STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Drama Tragedy Thriller

3  

SATYA PAVAN GANDHAM

Drama Tragedy Thriller

"ది ఎఫైర్ -1"

"ది ఎఫైర్ -1"

7 mins
150

ఇప్పటివరకూ నన్ను, నా రచనలను ఆదరిస్తూ వస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏

ఇంతకాలం ఆధ్యాత్మిక, సామాజిక, సస్పెన్స్, హార్రర్ మరియు ప్రేమ కథలతో మీ ముందుకు వచ్చిన నేను...

ఇప్పుడొక విభిన్న సందేశాత్మక కథాంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగే దీన్ని కూడా ఆదరిస్తారని నా ఆకాంక్ష !

ముందుగా కథకి మూలం : -

"ది ఎఫైర్ (ruins a human life) " టైటిల్ లో ఉన్నట్టుగానే ఈ కథను నా వయసు పరిధిని దాటి, ఓ సాహోసోపేతమైన అంశాన్ని తీసుకుని మీ ముందుకు రావడం జరుగుతుంది. దానికి గల కారణం చుట్టూ జరిగిన మరియు జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను పరిగణలోకి తీసుకుని, వాటి వల్ల జరిగే అనర్ధాలను, వాటి నిర్మూలనలను సమాజానికి నా ఈ కథ ద్వారా అందించాలని ఓ చిన్ని సదుద్దేశ్యంతో ..

అవును..!

బంధాలు బలపడితే అది మంచిదే, కానీ అవి సత్సంబంధాలై ఉండాలి. ఎప్పుడైతే మనిషి శారీరక సుఖం, విలాసాలకు అలవాటు పడి, తమ మధ్యనున్న బంధాలను అక్రమ బంధాలుగా మార్చుకుంటున్నాడో...

అప్పుడే ప్రతీ బంధాన్ని అనుమానించాల్సిన దుస్థితి నేటి సమాజంలో ప్రతీ వ్యక్తికి పట్టి...

చివరికి హత్య, ఆత్మహత్యలతో మానవాళి యొక్క అంతాన్ని శాసించే స్థాయికి సగటు మనిషి యొక్క దుస్థితి వచ్చిందని నా అభిప్రాయం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే !

గమనిక :

ముందుగా చెప్పినట్టు ఈ కథ కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని రాయడం జరిగింది కాబట్టి, సందర్భాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని కఠిన పదాలు వాడడం జరగొచ్చు. దయచేసి పాఠకులు తమ పరిపక్వత మనసుతో అర్థం చేసుకుని ఈ కథను ఆదరిస్తారని ఆశిస్తూ...

ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం.

                      ****************

జూన్ 9, 2023 ఉదయం 10 గంటలు కావొస్తోంది.

సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పరిధిలోని పోలీస్ స్టేషన్ కి

ట్రింగ్... ట్రింగ్... అంటూ ఒక ఫోన్ వచ్చింది.

అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే,

అవతలి వ్యక్తి ...

"సార్..!

సార్..!

నేను రావులపాలెంలోని "xxxxxx" luxury హోటల్ నుండి ఒక సిబ్బందిని మాట్లాడుతున్నాను.

ఇక్కడ..!

ఇక్కడ...!!(వణుకుతున్న స్వరంతో )

మా హోటల్ లో ఒక వ్యక్తి నిన్న ఒక రూం రెంట్ కి తీసుకున్నాడు. అప్పటినుండి రూం లాక్ చేసుకునే ఉన్నాడు. మా వాళ్ళు వెళ్లి ఎంత కొట్టినా అతను డోర్ ఓపెన్ చేయడం లేదు. ఇప్పుడిప్పుడే లోపల నుండి దుర్వాసన కూడా వస్తుంది.

మీరు..

మీరు..

త్వరగా రండి సార్..!" అంటూ చాలా కంగారుగా...

కానిస్టేబుల్ శ్రీనివాస్ తో అనగానే,

వెంటనే ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన పై అధికారులకు విషయం చెప్పి, వాళ్ల ఆదేశాల ప్రకారం వేరే ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ తో కలిసి ఆ హోటల్ కి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు.

అలా అక్కడకి వెళ్లిన అతను..

వారితో కలిసి, చాలా సేపు శ్రమించి ఆ రూం డోర్ పగుల కొట్టి చూసారు. అలా రూం డోర్ తెరిచి చూసిన వాళ్ళు అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఎందుకంటే, ఆ రూంలో ఆ వ్యక్తి అత్యంత దారుణమైన స్థితిలో మంచం పక్కనే గోడకు జారబడి విగత జీవిగా పడున్నాడు.

కుడి చేతి మీద కత్తి గాట్లు.. పక్కనే పదునైన చిన్న కత్తి దానివలన కారిన రక్తంతో, అతడు ఆ రక్తపు మడుగులో పడున్నాడు.

దాంతో పాటు మెడకు సగం తెగిన ఉరి తాడు. (మిగిలిన సగం ఫ్యాన్ కి ఉంది.)

ఆ పక్కనే ఒక టేబుల్ మీద కాళీ పాయిజన్ బాటిల్, సగం తాగిన కూల్ డ్రింక్ బాటిల్ వాళ్ళకి కనిపించాయి. చూస్తుంటే ఆ వ్యక్తి నోట్లో నుండి రక్తం కక్కిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.

ఆ కానిస్టేబుల్స్ కి అక్కడున్న పరిస్థితి ఏం అర్థం కావడం లేదు.

సరిగ్గా అప్పుడే అక్కడికి వాళ్ల ఎస్పీ కూడా వచ్చాడు. అతనికి కూడా అక్కడి పరిస్థితి ఏం అర్థం కావడం లేదు.

ఆ సగం తెగిపడిన ఉరి తాడును గమనిస్తుంటే,

అతడు ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తే, బలం లేక తెగిపడిందా?

లేక ఎవరైనా అతన్ని చంపి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారా ?

ఎడమ చేతికున్న గాట్లు చూస్తుంటే,

ఎవరైనా అతన్ని చంపడానికి ప్రయత్నించి అతని పై దాడి చేసి గాయపరిచారా ? లేక ఉరి ప్రయత్నం విఫలం అవ్వడంతో తానే ఈ ప్రయత్నం చేశాడా ?

ఆ పక్కనే ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ చూస్తుంటే,

ఇన్ని ప్రయత్నాలు చేసినా చావు నుండి ఎక్కడ తప్పించుకుంటాడో అని తను ఎలాగైనా చనిపోవాలని ఆ ప్రయోగం కూడా చేశాడా ? ఇతన్ని చంపడానికి ఎవరైనా ఆ విషం కలిపిన కూల్ డ్రింక్ బలవంతంగా తాగించారా ?

రూం లోపల చూస్తుంటే, లోపల నుండి బయటకు వెళ్ళే మార్గం మరొకటి లేదు, ఆ మెయిన్ డోర్ ద్వారా తప్ప !

అది కూడా లోపల నుండి లాక్ చేసి ఉంది. ఇంకో వ్యక్తి లోపలకి వెళ్లి రావడం దాదాపు అసాధ్యమే. కానీ కిటికీలు మాత్రమే upvc తో చేసినవి, అందులోకి గ్రిల్ లేకుండా ఓపెన్ టైప్ వి, అందులో నుండి బయటకి వెళ్ళడం సాధ్య పడొచ్చు. కానీ రెండు ఫ్లోర్ లు ఎత్తులో ఉంది. ఇది అసాధ్యమే !

కానీ పక్కనే వాటర్ పైప్ లైన్ ఉంది. బహుశా సాధ్య పడొచ్చు.

ఇలా ఎన్నో అనుమానాలకు తావు ఇస్తుంది ఈ సంఘటన.

అసలు అది హత్యా ! లేక ఆత్మహత్యా..!

ఇక ఆ కానిస్టేబుల్స్...

