిపెడుతున్నరేమో!

షర్ట్ క్లాత్ తో మర్డర్ లింక్ – మరింత జాగ్రత్తగా పరిశీలించాలి. హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద దుస్తుల కంపెనీ దగ్గర విచారన చెయ్యాలి.


అసలు అనిత చనిపోయే ముందు ఎవరైనా సన్నిహితంగా దగ్గరకి వచ్చినట్టే కనిపిస్తుందా. ఈ దిశగా సీక్రెట్ లో మళ్లీ విచారన మొదలు పెడతారు.


రెండు రోజుల తర్వత:-


పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గోపి వల్ల అమ్మ తనకి తెలిసిన లాయర్ తో పోలీస్ స్టేషన్ కి వస్తారు.


లాయర్ వాదన:

“సర్, మీకు అంతా తెలుసు… లిఫ్ట్ ఇచ్చాడని ఒప్పుకున్నాడు.

కానీ ఆ అమ్మాయి చనిపోయిన ఆరాత్రి గోపి ఆపార్ట్‌మెంట్ కి మళ్లీ వచ్చాడాని ప్రూఫ్ లేదు.

ఫోరెన్సిక్లో గోపి DNA మ్యాచ్ అవలేదు. షర్ట్ క్లాత్ కూడా సాధారణ బ్రాండ్… కనుక ఇది సాక్ష్యం కాదు.”


మీరు ఇంకా గోపి పైనా FIR కూడా ఫైల్ చెయ్యలేదు మీరు కొంచెం పరిస్థితి ఆలోచించి గోపిని విడిచిపెడితే బాగుంటుంది.


కొన్ని కఠినమైన షరతులు మీద గోపిని పోలీస్ వారు విడిచి పెడతారు. 

"కేసు దర్యాప్తు పూర్తిఅయ్యే వరకు హైదరాబాద్ నగరం వదిలి వెళ్ళరాదు.

పోలీసు కాల్ చేస్తే వెంటనే స్టేషన్కి రావాలి.

ఏదైనా కొత్త ఆధారాలు దొరికితే, సహకారం ఇవ్వాలి."


గోపి తన ఇంట్లో:

గోపి తన ఇంట్లో మంచం మీద కూర్చుని ఆ రోజు రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.


ఫ్లాష్‌బ్యాక్:


ఆ రోజు రాత్రి పెద్ద వర్షం. అదే సమయంలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది.

ఆ అమ్మాయి ని చూసిన వెంటనే గోపి కి తెలియని ఒక ఆనందం కలిగింది. అనిత ఎవరో కాదు, గోపి ఇష్టపడుతున్న అమ్మాయి.


సన్‌షైన్ అపార్ట్మెంట్స్ కి ముఖ్యంగా, అనిత ఇంటికి వచ్చిన పార్సెల్‌ని గోపి తీసుకువెల్లెవాడు. ఆలా అనితకు మరియు గోపికి మంచి స్నేహం పెరుగుతుంది.


కానీ అనిత ఎప్పుడూ గోపిని ఒక ఫ్రెండ్ లాగే చుసేది. గోపి కూడా తన స్థాయి గురించి ఆలోచించి, తన ఇష్టాన్ని తనలోనే దాచిపెట్టుకుంటాడు.


సడన్ గా రాత్రి 1:00 గంటలకు అనితను చూసిన వెంటనే, తనకు తెలిసిన అమ్మాయి, తనని ఇంటి దగ్గర  డ్రాప్ చేయడానికి లిఫ్ట్ ఇస్తాడు.


ఇ సంగటన దూరం నుంచి రాహుల్ చూస్తూ ఉంటాడు.


అలా రాహుల్ - అనిత, గోపిలను ఫాలో అవుతూ వల్ల వెంటే వేలతడు.

సన్‌షైన్ అపార్ట్మెంట్స్ దగ్గర దిగిన తర్వాత, అనిత గోపికి కాఫీ ఆఫర్ చేస్తుంది. వర్షం వస్తుంది కాబట్టి, కాఫీ తాగి వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళమని అనిత గోపితో చెబుతుంది.

గోపి ‘ఒద్దు’ అని, అక్కడ నుంచి వెళ్లిపోతాడు.


15 నిమిషల తర్వాత అపార్ట్మెంట్స్ వెనక నుండి రాహుల్ అనిత రూమ్ కి వెళ్తాడు. కానీ రాహుల్ వెళ్ళేసరికి అనిత చనిపోయి ఉంటుంది.

అది చూసి రాహుల్ భయపడి అక్కడి నుంచి వెల్లిపోతాడు."


పోలీసులకి అనిత చావు వెనక కారణాలు ఏం దొరకవు. అల 2 నెలలు 

గాడిచిపోతయి.


2 నేలల తర్వాత:


గోపీ, అనితను ఒక స్నేహితురాలిగా భావిస్తూ, ఆమె ఇంటికి వెళ్తాడు. అనిత తల్లి తో మాట్లాడుతు, అలా గోపి ఇంటిని చూస్తు ఉంటాడు. గోపి కాలింగ్ బెల్ ని చూస్తాడు. ఆది అనిత ఆర్డర్ చేసిన కాలింగ్ బెల్ గోపీ ఏ డెలివరీ చేసాడు ఇంకా అనిత వల్ల ఇంట్లో గోపి నే ఫిక్స్ చేసాడు. 


ఆ కాలింగ్ బెల్ సామాన్య బెల్ కాదు అందులో కెమెరా ఉంటుంది. రికార్డింగ్స్ ఫోన్‌లో స్టోర్ అవుతాయి. అందులో కెమెరా ఉన్న విషయం గోపీకి తెలుసు. గోపీ, అనిత తల్లిదండ్రులను అడిగి అనిత ఫోన్ తీసుకుంటాడు.


ఫోన్‌లో కాలింగ్ బెల్ కి సంబందించిన ఆప్ ఓపెన్ చేసి చూడగానే, ఆ రాత్రి జరిగిన వీడియో బయటకు వస్తుంది. అనితను చంపడం, అన్నీ క్లియర్ గా రికార్డ్ అయ్యి ఉంటాయి.


వెంటనే గోపీ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఎస్‌ఐ గరికి ఆ వీడియో చుపిస్తాడు.


SI గారు కొమల్ ని పిలుస్తాడు. కొమల్ ఆ వీడియో చూసి మౌనంగా అయిపోతాడు. అతని ముఖంలో ఒక గిల్టీ ఎక్స్‌ప్రెషన్ కనబడుతుంది.


అసలు ఆ వీడియో లో ఏం ఉంది:


ఆరోజు రాత్రి గోపీ అనిత ను డ్రాప్ చేసిన తర్వాత అనిత తన అపార్ట్మెంట్‌కి వెల్తుంది, తన తల్లిదండ్రులు పెళ్లి పనుల పైనా ఊరుకి వెళతారు. 


అనిత ఒంటరిగానే అపార్ట్‌మెంట్ కి వేలుతుంది, తన ఇంటి డోర్ ఓపెన్ చేస్తే, రూం లో ఇంకో అమ్మాయి ఉంటుంది. అనిత షాక్ తో “ఎవరు నువ్వు?” అని అడిగే లోపల, ఆ అమ్మాయి అనిత చేతిని కత్తితో కోస్తుంది. అనిత షాక్ లో గమనిస్తూనే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి అదే కత్తితో అనిత గొంతు మీద డీప్ గా కోస్తుంది. రక్తం ఊరుతూనే ఉంటుంది, అనిత ప్రాణం కోసం కొట్టుకుంటూ ఉంటుంది.


ఆ అమ్మాయి అనిత ను ప్రశాంతంగా గమనిస్తూ ఉంటుంది. తర్వాత, అనితను బాత్‌టబ్‌లో పడేసి, బ్లడ్ ను శుభ్రం చేసి, అపార్ట్మెంట్ మొత్తం సాక్ష్యం లేకుండా చేసి అధే అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ యూనిఫాం వేసుకుని, ఎలివేటర్ లో కూల్ గా దిగిపోతుంది.


కొమల్ కన్ఫెషన్:


కొమల్ వీడియో చుసిన తర్వత నిజం చెప్పేస్తాడు “ఆ వీడియో లో ఉన్నా ఆ అమ్మాయి పేరు మాలా! తను నన్ను ప్రేమించిన అమ్మాయి మెంటల్‌గా సరిగా ఉండదు. తను ఒక సైకో నేను తనని ప్రేమించడం లేదు అని చెప్పిన కూడా నా వెంటే తిరిగేది. 

                       ఈ విషయం మాలా తల్లిదండ్రులకి చెప్పాను వాళ్ళు విషయం అర్దం చేసుకొని మాల ని డాక్టర్ కి చూపించారు డాక్టర్ తనకి చికిత్స అందిస్తున్నారు .1 సంవత్సరం అయింది తనని చూసి. నా పెళ్లి అని తెలిసి ఒచ్చినట్టు ఉంది. 

                      తన సైకో ప్రేమ వల్ల అనితను చంపేసింది. ఇలా జరుగుతుంది అని అసలు ఊహించలేదు.”


పోలీస్ యాక్షన్:


పోలీసులు మాలా ఉంటున్న ప్లేస్ కి వెళ్లి, మాలను అరెస్ట్ చేసి, మెంటల్ హాస్పిటల్‌కి పంపిస్తారు.


గోపీ, అనిత సమాధి దగ్గర నిలబడి:

“ఆ రోజు ఆ రోజు రాత్రి నువ్వు పిలిచిన వెంటనే కాఫీ తాగడానికి రావల్సింది. అలా నేను నీతో ఉంటే నిన్ను కాపాడే వాడిని నువ్వు బ్రతికే ఉండదనివి… సారీ అనిత” అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.


ముగింపు... 


Rate this content
Log in

Similar telugu story from Tragedy