SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Drama Crime Thriller

"ది ఎఫైర్ - 7"

"ది ఎఫైర్ - 7"

5 mins
403


"ది ఎఫైర్ (ruins a human life) - 6" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 7"

ఇక ఆ పుస్తకం తనతో పాటు ఇంటికి తెచ్చుకున్న ఎస్ ఐ...

ఆరోజు రాత్రి తన రూం లో ఏకాంతంగా ఆ సూసైడ్ నోట్ ఉన్న పేజీ తెరిచి చదవడం మొదలు పెట్టాడు.

అందులో ఇలా ఉంది...

       "సూసైడ్ నోట్ - I (ఫెయిల్యూర్ పర్సన్ కథ)"

ఈ రోజు మా పెళ్లి రోజు. మాకు పెళ్లి జరిగి నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. 8 ఏళ్ల కూతురు కూడా ఉంది.

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తాయని నిరూపించడానికి మా అన్యోన్య దాంపత్య జీవితం ఇప్పుడు ఇలా అవ్వడం, దాని పర్యవసానంగా నా ఈ బలవన్మరనమే ఒక పెద్ద ఉదాహరణ!

ప్రకాష్ అనే మూడో వ్యక్తి మా జీవితంలోకి ప్రవేశించి నా భార్యకు మానసికంగా మరియు శారీరకంగా కూడా దగ్గరయ్యాడు.

ఇలా జరగకపోవడానికి కారణం లేకపోలేదు...

మా పెళ్లయిన దగ్గర నుండి నా లైంగిక సామర్థ్యం బాగానే ఉండేది. కానీ, అది తనకు ఏమాత్రం భావప్రాప్తి కలిగించడం లేదని, అసలు ఎంతసేపు శృంగారం చేస్తున్నా అది సరిపోయేది కాదని నా భార్య మొహం మీదే అంటుండేది. అయినా నాకు ప్రేమను పంచడంలో మాత్రం ఏ లోటు చేసేది కాదు తను.

ఇద్దరు పిల్లలు పుట్టారు, నా జీతం తక్కువని తను కూడా జాబ్ చేస్తూ నాకు చాలా సపోర్ట్ గానే ఉండేది. కాలం గడిచేకొద్దీ మెల్ల మెల్లగా నా లైంగిక సామర్థ్యం తగ్గడం మొదలైంది. దాంతో నా భార్య చాలా అసంతృప్తిగా ఉండేది.

"నన్ను ఇంత ప్రేమగా చూసుకునే భార్యకు నేను సరిపడేంత సుభాన్ని ఇవ్వలేకపోతున్నానా ?" అని నేను కూడా చాలా గిల్టీ గా ఫీలయ్యేవాడిని. దానివలనే అనాలోచిత ఆలోచనలు ఎక్కువయ్యాయి.

నాకు బైపోలార్ డిజార్డర్ అనే ఒక వింతైన వ్యాధి ఉంది.

ఆ వ్యాధి ఉన్న వారి లక్షణాలు ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం... అలా తీసుకున్న నిర్ణయాల యొక్క పర్యావసానం ఎంత వరకు వెళ్తుందనే ఆలోచనా శక్తి ఊహించలేకపోవడం . అంటే "సడెన్ డెసిషన్ మేకింగ్ విత్ ఔట్ ఎం మినిమం థింకింగ్" అన్న మాట !

అలా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే...

అప్పటికే పెళ్ళైన నా జీవితంలోకి అనుకోకుండా ఒక అమ్మాయిని ఆహ్వానించడం.

నేను తీసుకున్న మరో తప్పుడు నిర్ణయం ఏంటంటే...

నా భార్య అంటే చాలా ప్రేమ, ఇష్టం ఉండటంతో

తనతో ఒకసారి

"నా వల్ల నువ్వు అసంతృప్తిగా ఉంటున్నావు కదా. నీకు నచ్చిన వ్యక్తి, జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉంటే వెళ్లి కలువు. నీకు అవసరమైన ఫిజికల్ నీడ్ తీర్చుకో !" అని చెప్పాను. ఆ మాట కూడా అనాలోచితంగా అనేసాను తప్ప, ఒక భర్తగా నేను అక్కడే ఫెయిల్ అయ్యానన్న సంగతి నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. కానీ, ఆ మాటతో నా భార్య ముఖం మాత్రం చాలా ప్రకాశవంతంగా వెలిగి పోయింది.

"అది మీ మంచితనం, కానీ నేను మీతో హ్యాపీగానే ఉంటున్నాను" అని తను చెప్తూనే,

నాకు తెలియకుండా పెళ్లికి ముందు తను ప్రేమించిన ప్రకాష్ తో ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టింది.

పెళ్లయ్యి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా...

నా భార్య సుఖం కోసం ప్రకాష్,

నా తోడు కోసం వేరొక అమ్మాయి మా జీవితాల్లోకి ప్రవేశించారు.

ఎందుకనో నేను పెద్ద అందగాడిని కాకపోయినా...

ఆ అమ్మయి మాత్రం నాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేది. ఆ విషయం నా భార్యకు కూడా తెలుసు!

ప్రకాష్ తో అప్పటకే తను సీక్రేట్గా రిలేషన్ షిప్ స్టార్ట్ చేయటంతో, తెలివిగా ఆ అమ్మాయి విషయంలో నన్ను తప్పు పట్టకుండా పైగా సపోర్ట్ కూడా చేసింది.

అలా దగ్గరైన ఆ అమ్మాయి కూడా నా వల్ల సరైన భావప్రాప్తి కలగడం లేదనే కారణంతోనే చివరకు తను కూడా కొన్నాళ్లకు నన్ను వదిలేసింది.

మళ్ళీ ఒంటరినైన నేను...

అతి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే నా భార్య ఎక్కువగా ఫోన్ మాట్లాడంతో తన పైన నాకు అనుమానం పెరిగింది. ఒకసారి తన ఫోన్లో తనకి తెలియకుండా కాల్ రికార్డింగ్ పెట్టి విన్నాను. ఆ సంభాషణ అంతా ప్రకాష్ తోనే,

ఆ కాల్ రికార్డింగ్స్ ద్వారా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే,

మా పెళ్లికి ముందే ప్రకాష్ మరియు నా భార్య లవర్స్ అట. అంతేకాదు ఆ విషయం ఇంట్లో తెలిసి, తనకి ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా పెళ్లి చేశారట !.

నా భార్యను మర్చిపోలేక, అతను మాత్రం త్రాగుడికి అలవాటుపడి సింగిల్గా ఉండిపోయాడు.

మాట్లాడుకోవడం వరకే కదా నేను కూడా ముందు లైట్ తీసుకున్నాను.

కానీ, తర్వాత కొన్ని రోజులకు...

2020 లో మా చిన్న పాప అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత ప్రకాష్ డైరెక్ట్ గా మమ్మల్ని పరామర్శించడానికి ఇంటికి వచ్చాడు.

"మీలాంటి సపోర్ట్ చేసే భర్త దొరకడం నాగూ అదృష్టం !" అని నన్ను పొగిడి వెళిపోయాడు.

అలా మొట్టమొదటి సారి ప్రకాష్ ని కలిసిన నాకు, అంతకుందు అతనిపై ఏర్పరుచుకున్న అభిప్రాయం తప్పని అనిపించింది. మంచివాడిలానే కనిపించాడు.

కొన్ని రోజుల తర్వాత...

"ప్రకాష్ ని ఇంటికి రమ్మన్నాను, రెండు మూడు రోజులు ఇక్కడే మనతో పాటు ఉంటాడు" అని చెప్పింది నా భార్య.

నాకు అప్పటికే మానసికంగా అతనిపై మంచి అభిప్రాయం కలిగేలా తన గురించి చాలా విషయాలు చెప్పింది. నేను

కూడా ఆమె సంతోషం కోసం సరే అన్నాను.

కానీ కొద్ది రోజులకు తెలిసిన విషయం ఏంటంటే

తనతో నేను "నీకు నచ్చిన జెన్యూన్ పర్సన్ ఉంటే ఫిజికల్ నీడ్ తీర్చుకో !" అని అనడంతో అతడితో నా భార్య శారీరకంగా దగ్గరయ్యిందని.

అలా నేను పనికి వెళ్ళిపోయాక తరుచూ ఇంటికి వస్తున్న ప్రకాష్ తో మొగుడు పెళ్ళాళ్ళ ఉండేవారు వాళ్ళు.

అది తెలిసిన నాకు లోలోపల బాధ ఉన్నా...

తప్పు నావైపే ఉందన్న గిల్టీ ఫీలింగ్ తో ఏమనలేక పోయేవాడిని వాళ్ళని. ఆరేడు నెలలు అలా తను అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు.

అతని మోజు వల్ల నా భార్యకు నేను నచ్చటం లేదు. మూడేళ్ల క్రితం అతని వల్ల మా సమసారంలో ఏర్పడిన గొడవలు ఈరోజు వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.

దీని మూలంగా నాకూ ప్రకాష్ కు ఒక రోజు పెద్ద గొడవ జరిగింది. "ఇంకెప్పుడు మా ఇంటికి రావొద్దు !" అని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.

అప్పటి నుండి నా భార్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. విడాకులు కావాలని నన్ను ఫోర్స్ చేస్తుంది.

అయ్యిందేదో అయ్యింది, మనకి ఒక కూతురు ఉంది ప్లీజ్..! అతన్ని మర్చిపో అంటుంటే...

