STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Drama Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Drama Inspirational Thriller

"ది ఎఫైర్ - 5"

"ది ఎఫైర్ - 5"

5 mins
8

"ది ఎఫైర్ (ruins a human life) - 4" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 5"

నారాయణ మూర్తి అకస్మాత్తుగా చనిపోవడంతో కేసు విషయంలో అయోమయంలో పడ్డారు పోలీసులు.

కానిస్టేబుల్ శ్రీనివాస్ ని తన క్యాబిన్ కి పిలిచిన ఎస్ ఐ...

"శ్రీనివాస్ ...

నా అనుమానం ప్రకారం నాగలక్ష్మి ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. నాకు తెలిసి ఇద్దరి అఫ్ఫైర్స్ ఒకరికొకరికి తెలియడం వలనే శివరాం మరణానికి కారణం అయ్యి ఉండొచ్చు. మే బి అది ఆత్మహత్య అయ్యి ఉండొచ్చు, లేదా హత్య అయ్యి ఉండొచ్చు !

ఈ విషయాలు బహుశా సత్యనారాయణ, గంగాధర్ లకి కూడా తెలియకపోవచ్చు.

ఏది ఏమైనా ఈ కేసుని మనం సాల్వ్ చేసి తీరాలి.

దానికి ఒక్కటే మార్గం...!"

అంటూ శ్రీనివాస్ తో అంటుండగా...

దానికి శ్రీనివాస్...

"ఏంటి సార్ !" అని అడుగుతాడు కొంచెం ఆతృతగా

అప్పుడు ఆ ఎస్ ఐ

"నువ్వు కొన్ని రోజులు నాగమణి ని ఫాలో చెయ్యాలి.

నాకు తెలిసింది ఆమె ఈ మధ్యనే డ్యూటీ కి వెళ్ళడం స్టార్ట్ చేసింది అంట.

ఎల్లుండి సోమవారం...

ఆ రోజు నుండి నువ్వు ఆమెకు తెలియకుండా ఆమెను ఫాలో అవ్వు..!"

అలాగే తను పనిచేసే హాస్పిటల్ లో కూడా తన గురించి ఎంక్వైరీ చేయించు, అది నువ్వైనా లేక మరొక కానిస్టేబుల్ సహాయం తీసుకుని చేసినా పర్లేదు. కానీ, ఈ విషయాలు మాత్రం చాలా రహస్యంగా ఉంచాలి." అంటూ శ్రీనివాస్ కి తను చెయ్యాల్సిన తదుపరి కార్యాచరణ వివరిస్తాడు.

దానికి శ్రీనివాస్ కూడా...

"భర్త పోయి మూడు వారాలు కూడా కాలేదు. అప్పుడే డ్యూటీ కి సిద్దమైందా ఆమె ?

నాకు అనుమానంగానే ఉంది సార్ !

సరే సార్ !

అయినా దీనికి ఇంకో వ్యక్తి ఎందుకు సార్ !

మీరు చెప్పింది నేను ఒక్కడినే చేస్తాను.

ఆమె కూడా హాస్పిటల్ కి వెళ్తూ ఆమెను ఎవరెవరు కలుస్తున్నారో?

హాస్పిటల్ లో ఆమె ఎవరెవరితో చనువుగా ఉంటుందో ?

అన్ని విషయాలు తెలుసుకుంటాను." అంటూ ఎస్ ఐ కి బదులు ఇస్తాడు.

"మరొక్క సారి చెప్తున్నాను ...

ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు !" అంటూ పదే పదే శ్రీనివాస్ ని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఎస్ ఐ.

"మీరు నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించారు.

దీన్ని తూ...చా... తప్పకుండా పూర్తిచేసి మీకు కనిపిస్తాను." అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ శ్రీనివాస్.

అలా అతను ఒక వారం రోజులు పాటు ఆమెను బాగా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ల ఎస్ ఐ చెప్పినట్టు నాగమణి పనిచేసే హాస్పిటల్ లో ఆమెకు తెలియకుండా ఆమె గురించిన వివరాలు అన్నీ సేకరిస్తాడు.

సరిగ్గా వారం తిరిగిన తర్వాత ఆ ఎస్ ఐ ని కలిసి,

తన ఎంక్వైరీ లో ఆమె గురించి తెలుసుకున్న వివరాలు అతనికి ఇలా వివరిస్తాడు..

"సార్ !

మీరు చెప్పినట్టుగానే ఆమెను గత వారం రోజుల నుండి ఫాలో అయ్యాను. ఆమె డైలీ తన ఇంటినుండి స్కూటీ మీద తన పాపను ఎక్కించుకుని స్టార్ట్ అవుతుంది.

అలా ఆ పాపను కొంచెం దూరంలో ఉన్న స్కూల్ దగ్గర దింపి, తను అక్కడి నుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్తుంది." అంటూ శ్రీనివాస్ వివరిస్తుండగా...

మధ్యలో ఎస్ ఐ కలుగజేసుకుని,

"ఆ పాపను అక్కడే విడిచిపెట్టి, ఆమె వెంటనే స్టార్ట్ అయ్యేదా ? లేక టైం తీసుకునేదా బయలు దేరేదా?" అంటూ శ్రీనివాస్ ని తనకున్న అనుమానంతో ప్రశ్నించగా...

"అలాంటిదేం లేదు సార్ !

ఆమె వెంటనే స్టార్టయ్యి, అక్కడి నుండి వెళ్ళిపోయేది." అంటూ బదులు ఇస్తాడు శ్రీనివాస్.

"ఇట్స్ ఓకే!

ఇక తర్వాత ఇంకెక్కడైనా ఆమె ఆగడం కానీ, ఎవరితో అయినా మాట్లాడడం కానీ చూసావా ?" అంటూ ఆ ఎస్ ఐ మరొక ప్రశ్న లేవనెత్తుతాడు.

దానికి శ్రీనివాస్ మళ్ళీ "లేదు సార్ !" అనే బదులు ఇస్తాడు.

"సరే !

మరి హాస్పిటల్ లో ఏమైనా తన గురించి ..." అంటూ ఆ ఎస్ ఐ అడగ్గా

"హా...

అక్కడ కూడా తన గురించి చాలానే ఎంక్వైరీ చేశాను సార్ !

కానీ, ఆమె వచ్చి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుందట. ఎవరితోనూ ఎలాంటి విబేధాలు కూడా పెట్టుకోదట. పైగా పేషంట్స్ తో కూడా చాలా మర్యాద పూర్వకంగా నడుచుకుంటుందనీ, మొత్తానికి ఆమె క్యారక్టర్ చాలా మంచిదన్నట్టు చెప్పారు అక్కడ నేను ఎంక్వైరీ చేసిన వాళ్ళు" అంటూ శ్రీనివాస్ బదులు ఇస్తాడు.

"అసలే భర్త పోయి ఉంది కదా !

తన పైన జాలి చూపిస్తున్నారేమో వాళ్ళు.

ఎంతైనా వాళ్ళకి బాగా పరిచయాస్తురాలు,

ఆ మాత్రం సింపతీ ఉంటుంది లే !" అంటూ ఎస్ ఐ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుండగా...

"లేదు సార్ !

నేను ఎంక్వైరీ చేసిన అతను నాకు బాగా కావాల్సిన వాడు. మా దగ్గర బంధువే. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్టగానే చెప్తాడు. మీరన్నట్టు భర్త పోయి ఉన్న ఆవిడ మీద ఆ హాస్పిటల్ సిబ్బందికి కొంచెం జాలి ఉన్న మాట వాస్తవమే !

నేను కూడా...

"భర్త పోయి మూడు వారాలు కూడా కాలేదు, అప్పుడే డ్యూటీ ఎక్కింది" అన్నట్టు నా అనుమానం లేవనెత్తాను.

దానికి అతను...

"ఎంతైనా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుంది పాపం...

భర్త ఉన్నప్పుడు ఇలానే కష్టపడేది.

ఇప్పుడు తన పరిస్థితి మరింత దిగజారింది.

అసలే ఆడపిల్లతో బ్రతుకీడుస్తుంది తను...

ఇక ఈ మాత్రం కూడా కష్టపడకపోతే, తనకి రోజు ఎలా గడుస్తుంది చెప్పండి" అంటూ నా అహాన్ని తన జావాబుతో పటా పంచలు చేశాడు.

"అతను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా !" అని అప్పుడు అనిపించి, నేను ఆవిడ గురించి అన్న మాటలకి సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది." అంటూ అక్కడ జరిగింది సవివరంగా వివరిస్తాడు శ్రీనివాస్ ఆ ఎస్ ఐ తో...

దానికి ఆ ఎస్ ఐ కాసేపు మౌనంగా ఉండి, దీర్ఘంగా ఆలోచించి,

"అవును శ్రీనివాస్...

వాళ్ళు చెప్పినట్టు ఆమె అంత ఆర్థిక ఇబ్బందులతో ఉంటే,

ఆదుకోవడానికి వాళ్ల పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా !

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది ?

పైగా చిన్న పాపతో ఒంటరిగా ఉంటుంది. మొన్నటి వరకూ అంటే భర్తకు పుట్టింటివాళ్ళకు పడదు కాబట్టి, అతన్ని విడిచి పుట్టింటికి రమ్మంటే ఈమె రాను అనేది కాబట్టి నడిచేది !

మరి ఇప్పుడు తనకి తోడంటూ ఎవడూ లేడు కదా !

మరి ఇక ఒంటరిగా ఉండడం దేనికి ?

తన అన్నగారింటికి వెళ్లొచ్చు కదా !

లేదా వాళ్ళే ఈమెను తీసుకుని వెళ్లొచ్చు కదా !

అసలే చెల్లెలి మీద ఎక్కడ లేని ప్రేమ చూపించాడు ఆ గంగాధర్. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళని దరికి చేరనివ్వడం లేదు ? " అంటూ ఎదురు ప్రశ్నిస్తూ, మరిన్ని అనుమానాలు రేకిత్తిస్తాడు.

దానికి శ్రీనివాస్ కూడా ఆలోచనలో పడతాడు.

కొన్ని సెకన్ల తర్వాత...

ఆ ఎస్ ఐ

"చూడు శ్రీనివాస్ ...

ఒక్కోసారి మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నిజం కాకపోవచ్చు,

మన కళ్లు, చెవులు కూడా మనల్ని మోసం చెయ్యొచ్చు.

చట్టం కింద పనిచేసే మనకి, మనల్ని నమ్ముకుని పనిచేసే ప్రజలకి తేడా అదే !

కాబట్టి, నిజం అనేది నూటికి నూరు శాతం నిర్ధారణ అయ్యేవరకూ ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు.

అర్థమయ్యిందనుకుంటాను ?" అంటూ శ్రీనివాస్ తో ఎస్ ఐ అనగా...

దానికి శ్రీనివాస్...

"మీరు చెప్పింది నిజమే సార్ !

ఇప్పుడు ఏం చేద్దాం సార్ !" అంటూ ఆ ఎస్ ఐ నీ అడుగుతాడు .

దానికి ఆ ఎస్ ఐ

"ఆమెను ఈ వారం అంతా అబ్జర్వ్ చేసినా ఎలాంటి క్లూ మనకి లభించలేదు. ఈ వారంలో ఇక మిగిలింది ఒక్కరోజే,

అది రేపు ఆదివారం !

ఈ ఒక్క రోజు కూడా ఆమెను అబ్జర్వ్ చెయ్యి!

మరేదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు." అంటూ ఆదేశిస్తాడు.

"రేపు ఆదివారం

బహుశా తనకి సెలవు అయ్యిండోచ్చు...

తను ఇంటి దగ్గరే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా సార్ !" అంటూ శ్రీనివాస్ అడగ్గా...

"రేపు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టే,

తనపై ఒక కన్నేసి ఉంచమని చెప్తున్నాను.

సరిగా గుర్తుకు తెచ్చుకో..!

ఆ ముసలాయన మీకు ఆరోజు ఏం చెప్పాడో...

"ఆ అజ్ఞాత వ్యక్తి, ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కదా ఆమెను కలవడానికి వస్తున్నట్టు చెప్పాడు." అంటూ ఎస్ ఐ శ్రీనివాస్ కి గుర్తు చేయగా...

శ్రీనివాస్...

"నాకిప్పుడు అర్థమైంది సార్...!

కచ్చితంగా రేపు వెళ్తాను" అని అంటాడు.

"అన్నట్టు రేపు కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళు!

రేపు నువ్వు డ్యూటీ లో ఉన్నట్టు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు.

ఏమైనా అవసరం ఉంటే నాకు మాత్రమే కాల్ చెయ్యి

ఒకే నా ?" అంటూ ఎస్ ఐ, శ్రీనివాస్ కి అత్యంత సున్నితంగా విషయాన్ని చెప్పగా

దానికి "సరే" నంటూ బదులు ఇస్తాడు శ్రీనివాస్

అలా మరుసటి రోజు శివరాం ఇంటికి వెళ్ళి దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్న ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు,

చాలా సేపటి తర్వాత దాదాపు మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తి...

అచ్చం నారాయణ మూర్తి ఏ పోలికలు అయితే చెప్పాడో ఆ పోలికలతో ఉన్న వ్యక్తి శివరాం ఇంటికి వెళ్తూ కనిపించాడు.

అతన్ని నాగమణి కూడా చాలా చనువుగా పలకరిస్తూ లోపలికి తీసుకుని వెళ్ళింది.

వెంటనే శ్రీనివాస్ తన ఎస్ ఐ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు.

ఆ ఊరికి దగ్గర్లోనే ఉన్న ఆ ఎస్ ఐ కూడా హుటాహుటీన శివరాం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు.

ఒక అరగంట తర్వాత ఎస్ ఐ రావడం,

కానిస్టేబుల్ తో కలిసి శివరాం ఇంటివైపు కదిలారు ఇద్దరూ...

అలా కదిలిన ఇద్దరూ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెడతరా ?

ఆమెకు ఆ అజ్ఞాత వ్యక్తి కి మధ్య సంబంధం ఏమిటి ?

పోలీసులు ఈ క్లూ తో శివరాం కేసుని ఎలా చేదిస్తారు ?

లాంటి విషయాలు తర్వాతి భాగాలలో తెలుసుకుందాం...

తర్వాతి భాగం "ది ఎఫైర్ (ruins a human life) - 6" కొనసాగబోతుంది.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama