SATYA PAVAN GANDHAM

Abstract Classics Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Thriller

"ది ఎఫైర్ - 9"

"ది ఎఫైర్ - 9"

7 mins
417


"ది ఎఫైర్ (ruins a human life) - 8" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 9"

ఆ లెటర్ అలా కంటిన్యూ చేసినా ఎస్ ఐ కి పక్క పేజీలో...

ఉన్న కంటెంట్ చదవడం ప్రారంభించాడు.

"సూసైడ్ నోట్ 2"

ప్రకాష్ ఫుల్ డీటెయిల్స్ ...

ప్రకాష్ ది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం.

తండ్రి ఉరి వేసుకుని ప్రకాష్ చిన్నప్పుడే చనిపోయాడు.

అప్పటినుండి ప్రకాష్ మరియు వాళ్ల తమ్ముడిని కన్నతల్లే పెంచింది.

అదే ఊరిలో సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చిన ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు ప్రకాష్ తన కామన్ ఫ్రండ్స్ ద్వారా...

అమ్మాయిలను బుట్టలో వేయడంలో నేర్పరయిన ప్రకాష్..

పరిచయమైన ఆ అమ్మాయితో మరింత చనువు పెంచుకున్నాడు. అలా ఆ పరిచయం కాస్తా స్నేహంగా , ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి చివరికి అది వాళ్ళు శారీరకంగా దగ్గరయ్యే స్థితికి చేరింది.

అలా వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన విషయం వాళ్ల అమ్మమ్మకి తెలిసి, ఆ అమ్మాయిని వాళ్ల ఊరు నుండి పంపించేసింది. విషయం ఆ అమ్మాయి ఇంట్లో కూడా తెలియడంతో, ఆమెకు వేరే అతన్ని ఇచ్చి పెళ్లి చేసేసారు.

పెళ్లి అయినా కూడా ప్రకాష్ ఆ అమ్మాయితో కొన్నాళ్ళు అక్రమ సంబంధం కొనసాగించాడు. కట్టుకున్న భర్తకు కూడా తెలియకుండా ఆ అమ్మాయి చాలా డబ్బులు ప్రకాష్ కి ఇచ్చేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయిు భర్తకు విషయం తెలిసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరికీ.

తను భార్య దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కు ఇవ్వాలని ఆ అమ్మాయి భర్త గట్టిగా ప్రకాష్ ను నిలదీశాడు..

దాంతో భయపడ్డ ప్రకాష్, జాబ్లో జాయిన్ అయ్యి నెల నెలా కొంత అప్పు తీర్చేసాడు.

ఇక ఇంత జరిగాక ఆ అమ్మాయి దగ్గర ఆమె భర్త ఫోన్ లాగేసుకున్నాడు.

అప్పటి వరకు ఆ అమ్మాయితో సుఖం మరిగిన ప్రకాష్ ఆ ఎడబాటు భరించలేక తాగుడుకి అలవాటు పడ్డాడు.

కొన్నాళ్ళకి ఆ అమ్మాయి తన భర్తని ఒప్పించి, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అయ్యింది. అక్కడే నా భార్య నాగమణి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు.

ఇక ఆ అమ్మాయికి ఫోన్ లేకపోవడంతో నా భార్య వద్ద ఫోన్ తీసుకుని ఆ అమ్మాయి ప్రకాష్ తో రహస్యంగా మాట్లాడేది.

కొన్ని రోజులు చూసీ చూడనట్టు వదిలేసిన నా భార్య...

ఒకరోజు "ఫోన్లో ఎవరు అక్క.. బావ గారా?" అని అడిగితే,

"కాదు, పెళ్లికి ముందు నేను ప్రేమించిన వ్యక్తి !

చాలా మంచివాడు. మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసి నాకు బలవంతంగా పెళ్ళి చేయడంతో.. నన్ను మర్చిపోలేక తాగుడికి అలవాటుపడ్డాడు. నా జ్ఞాపకాలతో జీవిస్తూ పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయాడు." అంటూ నాగమణికి తన ప్రేమ గురించి సవివరంగా వివరించి చెప్పింది ఆ అమ్మాయి.

అప్పటికి టీనేజ్లో ఉన్న నాగమణి కి, ఆ అమ్మాయి మాటలతో ప్రకాష్ పై జాలి కలిగింది. తన ఫోన్లో అతడి నెంబర్ సేవ్ చేసుకుని అప్పుడప్పుడు ప్రకాష్ తో మాట్లాడుతూ బాధలో ఉన్నాడనుకున్న అతనిని ఒదార్చేది నాగమణి.

