STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

"ది ఎఫైర్ - 4"

"ది ఎఫైర్ - 4"

5 mins
11

"ది ఎఫైర్ (ruins a human life) - 3" కి


కొనసాగింపు...


"ది ఎఫైర్ (ruins a human life) - 4"


కొన్ని రోజుల తర్వాత...


ఆ కానిస్టేబుల్స్ హోటల్ కి వచ్చి ఆ అజ్ఞాత మహిళ యొక్క వివరాల కోసం ఆరా తీశారు ఆ హోటల్ మేనేజర్ ని.


అప్పుడు ఆ హోటల్ మేనేజర్...


"సారీ సార్..!


ఆ డిటైల్స్ కోసం ఎంత ట్రై చేసినా మాకు దొరకలేదు.


ఇక నుండి క్రమం తప్పకుండా


ప్రతి క్షణం ఎవరెవరు హోటల్ కి వచ్చి వెళ్తున్నారో ప్రతీది నోట్ చేస్తాం. దయచేసి ఈ ఒక్కసారికి జరిగిన తప్పుని మన్నించి, మమ్మల్ని అర్థం చేసుకోండి సార్.


ఈ ఒక్కసారికి ప్లీజ్ !"


అంటూ కానిస్టేబుల్స్ నీ ప్రాధేయపడ్డాడు.


కానిస్టేబుల్స్ కూడా చేసేదేం లేక,


ఆ మేనేజర్ ని నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ...


"ఏవైనా అవసరం ఉంటే, స్టేషన్ కి పిలుస్తాం, వచ్చి కనిపించి వెళ్తూ ఉండూ..!"


అంటూ కోపంగా వెళ్ళిపోయారు.


అదే విషయం వాళ్లు ఆ ఎస్ ఐ కి చెప్పగా...


ఇక ఎస్ ఐ కి కూడా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. దానికోసం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అక్కడే స్టేషన్ లోనీ తన రూంలో...


కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ ని పిలిచి,


"శ్రీనివాస్...


మీరు ఎంక్వైరీ కోసం శివరాం ఇంటికి వెళ్ళినప్పుడు...


అక్కడ ఒక పెద్దాయనా మీకు ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని అన్నారు, అదే శివరాం లేనప్పుడు అతని భార్యని కలవడానికి ఎవరో అజ్ఞాత వ్యక్తి వస్తున్నట్టు...!


ఇప్పుడొక సారి అతన్ని పిలిపిస్తే?


మరిన్ని వివరాలు లభించొచ్చేమో ?" అంటూ అడగ్గా...


శ్రీనివాస్ ...


"సార్ అది...!


అది...!" అంటూ నాన్చుతున్నాడు.


"ఎందుకు శ్రీనివాస్ అంతలా సంకొచిస్తున్నావ్ !


ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావ్ ?


అసలు ఏం జరిగింది శ్రీనివాస్ ?" అంటూ ఎస్ ఐ అడుగుతాడు.


అప్పుడు శ్రీనివాస్...


"ఏం లేదు సార్..!


ఆ ముసలాయన ఈ వయసులో స్టేషన్ కి రాలేనని, ఊరిలో నలుగురికి తెలిస్తే, మళ్ళీ అతని పెద్దరికం పోతుందని భయపడుతున్నాడు.


తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకూ తీసుకుని, అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని, మాకు ఈ డిటైల్స్ చెప్పినప్పుడు వేడుకున్నాడు. పోనీలే పెద్దాయన ఇంతగా ప్రాధేయపడుతున్నాడని మేము కూడా దానికి సరే అన్నాం.


వీలైతే ఎవరికి తెలియకుండా అతని దగ్గరికే వెళ్లి విచారిస్తామని సర్ది చెప్పి వచ్చాం. అందుకే, ఇప్పుడు మీకు ఈ విషయం ఎలా చెప్పాలా ?


అని ఆలోచిస్తూ...!


కానీ ఎలా చెప్పాలో తెలియక ...? " అంటూ జరిగింది చెప్తుండగా..


"ఓహ్ ఇంతేకదా..!


ఈ విషయం చెప్పడానికి ఇంత సేపు ఆలోచించాలా ?


సరే, నువ్వు అతనికి చెప్పినట్టుగానే ఎవరికి అనుమానం రాకుండా మఫ్టీలో అతని వద్దకే వెళ్లి విచారణ జరుపుదాం !


ఏమంటావ్ శ్రీనివాస్" అంటూ శ్రీనివాస్ ని ఆ ఎస్ ఐ అడగ్గా...


"థాంక్యూ సార్ !


థాంక్స్ ఫర్ ద అండర్ స్టాండ్ !" బదులు ఇస్తాడు కానిస్టేబుల్ శ్రీనివాస్...


"ఇట్స్ ఓకే!


అది నా రెస్పాన్సిబిలిటీ అయ్యా !" భుజం తడుతూ చెప్తాడు ఆ ఎస్ ఐ.


"అది సరే సార్...


అతని వద్దకు మనం ఎప్పుడు వెళ్దాం సార్ !" అంటూ ప్రశ్నిస్తాడు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ ఎస్ ఐ ని.


దానికి ఎస్ ఐ


"ఇప్పుడే,


అన్నట్టు నీ లంచ్ అయిపోయిందా ?" అని అడుగుతాడు.


"ఇంకా లేదు సార్...!


కొంచెం పని ఉంటేనూ... " బదులు ఇస్తాడు శ్రీనివాస్


"సరే సరే..!


టైం రెండు గంటలు కావొస్తోంది...


త్వరగా కంప్లీట్ చేసేయి.


మనం ఆ వెంటనే స్టార్ట్ అవుదాం!" అంటూ చెప్తాడు ఆ ఎస్ ఐ.


ఇక లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇద్దరూ మఫ్టీ లో కానిస్టేబుల్ శ్రీనివాస్ బైక్ మీద శివరాం ఊరికి బయలుదేరి వెళ్తారు.


అలా ఊరిలోకి వెళ్తారు ఆ ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్.


ఊరిలోకి ఎంటర్ అవ్వగానే ఒక శవం ఎదురు వస్తుంది వాళ్ళకి...


దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు కదిలారు వాళ్ళు.


అలా వాళ్ళు శివరాం ఇంటి సమీపానికి వెళ్ళిన వెంటనే,


ఆ రోజు ఎక్కడైతే ఆ ముసలాయన కానిస్టేబుల్స్ కి కనిపించాడో...


అక్కడే అతని కోసం వెతుకుతూ ఉంటాడు కానిస్టేబుల్ శ్రీనివాస్.


చాలా సేపు ఆ చుట్టూ పక్కల చూస్తూ అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానిస్టేబుల్ శ్రీనివాస్...


చాలా సేపు తదేకంగా శ్రీనివాస్ నీ గమనించిన ఎస్ ఐ


"ఏంటి శ్రీనివాస్..?


ఆ ముసలాయన దగ్గరకి తీసుకుని వెళ్తానని, ఇక్కడే ఉండి అంతలా వెతుకుతున్నావ్ ?


ఎవరి కోసం ?" ప్రశ్న లేవనెత్తుతాడు ఎస్ ఐ.


"ఆ ముసలాయన కోసమే సార్ !


ఆరోజు నాకు ఇక్కడే కనిపించాడు.


ఇక్కడే ఎక్కడో చుట్టు పక్కల ఉండే ఉంటాడు. అందుకే అతని కోసమే వెతుకుతున్నాను." అంటూ బదులు ఇస్తాడు కానిస్టేబుల్...


"అరెరే !


కనీసం అతని ఇంటి అడ్రస్ కూడా తీసుకోలేదా మీరు ?" అంటూ ఎస్ ఐ, శ్రీనివాస్ ని ప్రశ్నించగా ...


"మీకు ఆల్రెడీ చెప్పా కదా సార్ !


ఆ పెద్దాయన చాలా భయపడుతున్నాడని,


ఎప్పుడూ ఇక్కడే, ఈ చుట్టూ పక్కల ఉంటాడు లే అని, మేము కూడా అతన్ని ఆరాలు తీసి మరింత ఇబ్బంది పెట్టలేదు." అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ బదులు ఇస్తాడు.


"హమ్...


సరిపోయింది...


ఆరోజు అతని ఇబ్బంది గురించి ఆలోచించిన మీరు ?


ఈరోజు మనం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్న సంగతి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది." అంటూ ఎస్ ఐ కొంచెం అసహనంగా మాట్లాడతాడు.


దానికి శ్రీనివాస్...


"సారీ సార్ !


ఇంతలా జరుగుతుందని ఊహించలేదు...


ఇక్కడి ఎవర్ని అడిగినా అతని గురించి చెప్తారు." అంటూ ఆ ఎస్ ఐ కి నచ్చ చెప్తాడు.


"సర్ సర్లే !


జరిగిందేదో జరిగిపోయింది ...


ఇక జరగాల్సింది చూడు..!" అంటూ ఆ ఎస్ ఐ అంటాడు.


ఇంతలో అటుగా ఎవరో ఇంకో పెద్దమనిషి సైకిల్ పై వస్తుంటే అతన్ని ఆపిన శ్రీనివాస్...


"ఇదిగో పెద్దాయన...


ఇక్కడ కొంచెం లావుగా, పొట్టిగా, పెద్దపెద్ద మీసాలతో, కళ్ళకు కళ్లద్దాలు పెట్టుకుని ఒక ముసలాయన ఉండేవాడు నీకు అతని గురించి ఏమైనా తెలుసా ?" అని అడుగుతాడు.


మఫ్టీలో ఉన్న పోలీసులని గుర్తించని ఆ అవతలి వ్యక్తి


"ఆ...


తెలుసు !


నారాయణ మూర్తి గురించే కదా మీరు అడిగేది. అతని గురించి ఆయ్యి ఉంటుంది లే. మీరు చెప్పిన పోలికలు ఉన్న మనిషి ఆడే. పైగా ఇక్కడ ఆడు తప్ప ఎక్కువగా ఎవరూ కూకోరు !" అని అంటాడు.


అప్పుడు ఆ కానిస్టేబుల్ ఆతృతగా...


"హా...


అతనే, అతనే...


అతను ఎక్కడుంటాడు


కొంచెం చెప్పవా ?" అని అడుగుతాడు.


దానికి అవతలి వ్యక్తి కొన్ని క్షణాలు ఆలోచించి,


"అయినా అతనితో మీకేం పని ?" అంటూ నిలదీస్తాడు.


అసలే ఎండలో చిర్రెత్తకొస్తుంది మన ఎస్ ఐ గారికి, అతని ప్రశ్నలకు కోపంతో...


"ఏం పనైతే నీకెందుకయ్యా !


అడిగిన దానికి సమాధానం చెప్పు ?" అంటూ మఫ్టీలో ఉన్న విషయం మరిచిపోయి గదుముతాడు...


"మీరు ఊరుకోండి సార్ !" అంటూ శ్రీనివాస్ ఒకపక్క నచ్చ చెప్తుంటే,


ఆ పెద్దాయన


"సరే ...!


నా కూడా రండి ..!


అతని వద్దకే తీసుకెళ్తాను" అంటూ తను ముందు సైకిల్ పై వెళ్తుంటే అతన్ని అనుసరిస్తూ వీళ్ళూ వెళ్తారు.


అలా చాలా దూరం...


దాదాపు ఊరి చివరకు తీసుకుని వెళ్తుంటాడు ఆ పెద్ద మనిషి..


వెనుక వెంబడుస్తున్న ఎస్ ఐ, కానిస్టేబుల్ తో...


"ఏంటయ్యా !


ఇతను ఊరి చివరి వరకూ తీసుకుని వస్తున్నాడు.


అక్కడే ఆ ముసలాయన సంచరిస్తాడని చెప్పావ్. అలాంటప్పుడు అతని ఇల్లు కూడా అక్కడే ఎక్కడో దగ్గర్లో అయ్యి ఉండాలి కానీ, ఇంత దూరం తీసుకుని వస్తున్నాడు.


అసలు వీడికి అతని అడ్రస్ తెలుసు అంటావా ?


లేక మనం కొప్పడి సరిగా విషయం చెప్పలేదని అసూయతో మనల్ని తప్పు దోవ పట్టిస్తున్నాడా ?" అంటూ అనునామాలు రేకెత్తిస్తాడు.


"ఏమో సార్ !


అదే నాకు ఏం అర్థం కావడం లేదు" అంటూ శ్రీనివాస్ అనబోతుంటే,


ఈలోపు ఆ పెద్దాయన ఊరి చివర ఉన్న స్మశానం వద్దకు వాళ్ళని తీసుకుని వచ్చి, అక్కడ కాలుతున్న శవాన్ని చూపిస్తూ...


"అడిగో !


అతనే మీరు అడిగిన నారాయణ మూర్తి. కట్టెల్లో కాలిపోతున్నాడు. నీ పక్కనున్న మనిషిలాగా (ఎస్ ఐ నీ ఉద్దేశించి). వెళ్లి మాట్లాడండి !" అంటూ చాలా వెటకారంగా మాట్లాడతాడు.


అతని వెటకారం ఎలా ఉన్నా ...


ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతారు.


(ఆ సాక్షి చనిపోయాడన్న విషయం అర్థమయ్యి)


వెంటనే ఆ షాక్ నుండి తేరుకుని


"హేయ్ పెద్దాయన !


సరిగా సమాధానం చెప్పు.


అసలు మేము ఎవరో తెలుసా ?


పోలీసులం !


ఆయన ఎస్ ఐ గారు. నేను కానిస్టేబుల్ " అంటూ శ్రీనివాస్ తమని తాము పరిచయం చేసుకుంటుండగా...


అక్కడే ఉన్న మరొక వ్యక్తి (ఆ ఊరికి చెందినవాడే)


"సార్ సార్


ఎస్ ఐ గారు


మీరేంటి సార్ !


ఇలా వచ్చారు ? " అంటూ వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెడుతూ వాళ్ళని సమీపిస్తాడు.


దాంతో ఆ పెద్దాయనికి విషయం అర్ధం అయ్యింది. వాళ్ళు నిజంగానే మఫ్టీ లో ఉన్న పోలీసులని,


వెంటనే..


"సార్..!


తప్పై పోయిందయ్యా, నన్ను క్షమించండి. !!


మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను."


అంటూ వాళ్ళను ప్రాధేయపడతాడు.


"సరే కానీ, అసలు ఆ నారాయణ మూర్తి ఎలా చనిపోయాడు " అడుగుతాడు ఆ ఎస్ ఐ


"అది


రాత్రి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందంట సార్ !


హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం అనుకునెలోపు


ఇలా...!" అంటూ ఆ పెద్దాయన జరిగింది వివరిస్తాడు.


దీంతో కథ మళ్ళీ అడ్డం తిరిగిందని ఆ ఎస్ ఐ జుట్టు పట్టుకుంటాడు.


"ఇంతకీ నారాయణ మూర్తితో మీకేం పని సార్ !" అంటూ ప్రశ్నిస్తాడు అక్కడికి వచ్చిన వ్యక్తి.


దానికి ఆ ఎస్ ఐ ఒక్కసారిగా కళ్ళు ఎర్ర జేసీ అతని వైపు చూడగా ...


భయంతో ...


"అబ్బే అదేం లేదు సారు..


అంటే, వాల్లబ్బాయి ఇక్కడే ఉన్నాడు...


అడుగో! (అక్కడే స్మశాన వాటిక వద్ద దూరంగా ఉన్న అతన్ని చూపిస్తూ)


ఏమైనా అవసరం ఉంటుందేమోనని !" అంటూ కొంచెం వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు.


"ఏం అవసరం లేదు !


శ్రీనివాస్ బండి తియ్యి స్టేషన్ లో పనుంది" అంటూ అక్కడి నుండి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు.


ఆ ముసలాయన చనిపోవడంతో నాగమణిని కలిసే ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా దొరుకుతాయి ?


హోటల్ లో డిటైల్స్ మిస్ అవ్వడంతో శివరాం నీ కలిసే ఆ అజ్ఞాత మహిళ వివరాలు ఎలా కనుక్కుంటారు ?


అసలు శివరాం మృత్యువు వెనకున్న అసలు కారణం ఏమిటి ?


లాంటి విషయాలు తర్వాతి భాగాలలో తెలుసుకుందాం...


తర్వాతి భాగం "ది ఎఫైర్ (ruins a human life) - 5" కొనసాగబోతుంది.


అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.


అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.


నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama