SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

"ది ఎఫైర్ - 8"

"ది ఎఫైర్ - 8"

4 mins
325


"ది ఎఫైర్ (ruins a human life) - 7" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 8"

నాకంటూ సపోర్ట్ చేసే వారు ఎవరూ లేరు. అమ్మ కూడా చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆర్నెల్లు తిరక్కుండానే నాన్న రెండో వెళ్లి చేసుకున్నాడు.

చివరికి నాన్న కూడా 2015లో కాలం చేసారు. బైపోలార్ డిజార్డర్ వల్ల చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ గా మారిపోయాను. ఎవరితోను ఎక్కువ మాట్లాడక పోవడం వల్ల గర్వం, పొగరు అనుకుని నన్ను బంధువులు అందరూ వదిలేసారు. ఇప్పుడు నేనొక అనాథని. నాకంటూ ఎవరూ లేరు.

అంతా నా భార్య తరుపు వాళ్ళే. ఇక చేసేదేం లేక, విషయం మా అత్తగారికి, మా బావమరిదికి వివరించాను. వాళ్ళు కూడా చివరికి నన్నే తప్పుపట్టారు.

"నువ్వు తప్పు చేసిన తర్వాతే, మా కూతురు కూడా తప్పు చేసింది. ఆడదైనా అది ఉద్యోగం చేసి నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మెల్లగా అదే తెలుసుకుంటుందిలే!" అని నాకు నచ్చచెప్తున్నారు.

కానీ తను మాత్రం నా ముందే ప్రకాశ్ తో తరుచూ ఫోన్ మాట్లాడుతుంది.

"నువ్వు మగాడివేనా అసలు, మగాడంటే ప్రకాష్...!

అలాంటి వాడితో ఏ ఆడదైనా సుఖంగా ఉంటుంది. అతనితో మాట్లాడితే నా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది" అంటూ నన్ను మరింత క్షోభ పెడుతుంది.

నాతో దాదాపు సంవత్సరం నుండి శారీరకంగా కలవడం మానేసింది. భార్యా భర్తలు తప్పులు చేస్తే పిల్లలు అనాథలు అవుతారు. నా కూతురుకి ఆ కష్టం రాకూడదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి, ఇలా అక్రమ సంబంధం మానేసి అందంగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి, నా చిట్టి తల్లిని బాగా చూసుకుంటారని ఆశీస్తున్నాను. నా చివరి కోరిక ఇదే.

మూడు నెలలు నుండి సూసైడ్ చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను..

కానీ, "నా కూతురి భవిష్యత్తు ఏమవుతుందో ?" అనే ఆలోచనతో వాయిదా వేస్తూ వచ్చాను. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కావట్లేదు. ఒకే ఇంట్లో నా భార్య, నేను బద్ద శత్రువుల్లా ఉంటున్నాము.

"యద్భావం తద్భవతి"

మన మనసులో ఏదైనా గట్టిగా జరగాలని కోరుకుంటే భగవంతుడు దాన్ని ఖచ్చితంగా నిజం చేస్తాడు. ఇప్పుడు పోలీస్ వారే నా భగవంతుడు :

ఈ ఏకాకి గాడికి మీరు 3 సాయాలు చేయాలి.

1)

కట్టుకున్న భార్యతో సహా నేనంటే ఎవరికీ నచ్చను. నా జాతకమే అంత !

అనాథ శవం అనుకుని నా అంత్య క్రియలు జరిపించండి. నా బాడీని బంధువులెవరికి అప్పగించకండి.

"బ్రతికి ఉన్నప్పుడు కనీసం ఫోన్ చేసి పలకరించేవాడు కూడా కాదు. ఇప్పడెందుకు మాకీ కర్మ ?" అని అనుకుంటారు.

సొంత ఇల్లు కూడా లేని దౌర్బాగ్యుడిని నేను. బ్రతికున్నంత కాలం మెడల్లో నివసించే వాడికైనా పూరి గుడిసెలో తల దాచుకున్న వాడికైనా చనిపోయిన తర్వాత ఆఖరికి స్మశానమే నిలయం. దయచేసి నా మృతదేహాన్ని ఎవరికీ అప్పగించకండి. దానివల్ల పిండ ప్రదానాలు, భోజనాల ఖర్చు దండగ వాళ్లకి.

2)

మా అత్తగారికి, బావమరిదికి కౌన్సిలింగ్ ఇచ్చి (రెండో పెళ్లి తప్పకాదు అని) నా భార్యను మరియు ప్రకాశ్ ని కలపండి. మూడు ముళ్ల బంధంతో వాళ్ళు ఒక్కటైతే, నా ఎనిమిదేళ్ళ పాప జీవితం కష్టాల పాలు కాకుండా ఉంటుంది. దాని ముఖం కాస్త చూడండి!

దయచేసి విచారణ పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టకండి !

పెళ్లయిన స్త్రీ ఎవరైనా సరే...

శారీరకంగా సుఖం పొందితేనే, మానసికంగా కూడా సంతోషంగా ఉండి కట్టుకున్న మొగుణ్ణి బాగా చూసుకుంటారనే అభిప్రాయం వచ్చేసింది నాకు.

నా వల్ల నా భార్య పెద్దగా సుఖపడింది ఏమీ లేదు. నాకది తన మాటల్లో, చేష్ఠల్లో చాలా సార్లు అర్థమైంది.

తనంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. తను ప్రకాష్ ను పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి.

ఒకప్పటి నేను తీసుకున్న అనాలోచిత నిర్ణయం వాళ్లను శారీరకంగా దగ్గర చేసినా... అదే వాళ్లను మూడు ముళ్ల బంధంగా మార్చుతుంది నా ఈ చావుతో.

3)

నాకు తెలియకుండా నాలో 18 ఏళ్లకే బైపోలార్ డిజార్డర్ వచ్చిందట. టెన్త్, ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసయిన నాకు సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. సినిమాలు చూసి వాటి కథ మార్చేసి నా స్టైల్లో కొత్తగా చెప్పేవాడిని అలా నాకు తోచిన కథలు ఒక బుక్ పై రాసేవాడిని.

నేను రాసిన ఓ కథ విని ఇంట్లో ఐదు వేల రూపాయలు ఉంటే అవి తీసుకుని నన్ను 2003 లో హైద్రాబాద్ తీసుకెళ్లారు మా నాన్న, సినిమాల్లో అవకాశాల కోసం.

ఇంటర్ మాత్రమే చదవటంతో హైద్రాబాద్లో అందరూ తిట్టేవారు.

ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. డిగ్రీ కంప్లీట్ చేసిరా అప్పుడు అసిస్టెంట్గా పెట్టుకుంటాం అనే వారు. అప్పటి వరకూ "నేను ఒక స్టార్ రైటర్ " అనే భ్రమలో ఉన్న నన్ను వాళ్ల మాటలు ఆ భ్రమ నుండి బయటకి విసిరేశాయి.

మూడ్ డిజార్డర్ వల్ల ఎందులోను స్థిరంగా సెటిల్ అవలేక పోయాను. లోలోపల భయం వలన కూడా దేనికి తెగించి ముందు వెళ్ళే వాడిని కాదు. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఏది తోస్తే ఆ పని చేసి చివరకు ఏమీ సాధించకుండా ఇలా మిగిలిపోయాను. కన్న కూతురి కోసం, కట్టుకున్న భార్య కోసం పైసా కూడా పొదుపు చేయలేకపోయిన ఒక అసమర్ధుడిని నేను. 

ఒక భర్తగా ఫెయిలయ్యాను,

ఒక తండ్రిగా ఫెయిలయ్యాను,

చివరికి ఒక మనిషిగా ఫెయిలయ్యి ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తుకి, కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను.

కానీ ఎంతో ఇష్టంగా చిన్న కథ ఒకటి ఎప్పటి నుండో మైండ్ లో ఊహించుకుంటున్నాను. కథ పేరు ' సెలబ్రిటీ '

ఆ పాయింట్ సినిమాగా తీస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. రాసిన స్క్రిప్ట్ మా ఇంట్లో బీరువాలో ఉంది.

సుకుమార్ గారి ఆర్య సినిమా చూసాకే నాకు రైటర్ అవ్వాలనే ఆలోచన కలిగి కథలు రాసేవాడిని. సుకుమార్ గారికి నేను రాసుకున్న కథ చేరేలా చూడండి.

ఆ కథతో డబ్బు సంపాదించాలని కాదు.

ఈ కుటుంబం, అయినవాళ్ళు నన్నొక పనికిమాలిన వాడిగా, ఏమి చేతకాని వాడిలా ముద్ర వేశారు. నాలో ఉన్న ఈ కాస్త నైపుణ్యాన్నైనా, సృజాత్మకతనైనా గుర్తిస్తారని ఒక చిన్న ఆశ.

కూతురు కోసం, భార్య కోసం ఏమీ సంపాదించలేదు.

నా కథను సినిమాగా తీసి, అది హిట్ అయితే వచ్చిన కాస్త డబ్బుతో నా కూతురుని చదివిస్తారని చిన్న ఆశ అంతే. చదువు మనిషిని ఉన్నతంగా ఆలోచించేలా చేస్తుంది. మంచి దారిని చూపిస్తుంది. నాకున్న రోగం వల్ల నేను నిలకడగా ఏమీ ఆలోచించలేక కష్టాలు కోరి కొని తెచ్చుకునేవాడిని.

దర్శక ధీరుడు రాజమౌళి గారికి నా తరపున అభినందనలు. తెలుగు సినిమా స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు.

భర్తతో డైవర్స్ తీసుకుని 8 ఏళ్ల కొడుకుతో ఒంటరిగా బ్రతుకుతున్న రమా గారిని, మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుని మంచి భర్తగా, మంచి తండ్రిగా వాళ్లకు గౌరవమైన స్థానం కల్పించారు. "హ్యాట్సాప్ సార్ !" మీకు.

ప్రకాష్ గారు మీకు నా భార్యను రెండో పెళ్లి చేసుకోవడానికి సంశయం ఏమైనా ఉంటే, ధైర్యంగా మా రాజమౌళి సార్ని గుర్తు తెచ్చుకోండి. ఆయన కంటే తోపు ఏమీ కాదు మీరు.

ఆయనతో పోల్చానని తప్పుగా అనుకోకండి..

సెలబ్రిటీలు ఊరికే అయిపోరు. వారికి మంచి మనసు కూడా ఉండాలి. తెలుగు సినిమా పది కాలాలు పాటు చల్లగా ఉండాలి. ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్న కళామ్మ తల్లికి నా పాదాభివందనం.

ఇంకా శివరాం ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడో తర్వాత భాగం

"ది ఎఫైర్ (ruins a human life) - 9" లో తెలుసుకుందాం.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama