దేవరకొండ ఫణి శ్యామ్

Drama Thriller

4.5  

దేవరకొండ ఫణి శ్యామ్

Drama Thriller

జాగ్రత్త సుమా!!!!

జాగ్రత్త సుమా!!!!

5 mins
675


ఏమండి...మన ఆనంద్ కి....ఇక్కడే జాబ్ వచ్చిందట... రేపు ఇక్కడికి వస్తున్నాడు...

అవునా...పోనీలే...ఇన్నాళ్లకు...మీ వాళ్ళ కష్టాలు తీరాయి...

అవునండి...నాకైతే చాలా సంతోషంగా ఉంది...

మరి మీ అమ్మా నాన్న ఇద్దరే అక్కడ ఏం చేస్తారు...ఇక్కడికే వచ్చయేమను....

నేను వాళ్ళని అడిగా...ఇప్పుడు కాదు తరువాత వస్తాము అన్నారు...

ఇంక నెక్స్ట్ ఆనంద్ పెళ్లే అన్నమాట....

వాడు ఇప్పుడు కాదు...తరువాత చేసుకుంటా అన్నాడు..ఒరేయి చిన్నూ...రాత్రి 11.00 అయ్యింది...పడుకోరా.... రోజు పడుకునే సరికి లేట్ అవుతుంది...మళ్ళీ పొద్దున్నే లేవాలంటే ఇబ్బంది గా ఉంటుంది...

*************************************************

మరుసటి రోజు

హాయ్ అక్క ఎలా ఉన్నావ్...ఈ మధ్య facebook, whatsapp బాగా వాడుతున్నట్టు ఉన్నావ్...తరచు గా ఫొటోస్ అప్డేట్ చేస్తున్నావ్...

ఎరా ఆనంద్ ఎలా ఉన్నావ్...ఇదేనా రావటం....జాబ్ వచ్చిందట... ఏ కంపెనీ...మీ అక్క బాగా అడ్వాన్స్ అయ్యింది...ముందు నువ్వు చూసిన అక్కవేరు...ఇప్పుడు మీ అక్క వేరు...

నేను బావున్నాను బావ...అవును బావ జాబ్ వచ్చింది...Firetel అనే ...telecommunication కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ ...మీరు ఎలా ఉన్నారు...

ఓహ్ గుడ్...మంచి కంపెనీ....జాగ్రత్తగా పని చేయి..

అలాగే బావ...తప్పకుండా....ఎరా చిన్నూ ఏమి చేస్తున్నావ్...

హాయ్ మామా...బాగున్నవా....మమ్ము తిన్నవా...

చిన్నూ బాగా మాట్లాడుతున్నాడు అక్క..

అవును రా...వొద్దు వొద్దు అంటే మీ బావ వస బాగా పోసాడు...ఇప్పుడు వీడు పెద్ద నస లాగా తయారు అయ్యాడు...పైగా టీవీ, యూట్యూబ్ , మొబైల్ బాగా అడిక్ట్ అయ్యాడు...వాటిలో ప్రతీది చూసి మా దెగ్గర అన్ని చెప్తుంటాడు....

పోనిలేవే... వీడికి మాటలు నేర్పే పని తప్పింది...

అవును రా...ఇంతగా మాట్లాడతాడు కదా....కానీ వీడు పడుకున్నపుడు ఇల్లంతా...బోసిపోయినట్టు ఉంటుంది...ఇంతకీ ఎప్పుడు నువ్వు జాయిన్ అయ్యేది కంపెనీలో....

రేపే అక్క...పోదున్న 9.30 కల్లా ఆఫీస్ లో ఉండాలి..

సరే అయితే...పొద్దున్నే నీకు లంచ్ బాక్స్ కట్టిస్తా...

సరే అక్క...

************************************************

మరుసటి రోజు


బావ ఆఫీస్ కి వెళ్తున్నా...

ఉండు నేను అదే దారిలో వెళ్తున్న...మా ఆఫీస్ దెగ్గర నుంచి...మీ ఆఫీస్ ఇంకో 10 km ఉంటుంది...

సరే బావ...అక్కా వెళ్ళొస్తా....

సరే రా...all the best...

థాంక్స్ అక్క...

bye చిన్నూ....

టాటా...టాటా...టాటా...మామా...

*************************************************

చిన్నూ ఇదేంటి....

one...

ఇది..

two...

గుడ్....ఎరా ఆనంద్....ఎలా ఉంది మొదటి రోజు ఆఫీస్...

బావుంది అక్క...ఎరా చిన్నూ...ఏమి చేస్తున్నావ్...

లంబర్స్ చెప్తున్నా.....

హాహాహా నంబర్స్ కి వచ్చిన తిప్పలా...వెరీ గుడ్ ...

అక్క, బావ ఇంకా రాలేదా....

ఇందాకే వచ్చారు...ఫ్రెష్ అవుతున్నారు...

సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా...

*************************************************

బావ...నాకు ఆఫీస్ కొంచం దూరం అవుతుంది...మా collegue ఆఫీస్ దెగ్గరలో రూమ్ లో ఉంటున్నాడు...కావాలంటే నన్ను రమ్మన్నాడు...నేను అక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా...

అదేంట్రా...ఒకే ఊరిలో ఉంటూ...వేరే గా ఎందుకు రా...

అవును రా...మీ అక్క చెప్పింది కరెక్ట్...ఆలోచించుకో...

లేదు బావ...రోజు అంతదూరం ప్రయాణం అంటే కొంచం ఇబ్బందే....సెలవు దొరికినప్పుడల్లా ఇక్కడికే వచేస్తా...

సరే నీ ఇష్టం....

*************************************************

హలో అక్కా, చెప్పు....

వచ్చే ఆదివారం మన చిన్నూ 4వ పుట్టిన రోజు ...నువ్వు ముందు రోజే వచ్చేయి....

సరే అక్క...

మీ బావ మరి మరి చెప్ప మన్నారు ముందు రోజు రమ్మని..

సరే అక్క ..తప్పకుండా వస్తాను...

*************************************************

నాకు బిచికెట్లు కావాలి...బిచికెట్లు కావాలి...

అస్తమానం ఆ ఫోన్ తో ఆడుకోకపోతే వెళ్లి బయట ఆడుకోవచ్చు కదా....

నాకు బిచికెట్లు కావాలి...బిచికెట్లు కావాలి...

సరే ఉండు...లోపల ఉన్నాయి వెళ్లి తీసుకొని వస్తా...

nine seven zero one....

హాయ్ చిన్నూ ఏమి చేస్తున్నావ్....

నన్ను చంపుకో తింటున్నాడు వీడు...ఎప్పుడు మొబైల్ లో, టీవీ లో మునిగిపోతున్నాడు...

హాయ్ అక్క ఎదో ఫోన్ వస్తున్నట్టు ఉంది...

అవును రా వీడు ఆ ఫోన్ ఇవ్వట్లేదు....

నేను ఎత్తుకొని బయటకి తీసుకెళ్తా...నువ్వు ఫోన్ చేసింది ఎవరో చూడు....

సరే...

ఏంటి చిన్నూ...బయట కుక్క పిల్ల ఉంది చూద్దామ...

చరే మామా...

ten, nine, eight...

ఏంటి మళ్ళీ నా వాచ్ లో ఉన్న నంబర్స్ చదువుతున్నవా...వెరీ గుడ్ చిన్నూ...తిరిగింది ఇక చాలు పద ఇంటికి వెళ్దాం...అమ్మ తిడుతుంది...

*************************************************

ఏమైంది అక్క ఏడుస్తున్నావ్...

ఇది ఏడుపు కాదు రా బాబు...ఉల్లిపాయలు తరుగుతున్నా...

ఓహ్ అవునా...రేపటి పార్టీకీ ఎంతమంది వస్తున్నారు...

దాదాపు 100 మంది దాకా వస్తారూ...

అవునా...ఏదైనా సహాయం కావాలి అంటే చెప్పు చేస్తా...

తప్పకుండా...వెళ్లి ఈ సామాన్లు తీసుకుని రా..

సరే...

ఇదిగో డబ్బులు...వద్దులే నా దెగ్గర ఉన్నాయి...

*************************************************

మరుసటి రోజు


ఆనంద్ ఈ బలూన్స్ అక్కడ కట్టు...కొంచం పైకి...ఒకే బావుంది...కేక్ ఆర్డర్ ఇచ్చావు కదా...

ఇచ్చా అక్క...సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికే పంపిస్తాడు...

మిగతా డెకరేషన్ చూసుకో ...అందరూ వచ్చే టైం అయ్యింది...

సరే అక్కా...

nine seven zero one two....

మళ్ళీ ఫోన్ పట్టుకున్నవా... ఫోన్ వస్తుంది ఇలా ఇవ్వు...

నేను ఇవ్వను...నేను యూట్యూబ్ చూసుకుంటా...

చిన్నూ ఇప్పుడు కాదు ...నీ బర్త్డే పార్టీ ఉంది కదా రెడి అవ్వాలి...పద నీకు కొత్త డ్రెస్ వేస్తా....

అలాగే నాన్న....

*************************************************

ఏమైంది...కంట్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి...

ఏమి లేదండి...ఇందాక కిచెన్ లో సర్దుతుంటే కొంచం దుమ్ము కంట్లో పడింది...

అయ్యో జాగ్రత్త...నెమ్మద్దిగా పని చేయి...ఒక్క ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ఏమి కాదు...

అలాగే అండి..

అక్కా, నువ్వు బయట కూర్చో...నేను సర్దుతా...

సరే చూసుకో....

*************************************************

బావగారు, పార్టీ బాగా జరిగింది కదా...

అవును రా...అందరూ ఆనందంగా గడిపారు...

మీ collegues ఎవరినైనా పిలవకపోయావ...

పరిచయం అయ్యి 15 రోజులు కూడా కాలేదు...కదా...అందుకే పిలవలేదు....సరే అక్క నేను నా రూంకి వెళ్తా...

అదేంటి రా..రేపు పొద్దున్నే మీ బావగారితో సగం దూరం వెళ్లొచ్చు కదా...

లెద్దక్క.. ఇంకో జత బట్టలు కూడా లేవు...శనివారం తప్పకుండా వస్తా...

సరే నీ ఇష్టం...

*************************************************

హలో బావ చెప్పండి కాల్ చేశారు ఇందాక మీటింగ్ లో ఉండి ఫోన్ మాట్లాడలేకపోయాను...

పర్లేదు...నువ్వు రేపటి నుంచి ఒక వారం రోజులు... ఇక్కడే ఉండాలి....

ఎందుకు బావ...

నేను ఆఫీస్ పని పైన టూర్ వెళ్తున్నా....వారం రోజులు పడుతుంది...నువ్వు నా బైక్ వాడుకోవచ్చు...

సరే బావ..ఇవాళ సాయంత్రమే వచేస్తా...

సరే ఉంటా....

*************************************************

హలో ...ఏమండి...బస్ ఎక్కారా...

ఎక్కా... బస్ బయలుదేరుతుంది...సరే రేపు దిగాక కాల్ చేస్తా...

సరే అండి జాగ్రత్త...bye...

ఒరేయ్ చిన్నూ రాత్రి 12.00 పడుకోరా...

వీడు ఇంతే రా ఆనంద్...ఎంత చెప్పినా వినడు...వాడికి పాలు తీసుకొస్తా..కొంచం చూసుకో....

సరే అక్క...

nine seven zero one two three....

అక్కా, నీ ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది...చూడు...

ఇంకెవరు మీ బావగారు అయ్యుంటారు...నువ్వు వెళ్లి పడుకో...లేట్ అయ్యింది పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి..

సరే అక్క...

*************************************************

అక్కా, ఇదిగో వాడు పడుకునేటప్పుడు పక్కన పెట్టుకునే బొమ్మ హాల్లో ఉండిపోయింది...మళ్ళీ ఏమైంది అక్కా...ఎందుకు ఏడుస్తున్నావ్...

ఏమిలేదురా...మీ బావగారిని ఎప్పుడు ఇన్ని రోజులు వదిలిపెట్టి ఉండలేదు.....కొంచం బెంగగా ఉంది...

ఓసిని అంతేనా...వారం రోజులు ఇలా అయిపోతాయి... నువ్వు ఏమి బెంగ పెట్టుకోకు....

*************************************************

ఏంట్రా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావ్....

ఏమి లేదు కొంచం తలనొప్పిగా ఉంది...అందుకే వచ్చేసా..

సరే నువ్వు వీడితో ఆడుకుంటూ ఉండు...నాకు చిన్న పని ఉంది..అలా బయటకి వెళ్ళొస్తా....

ఏమైనా తీసుకురావలంటే చెప్పు...నేను చిన్నూ ఇద్దరం బయటకి వెళ్లి తెస్తాం...

అవును, అవును...బైక్ పైన..druyyyyyyyy పోతా...

ఏమి వద్దు..నాకు వేరే పని ఉంది...నేను వెళ్ళొస్తా...

సరే...వెళ్ళు...

*************************************************

అక్కా గంటలో వస్తా అన్నావ్...ఐదు గంటలు అయ్యింది...ఇందాక బావగారు నాకు కాల్ చేశారు...నీ ఫోన్ కలవలేదు అని చెప్పాడు...నేను నీకు కాల్ చేశా కలవలేదు...

ఏమో రా...నా ఫోన్ నా దెగ్గరే ఉంది...సిగ్నల్ ప్రాబ్లెమ్ అనుకుంటా...

సరే వీడు ఆకలి ఆకలి అంటున్నాడు...వీడికి అన్నం పెట్టు...

నాకు ఓపిక లేదు...నువ్వే పెట్టుకో....

అదేంటి నువ్వే అలాంటవు...వాడు నువ్వు పెడితే కానీ తినడు...

నాకు జ్వరం వచ్చింది...ఈ పూటకి నువ్వే ఎదో ఒకటి చెప్పి తినిపించు...

*************************************************

మరుసటి రోజు

ఎలా ఉంది అక్క నీకు....

ఇంకా తగ్గలేదు....

పద డాక్టర్ దెగ్గరికి వెళ్దాం...ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటా...

వద్దు అదే తగ్గుతుంది....

లేదు లేదు ఇప్పుడు నువ్వు రావలసిందే...లేదంటే బావ గారికి ఫోన్ చేస్తా....

వద్దులే ఆయనని ఎందుకు ఖంగారు పెట్టడం ..పద వెళ్దాం...

*************************************************

ఎలా ఉంది డాక్టర్ మా అక్కకి....

అంతా బాగానే ఉంది కాని...

కానీ ఏంటి డాక్టర్ ఏమైంది....

మీ అక్క బాగా డిప్రెషన్ ఫీల్ అవుతుంది..బాగా టెన్షన్ పడుతుంది....మీ బావగారు ఏమైనా సతాయిస్తారా...

లేదు డాక్టర్...ఆయన చాలా మంచి వారు...చాలా బాగా చూసుకుంటారు...

మరి ఎందుకు టెన్షన్ పడుతుందో తానే చెప్పాలి...

సరే డాక్టర్ నేను అడుగుతాను....

*************************************************

ఎమ్మన్నారు డాక్టర్ గారు...

ఈ మందులు వేసుకుంటే అంతా తగ్గిపోతుంది...రేపటి నుంచి నేను లీవ్ పెట్టి నీదెగ్గరే ఉంటా...

ఎందుకు నేను చూసుకుంటాను...నువ్వు ఆఫీస్ కి వెళ్ళు...

పర్లేదు అని చెప్పాన...

సరే నీ ఇష్టం...

*************************************************

nine seven zero one two three four five....

చిన్నూ...అమ్మకి ఫోన్ వస్తోంది...ఇచేసేయి...

ఆ ఆ ఆ ...నేను ఇవ్వను....

ఇక్కడ ఇవ్వు నేను ఇస్తా...

అక్కా..ఎదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది...

ఇలా ఇవ్వు...నేను చూస్తా...నువ్వు వెళ్లి వాడితో అడుకో...

*************************************************

అక్కా..వాడికి అదేదో బొమ్మ కావాలంట...అక్కా..అక్కా...

ఏంట్రా....

ఇక్కడ ఉన్నవా...ఏంటి కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి..

ఏమి లేదు రా...మీ బావగారు గుర్తొచ్చారు...

ఎల్లుండి వచేస్తారుగా...

అవును...

*************************************************

చిన్నూ గట్టిగా అరవకు....అమ్మకి ఆయి అయ్యింది..

పడుకుంది....

nine seven zero one two three four five six seven eight....

అరవకు అని చెప్పాన... పద నువ్వు కూడా పడుకుందువు...

*************************************************

మరుసటి రోజు

అక్కా...నువ్వు ఇక ఏమి టెన్షన్ పడకు...నీ సమస్యలు అన్ని తీరిపోయాయి....

సమస్యలేమిటి... తీరిపోవటం ఏమిటి....

నాకు మొత్తం తెలిసింది...

నీకు మొత్తం తెలిసిందా... దేనిగురించి నువ్వు మాట్లాడేది...

పద టీవీ చూడు...

ఇన్ని రోజులు చాలా మంది అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసిన నందు అలియాస్ నందకుమార్...ఇవాళ అరెస్ట్ చేశారు...తన దెగ్గర దొరికిన ఫోటోలు , వీడియోలు అన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

అవునా...చాలా మంచి పని అయ్యింది....వాడి పీడ విరగడయ్యింది...అవును...నీకు ఎలా తెలుసు వాడి గురించి...

నాకు వాడి గురించి చెప్పింది.....మన చిన్నునే...

చిన్నునా...వాడికి మాటలే సర్రిగ్గా రావు వాడు నీకు చెప్పడం ఏంటి...

అదే వాడి స్పెషలిటీ....వాడికి వచ్చిన మాటలే ...వాడ్ని పట్టించాయి...

అదెలా...

వాడు నీకు ఫోన్ వచ్చిన ప్రతి సారి...నంబర్స్ పైకి చదువుతాడు...

అవును అయితే...

నీకు బ్లాక్ మెయిల్ చేసిన వాడు ఫోన్ చేసిన ప్రతీ సారి నేను ఒకటి గమనించాను...మన చిన్నూ నెంబర్ చదవటం...నువ్వు ఫోన్ మాట్లాడి ఏడవటం...నేను అడిగితే...నువ్వు ఎదో ఒక సాకు చెప్పటం...

మొన్న రాత్రి...నువ్వు మంచి నిద్రలో ఉన్నావు...వాడు మెసేజ్ పెట్టాడు....నీకు వచ్చిన మెసేజ్ కదా ఎందుకు చూడడం అని అనుకున్నా....కానీ మన చిన్నూ...వచ్చిన నెంబర్ చదువుతుంటే...అప్పుడు...ఎందుకైనా మంచిది అని చెప్పి చూసా...అందులో...మొన్న నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు...ఇంకా కావాలి ఆని నిన్ను డబ్బులు అడగడం...చదివా...

అప్పుడు అనుకున్నా...నువ్వు టెన్షన్ పడేది ఇందుకోసం అని...నేను పని చేసేది telecom లో కదా...ఆ నెంబర్ వివరాలు అన్ని తీసి...పోలీసులకి ఇచ్చా...వాళ్ళు వాడిని వెతికి పట్టుకున్నారు...నువ్వు ఒక్కదానివే కాదు...వాడి బారిన పడిన వారు చాలా మందే ఉన్నారు...

అవునా...చిన్నూ నా బుజ్జి బంగారం....నువ్వు ఎంత మంచి పని చేసావు తెలుసా....

నాకి కోకిలెట్టు కావాలి....

తప్పకుండా ఇస్తా బంగారం...

*************************************************

బావ గారు ఎలా ఉన్నారు...ప్రయాణం బాగా జరిగింది...

బానే జరిగింది....ఇందాకే న్యూస్ చూసా...ఎవడో ఒకడు...whatsapp, facebook లాంటి వాటిలో ఫొటోస్ తీసుకోని....మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసాడట...ఇల్లాంటి వాళ్ళని...ఉరేయ్యాలి....

అదే న్యూస్ టీవీ లో ఇప్పుడే చూస్తున్నాం బావ...

*************************************************

అందరికి దయచేసి ఒక విన్నపం...మీ personal, ఫ్యామిలీ ఫొటోస్...సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవటం మంచిది కాదు...

అందరి ఇళ్లలో చిన్నూ లాంటి వాళ్లు ఉండక పోవచ్చు...కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు....వీధికి ఒక్కరు ఉండొచ్చు...

జాగ్రత్త సుమా...Rate this content
Log in

Similar telugu story from Drama