SATYA PAVAN GANDHAM

Drama Thriller Others

4  

SATYA PAVAN GANDHAM

Drama Thriller Others

"ది ఎఫైర్ - 10"

"ది ఎఫైర్ - 10"

6 mins
323"ది ఎఫైర్ (ruins a human life) - 9" కి


కొనసాగింపు...


"ది ఎఫైర్ (ruins a human life) - 10"


మరుసటి రోజు ఉదయాన్నే లేచి తాను సంపాదించిన ఎవిడెన్స్... అదే సూసైడ్ నోట్ ఉన్న ఆ నోట్బుక్ తో డ్యూటీ కి వెళ్ళాడు ఎస్ ఐ.


వెళ్ళీ వెళ్లడంతోనే కానిస్టేబుల్ శ్రీనివాస్...


"ఏంటి సార్ !


ఆ సూసైడ్ నోట్ లో ఏమైనా డిటైల్స్ దొరికాయా శివరాం గురించి ?" అని అడగ్గా...


"

ఇదిగో నువ్వే చదువు ..!" అంటూ అతనికి ఆ బుక్ ఇచ్చాడు ఎస్ ఐ.


ఈలోపు

తన పై అధికారులకి, దొరికిన ఎవిడెన్స్ గురించి ఫోన్లో వివరించాడు. శ్రీనివాస్ ఆ సూసైడ్ నోట్ పూర్తిగా చదివే లోపు వాళ్ల పై ఆఫీసర్స్ కూడా ఆ స్టేషన్ కి చేరుకున్నారు.


ఈ విషయం మీద అత్యవసరంగా మీటింగ్ పెట్టి దాని గురించి డిస్కషన్స్ మొదలు పెట్టారు వాళ్ళు.


ఆ మీటింగ్ లో ఒక పై అధికారి...


"ఈ కేసులో శివరాం తనకు తానే సూసైడ్ నోట్ రాశాడు, అలాగే తనది సూసైడ్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా వచ్చిందని మీరు చెప్పారు. కాబట్టి, ఇది ఆత్మహత్యగా పరిగణించి ఇప్పటివరకూ విచారించిన వాళ్ళని ఇక ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి !" అని


"శివరాం, తన చావుకి కారణం వాళ్ళేనని అంత క్లియర్ గా తన నోట్ లో రాసిన తర్వాత కూడా దోషులను ఎలా వదిలేస్తాం!. వాళ్ళు చేసిన పాపాలకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే ! వాళ్ళని తప్పకుండా శిక్షించాల్సిందే" అంటూ ఇంకో అధికారి


"అలా చేస్తే తన పాప జీవితం ఏమవుతుందో ?


అది కూడా కాస్త ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉందంటూ" ఒకరు...


"పాపను కావాలంటే మనమే అడాప్ట్ చేసుకుని, బాగా చదివించి ఒక ప్రయోజకులరాలిని చేద్దాం. వాళ్ల దగ్గర ఉంటే ఏదో ఒక రోజు ఆ పాప అడ్డును కూడా తొలగించుకోవడానికి వెనకాడరు వాళ్ళు !" అంటూ ఇంకో అధికారి


ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ అభిప్రాయాలను చెప్తున్నారు.


ఎస్ ఐ మాత్రం ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాడు.


అది గమనిస్తున్న అతని పై అధికారులు...


"ఏంటి రఘునాథ్ (ఎస్ ఐ)


మేమందరం ఇక్కడ ఇంతలా డిస్కస్ చేసుకుంటుంటే, ఈ కేసుని ఇక్కడి వరకూ నడిపించిన నువ్వు మాత్రం, కనీసం ఏ సలహా ఇవ్వకుండా, నీ అభిప్రాయం కూడా తెలపకుండా ఇలాగే ఉండిపోయావు." అంటూ అతన్ని ప్రశ్నిస్తారు.


దానికి రఘునాథ్ మెల్లగా తన తలను వారి వైపుకి తిప్పుతూ...


"మీరందరూ ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు.


కానీ, నేను మాత్రం ఇప్పుడే ఈ కేసు మొదలైంది అనుకుంటున్నాను" అని అంటుండగా...


"ఏంటి రఘు..!


నువ్వు చెప్పేది ?" అంటూ తన పై అధికారి ఒకరు ప్రశ్నించారు.


"అదే సార్..!


ఇక్కడ మనం శివరాం భార్య, ఆమె అన్న, తండ్రి లను విచారించాం!

కానీ, సూసైడ్ నోట్ లో శివరాం పేర్కొన్న...

నాగమణి తల్లి, నాగమణి తో అఫైర్ పెట్టుకున్న ప్రకాష్ లను ఇంకా విచారించ లేదు. ఇక శివరాం తో అఫైర్ పెట్టుకున్న ఆ అజ్ఞాత మహిళ గురించి మనకింకా డిటైల్స్ తెలియలేదు. అలాగే అసలు ప్రకాష్ కి నాగమణి ని పరిచయం చేసిన ఇంకో మహిళ గురించి కూడా డిటైల్స్ ఏమి మన దగ్గర లేవు. ఇవన్నీ మన చేతికి వస్తె ఈ కేసులో మరికొన్ని కొత్త కోణాలు కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఉందని నాకనిపిస్తుంది సార్ !"


అంటూ తనుకున్న అనుమానాలు బయట పెడతాడు రఘునాథ్.


"ఏం మాట్లాడుతున్నావ్ రఘు..!


వాటి వల్ల ఇక ఉపయోగం ఏముంది. ఆ సూసైడ్ నోట్ క్లియర్ గా ఉంది. అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అతను ఆత్మహత్య చేసుకున్నట్టు...


"మమ్మల్ని ఎందుకు ఇంకా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు" అని రేపు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తే !


వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం !


దీన్ని సాగదీయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అంతే,

మన రికార్డ్స్ లలో ఇలాంటి పెండింగ్ కేసులు ఇంకా చాలానే ఉన్నాయి. ముందు వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది." అంటూ ఎస్ ఐ తో వాదిస్తాడు అతని పై అధికారి ఒకరు...

రఘునాథ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.


"రఘునాథ్ ఈ కేసును చాలా చాకచక్యంగా డీల్ చేశాడు. తనకి ఇంకా ఏవేవో అనుమానాలు ఉన్నట్టున్నాయి. దయచేసి ఆయనికి ఇంకొంత టైం ఇద్దాం. ఇందులో ఇంకేమైనా లొసుగులు ఉన్నాయేమో తను కనిపెడతాడు. అతని పై పూర్తి నమ్మకం నాకుంది" అంటూ వేరొక అధికారి రఘునాథ్ వైపు మాట్లాడుతూ... అతనికి మద్దతుగా నిలుస్తాడు.


ఆ మీటింగ్ లో ఇంకొంతమంది రఘునాథ్ వైపే ఉంటూ వాళ్ళు కూడా అతన్ని సపోర్ట్ చేయడంతో...


మిగిలిన వారిని విచారించడానికి పై అధికారులు అంతా ఒప్పుకుంటారు.


ఇక, తన పై అధికారుల దగ్గర నుండి పూర్తి అనుమతి లభించడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ సహాయంతో మిగిలిన వారిని విచారించడానికి వాళ్ళని స్టేషన్ కి పిలిపిస్తాడు.


ముందుగా నాగమణి, ఆమె సోదరుడు గంగాధర్, తండ్రి సత్య నారాయణ లను మళ్ళీ విచారణ పేరుతో స్టేషన్ కి ముగ్గురిని రప్పించి, ఏకకాలంలో ఒకేచోట, ఒకేసారి ఎదురెదురుగా వాళ్ళని విచారించడానికి రెఢీ అవుతాడు ఎస్ ఐ.


పిలిపించినట్టుగానే

నాగమణి, గంగాధర్ మరియు సత్యనారాయణ స్టేషన్ కి వస్తారు.


ఒక రహస్య గదిలో వాళ్ళని విచారించడానికి వచ్చిన ఎస్ ఐ...

వాళ్ళని కోపంగా(అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టు) చూస్తూ...


"శివరాంని మీరే హత్య చేసి, దాన్ని ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మర్యాదగా నేరం ఒప్పుకుంటే, శిక్ష తగ్గుతుంది. లేదా ఇక్కడే థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వస్తుంది. నిజం చెప్తే సరే సరి ! లేదా ఆడదానివి అని చూడకుండా నీ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది" అంటూ ఎస్ ఐ వాళ్ళని బెదిరించడం మొదలు పెడతాడు.


దానికి నాగమణి భయంతో బిత్తర చూపులు చూస్తూ...


"నాకేం తెలీదు,


నాకేం తెలీదు ఎస్ ఐ గారు...


అయినా నా భర్తను నేనెందుకు చంపుకుంటాను !" అంటూ బిక్క మొహంతో తడబడుతూ సమాధానం ఇస్తూనే ఏడుపు లంఖించుకుంటుంది.


"ఏం మాట్లాడుతున్నారు ఎస్ ఐ గారు...


అసలు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కట్టుకున్న మొగుడ్ని నా చెల్లెలు ఎందుకు చంపుతుంది ?

మీరు కావాలనే ఈ కేసులో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు.

నాకూ లీగల్ గా చాలా సపోర్ట్ ఉంది. స్టేషన్ కి పిలిపించి బెదిరిస్తే అబద్ధం నిజం అవ్వదు. ఏదైనా అడిగే ముందు కొంచెం ఆలోచించి అడిగితే మంచిది" అంటూ పొగరుగా కోపంతో ఊగిపోతూ మాట్లాడతాడు గంగాధర్...


"నువ్వు ఆగరా !


ఎస్ ఐ గారు...

వీడు కొంచెం తొందర పాటు మనిషి. వీడన్నది ఏది మనసులో పెట్టుకోకండి. ఏదో ఆవేశంలో మాటలు వదులుతున్నాడు అంతే తప్ప మరేం దురుద్దేశ్యం లేదు.


దయచేసి మమ్మల్ని, మేము చెప్పేది కాస్త నమ్మండి. అతన్ని మేమే చంపాం అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గరా !


అతనంటే మాకు పీకల వరకూ కోపం వున్న మాట వాస్తవమే కానీ, హత్య చేసి, కూతురు జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డ వాళ్ళం అయితే కాదయ్యా.!" అంటూ కొడుకుని, కూతురిని వెనకేసుకొస్తూ కొడుకు మాటలకి కోపగించుకున్నట్టు కనిపిస్తున్న ఎస్ ఐ ని శాంత పరుస్తూ అసలు కారణం ఏమిటో ? తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు సత్య నారాయణ...


అప్పుడు ఆ ఎస్ ఐ సీరియస్ గా...


"శ్రీనివాస్...


ఆ నోట్ బుక్ తీసుకురా !" అంటూ గట్టిగా అరుస్తాడు.


ఎస్ ఐ సూచనతో

కానిస్టేబుల్ శ్రీనివాస్ నోట్ బుక్ తీసుకొస్తూ ఉంటాడు ఆ రూం లోకి తనతో పాటు..

అలా తీసుకొస్తున్న నోట్ బుక్ చూస్తూ...


"ఆ రోజు మా ఇంట్లో నుండి తీసుకెళ్లిన నోట్ బుక్ ఏ కదా !


ఇందులో ఏముంది ?"


అని అనుకుంటూ నాగమణి ఆలోచనలో పడుతుంది.


"అసలు ఆ నోట్ బుక్ ఏంటి?


అందులో ఏముంది ?" అని ఆత్రుతగా సత్యనారాయణా, గంగాధర్ దాని వంక అలానే చూస్తూ ఉంటారు.


ఇంతలో ఎస్ ఐ దాన్ని శ్రీనివాస్ దగ్గర నుండి తీసుకుని, ఓపెన్ చేసి...


ఇదిగో మీ అల్లుడు రాసిన సూసైడ్ నోట్ !


ఇది వీళ్ళ పాప నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నాడు. మొన్న వీళ్ళ ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తే మాకు దొరికింది. ఇందులో ఏం రాశాడో చదవండి ! అప్పుడు బయట పడుతుంది వీళ్ళ నిర్వాకం" అంటూ కోపంగా కల్లేర్ర జేసీ నాగమణి, గంగాధర్ ల వైపు చూస్తూ ఆ నోట్ బుక్ సత్యనారాయణ కి ఇస్తూ చెప్తాడు ఎస్ ఐ.


"సూసైడ్ నోట్ ఆ...!" అంటూ షాక్ అవుతూ ఎస్ ఐ చేతుల్లో నుండి ఆ బుక్ తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు సత్యనారాయణ...


ఇంతలో

"సూసైడ్ నోట్ అని మీరే అంటున్నారు. అంటే అతను సూసైడ్ చేసుకున్నట్టు మీరే నిర్ధారిస్తున్నారు. మళ్ళీ ఇది హత్య, అది కూడా మేమే చేశాం అని ఎలా చెప్తున్నారు ఎస్ ఐ గారు" అంటూ అసహనంతో అడిగాడు గంగాధర్...


దానికి ఎస్ ఐ...


"ఎలాగా ?


మీ చెల్లి ఎవరినో ప్రేమిస్తే, అది ఇష్టం లేని మీరు శివరాం తో పెళ్ళి చేశామని మా విచారణలో చెప్పారు !


మీ చెల్లి...


"

శివరాంనే ప్రేమించాను, ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అది మా అన్నయ్య, నాన్నలకు నచ్చలేదు. అందుకే శివరాం అంటే వాళ్ళకి పడదు! " అని మాకిచ్చిన స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్పింది. మరి ఇందులో ఏది నిజం ?" అంటూ ఎస్ ఐ వాళ్ల ముగ్గురి వంక చూస్తూ గంభీరంగానే చెప్తాడు ....


"ఏం మాట్లాడుతున్నారు ఎస్ ఐ గారు...


మా చెల్లి అలా చెప్పడం ఏంటి ?" అంటూనే గంగాధర్ నాగమణి వైపు కొంచెం ఆశ్చర్యం, మరింత కోపం కలిగిన భావంతో తనని చూస్తాడు.


తప్పు తనవైపే ఉందని తెలుసుకున్న

నాగమణి తల కిందికి దించుకుంటుంది.


ఇంతలో సూసైడ్ నోట్ చదవడం పూర్తైన సత్యనారాయణ కూడా "నాగమణి వైపు చూస్తూ ఎంత దారుణానానికి వడిగట్టావే బోకు లం* !" అని దుర్భషలాడుతూ కుమిలిపోతూ ఏడుస్తాడు.


"ఏమైంది నాన్నా ..!" అంటూ గంగాధర్ అడగ్గా...


"నువ్వు మాట్లాడకు రా నీచుడా !

ఇందులో నీ ప్రమేయం కూడా ఉంది కదరా వెధవ !


అసలు మీరు నా కడుపున ఎలా పుట్టారే!


అభం శుభం తెలియని ఒక అమాయకుడిని పొట్టన పెట్టుకున్నారు కదే !" అంటూ భోరున విలపిస్తాడు సత్యనారాయణ.


ఆ లెటర్ లో తన గురించి ఏముందోనని తెలుకోవడానికి తండ్రి దగ్గర ఆ లెటర్ తీసుకుని తాను కూడా చదవడం స్టార్ట్ చేస్తాడు గంగాధర్ !


గంగాధర్ కి తను చేసిన తప్పు బయట పడగానే దాన్ని ఎలా కవర్ చేస్తాడు ?


నాగమణి మళ్ళీ ఎలాంటి ప్రణాళికతో తన తప్పును కప్పి పుచ్చుకుంటుంది ?


ప్రకాష్ మరియు శివరాం తో అఫైర్ పెట్టుకున్న ఆజ్ఞత మహిళను పెట్టుకుంటారా ?


నాగమణి తల్లి పాత్ర కూడా వుండడంతో ఆవిడని కూడా విచారిస్తారా ?


భార్య, కొడుకు, కూతురే తన అల్లుడు చావుకి కారణం అని తెలుసుకున్న సత్యనారాయణ వాళ్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ?


లాంటి విషయాలు అన్నీ...


"ది ఎఫైర్ (ruins a human life) - 11" లో తెలుసుకుందాం.


అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.


అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.


నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


రచన: సత్య పవన్ ✍️✍️✍️Rate this content
Log in

Similar telugu story from Drama