అలా ప్రకాష్ తో పరిచయం పెరిగింది నా భార్యకు. మళ్ళీ ఈ పరిచయాన్ని కూడా స్నేహంగా, తర్వాత ప్రేమగా మలచుకుని తన శారీరక అవసరం తీర్చుకున్నాడు ప్రకాష్ నా భార్యతో కూడా...

తెలియని వయసు కావడం వలన ఆకర్షణతో నా భార్య కూడా అతడు శారీరకంగా దగ్గర అవుతుంటే అడ్డుచెప్పలేకపోయింది.

ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసి, ప్రకాష్ ను పెళ్లి చేస్కోమని మొదటి నాగమణి కి సపోర్ట్ చేసింది.

కానీ, ఎందులోనూ, ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా లేడు అనే కుంటి సాకుతో నాగమణి ప్రకాశ్ ను దూరం పెట్టింది.

నాకు కూడా ఇదే కారణం చెప్పింది మా ఆవిడ వాళ్లద్దరి బ్రేకప్ గురించి...

అలా మా జీవితంలోకి నా అసమర్థత వల్ల ప్రకాష్ ఏకులా వచ్చి, ఇప్పుడు మేకు అయ్యాడు.

మా మధ్య జరిగే ప్రతీ విషయం ముందు వాళ్ల అమ్మా, నాన్న, అన్నయ్య కంటే ప్రకాష్ కి ఫోన్ చేసి చెప్తుంది.

తను మాత్రం పెళ్లి చేసుకోకుండా గతంలో తనని ప్రేమించి దూరమైన అమ్మాయిల సంసార జీవితాలలోకి వెళ్లి, వాళ్లతో శారీరక సుఖాలు తీర్చుకునే శారీరక ధరుడు ప్రకాష్. ఒక రోజులో సగమ టైం వీళ్ల ముచ్చట్లు వినడానికే కేటాయిస్తాడు అతడు. మిగతా టైం తాగుతాడు. నాకు తెలిసి నా భార్య ఇతన్ని రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా?

నాకైతే...

పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం నా భార్యని మాయ మాటలతో వాడుకుంటాడు అని భయం వేస్తుంది.

ఇప్పుడు నా కూతురు చిన్నది కావడం వలన అర్థం కాకపోయినా.. పెద్దదయ్యక తల్లి గురించి తెలిస్తే, తల్లిగా తనపై ఉన్న గౌరవం కోల్పోతుంది నా భార్య. అతని మొత్తం స్టోరీ నాకు నా భార్య చెప్పింది. కొన్ని ఫోన్లో రికార్డ్స్ ద్వారా విన్నాను.

"నాకు అతనికి వ్యక్తిత్వంలో చాలా తేడా ఉందట. అతను 100% జెన్యూన్ పర్సన్ అట. అందుకే, అతనితో మాట్లాడకుండా ఉండలేక పోతుంది అట." అంటూ నా భార్య ఎప్పుడూ సూటి పోటి మాటలతో నన్ను మానసికంగా ఎప్పుడో చంపేసింది.

సూసైడ్ నోట్ 3...

నా భార్య డిటైల్స్...

నా భార్య నాగమణిది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి పచ్చి తాగుబోతు. ఇంటి బాధ్యత అంతా అన్నయ్య ఒక్కడే మోస్తున్నాడని అర్థం చేసుకుని పదో తరగతి అయ్యాక చదువు మానేసి హాస్పటల్లో నర్స్ గా జాయిన్ అయ్యింది. అన్నా, చెల్లెలు ఇద్దరూ కష్టపడి ఇల్లు కట్టుకున్నారు.

కానీ, నా భార్య వాళ్ల అన్నయ్య (గంగాధర్) డబ్బు అవసరం వచ్చిందని చెల్లెలు కష్టపడి ఉద్యోగం చేసి కొనుక్కున్న బంగారాన్ని అంతా తాకట్టు పెట్టాడు. మా పెళ్లయ్యి పదేళ్లు అయ్యింది. ఇప్పటికీ ఆ బంగారాన్ని విడిపిస్తానన్న మాటే లేదు. అంతా అతను చేసే మాయ. చూసే జనాలకి మాత్రం అన్నా, చెల్లెలు అంటే అలా ఉండాలి అని అనుకుంటారు. ఫ్రీగా ఏది దొరికితే అది తన సొంతం చేసేసుకుందాం అనే టైప్ గంగాధర్ ది.

నాకూ నా భార్యకు మూడో వ్యక్తి వల్ల గొడవలు అవుతున్నాయని వాళ్ల అమ్మకు, అన్నయ్యకు మొత్తం తెలుసు! కోపంలో నా భార్యా, నేను అనుకున్న మాటలు...

నావి వాళ్ల చెల్లి దగ్గర, వాళ్ల చెల్లి అన్నవి నా దగ్గర చెప్పి మా మద్య మరింత దూరం పెంచేసాడు గంగాధర్.

నా భార్య వర్కింగ్ ఉమెన్, ఎలాగైనా బ్రతికేస్తాది అనే నమ్మకంతో నన్నూ నా భార్యని వేరు చెయ్యాలని చూస్తున్నారు వాళ్ల అమ్మా అన్నయ్యలు. -

గంగాధర్ పెద్ద నటన గాడు. డ్వాక్రా ద్వారా డబ్బులు లక్ష ముప్పై వేలు (1,30,000) వస్తే, వడ్డీకి తిప్పమని గంగాధర్ కి ఇచ్చిందట నా భార్య. నా మీద కోపం ఉండటం వల్ల నా భార్య నాకు ఆ విషయం చెప్పలేదు.

కానీ, మరి గంగాధర్ అయినా ఆ విషయం చెప్పాలి కదా !

"మా చెల్లి డబ్బులు వడ్డీకి తిప్పమని ఇచ్చింది" అని.

ఆ డబ్బులు కూడా వాళ్ల ఫ్రెండ్ కి వడ్డీకి ఇచ్చాడట.

చెల్లి (నా భార్య నాగమణి) దాచుకున్న డబ్బులు అరవై వేలు (60,000) అప్పుగా తీసుకున్నాడు. పది రూపాయలు తిరిగి ఇవ్వడు. అదే వాళ్ల ఆవిడకి వచ్చిన డ్వాక్రా డబ్బులతో లక్ష రూపాయలు పెట్టి బంగారపు నెక్లెస్ చేయించాడు.

మరి, అదే డబ్బులతో...

తన చెల్లి కష్టార్జితంతో కొనుకున్న బంగారాన్ని తాకట్టు నుండి విడిపించి ఇవ్వాలి కదా. నా మీద కోపంతో నా భార్య వీళ్లందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. నా భార్య కష్టాన్ని దోచుకున్న వాడు ఎవ్వడూ సుఖపడడు!

నా భార్య ఎప్పుడూ మంచిదే.. తనకి దేవుడు మంచే చేస్తాడని నమ్ముతున్నాను. నేను మూడు నెలలుగా ఏ పనికి వెళ్లట్లేదని గంగాధర్, వాళ్ల అమ్మ నా మీద విష ప్రచారం మొదలు పెట్టేసారు.

"మమ్మల్ని వేరు చేసి తన కూతురుని దగ్గరగా ఉంచుకుంటే దాని సంపాదన తినొచ్చు కదా.. !" అనే ఆలోచన వాళ్ళది.

గంగాధర్...

నీకు చెల్లి మీద ప్రేమ ఉన్నట్టు నలుగురికి చెప్తే మాత్రమే సరిపోదు. దాని బాగోగులు చూడకపోయినా కనీసం తనని మోసం చేయకుండా ఉంటే అంతకు మించిన ప్రేమ అవసరం ఉండదు. తాకట్టు లోనున్న ఆ బంగారం, వడ్డీకి ఇచ్చిన ఆ డబ్బులు మీ చెల్లికి తిరిగిచ్చి అన్నగా నీ విలువ నిలబెట్టుకో...!

"నేను మందులు మానేయ్యాలనే దృక్పద్ధంతో, నన్ను మానసికంగా వీక్ చేసింది." అనే కోపంతో నా భార్యని తిడుతున్నా అంతే కానీ, తనంటే నాకు పిచ్చి ప్రేమ.

నాతో సుఖం లేదు అనుకుంటుంది తప్ప, భార్యకి భర్త వల్ల వచ్చే గౌరవం ఇంకెవరి వల్ల రాదు అన్న విషయాన్ని గ్రహించలేక పోతుంది.

నేను ఈరోజు చనిపోయే టైంకి నా భార్య దగ్గర రెండు లక్షలు అరవై వేలు (2,60,000) రూపాయిలు ఉన్నాయి.

తెలిసిన వాళ్లకు వడ్డీలకు ఇచ్చినవి (రీసెంట్ గా లక్షా ముప్పై (1,30,000)) డ్వాక్రాతో కలిపి...

నా కూతురుకి నా భార్యకు అవే ఆధారం.

దయచేసి వాటి మీద మీ కన్ను వేయకండి. ఆస్తి, డబ్బు ఏమీ లేవని నేను అందరికి ఒక జీరో లా కనిపిస్తున్నాను. అవే ఉండి ఉంటే, ఈ రోజు నా అనే వాళ్లు అందరూ నా ఈ కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచేవారు. అందుకే ఏమి సాధించలేని నేను చావడమే కరెక్ట్ అనిపిస్తుంది.

పోలీసు వారికి నా రిక్వెస్ట్...

నేను చేసిన పొరపాట్లు వలన నాకు నేను నచ్చటం లేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నేను, నా భార్య మరియు ప్రకాష్ ఇది మా ముగ్గురి జీవితాల కథ.

మాకు సొంత ఇల్లు కానీ, ఆస్తి కానీ ఏమీ లేదు.

నేనూ, నా భార్య రెక్కల కష్టంతో మా ఇంట్లో ప్రతి వస్తువు కొనుక్కున్నాము. ప్రకాష్ మాయలో పడి నా భార్య నన్ను ఒక వేస్ట్ గాడిగా, చేతకానివాడిగా చూస్తుంది. నేను పోతే పెద్దగా ఏడ్చేవాళ్లు కూడా ఎవరూ లేరు. కానీ నా భార్యకి కొత్తపేటలో వాళ్ల పెద్ధనాన్న, చిన్నాన్నల పెద్ద కుటుంబమే ఉంది. వాళ్లకు ఇలా నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిస్తే చాలా బాధపడతారు.

మాకు ఎనిమిదేళ్ళ కూతురు ఉంది. నేను లేని నా భార్య ఉద్యోగం చేసుకుంటూ నా కూతురుని పెంచాలి. ఈ విషయాలు బయటకి తెలిస్తే, తనకి ఉద్యోగం చేసే చోట గౌరవం ఉండదు !

ఆ తర్వాత ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి ఉంది.

ప్రకాష్ తనని చాలా మార్చేసాడు. మార్చేశాడు అనే కంటే ఏమార్చేసాడు అంటే బాగుంటుంది.

అతని మాయలో పడి ఖచ్చితంగా విడాకులు కావాల్సిందే అంటుంది నా భార్య. ఇన్నేళ్లు తనతో కాపురం చేసి, ప్రాణంగా ప్రేమించి ఇక నుండి నేను సింగిల్ గా బ్రతకలేను. నా భార్యను విడిచి ఉండలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

ప్రకాష్ నా భార్య విషయంలో మొహం చాటేసే అవకాశం ఉంది.

కనుక, ప్రకాష్ కి కౌన్సిలింగ్ ఇచ్చి నా భార్యకి, అతనికి పెళ్లి జరిగేలా చూడండి. వాళ్ల బతుకు వాళ్లు బ్రతుకుతారు. తప్పులు చేసే వాళ్లు బాగానే ఉంటారు. కానీ బాధలన్ని తర్వాత వాళ్ల కుటుంభీకులే భరించాలి. నా భార్య, నా కూతురు జీవితం దృష్టిలో పెట్టుకుని వాళ్ళని నిరు పేదలుగా పరిగణించి వాళ్ల బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి.

ఈ విషయాలు ఏవీ బయటకు రానీయకండి...

ఎందుకంటే, వాళ్ళకి సంఘంలో ఉన్న గౌరవం పోతుంది. గుండెల నిండా నా భార్య పై ప్రేమను నింపుకుని, ఏ తప్పూ చేయకపోయినా చివరికి తనతో అడ్డమైన మాటలు అనిపించుకుని, "పురుగులు పట్టి చస్తావు నువ్వు !" అని శపించిన తన మాటలు నిజం చేస్తూ చివరికి అదే పురుగుల మందు తాగి చేస్తున్నాను. Love U Nagu..."

అంటూ ఉంది ఆ సూసైడ్ నోట్ సారాంశం.

అది పూర్తిగా చదివిన ఎస్ ఐ పెదాలు ఇక కదలడం మానేశాయి. కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయి. అసలే కటినంగా, బండరాయి లా ఉండే తన హృదయం కూడా శివరాం ఆఖరి మాటలకి కరిగిపోయింది కాబోలు...

అంతే వేదనతో ఆ పుస్తకాన్ని, ఆ లేఖను భద్రపరిచి...

రాని నిద్ర కోసం ఉపక్రమించాడు.

శివరాం ను అంతలా వేధించి అతని చావుకి కారణమైన ప్రకాష్, నాగమణి, గంగాధర్ మరియు వాళ్ల అమ్మని ఎస్ ఐ దోషులుగా చేరుస్తాడా ?

లేక శివరాం చివరి కోరిక మేరకు వాళ్ళని క్షమించి వదిలేస్తాడా ?

లాంటి విషయాలు అన్నీ...

"ది ఎఫైర్ (ruins a human life) - 10" లో తెలుసుకుందాం.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️Rate this content
Log in

Similar telugu story from Abstract