"నీ వల్ల నేను సుఖపడలేకపోతున్నాను,

ప్రకాష్ వల్లే హ్యాపీగా ఉంటున్నాను.

నువ్వు వద్దాన్నా అతనితోనే మాట్లాడతాను. అలా అయితేనే కలిసి ఉందాం లేదా విడిపోదాం !" అంటూ తెగేసి చెప్పింది.

ఈ గొడవల వల్లే నాకు ఈ మధ్య సూసైడ్ ఆలోచనలు ఎక్కువయ్యాయి. వాళ్లిద్దరినీ కలిపి నేను చనిపోతే కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉంటారని, వాళ్ళతో పాటు ఉన్న ఒక్క పాప భవిష్యత్ కూడా బాగుంటుందని ఒకవైపు,

"నేను బ్రతికున్నప్పుడే లేనిది, ఒకవేళ చనిపోతే వాళ్ళు పాపని సరిగా చూసుకోగలరా ?" అన్న ఆలోచనలు మరొక వైపు ?

ఇలా రకరకాల ఆలోచనలు నన్ను అనుక్షణం వేధించేవి.

ఈ క్రమంలోనే రాజమండ్రి వెళ్లి సైకియాట్రిస్ట్ ని కలిసి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. చాలా ధైర్యాన్ని ఇచ్చారు డాక్టర్ గారు.

కానీ నాకు బైపోలార్ డిజార్డర్ అనే ఒక మానసిక రోగం ఉందని అప్పుడే తెలిసింది. దాని వల్ల లైంగిక సామర్థ్యం తగ్గింది. అదేమి అంత ఇబ్బంది కాదు. మందులు వాడితే నయమవుతుందని అన్నారు.

అప్పటికే డాక్టర్ ...

"ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు !

నువ్వు మందులు వాడితే నీ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది" అని నచ్చ చెప్పటంతో నా ఆత్మహత్య ఆలోచనలని విరమించుకుని...

ఇక ప్రకాష్ ని ఇంటికి రావొద్దు అని చెప్పాను.

సూసైడ్ ఆలోచనలు కూడా తగ్గే మెడిసిన్స్ ఇచ్చారు.

ఒకరోజు నా భార్యని కూడా ఆయన దగ్గరకి తీసుకెళ్లగా...

ఆమెకి కూడా ఆయన "ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు !" అని కౌన్సిలింగ్ ఇచ్చారు.

కానీ, ఇంటికి వచ్చాక తను నాకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. ప్రకాష్ మరియు నా భార్య ఇద్దరూ నాపై కోపంతో ఆవేశంతో విరుచుకుపడ్డారు.

ఒకప్పుడు నా భార్య ముందే నన్ను పొగిడిన ప్రకాష్

"వీడు సైకోగాడు...

వేస్ట్ గాడు ...

వీడితో ఎలా కాపరం చేస్తున్నావ్ ...!" అంటూ అదే నా భార్య ముందే నన్ను తిడుతూ, మానసికంగా మరింత వీక్ చేసేసాడు.

ఇద్దరం చాలా గొడవ పడ్డాము.

ఇక నా భార్య కూడా భర్తననే కనీస గౌరవం, మర్యాద కూడా లేకుండా నన్ను కాకుండా అతన్నే సపోర్ట్ చేసింది. అక్కడే నేను సగం చచ్చిపోయాను.

అప్పటి నుండి వాళ్లిద్దరూ నాకు శత్రువులు అయిపోయారు. నాకూ నా భార్యకి మధ్య గొడవలు కూడా ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలోనే నా మీద కోపం కాస్తా ద్వేశంగా మారింది నా భార్యకి.

దాంతో బరి తెగించిన నా భార్య ...

నా ముందే ప్రకాష్ కి ఫోన్ చేస్తూ...

గంటలు గంటలు మాట్లాడుతూ...

మానసికంగా నన్ను మరింత వీక్ చేసేసింది. ఆ దెబ్బకి ఇక మందులు మీద కూడా విరక్తి వచ్చి వేసుకోవడం మానేసాను.

మూడు నెలల నుండి నా మానసిక స్థితి చాలా అధ్వానంగా ఉంది. చేస్తున్న పని మానేసాను. ఏ పని చేస్తున్నా దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు.

డాక్టర్ కూడా ...

సైకోటిక్ మందులు సడెన్ గా మానేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని, నాకూ నా భార్యకు ఇద్దరికీ ముందే చెప్పారు.

అయినా ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాపై ఆమె కొంచెం కూడా కేర్ తీసుకోవడం లేదు.

ఇంకా శివరాం ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడో తర్వాత భాగం

"ది ఎఫైర్ (ruins a human life) - 8" లో తెలుసుకుందాం.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama