SATYA PAVAN GANDHAM

Crime Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Crime Inspirational Others

స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)-5

స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)-5

10 mins
377


స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)-4 కి

కొనసాగింపు ....

స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)-5

ఆ లెటర్ మరియు తన నోట్ బుక్స్ లో నున్న రెండు చేతిరాతలు ఒకేలా ఉండకపోవడం తో ...

స్వప్నికకి, ఆ డీజీపీ కి ఈ కేసు మీద మరింత అనుమానం పెరిగింది.

ఇక దివ్య ఫ్రెండ్స్నీ విచారించగా...

తను చాలా తెలివి గల అమ్మాయని,

తను అంత పిరికిదానిలా ఆత్మహత్య చేసుకునే టైప్ కాదని చెప్తూనే...

ఈ మధ్య మాత్రం ఎందుకో తనలో చురుకుతనం లోపించి కొంచెం డల్ గా ఉంటున్నట్టు తెలిపారు.

ఇక తన ప్రేమ వ్యవహారం గురించి మాత్రం వాళ్ళేవరికీ తెలీదని,

ప్రతి చిన్న విషయాన్ని తమతో పంచుకునే తను, ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకుండా దాచిపెట్టిందని వాళ్ళు తెలిపారు.

ఇక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే టైం లో కూడా తన రూమ్మేట్ వూరికి వెళ్లడంతో తను ఒక్కత్తే ఆ రోజు రూం లో ఉన్నట్టు, తెల్లారి వార్డెన్ వచ్చి చూస్తే విషయం తెలిసినట్టు చెప్పారు.

తన రూమ్మేట్ రాగిణి కూడా అదే విషయం పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపింది.

ఇక ఆ హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపల్ ని విచారిస్తే, వాళ్ళు కూడా అవే విషయాలు చెప్పారు.

ఆ కానిస్టేబుల్స్ చెప్పినట్టు దీని వెనుకనున్న ఆ పెద్ద వాళ్ళు ఎవరు ?

అంత తెలివైన , చురుకైన అమ్మాయి ఇంత అర్ధంతంగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు ?

అసలు ఆ లెటర్ లో ఉన్న అజ్ఞాత వ్యక్తి (ప్రేమించినట్టు చెప్పిన వ్యక్తి) ఎవరు?

వీటన్నింటికీ సమాధానం కోసం వీళ్ళ(డీజీపీ, స్వప్నిక) అన్వేషణ మొదలు పెట్టారు.

అసలు ముందు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్,

ఇంకా ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలిస్తే అసలు దివ్య ఎలా చనిపోయిందో తెలుస్తుంది. వీళ్ళు ఆ కోణంలోనే దర్యాప్తు ముమ్మరం చేశారు.

కేసుని తప్పు దోవ పట్టించిన ఆ ఎస్పీ ని విచారిస్తే ,

ఆ నియోజక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు ఒప్పుకున్నాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, ఆ ఎమ్మెల్యే కొడుకు రాహుల్ కూడా దివ్య చదివిన కాలేజ్ లోనే చదువుతున్నాడు. పైగా ఇద్దరూ క్లాస్మేట్స్ కూడా...

కానీ, దివ్య ఫ్రెండ్స్ ని వాళ్లిద్దరి మధ్య రిలేషన్ గురించి అడగ్గా...

అసలు ఇప్పటివరకూ దివ్య కానీ, ఆ అబ్బాయీ కానీ మాట్లాడుకోవడమే చూడలేదని, అసలు దివ్య అబ్బాయిలతో అంత కలివిడిగా మాట్లాడమే చూడలేదని వాళ్ళు బదులిచ్చారు.

దీంతో అసలు దివ్య కేసులో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.

ఇంతలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి.

అందులో వాళ్ళు ఊహించని విధంగా...

వాళ్ల అనుమానాలకు, సందేహాలకు ఆజ్యం పోసెట్టుగా

ఆ రిపోర్ట్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి.

అసలు పోస్టుమార్టం చేసిన డాక్టర్ ఏం చెప్పారంటే,

"చూడండి సార్...!