అతడు ఏ కారణం వలన చనిపోయాడో అక్కడేమైనా ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ రూం అంతా వెతికారు. కానీ ఏం ప్రయోజనం లేదు. అతడి గురించి ఎలాంటి వివరాలు లభించలేదు.

ఇక అక్కడున్న ఆధారాలన్ని(ఉరి తాడు, పాయిజన్ మరియు కూల్ డ్రింక్ బాటిల్, కత్తి) సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి మరియు అతడి డెడ్ బాడిని పోస్టుమార్టం కి పంపి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

ఆ హోటల్ సిబ్బందిని, ఓనర్ని, పక్కన రూం లలో ఉన్న వారిని అతనితో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని విచారించారు.

కానీ అతడు ఒక్కడు మాత్రమే ఆ హోటల్ కి వచ్చినట్టు ఆ సిబ్బంది, ఓనర్ చెప్పారు. ఇక పక్క రూం వాళ్ళకి అతని గురించి ఏం విషయాలు తెలియదని బదులు ఇచ్చారు. సీసీ

కెమెరా లలో కూడా అతడు ఒక్కడే హోటల్ కి వచ్చినట్టు, వచ్చిన దగ్గర నుండి ఆ రూంకి మాత్రమే అతడు పరిమితమయినట్టు రికార్డ్ అయ్యింది.

అప్పుడే కానిస్టేబుల్ శ్రీనివాస్...

ఆ హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గరకి వెళ్లి,

"మీరు రూం ఇచ్చేముందు, అతడి ఆధార్ డిటైల్స్ తీసుకుని ఉంటారు కదా...

ఆ వివరాలు మాకు కావాలి " అని అడిగి తీసుకుంటాడు.

అలా అతని ఆధార్ కార్డ్ ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు.

అతడి పేరు శివరాం.

వయసు 36 యేళ్లు !

భార్య నాగమణి, ఒక 8 ఏళ్ల పాప తప్ప తనకెవరు లేరు.

పక్కనే దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరిలో వారు నివాసం ఉంటున్నారని వాళ్ల ఎంక్వైరీ లో తెలిసింది.

వెంటనే అతని ఇంటికి వెళ్ళి ఆ వార్త అతని భార్యకి తెలియజేశారు ఆ పోలీసులు.

విషయం తెలిసిన నాగమణి ఒక్కసారిగా స్పృహతప్పి ఉన్నచోటే కుప్పకూలి పడిపోయింది.

ఆ కానిస్టేబుల్స్, చుట్టూ పక్కల వాళ్ళు సపర్యలు చేయడంతో స్పృహ లోకి వచ్చింది నాగమణి. స్పృహలోకి వచ్చిన తర్వాత భర్తను పోగొట్టుకుని, తన ఎనిమిదేళ్ళ పాపను హత్తుకుని విలపిస్తుండడం చూసి, చుట్టుపక్కల మరియు ఆ కానిస్టేబుల్స్ లా కళ్ళు కూడా చెమర్చాయి.

నాగమణిని ఓదార్చి, ఆమె సూచన మేరకు ...

ఆమె తరుపు సోదరుడికి, తండ్రికి ఈ సమాచారం అందించారు.

నాగమణి సోదరుడు, తండ్రితో కలిసి పట్నంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి అతని బాడీని రిసీవ్ చేసుకుని అంత్యక్రియలు జరిపించారు.

కొన్ని రోజులు గడిచాక విచారణ వేగవంతం చేశారు పోలీసులు.

ముందుగా అతడి భార్య నాగమణిని పిలిపించి మహిళా పోలీసు అధికారినితో విచారణ మొదలు పెట్టారు.

పోలీసు అధికారిని : మీ, మీ భర్త పూర్తి పేర్లు.

నాగమణి            : ఆయన పేరు శివరాం... నా పేరు నాగమణి... పాప ఆరాధ్య.

పోలీసు అధికారిని : మీకు పెళ్ళై ఎన్నేళ్లయ్యింది.

నాగమణి          : పదేళ్లు, నా భర్త చనిపోయిన రోజే మా పెళ్లి రోజు అంటూ బోరున విలపించింది.

పోలీసు అధికారిని : please ma'am, కొంచెం ధైర్యంగా   ఉండండి. ఆయనికి మీరు కాకుండా ఇంకెవరైనా బంధువులు ఉన్నారా ?

నాగమణి         :  ఆయనికి నేను తప్ప, ఆయన తరుపు ఇంకెవరూ లేరు మేడం ! చిన్నప్పుడే వాళ్ల అమ్మగారు కాలం చేశారు. మా పెళ్ళైయ్యాక కొన్నాళ్ళకి మా మామగారు కూడా... ఇక తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. కొద్దో గొప్పో దూరపు చుట్టాలు ఉన్నా... ఈయనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవని చిన్నప్పుడే దూరం చేసేశారని ఆయన చెప్తుండేవారు. మా పెళ్లి జరిగిన దగ్గర నుండి నేనసలు ఆయన బంధువులను ఎవర్ని కలవలేదు.

పోలీసు అధికారిని : it's ok, అసలు ఆయన వృత్తి రీత్యా ఏం చేస్తుంటారు.

నాగమణి         : ప్రస్తుతానికి కాళిగానే ఉంటున్నారు. ఇంతకుముందు పెయింటింగ్ పనులకి వెళ్ళేవారు. ఒక 3 నెలల నుండి మానేశారు.

పోలీసు అధికారిని : కారణం తెలుసుకోవచ్చా !

నాగమణి         : ఆయనికి ఒంట్లో సరిగా బాగుండటం లేదు.

పోలీసు అధికారిని : మరి కుటుంబ పోషణ ?

నాగమణి         :  నేను నర్స్ గా చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చాలీ చాలని జీతంతోనే కుటుంబాన్ని గెంటుకు రావాల్సి వస్తుంది. ఇంతలో ఈయన ఇలా ....(మళ్ళీ నిట్టుర్పుతో)

పోలీసు అధికారిని : మీకు, మీ వారికి ఎవరైనా శత్రువులు ?

నాగమణి         : నాకు తెలిసి ఆయనికి కానీ, నాకు కానీ శత్రువులు ఎవరూ లేరండి ! చుట్టూ పక్కల ఉన్న వాళ్ళతో కూడా ఆయన పెద్దగా కలవరు.

పోలీసు అధికారిని : మీ చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ అంటున్నారు. మరి మీకు అప్పులు ఏమైనా ఉన్నాయా ?

నాగమణి         : అలాంటివి ఏం లేవండి !, పెళ్లికి ముందు నుండి నేను ఉద్యోగం చేస్తున్నాను. నా సేవింగ్స్ ఉన్నాయి. ఇక ఆయన పడుతూ లేస్తూ సంపాదిస్తుంటారు. ఖర్చు విషయాలలో ఇద్దరం జాగ్రత్తగానే ఉంటాం. ఇప్పటి వరకూ అవే మాకు ఆసరా అయ్యాయి. అందుకే ఇతరుల దగ్గర అప్పులు చెయ్యాల్సిన అవసరం రాలేదు.

పోలీసు అధికారిని : మీ భర్తది హత్య అనుకుంటున్నారా ? లేక ఆత్మహత్య అనుకుంటున్నారా ?

నాగమణి         : హత్య గా భావించడానికి ఇందాక నేను చెప్పినట్టు మాకు ఎవరూ శత్రువులు లేరు ?

అలా అని ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు. ఎలాంటి కష్టం ఎదురైనా తన రచనల ద్వారా స్వయంగా తనలో తానే స్ఫూర్తిని నింపుకుంటాడు. కానీ ఇప్పుడు...

(బాధపడుతూ)

పోలీసు అధికారిని : ఏంటి ? ఆయనొక రచయితా ?

నాగమణి         : అవును రచయితే, కానీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రచయిత, సమాజానికి కనిపించని ఓ అజ్ఞాత కవి. నా ఉద్దేశ్యం ఆయన రచనలు పెద్దగా గుర్తింపు పొందలేదు.

పోలీసు అధికారిని : మరి మీ భర్త మరణం పై ఇంకేమైనా

అనుమానాలు ఉన్నాయా మీకు ?

నాగమణి         : లేదండీ ! ఆరోగ్యం బాలేక ఆందోళనతో 

ఆత్మహత్య చేసుకున్నారని నాకనిపిస్తుంది.

పోలీసు అధికారిని : ఆరోగ్యం బాలేదు అంటున్నారు. అసలు అతడి అనారోగ్య సమస్య ఏమిటి ?

నాగమణి           : బై పోలార్ డిజార్డర్. అతిగా ఆలోచిండం,

ఆందోళన చెందడం, ఇంట్రవర్ట్ గా ఉంటూ ఎవరితోనూ ఏ విషయాలు పంచుకోకుండా తనలో తానే మధన పడడం దీని లక్షణాలు. బహుశా ఇదే కారణం కావొచ్చు.

పోలీసు అధికారిని : ఇంత కచ్చితంగా అదే కారణం ఎలా చెప్తున్నారు ?

నాగమణి            : చెప్పా కదా మేడం! ఒక మూడు నెలల నుండి పని మానేసి ఆయన అదోలా ఉంటున్నారని, నా ఒక్కదాన్ని సంపాదనతో మా సంసారం గడవడం కొంచెం కష్టంగా మారింది, దీనివల్ల తరుచూ మా మధ్య గొడవలు జరిగేవి.    

"అనవసరంగా నాలాంటి అసమర్ధుడిని పెళ్ళి చేసుకున్నావ్ ...!

నేను ఉండడం కన్నా చస్తే మేలు. కనీసం మీరైనా హాయిగా బ్రతుకుతారు" అని నన్ను నిరంతరం బెదిరించేవారు.

ఇదివరకూ కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. కాబట్టి ఇవన్నీ మామూలే, ఆయన చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, కొద్ది రోజులు పోతే ఆయనే మళ్ళీ మామూలు మనిషి అవుతారు లే అని నేను పెద్దగా ఆయన మాటలు పట్టించుకోలేదు...

కానీ, ఇంతలోనే ఆయన ఇలాంటి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని నన్ను, పాపని అనాధని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారని అనుకోలేదు." అంటూ మళ్ళీ బోరున ఏడవ సాగింది.

పోలీసు అధికారిని : ok, control yourself...

మరి మీ భర్తకున్న అనారోగ్యం గురించి మీకు, మీ వాళ్ళకి ముందే తెలీదా ? లేక తెలిసే మీ పెళ్లి చేశారా ?

నాగమణి          : మాది లవ్ మ్యారేజ్, ఇంట్లో ఒప్పుకోలేదు. పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత కొన్నాళ్ళకి మా ఇంట్లో ఆక్సెప్ట్ చేశారు. ఆయన ఇంట్రోవెర్ట్ అనే నేను ఇష్టపడ్డాను. కానీ ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని, దాని వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని నాకు ముందుగా తెలీదు. పెళ్ళై తెలిశాక పాప కోసం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది.

పోలీసు అధికారిని : "it's ok ma'am, విచారణకు సహకరించినందుకు మీకు థాంక్స్ మామ్.... మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు !" అంటూ ఆ పోలీసు

అధికారి నాగమణి వద్ద విలువైన సమాచారం సేకరించి, దాన్ని రికార్డ్ చేసి ఇక అక్కడి నుండి ఆమెను పంపించేసారు.

నాగమణి చెప్పిన వివరాలతో పోలీసులు ఈ కేసును ఎలా చేధిస్తారు ?

అసలు శివరాం ది హత్యా ? ఆత్మహత్యా?

శివరాం పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెప్పబోతుంది ?

లాంటి విషయాలు "ది ఎఫైర్ (ruins a human life) - 2" లో తెలుసుకుందాం.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama