STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Drama Tragedy Thriller

4  

SATYA PAVAN GANDHAM

Drama Tragedy Thriller

"ది ఎఫైర్ - 3"

"ది ఎఫైర్ - 3"

6 mins
8

"ది ఎఫైర్ (ruins a human life) - 2" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 3"

అలా వారి ముగ్గురిని విచారించిన పోలీసులు, మరిన్ని అనుమానాలను ఏర్పరుచుకున్నారు తప్ప, కేసులో ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.

శివరాం ఉండే ఇంట్లో సోదాలు నిర్వహించడం వలన కానీ,

వాళ్ల ఇంటి చుట్టూ పక్కల వాళ్ళని విచారించడం వలన కానీ ఇంకా ఏమైనా ఆధారాలు లభించ వచ్చునేమొనన్న

పై అధికారుల ఆదేశాలతో...

టౌన్ పరిధిలోని పోలీసులు ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

దానికి కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మరియు రాంబాబు లను ఎంపిక చేశారు.

ముందుగా శివరాం ఇంట్లో తనికీలు నిర్వహించారు అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్స్...

రోజంతా కష్టపడి, ప్రతి చోటా అణువణువునా గాలించినా చిన్న క్లూ కూడా లభించలేదు వాళ్ళకి.

కానీ, చివరకు వాళ్ళు అక్కడనుండి వెళ్లిపోయే ముందు మూలాన ఉన్న ఒక బీరువా పక్కన కొన్ని పేపర్స్ దొరికాయి. అవి శివరాం స్వతహాగా రాసుకున్న కవితలు, కథలు.

ఉదాహరణకి కొన్ని రచనలు చదివిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే...

శివరాం భార్య చెప్పినట్టు అతనేదో కాలక్షేపానికి రాసెట్టు కనిపించడం లేదు ఆ రచనలు.

ఎప్పటికైనా తనొక గొప్ప రచయిత కావాలనే దృఢ సంకల్పంతో రాసినట్టుగా ఉన్నాయి.

అందులో వాటి అర్థాలు అంత లోతుగా ఉన్నాయి మరి!

పోలీసులు అతని రచనల్లో గమనించిన మరొక విషయం ...

తను రచనలు రాయడానికి అతను ఎంచుకున్న పేపర్స్ ...

స్కూల్ పిల్లల పుస్తకాలలోనివని.

బహుశా అతని పాప స్కూల్ బుక్స్ లోనివి అయ్యిండొచ్చని ఆ కానిస్టేబుల్స్ అనుకున్నారు. నాగమణిని అడగ్గా ఆమె కూడా అదే విషయం వాళ్ళకి చెప్పింది.

ఇక తర్వాతి రోజు అదే కానిస్టేబుల్స్ చుట్టుపక్కల వారిని విచారించడానికి వెళ్ళారు.

ఆ కానిస్టేబుల్స్...

ఇంతకు ముందు నాగమణి, సత్యనారాయణ మరియు గంగాధర్ స్టేట్మెంట్స్ ను ఆధారంగా చేసుకొని అక్కడున్న వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగారు.

వాళ్ళు మాత్రం పోలీసులకి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

"శివరాం, నాగమణి తమకు పదేళ్లుగా తెలుసని, వాళ్లసలు చుట్టుపక్కల వాళ్ళతో పెద్దగా కలిసేవారు కాదని,

శివరాం అయితే పనికి వెళ్ళడం లేదంటే ఇంట్లో ఒంటరిగా కూర్చోడం అంతేనని,

ఎవరిని చిన్న మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటుండేవాడని

శివరాంకి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవని,

ఇక తాగుడు, తిరుగుడు విషయానికి వస్తే...

అసలు ఈ పదేళ్లలో అతడు అలాంటివాడిలా ఎప్పుడూ కనిపించలేదని,

నాగమణి మాత్రం ఎప్పుడూ డ్యూటీ అంటూ దగ్గర టౌన్లో ఉన్న హాస్పిటల్ కి వెళ్లేదని, ఆమెకు కూడా ఇరుగుపొరుగు వారితో ముచ్చట్లు చెప్పేంత తీరిక ఉండేది కాదని వాళ్ళు వివరించారు.