అందరూ అనుకుంటున్నట్లు దివ్య ది ఆత్మహత్య కాదు,

"She was raped and murdered"

మరియు ఆమె చనిపోయే టైం కి తను ప్రెగ్నంట్ కూడా ..

ఆ మాటతో వెంటనే

what...?

అంటూ డీజీపీ మరియు స్వప్నిక ఇద్దరూ షాక్ అవుతూ ఆయన చెప్తున్న మాటలకు ఆయన వంక ఆశ్చర్యంతో చూసారు.

దానికి డాక్టర్ మరలా బదులిస్తూ...

"అవును మీరు విన్నదే నిజం!

ఎవరో కొంత మంది ఆమెను అతి కిరాతకంగా రేప్ చేసి, ఆపై హత్య చేసి దానిని ఆత్మహత్య గా చిత్రీకరించారు." అంటూ ఆ డాక్టర్ వాళ్ళకి బదులిచ్చాడు.

"What..?

Do mean is it a gang-rape?" అంటూ ప్రశ్నించింది స్వప్నిక డాక్టర్ నీ

"హుమ్... ఆమె శరీరం అంతా పంటి గాట్లు, ప్రవేట్ భాగాలలో చాలా దారుణంగా.... ఛీ..! ఛీ...! పోస్టుమార్టం రిపోర్టు అనలైజ్ చేసిన నాకే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది అది చూస్తుంటే!" అంటూ డాక్టర్ విస్త్మయంగా బదులిచ్చాడు.

"But doctor...!

మీరు చెప్పింది నిజం అయితే, తన బాడీ హాస్టల్ లో ఎలా ఉరికి ఎలా వెలాడుతూ కనిపించింది. హాస్టల్ లోకి వచ్చి రేప్ చేసి, చంపి వెళ్ళంత స్కోప్ నేరస్తులకు ఎలా ఉంటుంది. ఆ టైం లో వార్డెన్, చుట్టూ పక్కల పిల్లలకు అందరికీ తెలుస్తుంది గా...

బట్ వాళ్ళు మాకేం తెలీదని చెప్తున్నారు...

కానీ, దీన్ని మీరు హత్య అని అంటుంటే నమ్మశక్యంగా లేదు..."

అంటూ డీజీపీ తన మాట పూర్తి చేసేలోపు...

మధ్యలో డాక్టర్ కలుగజేసుకుని

"Sir it's your duty to find the clear evidences...

I have very cleared on report and informing based on that.

Once again, I am strongly saying that

She was gang raped and murdered brutally." అంటూ డాక్టర్ ముక్త కంఠంతో వాళ్ళకి బదులిచ్చాడు.

బాడీ దగ్గర , హాస్టల్ దగ్గర దొరికిన కొన్ని క్లూస్ నీ అప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు పోలిసు వాళ్ళు.

ఈలోపు మరొక్క సారి ఆ హాస్టల్ వార్డెన్ మరియు కాలేజ్ ప్రిన్సిపల్ నీ ఇంటరాగేషన్ చేయగా...

ఈసారి ఆ హాస్టల్ వార్డెన్ లో ఎందుకు ఒకింత తడబాటు, అంతకుమించిన భయం కనిపించాయి. అతనితో పాటు ఆ కేస్ కి సంబంధమున్న ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ నీ, ట్రేసేస్ నీ తీసుకున్నారు.

ఇక ఆ అసలు సూత్రధారి ఆ ఎమ్మెల్యే కొడుకు రాహుల్ ఒక్కడే మిగిలాడు. అతన్ని విచారించడానికి చాలా రాజకీయ అడ్డంకులు ఎదురయ్యాయి స్వప్నికకి మరియు ఆ డీజీపీకి...

ఈ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని ఎలాగోలా అతన్ని విచారించడం ప్రారభించారు వాళ్ళు...

వాళ్ల విచారణలో తేలింది ఏంటంటే, అచ్చం ఆ లెటర్లో ఏదైతే రాసి ఉందో, అదే ఆ రాహుల్ కూడా వాళ్ళకి చెప్పాడు.

"ఆ అమ్మాయే అతని వెంట పడిందని, రెండు మూడు సార్లు ఇష్టం లేదని హెచ్చరించనా ఆమె వినలేదని చివరికి ఇలా ఆత్మ హత్య చేసుకుందని, ఇలా జరుగుతుందని తను కూడా అనుకోలేదని, ఈ ఘటనతో తను కూడా మానసికంగా చాలా కృంగిపోతున్నానని వాళ్ళకి తెలిపాడు రాహుల్."

వెంటనే ఆ డీజీపీ ...

"చూడు రాహుల్ ..!

అంతా అనుకున్నట్టు ఆమె ఆత్మహత్య చేసుకోలేదు .

"She was raped and murdered brutally" "

అంటూ బదులిచ్చాడు డీజీపీ.

దానికి

" what ..?"

అంటూ తను కూడా ఆశ్చర్యార్ధకం కలిగిన ముఖ కవలికలతో అడిగాడు రాహుల్.

అవును ..!

మీకు ఇంకెవరి మీదైనా అనుమానాలున్నాయా అని ఆ డీజీపీ అడగ్గా ...

"నాకు అసలు ఆ అమ్మాయి గురించి పెద్దగా తెలీదు. నేను చేయని తప్పుకు ఈ విచారణ పేరుతో మా నాన్న గారి పేరు దెబ్బతింటుంది. ప్లీజ్ ఈ కేస్ విషయంలో నాకు ఇంకేం తెలీదు, నన్ను వదిలేయండి" అంటూ కొంచెం భయబ్రాంతలకు గురవుతున్న స్వరంతో తను వాళ్ళని బ్రతిమాలాడు.

ఇక చేసేదేం లేక, కేస్ లో పురోగతి కోసం తన ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుని అక్కడ నుండి వచ్చేశారు.

కొన్ని రోజులకు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఎమ్మెల్యే కొడుకు రాహుల్, ఆ హాస్టల్ వార్డెన్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినట్టు తేలింది.

దాంతో ఇక అసలు దొంగలు దొరికారు.

రాహుల్ మరియు ఆ హాస్టల్ వార్డెన్ లు దివ్యని అతి కిరాతకంగా మర్డర్ చేసి చంపేసినట్టు న్యాయస్థానానికి ప్రాథమిక రిపోర్ట్ అందించి, తదుపరి విచారణ కోసం వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి న్యాయస్థానం అనుమతి తీసుకున్నారు.

దాంతో ఈ కేసు నీ మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలుపడుతుందని వాళ్ళు కోర్టుకి విన్నవించారు. కోర్టు కూడా వాళ్ల వాదనలు విని అందుకు సానుకూలంగా స్పందించింది.

దీంతో రాహుల్ మరియు హాస్టల్ వార్డెన్ నీ కస్టడీలోకి తీసుకుని వేరు వేరుగా విచారించగా...

ముందు హాస్టల్ వార్డెన్ ఇచ్చిన వాగ్మూలం...

"ఆ రోజు దాదాపు నైట్ 12 గంటలు అవుతుంది సారు. నేను ఆ రోజు డ్యూటీలో ఉండగా కరెక్ట్ గా గేట్ దగ్గరకు కార్ వచ్చి ఆగింది. అందులో ఐదుగురు అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు దిగి తూలుతూ నా వద్దకు వచ్చారు. అప్పటికే వాళ్ళు బాగా తాగి ఉన్నట్టున్నారు.

వారిలో ఎమ్మెల్యే గారబ్బాయి రాహుల్ ఒకరు. ఈ టైంలో వాళ్ళు అక్కడికి రావడంతో కొంచెం కంగారుగా...

"ఏమైంది బాబు?

ఏంటి విషయం?" అంటూ వాళ్ళని ఆరా తీశాను.

దానికి వాళ్ళు కార్ దగ్గరకి తీసుకెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి,

చాలా దీనస్థితిలో, నిశ్చలంగా నున్న ఒకమ్మాయిని నాకు చూపించారు...

కొద్ది సేపటి వరకూ ఆమెను నేను గుర్తుపట్టలేదు.

కాసేపటికి అది దివ్యమ్మ గారిదని గుర్తుపట్టగలిగాను.

నేను కంగారు పడుతూ...

"ఏమైంది బాబు ...? ఏమైంది..?

మా దివ్యమ్మ గారికి ఏమైంది బాబు..?"

అంటూ వాళ్ళని అడిగాను.

దానికి వాళ్ళు...

"మా కోరికలను తీర్చి, మాకు స్వర్గ సుఖాలను అందించి, ఇక ఓపిక లేక చచ్చింది." అంటూ బదులిచ్చారు.

ఒక పక్క నాలో కోపం కట్టలు తెంచుకున్నా...

ఆ పెద్దోళ్ల ముందు నిలబడలేక, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను.

"ఎంత పని చేశారు బాబు,

ఎంత ఘోరానికి ఒడిగట్టారయ్యా..?

అమాయకురాలైన ఆడపిల్లని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు కదయ్యా..!" అంటూ అక్కడే రోధిస్తుంటే,

బలవంతంగా నా నోరు నొక్కి,

"ఇప్పుడు మేము చెప్పినట్టు చేయకపోయినా...

లేక, ఈ విషయం బయట ఎక్కడైనా చెప్పినా...

నీ పెళ్ళాం పిల్లలకి కూడా ఇదే దుస్థితి పడుతుంది. చిన్నా పెద్దా అని చూడకుండా ఎవరిని వదిలిపెట్టము.

మర్యాదగా మేము చెప్పినట్టు చెయ్యి.!" అంటూ నన్ను బెదిరించారు, మరింత భయపెట్టారు.

ఆ బాడీ నీ తన రూం కి తీసుకెళ్ళి, అప్పటికే జీవం లేని ఆ తల్లిని చున్నీ తో మళ్ళీ చంపేసాం.

ఆ తర్వాత రోజు!

విషయం బయటకి పొక్కకుండా వాళ్ల పలుకుబడి ఉపయోగించి, ఎస్పీ సహాయంతో జరిగింది అంతా ఒక ఆత్మహత్యా గా చిత్రీకరించి,

తెల్లారగానే హుటాహుటీన ఆ శవాన్ని కూడా అక్కడి నుండి వాళ్ల ఊరికి తీసుకెళ్ళిపోయారు.

నా సొంత బిడ్డ లాంటిదయ్య...!

దివ్యమ్మా..!

ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది. కాలేజ్ లో కానీ, హాస్టల్ కానీ ఎప్పుడూ ఎవరితో ఏ తగాదాలు లేవు. అలాంటి బిడ్డకి అన్యాయం చేశాను. క్షమించరాని తప్పు చేశాను. తెలిసి తెలిసి కన్న బిడ్డ లాంటి దానికి తీరని అన్యాయం చేశాను.

అంతా నా వాళ్ళని కాపాడుకోవడానికే తప్ప, మరింకేం దురుద్దేశ్యం లేదు." అంటూ చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ... మరింత కృంగిపోతూ తన వాంగ్మూలం ఇచ్చాడు.

ఇక ఈ కేసు లో అసలు నేరస్తుడు రాహుల్ నీ విచారించడానికి వెళ్తారు డీజీపీ మరియు స్వప్నిక.

అప్పటికీ అతను ఇంకా నాకేం తెలీదు అంటూ వాధిస్తునే ఉంటాడు.

దాంతో చిర్రెత్తిన డీజీపీ...

"చూడు రాహుల్...!

ఈ కేసుతో నీకు సంబంధం లేదని నువ్వెంత బుకాయించినా... నువ్వు ఈ కేసు నుండి తప్పించుకోలేవు.

నీ ఫింగర్ ప్రింట్స్, ఆ హాస్టల్ వార్డెన్ ఇచ్చిన వాంగ్మూలం, మరికొన్ని ఆధారాలూ... అన్ని నువ్వే ఆమెను అత్యాచారం మరియు హత్య చేశావని మా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే నీ చుట్టూ ఉన్న దారులన్ని మూసుకుపోయాయి.

ఇక నీ దగ్గర ఉన్నది ఒకే ఒక్క దారీ...

తప్పు ఒప్పుకుని, అసలేం జరిగిందో చెప్తే, శిక్ష తక్కువ పడేలా చూస్తాం...

నువ్వు ఇంకా ఇలా నాటకాలు ఆడితే, థర్డ్ డిగ్రీ ఉపయోగించి నీ దగ్గర నిజాలు రాబట్టాల్సి ఉంటుంది. అవసరమైతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడను.

నీ బాబు కూడా నిన్ను ఇక్కడ నుండి, మా నుండి కాపడలేడు." అంటూ అతన్ని హెచ్చరిస్తాడు డీజీపీ.

దాంతో రాహుల్ దారిలోకి వచ్చి తన తప్పుని అంగీకరించి, నిజం చెప్తాడు.

"దివ్య...!

తను మా కాలేజ్ లో జాయిన్ అయిన మొదటి రోజు...!

తనని , తన అందాన్ని చూడగానే కాలేజ్ అంతా తన వెనకే పడింది. నాకు కూడా ఆమెను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనే కోరిక పుట్టింది.

ఇప్పుడే దాన్ని ఎలా పడగొడతానో అంటూ ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేశాను.

నడుచుకుంటూ వస్తున్నా ఆమెకు డాష్ ఇచ్చాను.

దాంతో తను స్టుపిడ్ అంటూ నన్ను తిట్టింది.

కోపంతో నేను...

"హేయ్..! నేనెవరో తెలుసా...!

ఎమ్మెల్యే కొడుకునే..!" అంటూ తనని గదమాయించాను.

"నువ్వు ఎవరైతే నాకేంటి రా ఇడియట్..!" అంటూ మరొక్కసారి నన్ను అవమానించింది.

దాంతో నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేశారు. అసలే అవమాన భారంతో రగిలిపోతున్న నేను, దాన్ని అనుభవించి దాని తలపొగరను దించాలనుకున్నాను.

ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంటే, అప్పుడే నా ఫ్రెండ్ రాగిణి తన రూమ్మేట్ అన్న సంగతి తెలిసి, తన ద్వారా దివ్యని లోబరుచుకోవాలని అనుకున్నాను.

రాగిణి మాత్రం తను అలాంటిది కాదని, అందుకు ఒప్పుకోలేదు. కానీ, నా బ్యాక్ గ్రౌండ్ తనకు తెలుసు కాబట్టి, నా బెదిరింపులకు భయపడి చివరకు ఒప్పుకుంది.

అనుకున్నట్టుగానే పథకం ప్రకారం...

రాగిణి దివ్య తో బాగా చనువు పెంచుకుంది. ఒకరోజు తన బంధువుల ఇంటికంటూ నా గెస్ట్ హౌజ్ కి తీసుకొచ్చింది. కూల్డ్రింక్ లో మత్తు మందు కలిపి తనని నేను అనుకున్న విధంగా అనుభవించాను.

తను స్పృహలోకి వచ్చాకా... చాలా గొడవ చేసింది. తన జీవితాన్ని నాశనం చేసానంటూ నా కాలర్ పట్టుకుని నన్ను నిలదీసింది. మోసం చేసి అక్కడకి తీసుకొచ్చిన రాగిణి నీ పట్టుకుని చెడామడా రెండు చెంపలు వాయించింది.

"నువ్వు అసలు ఆడదానివేనా?" అంటూ తనని తిట్టింది.

ఈ విషయం బయటకు పొక్కితే నీ జీవితం, మీ ఇంట్లో వాళ్ల పరువు, నీ ఆశయం అన్నీ సర్వనాసనం అవుతాయి. నాకెలాగో మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి, నేను తప్పించుకుంటాను. అందుకే సైలెంట్ గా ఉండు. కాదు కూడదని గొడవ చేసావో నీకే రిస్క్. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో!" అంటూ ఆమెను బెదిరించాను.

దాంతో తను లొంగిపోయింది.

ఈ సంఘటన తర్వాత తను ఇది వరకులా కాకుండా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. తన చదువు మీద ఒకప్పటిలా కాన్సంట్రేట్ చేయలేక పోయింది.

చివరికి ఒక రోజు తను ప్రెగ్నంట్ అంటూ మళ్ళీ గొడవ చేసి, తనని పెళ్ళి చేసుకోవాలని లేకుంటే ఈ విషయం అందరికీ చెప్తాను అంటూ నన్ను బెదిరించింది.

ఆరోజు అప్పటికే స్నేహితులతో కలిసి డ్రింకింగ్ చేస్తున్న నేను... తనని ఒక రహస్య ప్రదేశానికి రావాలని, అక్కడ సామరస్యంగా చర్చించుకుందామని తనని ఒప్పించి అక్కడకి రప్పించాను.

తీరా అక్కడకి వచ్చాకా, మా ఫ్రండ్స్ తో కలిసి ఒకరి తర్వాత ఒకరు వరుసగా తనని అనుభవించాం. మూకుమ్మడిగా గ్యాంగ్ రేప్ చేశాం.

ఆరోజు మధ్యాహ్నం మొదలుకుని అర్ధరాత్రి వరకూ... దాదాపు 12 గంటలు...

తన ఒళ్లంతా రక్కి, పళ్ళతో కొరికి, తన ప్రవైట్ భాగాలలో బీర్ బాటిల్స్ చొప్పించి, బలవంతంగా మద్యం తాగించి, తనను నానా చిత్ర హింసలకు గురి చేసి, అత్యంత దారుణంగా తనని రేప్ చేశాం.

ఒక పక్క నొప్పి తట్టుకోలేక తను వదిలిపెట్టమని మమ్మల్ని వేడుకుంటుంటే, ఆరోజు అది చూపించిన దాని తల పొగరు, తగ్గించిన ఆనందంలో ఇంకా వైల్డ్ గా ప్రవర్తించాము. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు కొట్టాము. తాళ్లతో బంధించి బెల్టులతో కొట్టాము. మా నుండి తప్పించుకుని పారిపోబోతుంటే జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టాము. స్పృహ తప్పి పడిపోయాక కూడా తనని వదిలిపెట్టకుండా మరింత క్రూరంగా అనుభవించాము.

తన ప్రవైట్ భాగాల నుండి ఒక పక్క రక్తం కారుతున్నా, తను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి,

"మా అమ్మ నాన్నను ఒకసారి చూడాలని ఉంది. నేను లేక పోతే వాళ్ళు బ్రతకాలేరు!"

అంటూ మమ్మల్ని ప్రాధేయపడింది.

"ప్లీజ్...ప్లీజ్... ఒక్కసారి నన్ను వదిలిపెట్టింది..!" అంటూ మమ్మల్ని బ్రతిమలాడుకుంది.

అప్పటికే బాగా తాగి ఉండడంతో మాలో రాక్షసత్వం రంకెలు వేసిందే తప్ప, తన పరిస్థితి చూసి జాలి కలగలేదు.

ఆ రోజు నైట్ దాదాపు పది గంటలకే తను చనిపోయినా...

నైట్ పదకొండు వరకూ తనను శారీరకంగా అనుభవిస్తునే ఉన్నాము.

ఆ తర్వాత తన హాస్టల్ కి తీసుకెళ్ళి, వార్డెన్ ను బెదిరించి ఈ హత్యని ఒక ఆత్మహత్యాగా చిత్రీకరించాము. రాగిణి భయపడడంతో తనని అప్పటికప్పుడే ఆ ముందు రోజు సాయంత్రనికే ఇంటికి పంపించేశాము.

ప్రతి పరిస్థితినీ మాకు అనుకూలంగా మార్చుకుని, తను రాసినట్టుగా ఒక లెటర్ మేమే రాసి, కేస్ మా వైపు రాకుండా జాగ్రత్త పడ్డాము. కానీ, చివరికి...."

అంటూ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు రాహుల్.

ఇదంతా విని డీజీపీ, స్వప్నిక ఇద్దరూ నిష్ణాతులైయ్యారు. స్వప్నిక తన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ

"అధికార మదంతో, తల పొగరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా...!

ఎన్నో అసలు పెట్టుకున్న ఆ అమ్మాయి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చావు కదా రా...!

వెధవ!" అంటూ ఆవేశంగా రాహుల్ రెండు చెంపలు పదే పదే వాయిస్తూ.... డీజీపీ దగ్గర ఉన్న గన్ తీసుకుని తనని అక్కడే షూట్ చేయబోతుంటే, ఆ డీజీపీ అడ్డుపడి...

"కంట్రోల్ స్వప్నిక...!

కంట్రోల్...!!

చట్టాన్ని నీ చేతులోకి తీసుకోకు, ఇదంతా న్యాయస్థానం చూసుకుంటుంది" అంటూ తనకి నచ్చజెప్పి... తన ఆవేశాన్ని కంట్రోల్ చేస్తాడు డీజీపీ.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట కోర్టు...

ఆమె హత్య , అత్యాచారం లో పాలుపంచుకున్న వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది కోర్టు.

వారికి సహాయం చేసిన రాగిణికి ఏడేళ్లు మరియు ఆ హాస్టల్ వార్డెన్ కి మూడేళ్ళు కటిన కారాగార శిక్ష విధిస్తుంది.

స్వప్నిక కోపం అక్కడితో చల్లారదు!

డీజీపీ తో "ఇదేనా సర్!, ఒక ఆడపిల్ల జీవితాన్ని చిధిమేసి, ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ మూర్ఖులకు మన

న్యాయస్థానం విధించే శిక్ష!

ఇప్పుడు యావజ్జీవ శిక్ష !

వాళ్ళని దున్నపోతులను మేపినట్టు మేపి, తీరా ఒక సంవత్సరం పోయాక సత్ప్రవర్తన కింద బెయిల్, తదుపరి కేస్ క్లోజ్, వాళ్ళు విడుదల!

That's it, ప్రతి సారి జరిగేది ఇదే కదా సార్

ఇంకెప్పుడు సర్ ఇలాంటి ఆడపిల్లలకి న్యాయం జరిగేది?" అంటూ ఆవేదనగా అతన్ని ప్రశ్నిస్తుంది.

డీజీపీ అప్పటికే తన ప్లాన్ లో తాను ఉంటాడు. ఆ ఐదుగురిని ఎన్కౌంటర్ చేస్తాడు.

తన పైన వాళ్ళకి చెప్పిన కారణం...

వాళ్ళు జైలు నుంచి తప్పించుకునీ పారిబోతుంటే, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వాళ్ల పై ఎదురుదాడికి దిగడంతో ఆత్మ రక్షణ కోసం అని ఒక స్టేట్మెంట్ సృష్టిస్తారు.

కానీ, అసలు విషయం న్యాయ స్థానంతో పాటు మనకి తెలుసు!

వాళ్ళు ఎందుకు ఎన్కౌంటర్ చేయబడ్డారో...?

స్వప్నిక మనసు మాత్రం ఇంకా ఆందోళనలోనే ఉంటుంది.

స్వప్నిక మదిలో ఎన్నో రకాల ఆలోచనలు...!

కేవలం ఒకరి పొగరుబోతు తనానికి, అధికార పలుకుబడికి ఒక అమాయకురాలైన అమ్మాయి బలి...!

తెలిసిన అమ్మాయి ఒక్కరే, ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలా ఈ సమాజంలో...!

దానికి తోడు ఈ న్యూస్ చానల్స్...! పాపులారిటీ కోసం అసలు నిజాల్ని కప్పిపుచ్చి, అమాయకుల, బలహీనుల పై నేరాన్ని మోపడం పరిపాటిగా మారింది.

అందుకే తను ఒక నిర్ణయం తీసుకుంది.

చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది

ఆ నిర్ణయం ఎంత వరకూ ప్రభావితం చేస్తుంది?

ఆ మార్పులు ఏమిటి?

ఈ అఘాయిత్యాలు ఆపడానికి తనింకా ఏం చేయబోతుంది..?

మార్పుల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే మరిన్ని రాజకీయ ఒత్తిళ్లను ఆమె ఎలా ఎదుర్కుంటుంది?

తర్వాతి భాగం స్వప్నిక I A S ( ఓ వేశ్య కథ) - 6 లో చూద్దాం

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Crime