ఇక ఆ మూడో వ్యక్తి (శివరాంతో ఎఫైర్ ఉన్న మనిషి) కోసం అక్కడే ఉన్న ఒక ముసలాయనను ఆరా తీయగా...

"అలా ఒక ఆడమనిషి వాళ్ళింటికి రావడం ఎప్పుడూ చూడలేదని...

కానీ, ఒక మగ మనిషి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడని,

అది కూడా శివరాం, అతని కూతురు ఇంట్లో లేనప్పుడు, పైగా నాగమణితో కొంచెం చనువుగా మెలిగేవాడని చెప్పాడు." ఆ ముసలాయన

"అతను ఈ మధ్య కాలంలో ఇక్కడికి ఏమైనా వచ్చాడా తాతా ?" అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగ్గా..

"ఒక మూడు నాలుగు నెలల క్రితం అయ్యింటుంది సారు..."

బదులిచ్చాడు ఆ ముసలాయన.

అప్పుడు కానిస్టేబుల్ రాంబాబు...

"బహుశా...

వాళ్ల అన్నయ్య అయ్యుండొచ్చేమో శ్రీనివాస్ !" అంటూ శ్రీనివాస్ తో అన్నాడు.

కానీ, కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం...

"కచ్చితంగా కాదు...

ఎందుకంటే,

గంగాధర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో అతను ఒక సంవత్సరం నుండి అసలు తన చెల్లెలి కుటుంబంతో కలవడం లేదని చెప్పాడు. అసలు వీళ్ళని పట్టించుకోవడమే మానేశారు వాళ్ళు. కాబట్టి అతను అయ్యి ఉండడు అనేది నా అనుమానం !" అంటూ రాంబాబుతో వాదించాడు.

"అలా ఎందుకనుకుంటున్నావు శ్రీనివాస్ నువ్వు...

తోడబుట్టిన దాని మీద ప్రేమ, ఆప్యాయతలు ఎక్కడికి పోతాయి. కట్టుకున్న మొగుడు సరైనోడు కాదని, అతను లేనప్పుడు నచ్చజెప్పి తీసుకుపోవడానికి వచ్చి వెళ్తుండేవాడెమో అలా కూడా జరగొచ్చుగా..." అంటూ కానిస్టేబుల్ రాంబాబు ప్రతి వాధించగా

"ఏమో ?

నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు. కానీ, నాకు ఎందుకో ఇంకా అనుమానంగానే ఉంది." అని కానిస్టేబుల్ శ్రీనివాస్ అంటూనే

"అయినా...

మొన్న మనం గంగాధర్ కోసం వెళ్ళినప్పుడు, నీ దగ్గర అతని ఫోటో ఒకటి ఉంది కదా !

అది ఇంకా నీ దగ్గర ఉందా ?" అంటూ కానిస్టేబుల్ రాంబాబుని అడిగాడు.

"హ ఉంది శ్రీనివాస్ !" అంటూ తన మొబైల్ ఫోన్ గాలరీలో ఉన్న ఫోటో తీసి ఇచ్చాడు కానిస్టేబుల్ రాంబాబు.

ఆ ఫోటో అక్కడున్న ముసలాయనకి చూపిస్తూ...

"మీరు చెప్పిన వ్యక్తి ఇతనేనా ?" అని కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగ్గానే...

ఆ ముసలాయన...

"కొంచెం సేపు, దాన్ని పట్టీ పట్టీ చూస్తూ...

(వయసు మల్లడం వలన సరిగా కనిపించక)

తన జేబులో ఉన్న కళ్ళ జోడు పెట్టుకుని సరిగా చూస్తూ...

ఇతనైతే కాదు సారు..!" అంటూ బదులు చెప్పాడు.

"సరిగా చూడు పెద్దాయన..!

నీకు ఈ ఫోటో సరిగానే కనిపిస్తుందా ?" అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగ్గానే

"కచ్చితంగా చెప్పగలను సారు ఇతను కాదని ...!

ఎందుకంటే అతనికి, ఇతనికి చాలానే తేడా ఉంది. మీరు ఇప్పుడు చూపిస్తున్న వ్యక్తి కంటే, అతని మొహం కొంచెం సన్నగా, కొంచెం తెల్లగా ఉంటాడు. జుట్టు కూడా రింగులు తిరిగి ఉంటుంది. పైగా గడ్డంతో ఉంటాడు. అసలు ఇతనికి అతనికి పోలికే లేదు." అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశాడు ఆ ముసలాయన.

"సరే పెద్దాయన !

ఇక వెళ్ళొస్తాం...!!

ఈ కేసు సంబంధించి...

ఎప్పుడైనా అవసరం అయితే, నువ్వు ఒకసారి పోలీసు స్టేషన్ కి రావలసి ఉంటుంది"

అంటూ ఆ కానిస్టేబుల్స్ అక్కడి నుండి వెళ్లిపోబోతుంటే,

"అయ్యా...!

ఒక్క నిమిషం...!!

నేనేదో రేపో మాపో పోయేటోడిని...

ఈ వయసులో పోలీసులు, స్టేషనూ, కేసులు అంటే...!

(లోలోపల కొంచెం బెదురుగా..)

ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఇక్కడితో నన్ను వదిలేయండయ్యా..!" అంటూ ఆ ముసలాయన కొంచెం భయంగానే వాళ్ళని వేడుకున్నాడు.

అతని బాధా, భయం అర్థం చేసుకున్న ఆ కానిస్టేబుల్స్

"అరె... !

పెద్దాయన !!

నీకేం కాదులే !

ఎస్ ఐ గారితో చెప్పించి ఇక్కడికే వచ్చి, ఎవరికి తెలియకుండా నిన్ను విచారిస్తాం లే..!

దాని గురించి నువ్వేం పెద్దదా కంగారు పడకు !" అంటూ అతనికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

అదే విషయం ఆ కానిస్టేబుల్స్ తమ పై అధికారులకు చెప్పారు.

ఇక ఈ ముసలాయన స్టేట్మెంట్ తో మళ్లీ కేసు చిక్కుల్లో పడినట్టైంది.

శివరాం భార్య మరియు ఆమె తరుపు వాళ్ళు శివరాంకి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు. అతని చావుకు కూడా అదే కారణం కావొచ్చనేది వాళ్ల వాదన.

ఇక మరొక వైపు,

చుట్టు పక్కల వాళ్ళు మాత్రం...

శివరాం అలాంటివాడు కాదని చెప్తున్నారు. పైగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి శివరాం లేనప్పుడు అతని భార్యను కలవడానికి వస్తున్నట్లు చెప్తున్నారు.

గంగాధర్ చెప్పినట్టు శివరాంతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు ?

ఆ పెద్దాయన చెప్పినట్టు నాగమణిని కలవడానికి వస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు ?

అసలు వీళ్ళందరికి ఉన్న లింక్ ఏమిటి ?

పోలీసు వారు కూడా ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అప్పుడే కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్కడున్న ఎస్ ఐ తో....

"సార్..!

గంగాధర్ మనకి శివరాంని ఎవరో మహిళతో ఒక హోటల్ దగ్గర చూసినట్టు చెప్పాడు కదా !

అసలు ఆ హోటల్ అడ్రస్ పట్టుకుని,

అక్కడికి వెళ్లి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లు కానీ...

రిజిస్టర్ బుక్ లో వాళ్ల వివరాలు కానీ ....

ఒకవేళ నోట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది కదా !

సో, మనం ఆ శివరాం చెప్పిన అజ్ఞాత మహిళ ఎవరో కనిపెట్టడం ఈజీ అవుతుంది. తద్వారా ఈ కేసును సులభంగా పరిష్కరించవచ్చు.!" అంటూ తనకొచ్చిన ఐడియాను చెప్తాడు.

అప్పుడు ఆ ఎస్ ఐ...

"నువ్వు చెప్పింది బాగానే ఉంది శ్రీనివాస్.

కానీ, అసలు ఆ గంగాధర్ చెప్పిందంతా నిజమే అంటావా ?

నాకెందుకో ఈ కేసుని అతను తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తుంది.

ఎందుకంటే, ఆ చుట్టూ పక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే...

నాకు ఈ అనుమానం కలిగింది. అదీ కాకుండా నాగమణి, గంగాధర్ మరియు అతని తండ్రి చెప్పిన సమాధానాలు ఒకదానికొకటి అసలు పొంతనే లేదు.

ఏమంటావ్ ?" అంటూ శ్రీనివాస్ ను తిరిగి ప్రశ్నించాడు.

"అసలు ముందు ఆ హోటల్ అడ్రస్ తీసుకుని, అక్కడికి వెళ్లి డిటైల్స్ కనుక్కుంటేనే కదా సార్...

మనకు అతను చెప్పింది నిజమో లేక అబద్ధమో తెలిసేది ?" అంటూ మరొక కానిస్టేబుల్ రాంబాబు వారిస్తాడు.

దాంతో ఇక ఎస్ ఐ వాళ్ళకి ఆ కోణంలో విచారణ కొనసాగించడానికి అనుమతినిస్తాడు.

ఇక శ్రీనివాస్ గంగాధర్ కి కాల్ చేసి...

"మీ బావతో చనువుగా ఉన్న వ్యక్తిని ఏ హోటల్ దగ్గర చూసావ్ !" అంటూ అడగ్గా...

దానికి అతను వాడు

"ఏ హోటల్ లో అయితే తను చనిపోయాడో ?

అదే హోటల్ !" అంటూ బదులు ఇస్తాడు.

కానిస్టేబుల్స్ కొంచెం షాక్ అయ్యి, ఇక ఆలస్యం చేయకుండా ఆ హోటల్ దగ్గరకి వెళ్తారు.

ఇక ఆ హోటల్ దగ్గరకి వెళ్లి ఎంక్వైరీ చేయగా...

"ఇంతకుముందు ఈ హోటల్ వేరే వారిది సార్ !

ఒక ఆరునెలల క్రిందటే ఇది మా చేతుల్లోకి వచ్చింది.

అతను మాకు రెగ్యులర్ కస్టమర్ ఏ కానీ, సంవత్సరం క్రితం డేటా అంటే ఇప్పటికిప్పుడు కష్టం సార్...!

మొన్నటి వరకూ సీసీ కెమెరా కూడా సరిగా వర్క్ చేయలేదు. ఈ మధ్యే వాటిని బాగు చేయించాం. అందుకే మొన్న మీరు డిటైల్స్ అడగ్గానే చక చక ఇవ్వగలిగాం.

రిజిస్టర్ లో కస్టమర్స్ డిటైల్స్ ఎప్పటికప్పుడు ఎంటర్ చేస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు తీసి ఇవ్వడం కష్టం సార్ ...!

పైగా పాతవాల్లు అవి ఎక్కడ పెట్టారో ?

మాకు కొంచెం టైం కావాలి . బట్ 100 % డిటైల్స్ ఉంటాయని గ్యారంటీగా చెప్పలేను సార్..!" అంటూ ఆ హోటల్ మేనేజర్ బదులు ఇస్తాడు.

దాంతో శ్రీనివాస్...

"అయినా హోటల్ అన్నాకా డిటైల్స్ సరిగా నోట్ చేసి పెట్టుకోవాలని మీకు తెలీదా ?,

సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ఆ నిర్ల్యక్షపు సమాధానం ఏంటి ?

మీరు అలా అనొద్దు...

ఏం చేస్తారో ..? ఎంత టైం కావాలో తీసుకోండి!

ఇంతకుముందు ఈ హోటల్ నడిపిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి !

మాకు మాత్రం ఆ వివరాలు చాలా ముఖ్యం..!

ఈ సారి మేము వచ్చేసరికి అవన్నీ మీ దగ్గర ఉండాలి !" అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆ అజ్ఞాత మహిళ వివరాలు దొరుకుతాయా ?

ఆ ముసలాయన చెప్పినట్టు నాగమణిని కలిసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు ?

ఇక ఎస్ ఐ అనుమానిస్తున్నట్టు గంగాధర్, నాగమణి, సత్యనారాయణ కేసుని తప్పు దోవ పట్టిస్తున్నారా ?

లాంటి విషయాలు తర్వాతి భాగాలలో తెలుసుకుందాం...

తర్వాతి భాగం "ది ఎఫైర్ (ruins a human life) - 4" కొనసాగబోతుంది.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama